1

1

Friday 2 January 2015

ద‌ర్శ‌కుల భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు క‌ళ్లెం వేయాలా?

మొన్న‌టి దాకా ఆ రెండు ఛానెళ్ల‌పై నిషేధం ఎత్తేయాల‌ని తెగ ఆందోళ‌న చేశారు.. పార్ల‌మెంట్‌లో మంత్రుల ద్వారా చెప్పించారు... ఫేసుబుక్‌లో తెగ పోస్టులు పెట్టారు...
ఇప్పుడేమో... ఆ సినిమాను నిషేధించాలి.. ఆ సినిమాను అడ్డుకోవాలి.. ఆ సినిమా న‌డుస్తున్న థియేట‌ర్ల‌పై దాడులు చేస్తున్నారు..
అరే ఎందుకిలా మారిపోయారు...? ఈ దాడుల‌ను ఖండిస్తూ బీజేపీ నేత‌లు ప్రెస్‌మీట్లు పెట్ట‌రా?
తెలంగాణను కించ‌ప‌రిచార‌ని తెలంగాణ స‌మాజ‌మంతా ఆ రెండు ఛానెళ్ల‌ను నిషేధిస్తే మీరు మాత్రం భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు సంకెళ్ల‌న్నారు... ఇప్పుడు హిందూ మ‌నోభావాలు దెబ్బ‌తీశార‌ని సినిమాల‌ను అడ్డుకోమంటున్నారు.. అంటే ద‌ర్శ‌కుల భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు క‌ళ్లెం వేయాలా?
మీకు న‌చ్చ‌క‌పోతే సినిమా చూడ‌టం మానేయ‌వ‌చ్చు క‌దా... ఎందుకు నిషేధించాలి అని దాడులకు తెగ‌బ‌డుతున్నారు..!!
మీకో నీతి మాకో నీతా?

No comments:

Post a Comment