స్వచ్ఛ భారత్‌తో భారత్‌ను పరిశుభ్రంగా మార్చాలంటున్నారు..
సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్లుగా పెట్టి అందరిలో స్ఫూర్తి నింపాలని చూస్తున్నారు..
ఇదే రకంగా దేశానికి అన్నం పెట్టే రైతన్నలో స్ఫూర్తి నింపడం, ఆధునిక సాగు పద్ధతుల్లో వారికి మెలకువలు నేర్పాలి..
నష్టాల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న అన్నదాతలను చూసి వ్యవసాయం వైపు మొగ్గుచూపే వారే తగ్గుతున్నారు..
ఇది మనకు భవిష్యత్తులో తీరని నష్టాన్ని మిగుల్చుతుంది..
అందుకే వ్యవసాయం చేసే వారిలో స్ఫూర్తి నింపేలా, సాఫ్ట్‌వేరు ఉద్యోగులు కూడా వారాంతాల్లో చేను, చెలకల్లో పొలాలను చూసేలా సెలబ్రిటీలే స్ఫూర్తిని నింపాలి...
వ్యవసాయం అంటే వరి, పత్తే కాదు... కూరగాయల సాగైనా, ఇంకోటైనా సరే... అది పొలాల్లోనే చేయాలని ఏముంది... ఇళ్ల పైకప్పులనే పొలాలుగా మార్చుకొని కూరగాయలు పండించేలా చూడాలి...
-------------------
కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఆధునిక మెలకువలతో పంటలు పండించడం చూశాం... సినిమాలతో బిజీబిజీగా ఉండే పవన్ కల్యాణ్ కూడా వ్యవసాయం వైపు మొగ్గుచూపారు. సుభాష్ పాలేకర్ చెప్పిన జీరో బడ్జెట్ సేంద్రీయ సాగుపై దృష్టిసారించారు. కూరగాయల సాగులో బిజీగా ఉన్నారట.. ఈ మేరకు ఆయన ట్వీట్లు కూడా చేశాడు..
------------------
ఇలా సెలబ్రిటీలు కూడా వ్యవసాయానికి రోజుకు గంట చొప్పున ఏడాదికి 365 రోజులు కేటాయిస్తూ ప్రతీ ఒక్కరినీ రైతుగా మారేలా స్ఫూర్తిని నింపితే ఎంత బాగుంటుంది(స్వచ్ఛ భారత్ మాదిరిగా ఫొటోలకు ఫోజులు ఇస్తే ఫలితం ఉండదు)..
----------------------
ఒకవేళ సాఫ్ట్ వేరు సంక్షోభంలో ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకొని కూడా మనం బతకొచ్చన్న ధీమాను యువతలో కల్పించవచ్చు... పిచ్చి సలహానే కావొచ్చు... వ్యవసాయాన్ని లాభసాటి చేయాలి.. భారత్ అన్నపూర్ణగా ఎప్పుడూ ఉండాలన్నది నా ఆకాంక్ష...!!
No comments:
Post a Comment