1

1

Tuesday, 20 January 2015

ఆ అజ్ఞాత వీరుడెవ్వ‌డు? ఆ పిలుపునిచ్చిన సేనాని ఎవ‌రు?

ఆ అజ్ఞాత వీరుడెవ్వ‌డు?
ఆ పిలుపునిచ్చిన సేనాని ఎవ‌రు?
ఆ ఒక్క మ‌గాడెవ‌రో తెలిస్తే చెప్పండి ప్లీజ్‌...
లేక అవి ఆకాశ‌వాణి ప‌లుకులేనా...?
----------------------
ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తా... ఈ మాట తెలంగాణ వాదుల‌కు ఓ స్ఫూర్తి, ఈ మాట అక్ర‌మార్కుల‌కు ఓ హెచ్చ‌రిక‌. ఎవ‌రు ఈ పిలుపు ఇచ్చారో తెలియ‌దు.. ఎవ‌రికి ఇచ్చారో తెలియ‌దు.. తెలంగాణ‌ నేల‌పై ఇలాంటి ప‌ద బంధాల‌ను ఉప‌యోగించగ‌ల ఏకైక‌ వ్య‌క్తి కేవ‌లం ఒక్క‌ర‌ని నేను అనుకున్నా.. గ‌త‌ ప‌దేళ్లుగా ఆయ‌నే ఈ మాట అన్న‌డ‌ని న‌మ్మాను.. ఈ అత్య‌ద్భుత మాట‌ల‌ను ఉప‌యోగించిన ఆయ‌న‌ను ఆరాధించాను.. కానీ నాకు ఈ మాట‌ల‌తో సంబంధం లేదు అని ఆయ‌నే ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. మ‌రి ఇంత గొప్ప మాట‌ను ప్ర‌యోగించింది ఎవ‌రై ఉంటారు? ఆ అజ్ఞాత యోధుడెవ‌రు? ఆ పిలుపునిచ్చి తెలంగాణ స‌మాజాన్ని జాగృతం చేసిన వ్య‌క్తి ఎవ‌రు? నాకు తెలుసుకోవాల‌ని ఉంది. ఆయ‌న‌ను అభినందించాల‌ని ఉంది.
ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తా... అన్న ఈ మాట వింటే గోల్కొండ ఖిల్లా కింద గోరి క‌డ‌తం కొడ‌కా అన్న ర‌చ‌యిత మాట‌లు విన్న‌ట్లుగా అనిపిస్తుంది.. అంత ఉత్తేజం, అంత చైత‌న్యాన్ని నింపుతున్నాయి. ఏది ఏమైనా ఈ మాట‌లు రాసింది కేవ‌లం విలేక‌రి మాత్ర‌మే అయితే ఆయ‌న పేరు చెప్పండి మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తా.. చిన్న నాయకుడైతే ఆయ‌న వివ‌రాలు ఇవ్వండి దండేసి దండం పెడ‌తా.. ఆయ‌న ఎవ‌రైనా స‌రే వారికి నా ఉద్య‌మాభినంద‌న‌లు.. పాదాభివంద‌నాలు..!!!

No comments:

Post a Comment