1

1

Friday, 2 January 2015

మోడీ ప‌క్క‌న అమీర్ ఖాన్ ఉన్న‌ప్పుడు నోరువిప్ప‌లేదేం..

ఐఎస్ఐ నుంచి డ‌బ్బులు తీసుకుని పీకే సినిమా చేస్తే అమీర్‌ఖాన్‌ ముమ్మాటికీ ఐఎస్ఐ ఏజెంట్ అవుతాడు.. మ‌రి ఐఎస్ఐ నుంచి డ‌బ్బు తీసుకునే వ్య‌క్తి భార‌త‌ ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌చ్ఛ భార‌త్ ప్ర‌తిజ్ఞ‌లో పాల్గొన్న‌ప్పుడు ఎందుకు ఈ సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి నోరు విప్ప‌లేదు... మోడీ ప‌క్క‌న ఐఎస్ఐ అజెంట్ నిల‌బ‌డ్డాడ‌ని అప్పుడే గ‌ట్టిగా అర‌చి చెప్పొచ్చు క‌దా...? ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది.. ఐఎస్ఐ అజెంట్ మోడీతో స‌మావేశం అవుతుంటే ముందే హెచ్చ‌రించొచ్చు క‌దా... సినిమా నిర్మాణం జ‌రుగుతున్న‌ప్పుడే ఐఎస్ఐ నిధుల‌తో సినిమా చేస్తున్నార‌ని సుప్రీంకోర్టులో కేసు వేయొచ్చు క‌దా... ఎందుకు వేయ‌లేదు...? !!
హిందువుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా గోవిందా గోవిందాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తుంటే మోడీ గారు ఎందుకు ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టుకున్న‌ట్లు?

No comments:

Post a Comment