1

1

Friday, 30 January 2015

ఫాస్టు ప‌థ‌కం ర‌ద్దు...!

ఫాస్టు ప‌థ‌కం ఇక ఉండ‌దు... అంటే 1956కు ముందు తెలంగాణ‌లో స్థిర‌ప‌డిన వారి పిల్ల‌ల‌కు బోధ‌న రుసుములు చెల్లిస్తామ‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు.. మొత్తానికి ఉమ్మ‌డి హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.. ఇక్క‌డ తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు ఏర్ప‌డి ఉంటే ప‌రిస్థితి ఎలా ఉండేదో...
అయితే జ‌న్మ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల విష‌యంలోనూ, స్థానిక‌త విష‌యంలోనూ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హరించాలి.. మ‌ళ్లా దొంగ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను తీసుకొని లోక‌ల్ గా చెలామ‌ణీ అయితే క‌ష్టం... అయితే వేరువేరుగా ఎంసెట్‌లు ఉండ‌టం కూడా ఒక‌విధంగా మంచిదైంది.. ఉమ్మ‌డి ఎంసెట్ ఉండి ఉంటే మ‌ళ్లా ఇక్క‌డ చేరి ఇక్క‌డ బోధ‌న ఫీజుల భారాన్ని ప్ర‌భుత్వం నెత్తిన వేసే అవ‌కాశం ఉంది.. బోధ‌న రుసుంల కోస‌మే వేచిచూస్తున్న కాలేజీల‌పై స‌ర్కారు దృష్టి కేంద్రీక‌రించాలి..

ముక్కోటి తెలంగాణ ప్ర‌జ‌ల మొక్కులూ తీర్చుకోవాలి సార్‌...

కేసీఆర్ గారికి చిన్న‌ విజ్ఞ‌ప్తి..
మొక్కులు తీర్చుకుంటున్న తెలంగాణ ప్ర‌భుత్వం...
రాతి బొమ్మ‌ల్లో కొలువైన దేవుళ్ల మొక్కులే కాదు.. ముక్కోటి తెలంగాణ ప్ర‌జ‌ల మొక్కులూ తీర్చుకోవాలి సార్‌...
గ‌త 14 ఏళ్లుగా తెలంగాణ ఉద్య‌మానికి వెన్నుద‌న్నుగా ఉన్న జాతీయ నేత‌ల‌కు ఆత్మీయ స‌న్మాన‌మూ చేయాలి...!
---------------------------

తెలంగాణ రాష్ట్రం రావాల‌ని గ‌త ప‌దేళ్లుగా దేవుళ్ల‌కు కూడా మొక్కుకున్న‌ట్లు కేసీఆర్ చెప్పారు.. ఇప్పుడు రాష్ట్రం సిద్దించినందుకు ఆ మొక్కుల‌ను తీర్చుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.. తిరుప‌తి దేవుడికి రూ.5 కోట్ల‌తో ఆభ‌ర‌ణాలు, విజ‌య‌వాడ అమ్మ‌వారికి ముక్కు పుడ‌క‌, భ‌ద్ర‌కాళి అమ్మ‌వారికి స్వ‌ర్ణ కిరీటం, మ‌ల్ల‌న్న‌కు బంగారు మీసాలు, అజ్మీర్ ధ‌ర్గాలో చాద‌ర్ స‌మ‌ర్పించ‌డం, భ‌క్తుల కోసం వ‌స‌తి గృహ నిర్మాణం చేప‌ట్ట‌నున్న‌ట్లు కేసీఆర్ గారు ప్ర‌క‌టించారు..
ఇది మంచి విష‌య‌మే.. అయితే రాతి బొమ్మ‌ల్లో కొలువైన దేవుళ్లే కాకుండా.. ఈ 14 ఏళ్లుగా మీకు అండ‌దండ‌గా ఉన్న తెలంగాణ ప్రజాదేవుళ్ల మొక్కుల‌ను కూడా త్రిక‌ర‌ణ శుద్ధిగా తీర్చుకోవాలి.. ఓటేసి మీకు అధికారం ఇచ్చిన ఓట‌రు దేవుళ్ల కోరిక‌ల‌న్నింటినీ తీర్చాలి.. రాతి బొమ్మ‌ల్లోని దేవుడికి ఆగ్ర‌హం వ‌స్తుందో లేదో తెలియ‌దు కానీ.. ఓట‌రు దేవుడికి ఆగ్ర‌హం వ‌స్తే అస‌లుకే ఎస‌రు.. వాళ్ల‌ను ఎప్పుడూ కూడా ఆగ్ర‌హానికి గురిచేయొద్దని మ‌న‌వి...
------------------------------------------------
తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో అడుగ‌డుగునా అండ‌గా నిల‌బ‌డిన పార్టీలైన ఆర్జేడీ, బీఎస్పీ, ఎల్జేపీ, ఎన్సీపీ త‌దిత‌ర పార్టీల జాతీయ అధ్య‌క్షులు/  సీనియ‌ర్‌ నేత‌ల‌ను తెలంగాణ‌కు ర‌ప్పించి ఆత్మీయ స‌న్మాన‌మూ చేయాల‌ని విజ్ఞ‌ప్తి...
ఇంకా చెప్పాలంటే సోనియాగాంధీ, సుష్మా స్వ‌రాజ్‌, మీరా కుమార్, కురియ‌న్‌ల‌ను ఇక్క‌డి ఆహ్వానించి స‌న్మానించినా త‌ప్పులేద‌ని నా భావ‌న‌...



మీ అక్ష‌రాల‌కు అంతోకొంత విలువ ద‌క్కుతున్న‌ది ఇక్క‌డే

ఇసుక మాఫియాకు స‌ర్కారు పెద్ద‌ల అండ‌దండ‌లున్నాయ‌ని రాసింది ఆయ‌నే..
మ‌ళ్లా ఇసుక దందాపై త‌మ క‌థ‌నానికి మంత్రి స్పందించాడ‌ని రాస్తున్నారు..
ప్ర‌భుత్వ పెద్ద‌ల హ‌స్తం ఉంటే మంత్రి స్పందించి టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేస్తాడా?
------------------
ఆంధ్రాకు రాజ‌ధానిగా మారే తుళ్లూరులో కాలిపోయిన రైతుల పంట‌ల‌పై విచార‌ణ ఏమైంది..?
స‌ర్కారు పెద్ద‌ల క‌నుస‌న్న‌ల్లోనే అవి కాలిపోయాయా?
ఇవ‌న్నీ రాయ‌డానికి ద‌మ్ము లేదా?
--------------------
క‌నీసం తెలంగాణ‌లో మీ ప‌త్రిక ఒక‌టి రాస్తే స‌ద‌రు మంత్రి స్పందించి విచార‌ణ చేయిస్తున్నారు..
మ‌రి ఆంధ్రాలో త‌ప్పును ఒక్క‌టైనా ఎత్తిచూపారా?   ఒక్క‌దానిపైనైనా ప్ర‌భుత్వం స్పందించిందా?
ఆలోచించుకోండి.. ఇప్ప‌టికీ మీ అక్ష‌రాల‌కు అంతోకొంత విలువ ద‌క్కుతున్న‌ది ఇక్క‌డే అని...!!

ఈ యోగా మ‌న ఒంటికీ, ఖ‌జానాకు మంచిది కాదండీ...!!!

ఈ యోగా మ‌న ఒంటికీ, ఖ‌జానాకు మంచిది కాదండీ...!!!
---------------
ఒంటికి యోగా మంచిదే కానీ.. ఇలాంటి ఖ‌రీదైన యోగా మాత్రం ఖ‌జానాకు జ‌బ్బును చేకూర్చుతుంది..
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇలాంటి యోగా శిబిరాల‌ను భ‌రిస్తుందేమో కానీ.. తెలంగాణ స‌ర్కారు మాత్రం ఇలాంటివి చేయొద్ద‌ని మ‌న‌వి..
నోట్‌: ఒక ఇండ్లీ, ఒక అర‌టిపండు, ఓ గ్లాస్ పాల ఖ‌ర్చు రూ.450 అంట‌..
క‌ర్రీతో కూడిన అన్నం ఖ‌రీదు రూ.1350 అంటా...
ఈ యోగాతో పాటు ఉప‌వాసం చేస్తే ఈ ఖ‌ర్చంతా మిగిలేది.. ధ్యాన‌చింత‌న‌, దైవ చింత‌న రెండు ఉండేవి క‌దా..!!

Thursday, 29 January 2015

కేసీఆర్ నిజాం ఆన‌వాళ్ల‌ను తొల‌గిస్తుంటే వ‌ద్దంటారా?



మెట్రో మార్గంలో చ‌రిత్రాత్మ‌క క‌ట్ట‌డాల‌ను కోల్పోయే ప్ర‌మాదం ఉందని అలైన్‌మెంట్ మార్చ‌డానికి నిర్ణ‌యం తీసుకుంటే త‌ప్ప‌న్నారు...
మెట్రో మార్గాన్ని మార్చొద్ద‌ని డిమాండ్లు చేశారు.. చ‌రిత్ర‌క సంప‌ద‌కు ఏమైనా ప‌ర్వాలేద‌న్న‌ట్లు మాట్లాడారు..
నిజాం పాల‌న‌లో సంక్షేమ‌మే లేద‌న్నారు..
ఇప్పుడేమో నిజాం పాల‌నా కాలంలో క్ష‌య విజృంభిస్తే అప్ప‌టి న‌వాబు త‌న కుమార్తె పేరుతో క‌ట్టించిన‌ ప్యాలెస్‌ను ఆసుప‌త్రిగా ఇచ్చార‌ని, 120 ఎక‌రాలు దానం ఇచ్చార‌ని వార్త‌లు రాస్తున్నారు..
కేసీఆర్ నిజాంను పొగిడిన‌ప్పుడు, అప్ప‌టి పాల‌న‌లో మంచి జ‌రిగింద‌న్న‌ప్పుడు ర‌జాకార్ల అకృత్యాల‌ను గుర్తుచేస్తారు..
నిజాం కాలంలోని ఆసుప‌త్రిని తొల‌గించాల‌నుకున్న‌ప్పుడు అది చ‌రిత్రాత్మ‌క సంప‌ద‌.. దాన్ని క్ష‌య వ్యాధి ప్ర‌బ‌లిన‌ప్పుడు అప్ప‌టి న‌వాబు ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం ఇచ్చార‌ని చెబుతారు...!!
ఎందుకీ వైవిధ్యం..?

అడ‌విలో ఉన్న ఆసుప‌త్రి అడ‌వికే వెళ్తోంది..

ఎర్ర‌గ‌డ్డ‌లోని ఛాతీ ఆసుప‌త్రి అడ‌విలోకి వెళ్లిపోతోంద‌ని ఓ ప‌త్రిక తెగ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది..
వాస్త‌వానికి నిజాం కాలంలో ఆసుప‌త్రిని అడ‌విలోనే ఏర్పాటు చేశారు.. ఒక‌ప్పుడు ఆ ప్రాంతం అడ‌విని త‌ల‌పించేదే క‌దా..!!
పంజ‌గుట్ట‌లో పులులు తిరిగేవి... కాల‌క్ర‌మంలో హైద‌రాబాద్ విస్త‌రించింది.. ఎర్ర‌గ‌డ్డ అన్న‌ది న‌గ‌రంలో ప్ర‌ధాన ర‌ద్దీ ప్రాంతంగా మారింది..
ఈ ప‌త్రిక వాళ్లు నిజాం కాలంలోనూ ఉంటే అడ‌విలో ఆసుప‌త్రి ఏంటని గ‌గ్గోలు పెట్టేవారేమో.. ఇంకా ఆ కాలంలో అయితే ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థే లేదు..!!
NOTE: ఛాతీ ఆసుప‌త్రిని మ‌రో ప్రాంతానికి త‌ర‌లించ‌డం ప్ర‌భుత్వ ఇష్టం.. అయితే చ‌రిత్రాత్మ‌క క‌ట్ట‌డాల‌ను ప‌రిర‌క్షించాల‌న్న‌ది నా అభిమ‌తం...

నీటి కుట్ర‌ల‌ను తిప్పికొట్టాలి..


కృష్ణా బేసిన్ నీటిపై బ‌చావ‌త్ ట్రిబ్యున‌ల్ 512 టీఎంసీలు ఆధ్రాకు, 299 టీఎంసీలు తెలంగాణ‌కు కేటాయించిందట‌(నిజ‌మో కాదో నాకు తెలియ‌దు)..
మ‌రి కృష్ణా బేసిన్‌లోని తుంగ‌భ‌ద్ర‌, సాగ‌ర్ దిగువ‌న నీరు పూర్తిగా ఆంధ్రా వాడుకుంటుంది క‌దా..
మిగిలిన నీటిలో తెలంగాణ‌కు 42 శాతం వాటా, ఆంధ్రాకు 58 శాతం వాటా ఉంటుంద‌ని తెలంగాణ వాదిస్తోంది..
అలా కాదు... తెలంగాణ‌కు 27 శాతం, ఆంధ్రాకు 73 శాతం ఉంటుంద‌ని ఆంధ్రా చెబుతోంద‌ట‌...
-------------------------
మ‌రి తెలంగాణ ప్ర‌భుత్వం ఈ కుట్ర‌ల‌ను గ‌ట్టిగా తిప్పి కొట్ట‌క‌పోతే మ‌న‌కు దాదాపు 15 శాతం నీటి వాటా కోల్పోతాం... వీళ్ల‌కు ఆంధ్రా మీడియా మ‌ద్ద‌తు ఎలాగూ ఉంటుంది...

కృష్ణా నీటిలో మ‌న వాటాను మ‌నం సాధించుకోవాలి..

కృష్ణా నీటిలో మ‌న వాటాను మ‌నం సాధించుకోవాలి.. లేక‌పోతే మ‌నం కోరుకున్న తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం కావ‌డం చాలా క‌ష్టం. ఇన్నేళ్లు జ‌ల దోపిడీ జ‌రిగినా ఏమీ చేయ‌లేక‌పోయాం.. ఇప్పుడు కొంత‌వ‌ర‌కు అడ్డుకోగ‌లిగాం. అయితే కృష్ణా నీటిలో మ‌న వాటా 27 శాత‌మే అని ఏపీ వాదిస్తోంది. అంటే 73 శాతం నీటిని త‌ర‌లించుకుపోవాల‌న్న‌దే ల‌క్ష్యంగా కుట్ర‌లు చేస్తోంది.. దానికి ఓ ప్ర‌ధాన ప‌చ్చ ప‌త్రిక అండ‌దండ‌లు ఉన్నాయి.. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఇంకా దూకుడుగా ఉండాల్సిందే. కేంద్రానికి వాస్త‌వాల‌ను వివ‌రించాలి. కేంద్ర మంత్రి ఉమాభార‌తి, ఆమె వ‌ద్ద ప‌నిచేస్తున్న వెదిరె శ్రీ‌రాం గారి స‌హ‌కారంతో కృష్ణా నీటిలో మ‌న‌కు న్యాయంగా రావాల్సిన వాటాను సంపాదించుకోవాలి. పాల‌మూరు, న‌ల్ల‌గొండ త‌దిత‌ర జిల్లాల‌ను స‌స్య‌శ్యామ‌లంగా మార్చుకోవాలి.
నోట్‌: తెలంగాణ‌, ఆంధ్ర రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదాలు వ‌స్తే మ‌న ప‌త్రిక‌లు ఎటు వైపు ఉంటాయి... ముమ్మాటికీ మ‌నవైపే ఉంటాయి... కానీ ఓ ప‌చ్చ ప‌త్రిక మాత్రం ఆంధ్రాకు ల‌బ్ధి చేకూర్చ‌డానికి గ‌త కొద్ది నెల‌లుగా అదే ప‌నిగా మొద‌టి పేజీలో కృష్ణా నీళ్ల‌పై జ‌గ‌డం అంటూ రాస్తుంది.. ఈ విష‌యంపై ఏమ‌రుపాటుగా, అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..

శ్రీ‌శైలంలోకి నిజంగానే 630 టీఎంసీలు వ‌చ్చాయా? మ‌రి తెలంగాణ రైతులు ఎందుకు చ‌నిపోయారు?



ఓ అనుమానం...
శ్రీ‌శైలంలోకి నిజంగానే 630 టీఎంసీలు వ‌చ్చాయా?
మ‌రి తెలంగాణ రైతులు ఎందుకు చ‌నిపోయారు?
అంత‌గా వ‌ర‌ద వ‌స్తే విద్యుత్ ఉత్ప‌త్తికి ఎందుకు అడ్డు చెప్పారు?

---------------------------
శ్రీ‌శైలంలోకి జులై చివ‌రి వ‌ర‌కు చుక్క నీరు రాలేద‌ని అప్ప‌ట్లో ఈనాడు రాసింది..
ఖ‌రీఫ్ ఖ‌తం అని రాసింది.. రైతులు కూలీల‌య్యార‌ని రాసింది...
ఆగ‌స్టు, సెప్టెంబ‌రులోనూ ఆశించిన వ‌ర్షాలే ప‌డ‌లేదు..
అయితే నిన్న రాసిన వార్త‌లో మాత్రం ఈసారి అంచ‌నాకు మించి నీళ్లు వ‌చ్చాయ‌ని రాసింది..
ఏకంగా 630 టీఎంసీలు వ‌చ్చింద‌ని రాసింది..
అంటే ఆగ‌స్టు, సెప్టెంబ‌రు, అక్టోబ‌రులోనే నీళ్లు రావాలి క‌దా..
మ‌రి అంత‌గా నీళ్లు వ‌చ్చి ఉంటే తెలంగాణ‌లో ఖ‌రీఫ్‌లో నీళ్లు లేక రైతులు ఎందుకు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న‌ట్లు?
ప‌చ్చ ప‌త్రిక‌ల అంచ‌నాల ప్ర‌కారం అయితే 400 మంది రైతులు ఖ‌రీఫ్‌లో తెలంగాణ‌లో క‌న్నుమూశారు..
కార‌ణం ఏంటంటే నీళ్లు లేక‌..?
మ‌రి శ్రీ‌శైలానికి భారీగా నీళ్లు వ‌స్తే తెలంగాణ కాలువ‌ల్లోకి రాలేదా?
ఇంకో ముచ్చ‌ట‌... శ్రీ‌శైలానికి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి ఉంటే క‌రెంట్ ఉత్ప‌త్తికి అవ‌కాశం ఉండేది క‌దా.
మ‌రి 854 అడుగుల‌కు ప‌డిపోతుంది... నీళ్లు లేవు.. క‌రెంట్ ఉత్ప‌త్తి చేయొద్ద‌ని న‌వంబ‌రు, డిసెంబ‌ర్‌లో ఇదే ప‌త్రిక వార్త‌లు రాసింది క‌దా..
నీళ్లు పుష్క‌లంగా వ‌చ్చిన‌ప్పుడు నీటిమ‌ట్టం ఎక్కువ‌నే ఉంటుంది క‌దా... ?
అంటే ఈ ప‌త్రిక రిపోర్ట‌ర్‌కు తోచిన‌ప్పుడు నీటి మ‌ట్టం పెర‌గ‌డం, త‌గ్గ‌డం జ‌రుగుతోందా?
ఇప్పుడు ఆంధ్రాకు నీళ్లు ఇప్పించాల‌నే క‌దా.. ఇంతగా తాప‌త్ర‌యం...

నోట్‌:  ఈసారి ఆశించిన వ‌ర్ష‌పాతం లేన‌ప్పుడు 630 టీఎంసీల నీళ్లు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయో.. ఎక్క‌డికి పోయాయే...శ్రీ‌శైల మ‌ల్ల‌న్న‌కే ఎరుక‌.. !!
ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా ఉండాలి.. ఉదాసీనంగా ఉంటే నీళ్ల దోపిడీ మ‌ళ్లా కొన‌సాగుతుంది... వీలైనంత త్వ‌ర‌గా ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేప‌ట్టి పూర్తి చేయాలి.
నోట్‌: గ‌తేడాది జులై చివ‌రి వారంలో వ‌చ్చిన వార్త‌లు, అలాగే నిన్న వ‌చ్చిన వార్త‌ను ఓసారి చూడండి..

Saturday, 24 January 2015

మీ జ‌ర్న‌లిజం నైపుణ్యాల‌కు హ్యాట్సాఫ్‌.!!

మొన్న వైద్య, ఆరోగ్య శాఖ‌కు అవినీతి జ‌బ్బు చేసిందని రాసిందీ వాళ్లే..
స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్నా స‌ద‌రు మంత్రి ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న‌ట్లు నానా యాగీ చేసింది వాళ్లే..
స్వ‌యంగా ముఖ్య‌మంత్రి రంగంలోకి దిగేలా క‌థ‌నాలు రాసింది వాళ్లే..
వైద్య‌, ఆరోగ్య శాఖ‌లో అవినీతి జ‌బ్బును తొల‌గించేందుకు సీఎం ప్ర‌య‌త్నిస్తుంటే..
అగో చూశారా.. వైద్య మంత్రిని ల‌క్ష్యంగా చేసుకున్నారు...
ద‌ళిత మంత్రిపై క‌క్ష సాధింపున‌కు పాల్ప‌డుతున్నార‌ని అంటున్న‌దీ వాళ్లే...!!
-----------------------
త‌ప్పు జ‌రుగుతుంద‌ని చెబుతారు.. త‌ప్పు జ‌రిగినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదంటారు.. తీరా ప‌ట్టించుకుంటే అది క‌క్ష సాధింపే అన్న‌ట్లు రాస్తున్నారు.. ఇదేం ర‌కం జ‌ర్న‌లిజం... !!
-----------------------
ముఖ్య‌మంత్రి ఎవ‌రిపైనా చ‌ర్య‌లు తీసుకోక‌పోతే అగో చూశారా... ఈ అవినీతిలో ముఖ్య‌మంత్రికీ భాగ‌స్వామ్యం ఉంది.. అందుకే ఇంత‌జ‌రిగినా ఎవ‌రిపైనా చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని ఉల్టా క‌థ‌నాలు రాస్తారు... ఇప్పుడు కొంద‌రు అధికారుల‌ను త‌ప్పించ‌డంతో ద‌ళిత మంత్రిని టార్గెట్ చేసుకున్న‌ట్లుగా వార్త‌లు రాస్తున్నారు.. మీ జ‌ర్న‌లిజం నైపుణ్యాల‌కు హ్యాట్సాఫ్‌.!!

ఇది మీడియా తీరు..

ఇది మీడియా తీరు..
---------------
వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఉన్న‌న్ని రోజులు అన‌ర్హుల‌కు పింఛ‌న్లు ఇస్తున్నార‌ని రాశారు..
అన‌ర్హుల‌కు ఇళ్లులు క‌ట్టిస్తున్నార‌ని రాశారు..
-----------------
మ‌ళ్లా అన‌ర్హుల‌ను ఏరివేద్దామ‌ని మ‌రో సీఎం అనుకుంటే పాపం వృద్ధుల‌కు ఎన్ని క‌ష్టాలు పెడుతున్నార‌ని రాస్తారు..
ఒక‌వేళ అవే పింఛ‌న్ల‌ను కొన‌సాగిస్తే... వైఎస్ బాట‌లోనే అవినీతిని కొన‌సాగిస్తున్నార‌ని అంటారు...
------------------
ఇక్క‌డ వాళ్ల‌కు న‌చ్చిన ముఖ్య‌మంత్రి ఉంటే అంతా సాఫీగా సాగిన‌ట్లు రాస్తారు..!!

ఒబాకు అభ‌ద్ర‌త అని వార్త రాస్తాడు మొద‌టి పేజీలో....

ఒబామా తినే ఆహారాన్ని మూడు ద‌శ‌ల్లో ప‌రిశీలిస్తార‌ట‌... ఆహార నిపుణులు, ఢిల్లీ పోలీసులు, ఆ త‌ర్వాత ఆమెరికా సీక్రెట్ స‌ర్వీస్ వాళ్లు ప‌రీక్షించిన త‌ర్వాత ఒబామా గారు భోజ‌నం చేస్తార‌ట‌...!!
----------------------
ఈ విష‌యంలో తెలిస్తే ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక వాడు ఒబాకు అభ‌ద్ర‌త అని వార్త రాస్తాడు మొద‌టి పేజీలో....

తెలంగాణ‌, ఆంధ్ర రాష్ట్రాలు స‌మ‌ష్టిగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలి..

కేంద్ర ప్ర‌భుత్వం ఆంధ్రాకు నిధులు ఇవ్వ‌డం లేద‌ని కొంద‌రు సంతోషిస్తున్నారు.. వాస్త‌వానికి కేంద్రం తెలంగాణ‌కు కూడా రిక్త‌హ‌స్త‌మే చూపుతోంది.. మ‌న‌కు కూడా స‌రిగా నిధులు ఇవ్వ‌డం లేదు.. మ‌న‌కు రావాల్సిన నిధుల్లో 33 శాతమే వ‌చ్చాయ‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి... ఫ‌లితంగా చాలా ప‌థ‌కాల అమ‌లులో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి.. రాష్ట్రాల‌కు ఇవ్వాల్సిన నిధుల‌ను కేంద్రం నుంచి తీసుకోవ‌డం రాష్ట్రాల హ‌క్కు.. ఈ విష‌యంలో ఆంధ్రాకు నిధులు ఇవ్వ‌డం లేద‌ని మ‌నం సంతోషించ‌డం, తెలంగాణ‌కు నిధులు ఇవ్వ‌డం లేద‌ని వాళ్లు సంతోషిస్తే ప్ర‌యోజ‌నం ఉండ‌దు... కేంద్రం నుంచి రావాల్సిన నిధుల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా రాబ‌ట్టుకోవాలి.. ఇందు కోసం తెలంగాణ‌, ఆంధ్ర రాష్ట్రాలు స‌మ‌ష్టిగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలి.. లేక‌పోతే అభివృద్ధిలో వెన‌క‌బ‌డిపోతాం...!!

ఆంధ్రాలో జ‌ర్న‌లిస్టుల‌కు ర‌క్ష‌ణ క‌ర‌వు..


ప్రెస్‌ కౌన్సిల్‌కు 6 వారాల్లో జర్నలిస్టులపై దాడుల నివేదిక : నిజనిర్ధారణ కమిటీ వెల్లడి
కెఎన్‌ఎన్‌ ప్రతినిధి, గుంటూరు:గుంటూరు జిల్లాలో జర్నలిస్టులపై జరిగిన దాడులకు సంబంధించిన విచారణ నివేదికను 6 వారాల్లో ప్రెస్‌ కౌన్సలర్‌ ఛైర్మన్‌కు అందజేస్తామని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఎన్‌. రామచంద్రరావు తెలిపారు. బుధవారం జిల్లా పరిషత్‌ సమావేశపు మందిరంలో రామచంద్రరరావుతోపాటు కమిటీలోని ప్రకాష్‌దూబే, అమర్‌ నాథ్‌లు జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలకు సంబంధించి బహిరంగ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా రామచంద్రరావు విలేకర్లతో మాట్లాడుతూ చిలకలూరిపేటలో శంకర్‌హత్య, వినుకొండలో స్టీఫెన్‌బాబుపై దాడికి సంబంధించిన విచారణ నిర్వహించామన్నారు. వీటితోపాటు తమ దృష్టికి వచ్చిన జర్నలిస్టులపై జరిగిన దాడులు, వేదింపుల గురించి ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా దృష్టికి తీసుకువస్తామన్నారు. జర్నలిస్టులతోపాటు పోలీసు అధికారుల నుంచి కూడా జరిగిన ఘటనలపై అభిప్రాయాలు తీసుకోని ఛైర్మన్‌కు నివేదిస్తామన్నారు. గుంటూరు జిల్లాలో రాజధాని ఏర్పాడనున్న నేపధ్యంలో మీడియాపై జరిగిన దాడిని కూడా ఛైర్మన్‌ దృష్టికి తీసుకువెళతామన్నారు. జరిగిన ఘటనలపై రెండ్రోజులుగా అనేక కోనాలు, అంశాలపై వి చారణ చేయడం జరిగిందన్నారు. త్రిసభ్య కమిటీ వినుకొండ, చిలకలూరిపేటతోపాటు ఇటీవల కాలంలో గుంటూరు జిల్లాలో జరిగిన దాడులపై కూడా ప్రెస్‌ కౌన్సిల్‌కు నివేదిక అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు జరిగిన ఘటనలపై తమ అభిప్రాయాలను నిజ నిర్ధారణ దృష్టికి తీసుకువచ్చారు. చిలకలూరిపేట జర్నలిస్టు శంకర్‌ దారుణ హత్యకు సంబంధించి సూత్రదారులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప టిష్టమైన చట్టాలను రూపొందించే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు ఈ సందర్భంగా నిజ నిర్ధారణ దృష్టికి తీసుకువచ్చారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో మీడియా వ్యవహరించే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని కోరారు.
-------------------------------------------------
నవంబ‌రు నెల‌లో గుంటూరు జిల్లా లో ఓ విలేక‌రి హ‌త్య‌కు గుర‌య్యాడు.. ఎన్ని ప‌త్రిక‌ల్లో ప్ర‌ధాన పేజీలో వ‌చ్చింది... రాదు.. గుంటూరులో జ‌ర్న‌లిస్టుల‌పై దాడులు పెరిగాయ‌ట‌... ఇవ‌న్నీ రావు.. ఈ హత్య‌లు, దాడుల‌పై ప్రెస్ కౌన్సిల్ ఓ నిజ‌నిర్దార‌ణ క‌మిటీ వేసింది... ఈ విష‌యాన్ని
ద‌మ్ము ఛానెల్‌, మెరుగైన స‌మాజం కోసం త‌ప్పించే వాళ్లు ఎవ‌రూ ప్ర‌ముఖంగా చూప‌రు.. పాత్రికేయుల‌పై ఓ ప్రాంత సీఎం ఇలా అన్నాడ‌ని చేసిన‌
హ‌డావుడి అంతా ఇంతా కాదు.. కానీ మ‌రో ప‌క్క‌న‌ ఏకంగా పాత్రికేయుల‌నే హ‌త‌మారుస్తున్నా
ఎవ‌రూ నోరు మెద‌ప‌రు... పాత్రికేయులంతా మా కుల‌మే అన్న కించిత్ భావ‌న అయినా ఉంటే ఈ ఘ‌ట‌న‌ల‌ను ముక్త కంఠంతో ఖండించే వారు.. అది జ‌ర‌గ‌లేదు.. ఎందుకు? ఎవ‌రి స్వ ప్ర‌యోజ‌నాలు వారివి..
నిఖార్సైయిన పాత్రికేయ‌మే అయితే ఎక్క‌డో ఫ్రాన్స్‌లో జ‌ర్న‌లిస్టుల‌పై దాడుల‌ను ప్ర‌ముఖంగా చూప‌డం క‌న్నా ఇక్క‌డ జ‌ర్న‌లిస్టుల ప‌రిస్థితి ఏంటో ఆలోచించుకోండి.. మొన్న‌టికి మొన్న ఓ ఛానెల్‌లో మ‌హిళా ఉద్యోగినికి లైంగిక వేధింపులు.. ఇంకో పేప‌ర్ లో కార్మిక చ‌ట్టాల‌ను ఉల్లంఘించి య‌థేచ్చ‌గా ఉద్యోగుల తొల‌గింపు.. ఇవ‌న్నీ మీ పాత్రికేయుల‌కు జ‌రుగుతున్న అన్యాయాలే.. వీటిపైన కూడా రోడ్డెక్కండి.. ఓ వ్యాఖ్యాలు రాజ్యాంగ‌ వ్య‌తిరేక‌మ‌ని స్వేచ్ఛ‌గా ధ‌ర్నాలు చేసిన వాళ్లంతా కూడా రోజు ప‌త్రిక‌ల్లో, మీడియా సంస్థ‌ల్లో అణ‌చివేత‌కు గుర‌వుతున్న పాత్రికేయుల త‌ర‌ఫున‌ కూడా అంతే స్వేచ్ఛ‌గా గొంతెత్తండి.. యాజ‌మాన్యాల కోసం గొంతెత్తితే మీ అస్థిత్వానికే ముప్పు..
---------------------------------------
ప్రెస్ కౌన్సిల్ తెలంగాణ‌లో సీఎం వ్యాఖ్య‌ల‌పై మాత్రం ఆగ‌మేఘాల‌పై విచార‌ణ చేసి నివేదిక ఇచ్చింది.. ఇక ఆంధ్రా సీఎం జ‌ర్న‌లిస్టుల‌ను ప్రెస్ మీట్ల‌కు రానివ్వ‌కుండా అడ్డుకోవ‌డంపై నివేదిక‌కు
దిక్కు మొక్కు లేద‌.. అడిగే నాథుడే లేడు.. నాకు తెలిసి.. ఈ ఆంధ్రా ప్ర‌భ విలేక‌రి హ‌త్య కేసులోనూ 6 వారాల్లో నివేదిక వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం అయితే లేదు.. అడిగే వాళ్లు కూడా లేరు.. మొక్కు బ‌డి విచార‌ణ‌లు ఎందుకు చేస్తారో?

శుక్ర‌వారం రాజ్‌ప‌థ్‌లో జ‌రిగిన ఫుల్ డ్రెస్‌ రిహార్స‌ల్స్‌లో తెలంగాణ శ‌క‌టం...

శుక్ర‌వారం రాజ్‌ప‌థ్‌లో జ‌రిగిన ఫుల్ డ్రెస్‌ రిహార్స‌ల్స్‌లో తెలంగాణ శ‌క‌టం...

Thursday, 22 January 2015

మ‌న వ‌ద్ద ఇలాంటి రాజ‌కీయ ఐక్య‌త ఎప్పుడు సాధ్య‌మో...!!

సాగ‌ర్ నీటిని ఎక్కువ‌గా త‌ర‌లించుకున్న పోతున్న‌ర‌న్న వార్త‌ల‌తో ప‌రిశీల‌న‌కు వెళ్లిన తెలంగాణ నీటిపారుద‌ల శాఖ సీనియ‌ర్ ఇంజినీర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ నాయ‌కులు అడ్డుకున్నారు.. ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేంత వైరం వైసీపీ, టీడీపీకి ఉన్నా.. ఆంధ్రా ప్ర‌యోజ‌నాల‌ను కాపాడాల‌ని వాళ్లు ఏక‌మై మ‌న ఇంజినీర్ల‌ను అడ్డుకున్నారు...!!
----------------------------
మ‌న వ‌ద్ద ఇలాంటి రాజ‌కీయ ఐక్య‌త ఎప్పుడు సాధ్య‌మో...!!
మ‌న రాజ‌కీయ అనైక్య‌తే ఇంత‌కాలం క‌ష్టాల‌కు కార‌ణ‌మైంది.. ఇక‌నైనా తెలంగాణ ప్ర‌యోజ‌నాల విష‌యంలో సంఘ‌టితంగా కొట్లాడాల‌ని అన్ని పార్టీల నేత‌ల‌కు పేరుపేరున విజ్ఞ‌ప్తి చేస్తున్నా...!!

ఇద్ద‌రు మాటకారులు క‌లిస్తే ఎలా ఉంటుంది...

ఇద్ద‌రు మాటకారులు క‌లిస్తే ఎలా ఉంటుంది... జ‌న‌వ‌రి 26న మ‌నం చూడాల్సిందే..
అరే నువ్వు గొప్పొడివి రా.. అంటే లేదు లేదు నువ్వే గొప్పొడివి రా అంటూ తెగ పొగ‌డ్త‌ల వ‌ర్ష‌మే క‌దా...!!
ఒబామా, మోడీ ఇద్ద‌రూ మాట‌ల మాంత్రికులే... అయితే మోడీ కొంత బెట‌రే అని చెప్పుకోవాలి... ఎందుకంటే మాట‌లే కాకుండా చేత‌లు కూడా చేయ‌గ‌ల‌డు..!!

బ‌యోమెట్రిక్ హాజ‌రు ప‌ట్టిక అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఉండాలి...

బ‌యోమెట్రిక్ హాజ‌రు ప‌ట్టిక అన్ని ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఉండాలి...
ఉద్యోగుల హాజ‌రు వివ‌రాలు న‌మోదు చేయాలి...
విధుల్లో అల‌స‌త్వాన్ని స‌హించొద్దు...!!
-----------------------------
అన్ని రాష్ట్ర‌ ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను ఒకే చోట ఉంచాల‌న్న కేసీఆర్ ప్ర‌తిపాద‌న మంచిదే... ఇందుకోసం స‌మీకృత భ‌వ‌న స‌ముదాయాల‌ను వీలైనంత త్వ‌ర‌గా నిర్మించాలి... ప్ర‌తీ ప్ర‌భుత్వ కార్యాల‌యంలోనూ బ‌యోమెట్రిక్ విధానం ఉండాలి.. ప్ర‌తీ ఉద్యోగి ఏ స‌మ‌యానికి విధుల‌కు హాజ‌రు అవుతున్నాడు.. ఎన్ని గంట‌ల‌కు విధులు ముగించుకు వెళ్తున్నాడు అన్న‌ది కూడా న‌మోదు చేయాలి... అలాగే ఆస‌రా పింఛ‌న్లు, స‌మ‌గ్ర కుటుంబ స‌ర్వే స‌మ‌యంలో ఎక్కువ స‌మ‌యం పనిచేసిన ఉద్యోగుల‌కు త‌గిన రీతిలో గుర్తింపు కూడా ఉండాలి..
------------------------------
నోట్‌: ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ జ‌రిగే స‌మ‌యంలో త‌ప్ప మిగిలిన అన్ని వేళ‌ల్లోనూ నియోజ‌క‌వ‌ర్గాల్లోనే ఉండాలి.. వాళ్ల ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటే ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డ‌మే కాకుండా ప్ర‌త్య‌క్షంగా చూసే అవ‌కాశం ఉంటుంది.. ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, మంత్రులు జీతాలు పెంచుకున్నారు.. ప‌న్నుల రూపంలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే డ‌బ్బే వీరి జీతాల‌కు ఉప‌యోగించుకుంటారు.. మ‌రి జీతం ఇస్తున్న ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగైనా, నాణ్య‌మైన రీతిలో ప‌నిచేయాలి క‌దా... ప్ర‌జ‌లు ప‌నిచేయించుకోవాలి.. ఎందుకంటే ఉద్యోగులు, ఎమ్మెల్యేల‌కు జీతాలిస్తుంది ప్ర‌జ‌లే...!!

బేడీ మాయ ప‌నిచేస్తుందా?

మ‌హారాష్ట్ర, హ‌ర్యానా, జ‌మ్మూకాశ్మీర్‌, జార్ఖండ్ ఎన్నిక‌లు మొన్న‌నే జ‌రిగాయి... ఆ ఎన్నిక‌ల స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి ఎవ‌రో బీజేపీ ముందే ప్ర‌క‌టించిందా? ఢిల్లీలో మాత్రం ముందే ప్ర‌క‌టించింది.. ఢిల్లీ ఎన్నిక‌ల్లో గెలిచినా ఓడినా కిర‌ణ్ బేడీతో బాధ్య‌త అన్న మాట‌.. నిజంగా ఇక్క‌డ మోడీ మాయ క‌న్నా బేడీ మాయ ప‌నిచేస్తుందా మ‌నం వేచి చూడాలి...!!!

ఎవ‌రికీ ఏమీ చెప్ప‌లేం...

ఆ ప‌త్రిక వాళ్లు దైవ దూత‌పై కార్టూన్లు వేస్తే ఓ వ‌ర్గం స‌హించ‌దు.. 
ఇంకో చిత్ర‌కారుడు దేవుడిపై బొమ్మ‌లు గీస్తే మ‌రో వ‌ర్గం అంగీక‌రించ‌దు...
ఒక‌రి మ‌త అభిమానం దాడితో ఆగుతుంది.. ఇంకొక‌రిది ప్రాణాలు తీసే వ‌ర‌కు వ‌స్తుంది... ఎవ‌రికీ ఏమీ చెప్ప‌లేం...

ముర‌ళీ మోహ‌న్ గారికి మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు..

ముర‌ళీ మోహ‌న్ గారికి మ‌న‌స్ఫూర్తిగా కృత‌జ్ఞ‌త‌లు..
వివాదం లేకుండా ఈ త‌ర‌లింపు ప్ర‌క్రియ సాగితే బాగుంటుంది...

కొండ‌ల‌న్నింటినీ నాశ‌నం చేసి హ‌రిత హారాలు చేస్తే ప్ర‌యోజ‌నాలు ఉంటాయా?

ఓ చిన్న సందేహం...
---------------
కొండ‌ల‌న్నింటినీ నాశ‌నం చేసి హ‌రిత హారాలు చేస్తే ప్ర‌యోజ‌నాలు ఉంటాయా?
మ‌న అవ‌స‌రం మేర‌కు గ్రానైట్ వాడుకోవాలి కానీ... ప్ర‌పంచానికి ఎగుమ‌తులు చేసేంత‌గా కొండ‌ల‌ను పిండి చేస్తే భ‌విష్య‌త్తుకు న‌ష్టం కాదా?
ఎన్ని ల‌క్ష కోట్లు ఇచ్చినా కొండ‌లు, గుట్ట ల‌ను సృష్టించ‌లేం క‌దా...
మాన‌వులు ఏదో ఒక రోజు ఇలా కొండ‌ల‌ను నాశ‌నం చేస్తార‌ని భ‌గ‌వంతుడు ఆలోచించాడేమో...
అందుకే కొండ‌ల్లో కొలువై... క‌నీసం కొన్ని కొండ‌ల జోలికైనా మాన‌వులు రాకుండా నిరోధించిన‌ట్లు అనిపిస్తుంది అప్పుడ‌ప్పుడు..
గాలి జ‌నార్ద‌న్ రెడ్డి లాంటోళ్లు సుంకుల‌మ్మ‌ ఆల‌యాన్ని పేల్చేసి మ‌రీ గ‌నుల త‌వ్వ‌కం చేశారు..
ఇక క‌రీంన‌గ‌ర్‌లో అయితే మ‌న అస్థిత్వానికి ఆనావాలుగా నిలిచిన బొమ్మ‌ల‌మ్మ గుట్ట‌లోనూ చ‌రిత్ర‌క సంప‌ద‌ను నాశ‌నం చేశారు..
రేపు డ‌బ్బులొస్తాయంటే భువ‌న‌గిరి కొండ‌ను కూడా గ్రానైట్ వ్యాపారుల‌కు అప్ప‌గిస్తారా?
సిద్ధుల గుట్ట‌ను కూడా పైస‌ల కోసం పిండి చేస్తారా?
అస‌లు ఎందుకు ఈ కొండ‌ల‌ను పిండి చేయ‌డం... అవే క‌దా మేఘాల‌ను అడ్డుకుని వ‌ర్షించేలా చేస్తాయి క‌దా...!
గిరిజ‌నుల‌కు ఉపాధినిస్తాయి క‌దా... మ‌నం ఉండ‌టానికి ఇళ్లులున్నాయి... మ‌రి జంతు జాలానికి ఆవాసం ఉండొద్దా..?
ఈ కొండ కోన‌ల్లోనే క‌దా గోదావ‌రి, కృష్ణ‌మ్మ‌లు ఉద్భ‌వించింది... న‌దుల్లోకి వ‌చ్చే చిన్న చిన్న నీటి పాయ‌లు కూడా ఈ కొండ‌ల నుంచి మొద‌ల‌య్యేవి క‌దా..
రేపు ఈ కొండ‌లే లేకుండా ప‌రిస్థితి ఏంటి?

బాబు గారు తెలంగాణ‌లో ప‌ర్య‌టించి ఏం చెప్పాల‌నుకుంటున్నారు..?

--------------------------------------
పాల‌మూరు ఎత్తిపోత‌ల వ‌ద్ద‌ని ఢిల్లీకి బృందాన్ని పంపిన అని చెబుతాడా?
సీలేరు విద్యుత్తును లాక్కొని తెలంగాణ‌ విద్యుత్ క‌ష్టాల‌కు కార‌కుడిన‌య్యాన‌ని చెబుతాడా?
పోల‌వ‌రం కోసం ఖ‌మ్మం మండ‌లాల‌ను క‌లిపేసుకున్నాన‌ని చెబుతాడా?
పోల‌వ‌రం ఎత్తును మ‌రింత పెంచాల‌నుకుంటున్న‌ట్లు చెబుతాడా?
న‌ల్ల‌గొండ జిల్లాల‌ను ఎండ‌గొట్టేలా ర‌బీలోనూ సాగ‌ర్ నీటిని కృష్ణా డెల్టా కోసం త‌ర‌లించుకుపోతున్నామ‌ని చెబుతాడా?
సాగ‌ర్‌లో జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి కాకుండా అడ్డుప‌డింది నేను అని చెబుతాడా?
ఎంసెట్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో కిరికిరి పెట్టిస్తున్నా? అని చెప్పుకుంటాడా?
-----------------------------------
ఏం చెప్పుకోవ‌డానికి ఆయ‌న ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారో తెలంగాణ టీడీపీ నేత‌లే స‌మాధానం ఇస్తే బాగుంటుంది...

Wednesday, 21 January 2015

కృష్ణా నీటి వాటాలో రాజీ ప‌డొద్దు.. వేస‌విలో నీటి క‌ష్టాలు కొని తెచ్చుకోవ‌ద్దు..!!

కృష్ణా నీటిని వాడుకున్నారు.. వాళ్ల‌ వాటా అయిపోయిన త‌ర్వాత ర‌బీకి సాగు నీళ్లు ఇవ్వాలంటూ ప‌ట్టుప‌డుతున్నారు.. 
వాళ్ల ప‌త్రిక‌లో లొల్లి షురూ చేసిన్రు... బోర్డు నిర్ణ‌యాన్ని గౌర‌వించాల‌ని ఓసారి.. న్యాయ శాఖ ఏం చెబితే అదేని మ‌రోసారి కిరికిరి మొద‌లైంది..
తెలంగాణ‌ ప్ర‌భుత్వం మెత‌క వైఖ‌రి వ‌హిస్తే సాగు మాట దేవుడెరుగు మ‌న‌కు తాగేందుకే నీళ్లు ద‌క్క‌వ్‌... త‌స్మాత్ జాగ్ర‌త్త‌...!!
కృష్ణా నీటి వాటాలో రాజీ ప‌డొద్దు.. వేస‌విలో నీటి క‌ష్టాలు కొని తెచ్చుకోవ‌ద్దు..!!

నీట్ వ‌ద్ద‌న్నారు ఎందుకు?

రెండు ఎంసెట్ ప‌రీక్ష‌లు రాస్తే విద్యార్థుల‌కు ఏం న‌ష్టం ఉంటుంది.. క‌ర్ణాట‌క సెట్‌, త‌మిళ‌నాడు సెట్‌లు రాయ‌డానికి లేని ఇబ్బంది తెలంగాణ ఎంసెట్ రాయ‌డానికి వ‌స్తుందా? ఒక‌వేళ ఉమ్మ‌డి ప‌రీక్ష‌లే ఉండాలంటే జాతీయ స్థాయిలో మెడిక‌ల్ విద్యార్థుల కోసం నీట్ ప‌రీక్ష జ‌ర‌పాల‌ని ప్ర‌తిపాదించిన‌ప్పుడు ఎందుకు వ‌ద్ద‌న్నారు...?

నేను చేసేది చేస్తాను అంటారు.. ఎందుకో ఈ తేడా..!!

గంగా న‌ది ప‌రిశుభ్రం కావాల‌న్న‌ది మ‌తాల‌కు అతీతంగా భార‌తీయులంద‌రి కోరిక‌....
ఒక్క గంగాన‌దే కాదు కాలుష్య కోర‌ల్లో చిక్కుకున్న ప్ర‌తీ న‌దిని, ప్ర‌తీ స‌ర‌స్సును, ప్ర‌తీ చెరువును ప‌రిశుభ్రం చేసుకోవాలి...
గంగాన‌దిని కాలుష్య కోర‌ల నుంచి కాపాడేందుకు పూజా ద్ర‌వ్యాల‌ను, ర‌సాయ‌నాల‌ను ఇత‌ర‌త్రా వ‌స్తువుల‌ను గంగా న‌దిలో వేయొద్ద‌ని సూచిస్తారు..
మొన్న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గంగా న‌ది నుంచి 100కు పైగా బాలిక‌ల మృత‌దేహాలు బ‌య‌ట ప‌డ్డాయి..
పెళ్లి కాని యువ‌తుల మృత‌దేహాల‌ను గంగా న‌దిలో వేసి అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌డం అక్క‌డి ఆచార‌మ‌ట‌...
అరే ఏళ్ల త‌ర‌బ‌డిగా వాళ్లు ఆ ఆచారాన్ని పాటిస్తున్నారు.. దాన్ని ఎలా అడ్డుకుంటార‌ని ఏ ఒక్క‌రూ గొడ‌వ చేయ‌రు....
ఈ ఆచారం వ‌ల్ల గంగా న‌ది క‌లుషితం అవుతుంది.. మ‌న‌కు న‌ష్టం క‌లుగుతుంద‌ని ఆలోచిస్తాం..
ఎందుకంటే గంగా న‌దిని కాపాడుకుంటేనే మ‌న‌కు భ‌విష్య‌త్తు ఉంటుంది కాబ‌ట్టి..
ఇక్క‌డ ఆచారాల క‌న్నా న‌దీమ‌ త‌ల్లి వేద‌న‌ను తీర్చ‌డ‌మే మ‌న‌కు ముఖ్యం అవుతోంది...
మ‌రి మ‌న వ‌ద్ద‌కొచ్చే స‌రికి చెరువును శుద్ధి చేద్దాం రా మొర్రో అంటే.. లేదు లేదు నాకు అక్క‌ర్లేదు అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తారు..
నా సంప్ర‌దాయం నాదే.. నేను చేసేది చేస్తాను అంటారు.. ఎందుకో ఈ తేడా..!!

నేతాజీని జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని విజ్ఞ‌ప్తి...!!



స్వాంతంత్ర్య స‌మ‌ర యోధుడు, ఆజాద్ హిందు ఫౌజ్‌ వ్య‌వ‌స్థాప‌కుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జ‌యంతి జ‌న‌వరి 23వ తేదీన ఉంది.. ఆయ‌న జ‌యంతి రోజును దేశ్ ప్రేమ్‌ దివ‌స్‌గా జ‌రిపించాల‌ని బెంగాల్‌కు చెందిన కొన్ని పార్టీలు కోరాయి. మ‌రి మోడీ గారు స్పందిస్తే బాగుంటుంది.. నేతాజీ అభిమానులు కొంద‌రు దేశ‌వ్యాప్తంగా చేత‌నా యాత్ర‌ను చేప‌ట్టారు.. వారం రోజుల పాటు ఇది కొనసాగుతుంది... స‌దా స్మ‌ర‌ణీయుడు, గొప్ప పోరాట యోధుడైన‌ నేతాజీని స‌మున్న‌తంగా గౌర‌వించుకోవాలి.. ఈ మ‌ధ్య మ‌హ‌నీయుల పుట్టిన రోజుల‌ను, జ‌యంతుల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న మీరు నేతాజీని జ‌యంతిని ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని విజ్ఞ‌ప్తి...!!

Tuesday, 20 January 2015

పెరిగిన పులుల జ‌నాభా

దేశంలో పులుల జ‌నాభా నాలుగేళ్ల‌లో 30 శాతం పెరిగింది...
2010లో 1706 పులులు ఉండ‌గా... ఇప్పుడు 2226 పులులు ఉన్న‌ట్లు తాజా గ‌ణాంకాలు చెబుతున్నాయి..
మొత్తం మీద వ‌న్య‌ప్రాణి సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు స‌త్ఫ‌లితాల‌ను ఇచ్చిన‌ట్లు ఉన్నాయి..
నోట్‌: మ‌న‌లో మ‌న మాట‌.. కొంప‌దీసి ఈ పులుల‌లో సాక్షి మ‌హారాజ్‌, చంద్ర‌బాబులు ఏమైనా ఉన్నారో తెలియ‌దు కానీ పులుల జ‌నాభా పెర‌గ‌డం మంచి ప‌రిణామ‌మే...

సంతోషంగా ఉంది..

సీబీఐ త‌న విశ్వ‌స‌నీయత‌ను నిరూపించుకుంద‌నిపిస్తుంది... కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ అన్న ముద్ర‌ను తొల‌గించుకున్నందుకు సంతోషంగా ఉంది..

గాలి అక్ర‌మాల‌పై నేను కొట్లాడానంటే నేను కొట్లాడాను అని చెప్పుకోవ‌డానికి కూడా ఎవ‌రైనా ముందుకు వ‌స్తారా?

గాలి అక్ర‌మాల‌పై నేను కొట్లాడానంటే నేను కొట్లాడాను అని చెప్పుకోవ‌డానికి కూడా ఎవ‌రైనా ముందుకు వ‌స్తారా?
లేదు లేదు గాలి కేసు గోల మాకేందుకు అని బాబు, నాగంలు నోరు మూసుకుంటారా?
క‌నీసం రాజ‌గురువు గారైనా పాత వార్త‌ల‌ను రాస్తారా?
గాలి గ‌నులు, విజ‌య‌సాయి, సునీల్‌రెడ్డి, బ‌ళ్లారి బ్ర‌ద‌ర్స్ అంటూ పుంఖానుపుంఖానులుగా స్టోరీలు ఇస్తారా?
లేదా.. విచార‌ణ‌లో ఉన్న అంశాల జోలికి వెళ్ల‌బోమంటూ స్వీయ నియంత్ర‌ణ విధించుకుంటారా?(ప్ర‌భుత్వాలు వాళ్ల‌వైతే స్వీయ‌నియంత్ర‌ణ‌లే శ‌ర‌ణ్యం కదా... శూల శోధ‌న‌లు చేస్తే కేసు ఏ మ‌లుపు తిరిగి ఎవ‌రి మెడ‌కు చుట్ట‌కుంటుందో తెలియ‌దాయే...)
------------
నోట్‌: 2009 నుంచి 2014వ‌ర‌కు తెలంగాణ ఉద్య‌మం ప్ర‌జ‌ల్లో ఎంత న‌డిచిందో... అంత‌క‌న్నా ఎక్కువ‌గా గాలి క‌థ‌నాల జోరు ప‌త్రిక‌ల్లో(ఆ రెండు) ఎక్కువ‌గా క‌నిపించేదే... చిన్న‌పిల్లాడిని అడిగినా గాలి అని చెబితే పుట్టుపూర్వోత్త‌రాల‌తో స‌హా చెప్పేలా రాశారు.. ఆయ‌న బెయిల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోబోతుంటే వెంట‌నే ఓ క‌థ‌నం వ‌చ్చేది... ఎలా బెయిల్ ఇస్తార‌న్న‌ట్లుగా... సాక్ష్యుల‌ను ప్ర‌భావితం చేస్తాడ‌నే వారు.. మ‌రి ఇప్పుడు ఆ వార్త‌లు రావు.. మ‌నం ఒబుళాపురాన్ని మ‌ర‌చిపోవాల్సిందేనేమో...!!!

ఆ అజ్ఞాత వీరుడెవ్వ‌డు? ఆ పిలుపునిచ్చిన సేనాని ఎవ‌రు?

ఆ అజ్ఞాత వీరుడెవ్వ‌డు?
ఆ పిలుపునిచ్చిన సేనాని ఎవ‌రు?
ఆ ఒక్క మ‌గాడెవ‌రో తెలిస్తే చెప్పండి ప్లీజ్‌...
లేక అవి ఆకాశ‌వాణి ప‌లుకులేనా...?
----------------------
ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తా... ఈ మాట తెలంగాణ వాదుల‌కు ఓ స్ఫూర్తి, ఈ మాట అక్ర‌మార్కుల‌కు ఓ హెచ్చ‌రిక‌. ఎవ‌రు ఈ పిలుపు ఇచ్చారో తెలియ‌దు.. ఎవ‌రికి ఇచ్చారో తెలియ‌దు.. తెలంగాణ‌ నేల‌పై ఇలాంటి ప‌ద బంధాల‌ను ఉప‌యోగించగ‌ల ఏకైక‌ వ్య‌క్తి కేవ‌లం ఒక్క‌ర‌ని నేను అనుకున్నా.. గ‌త‌ ప‌దేళ్లుగా ఆయ‌నే ఈ మాట అన్న‌డ‌ని న‌మ్మాను.. ఈ అత్య‌ద్భుత మాట‌ల‌ను ఉప‌యోగించిన ఆయ‌న‌ను ఆరాధించాను.. కానీ నాకు ఈ మాట‌ల‌తో సంబంధం లేదు అని ఆయ‌నే ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. మ‌రి ఇంత గొప్ప మాట‌ను ప్ర‌యోగించింది ఎవ‌రై ఉంటారు? ఆ అజ్ఞాత యోధుడెవ‌రు? ఆ పిలుపునిచ్చి తెలంగాణ స‌మాజాన్ని జాగృతం చేసిన వ్య‌క్తి ఎవ‌రు? నాకు తెలుసుకోవాల‌ని ఉంది. ఆయ‌న‌ను అభినందించాల‌ని ఉంది.
ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తా... అన్న ఈ మాట వింటే గోల్కొండ ఖిల్లా కింద గోరి క‌డ‌తం కొడ‌కా అన్న ర‌చ‌యిత మాట‌లు విన్న‌ట్లుగా అనిపిస్తుంది.. అంత ఉత్తేజం, అంత చైత‌న్యాన్ని నింపుతున్నాయి. ఏది ఏమైనా ఈ మాట‌లు రాసింది కేవ‌లం విలేక‌రి మాత్ర‌మే అయితే ఆయ‌న పేరు చెప్పండి మ‌న‌స్ఫూర్తిగా అభినందిస్తా.. చిన్న నాయకుడైతే ఆయ‌న వివ‌రాలు ఇవ్వండి దండేసి దండం పెడ‌తా.. ఆయ‌న ఎవ‌రైనా స‌రే వారికి నా ఉద్య‌మాభినంద‌న‌లు.. పాదాభివంద‌నాలు..!!!

ఢిల్లీ ప‌రిణామం స్వాగ‌తించాల్సిందే..

స‌చ్ఛీలుర మ‌ధ్య స‌మ‌రాలు శుభ‌ప‌రిణామం...
బేడీ,, కేజ్రీవాల్‌లో ఎవ‌రు సీఎం అయినా మంచిదే...
--------------------------------------
ఒక‌ప్పుడు స‌చ్ఛిలురైన రాజ‌కీయ నాయ‌కులు ఎంద‌రున్నా అందులో అత్యంత సచ్ఛీలురుల‌ను ఎంపిక చేసి అవ‌కాశం ఇచ్చే వారు.. రానురాను ప‌రిస్థితులు మారిపోయి ఎవ‌రిపై ఎక్కువ కేసులున్నాయో వారికే సీట్లు ఇచ్చి అంద‌లం ఎక్కే రోజులొచ్చాయి... పోటీ చేసే అభ్య‌ర్థుల‌పై కేసులు లేకుంటే ఆశ్చ‌ర్య‌పోయే రోజులివి.. నిజాయ‌తీగా ఉంటే గెలుస్తామో లేదో అన్న భ‌యాందోళ‌న‌.. అవినీతి ఆరోప‌ణ‌లు స‌ర్వ‌సాధార‌ణం... కానీ ఢిల్లీ ఎన్నిక‌ల్లో మాత్రం స‌చ్ఛీలురుల‌ మ‌ధ్య పోటీ న‌డుస్తోంది.. ముఖ్యంగా కేజ్రీవాల్‌ను ఢీకొట్ట‌డానికి అంతే నిజాయ‌తీ, స‌చ్ఛీల‌త క‌లిగిన వారిని ఏరికోరి బీజేపీ ఎంపిక చేస్తోంది.. నువ్వు మంచోడిని పోటీలో దించితే.. నేను అంత‌క‌న్నా ఎక్కువ మంచోడికి సీటు ఇచ్చి గెలిపించుకుంటా అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఆహ్వానించ‌ద‌గిన విష‌య‌మే.. ఏది ఏమైనా ఢిల్లీ ఎన్నిక‌ల అనంత‌రం కిర‌ణ్ బేడీ, కేజ్రీవాల్ ఇద్ద‌రిలో ఎవ‌రు సీఎం అయినా అది శుభ‌ప‌రిణామ‌మే అనుకోవాలి... ఉద్యోగాల్లో నిజాయ‌తీగా ప‌నిచేస్తే డ‌బ్బు సంపాదించ‌క‌పోయినా జ‌నాభిమానం క‌ల‌కాలం ఉంటుంద‌న‌డానికి ఇవి నిద‌ర్శ‌నంగా నిలిచే అవ‌కాశం ఉంది..

తెలంగాణ‌కు బీచ్ మాటేమో కానీ... భూభాగ‌ ఓడ రేవునైతే తీసుకొస్తున్నారు..

తెలంగాణ‌కు బీచ్ తెస్తాం... ఓడ రేవును తెస్తామ‌ని ఇక్క‌డి నాయ‌కులు పిచ్చి హామీలిచ్చినా న‌మ్మే గుడ్డి జ‌నాలున్నార‌న్న‌ట్లు కొన్నిసార్లు సినిమాల్లో, రాజ‌కీయ నాయ‌కుల ప్ర‌సంగాల్లోనూ మాట‌లు వినిపించేవి... బీచ్ మాటేమో కానీ... భూభాగ‌ ఓడ రేవునైతే తీసుకొస్తున్నారు.. ఇప్పుడు పిచ్చివాళ్లెవ‌రో.. తెలివిత‌క్కువ వాళ్లెవ‌రో ఆ ద‌ర్శ‌కులు, మాట‌ల ర‌చ‌యిత‌లే ఆలోచించుకోవాలి.. 
నోట్‌: ఖ‌మ్మం నుంచి బంగాళా ఖాతానికి నౌకాయానాన్ని కూడా ప్రారంభిస్తే ఎంత బాగుంటుందో...? 
మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌గా ఉన్న విద్యాసాగ‌ర్‌రావు ఈ విష‌యంలో అప్ప‌ట్లో మంచి ప్ర‌తిపాద‌న సిద్ధం చేశారు.. వాటిని అమ‌లులోకి తెస్తే బాగుటుంది...

జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌లో ఇంత వీకా

నేను తెలంగాణ వాడిని కాదు... ఆంధ్రా వాడిని కాదు... నేను హైద‌రాబాదీని... హైద‌రాబాద్ ఎక్క‌డుంది? ఈ విష‌యం కూడా తెలీదా? జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌లో ఇంత వీకా ఈయ‌న‌...!!!

పిల్ల‌ల్ని క‌న‌మ‌ని ప్రోత్స‌హించ‌డం ఏంటో?

ఒక‌రిద్ద‌రు ఎక్కువైనా ప‌ర్వాలేదు.. ఎక్కువ మందిని క‌నండి అని చంద్ర‌బాబునాయుడు స్టేట్‌మెంట్ ఇచ్చారు..
మ‌రి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఇద్ద‌రు క‌న్నా ఎక్కువ మంది పిల్ల‌లు ఉంటే వారిని పోటీకి అన‌ర్హుల‌ను చేస్తారు క‌దా..
మ‌రి దానిపైన కూడా చ‌ట్ట స‌వ‌ర‌ణ చేస్తారా? ఉద్యోగుల‌కు ఇద్ద‌రు పిల్ల‌ల వ‌ర‌కే పెట‌ర్నిటీ సెల‌వు(పురుష ఉద్యోగుల‌కు) ఉంటుంది.. దాన్ని కూడా మార్చాలి క‌దా... అవ‌న్నీ చేయ‌కుండా పిల్ల‌ల్ని క‌న‌మ‌ని ప్రోత్స‌హించ‌డం ఏంటో?
చంద్ర‌బాబునాయుడు పిల్ల‌ల్ని ఎక్కువ మందిని క‌న‌మ‌ని చెప్పి ఊరుకున్నాడు సంతోషించాలి... అప్ప‌ట్లో సంజ‌య్ గాంధీ జ‌నాభా నియంత్ర‌ణ అని చెప్పి ఏకంగా పెళ్లి కాని వాళ్ల‌కు కూడా కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్లు చేయించాడ‌ట‌... మ‌న బాబుగారికి ఈ విష‌యం తెలిస్తే పిల్ల‌ల్ని క‌నిపించేందుకు పెళ్లి కానివారితోనూ కాపురాలు చేయించినా చేయిస్తాడేమో...!!!

బాబీ జిందాల్‌ చాలా మంచి మాట చెప్పాడు..


ఈయ‌న రాజ‌కీయ కార‌ణాల వ‌ల్ల ఇచ్చాడో లేక వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మో తెలియ‌దు కానీ చాలా మంచి మాట చెప్పాడు.. మ‌నం ఏ గ‌డ్డ మీద అడుగు పెట్టినా ఆ గ‌డ్డ మ‌న‌దే అన్న భావ‌న ఏర్ప‌డాలి.. అక్క‌డి మ‌న‌షుల‌ను గౌర‌వించాలి, అక్క‌డి సంస్కృతిలో మ‌మేకం కావాలి... అప్పుడే జాతుల మ‌ధ్య వైరాలు, ద్వేష భావ‌న‌లు ఉండ‌వు..

Wednesday, 14 January 2015

వ్య‌వ‌సాయం చేసే వారిలో స్ఫూర్తి నింపాలి




స్వ‌చ్ఛ భార‌త్‌తో భార‌త్‌ను ప‌రిశుభ్రంగా మార్చాలంటున్నారు..
సెల‌బ్రిటీల‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా పెట్టి అంద‌రిలో స్ఫూర్తి నింపాల‌ని చూస్తున్నారు..
ఇదే రకంగా దేశానికి అన్నం పెట్టే రైత‌న్న‌లో స్ఫూర్తి నింప‌డం, ఆధునిక సాగు ప‌ద్ధ‌తుల్లో వారికి మెల‌కువ‌లు నేర్పాలి..
న‌ష్టాల ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోతున్న అన్న‌దాత‌ల‌ను చూసి వ్య‌వ‌సాయం వైపు మొగ్గుచూపే వారే త‌గ్గుతున్నారు..
ఇది మ‌న‌కు భ‌విష్య‌త్తులో తీర‌ని న‌ష్టాన్ని మిగుల్చుతుంది..
అందుకే వ్య‌వ‌సాయం చేసే వారిలో స్ఫూర్తి నింపేలా,  సాఫ్ట్‌వేరు ఉద్యోగులు కూడా వారాంతాల్లో చేను, చెల‌క‌ల్లో పొలాల‌ను చూసేలా సెల‌బ్రిటీలే స్ఫూర్తిని నింపాలి...
వ్య‌వ‌సాయం అంటే వ‌రి, ప‌త్తే కాదు... కూర‌గాయ‌ల సాగైనా, ఇంకోటైనా స‌రే... అది పొలాల్లోనే చేయాల‌ని ఏముంది... ఇళ్ల పైక‌ప్పుల‌నే పొలాలుగా మార్చుకొని కూర‌గాయ‌లు పండించేలా చూడాలి...
-------------------
కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఆధునిక మెల‌కువ‌ల‌తో పంట‌లు పండించ‌డం చూశాం... సినిమాల‌తో బిజీబిజీగా ఉండే ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా వ్య‌వ‌సాయం వైపు మొగ్గుచూపారు. సుభాష్ పాలేక‌ర్ చెప్పిన‌ జీరో బ‌డ్జెట్ సేంద్రీయ సాగుపై దృష్టిసారించారు. కూర‌గాయ‌ల సాగులో బిజీగా ఉన్నార‌ట‌.. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్లు కూడా చేశాడు..
------------------
ఇలా సెల‌బ్రిటీలు కూడా  వ్య‌వ‌సాయానికి రోజుకు గంట చొప్పున ఏడాదికి 365 రోజులు కేటాయిస్తూ ప్ర‌తీ ఒక్క‌రినీ రైతుగా మారేలా స్ఫూర్తిని నింపితే  ఎంత బాగుంటుంది(స్వ‌చ్ఛ భార‌త్ మాదిరిగా ఫొటోల‌కు ఫోజులు ఇస్తే ఫ‌లితం ఉండ‌దు)..
----------------------
ఒక‌వేళ సాఫ్ట్ వేరు సంక్షోభంలో ఉన్న‌ప్పుడు వ్య‌వ‌సాయం చేసుకొని కూడా మ‌నం బ‌త‌కొచ్చ‌న్న ధీమాను యువ‌త‌లో క‌ల్పించ‌వ‌చ్చు... పిచ్చి స‌ల‌హానే కావొచ్చు... వ్య‌వ‌సాయాన్ని లాభ‌సాటి చేయాలి..  భార‌త్ అన్న‌పూర్ణ‌గా ఎప్పుడూ ఉండాల‌న్న‌ది నా ఆకాంక్ష‌...!!

ఆర్టీసీ విభ‌జ‌న జ‌రిగితే ఆ బ‌స్సును వెన‌క్కి తెచ్చుకోవాల్సిందే..

ఆర్టీసీ విభ‌జ‌న జ‌రిగితే ఆ బ‌స్సును వెన‌క్కి తెచ్చుకోవాల్సిందే..
------------------

రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగి ఎనిమిది నెల‌లు అవుతున్నా.. ఇంకా ఆర్టీసీ విభ‌జ‌న జ‌ర‌గ‌డం లేదు.  ఆర్టీసీ విభ‌జ‌న జ‌రిగే స‌మ‌యంలో నిజాం కాలం నాటి ఆస్తుల‌పై దృష్టి సారించాలి. ఇప్ప‌టికే ఒక‌సారి ఆ ఆస్తుల‌ను కూడా ఉమ్మ‌డి ఖాతాలో వేసేశారు. అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే విలువైన సంప‌దను మ‌నం కోల్పోతాం. ఇక నిజాం కాలానికి చెందిన అరుదైన ద‌క్క‌న్ క్వీన్ బ‌స్సు ఒక‌టి విజ‌య‌వాడ‌లో ఉండిపోయింది. దాన్ని వెన‌క్కి తెప్పించాల్సిందే. అలాగే  బౌద్ధ మ‌తానికి సంబంధించి తెలంగాణ‌లో ల‌భ్య‌మైన‌ విలువైన పురావ‌స్తు సంప‌ద కూడా ఆంధ్రాలోని ప‌లు మ్యూజియంల‌కు త‌ర‌లించారు. వీట‌న్నింటినీ మ‌నం వెన‌క్కి తెప్పించుకోవాలి. మ‌న గ‌త వైభ‌వాన్ని ప్ర‌పంచానికి చాట‌డానికి ఈ చ‌రిత్ర‌క సంప‌ద ఎంత‌గానో దోహ‌ద‌ప‌డుతుంది....

నోట్‌: ఇక మొన్నామ‌ధ్య ఆర్టీసీ బ‌స్సుల నెంబ‌ర్ ప్లేట్ల‌లో జ‌డ్ అనే అక్ష‌రాన్ని ఎందుకు ఉంటుంద‌ని ఓ ప్ర‌శ్న‌ను వేశాను.. వాస్త‌వానికి ఇది నిజాం త‌ల్లి  జెహ్రా బేగ‌మ్ పేరు మీద నిజాం తొలుత బ‌స్సు స‌ర్వీసుల‌ను ప్రారంభించాల‌నుకున్నాడు. అయితే కొంద‌రు వ‌ద్ద‌ని సూచించ‌డంతో త‌న త‌ల్లి పేరు స్మ‌ర‌ణ‌కు వ‌చ్చేలా జ‌డ్‌ను మాత్రం నెంబ‌ర్ ప్లేట్ల‌కు ఉంచారు...  హైద‌రాబాద్ సంస్థానం భార‌త్‌లో విలీనం అయిన త‌ర్వాత నిజాం విజ్ఞ‌ప్తి మేర‌కు జ‌డ్ అన్న అక్ష‌రాన్ని రోడ్డు ర‌వాణా సంస్థ బ‌స్సుల‌న్నింటికీ ఉంచ‌డానికి అప్ప‌డి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంగీక‌రించాయి.. ఆ విధంగా జ‌డ్ అక్ష‌రం ఇప్ప‌టికీ 20వేల‌కు పైగా ఆర్టీసీ బ‌స్సుల‌కు ఉంది.. భ‌విష్య‌త్తులో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉంటుందో లేదో నేను చెప్ప‌లేను..!!!
------------
ఆర్టీసీ బ‌స్సుల‌పై జ‌డ్ అక్ష‌రంపై ఓ  ప్ర‌శ్న‌ను మొన్న‌నే మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు?   అన్న ప్రోగ్రామ్‌లో అడిగారు... నేప‌థ్యాన్ని కూడా చెప్పారు!!

కంటోన్మెంట్‌లో అర్ధ‌శతాబ్దపు కాంగ్రెస్ ఆధిప‌త్యానికి చెక్‌

ఇంటి పార్టీని ఆద‌రించిన ఓట‌ర్లు...
------------------
కంటోన్మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ-బీజేపీ కూట‌మికి చుక్కెదురైంది. దాదాపు అర్ధ శ‌తాబ్దంగా కంటోన్మెంట్ ఉపాధ్య‌క్ష ప‌ద‌విని కైవ‌సం చేసుకుంటున్న కాంగ్రెస్‌కు ఓటర్లు దిమ్మ దిరిగేలా తీర్పునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భ‌వించిన ఎనిమిది నెల‌ల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఆ పార్టీ అభ్య‌ర్థులు నాలుగు చోట్ల గెల‌వ‌గా, ఆ పార్టీ రెబ‌ల్స్ రెండు చోట్ల విజ‌యం సాధించారు. టీడీపీ అధికారంలో ఉన్న 15 ఏళ్ల స‌మ‌యంలోనూ టీడీపీ కంటోన్మెంట్‌లో పాగా వేయ‌లేక‌పోయింది. కానీ అధికార‌ టీఆర్ఎస్‌ను మాత్రం కంటోన్మెంట్ ప్ర‌జ‌లు ఆద‌రించారు. టీఆర్ఎస్ రెబ‌ల్స్ గెలిచిన రెండు స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్య‌ర్థులు భార్యాభ‌ర్త‌లే కావ‌డం విశేషం. వారు ఇత‌ర పార్టీల నుంచి చివ‌రి నిమిషంలో వ‌చ్చి టీఆర్ఎస్‌ టికెట్లు సంపాదించుకున్న‌ట్లు స‌మాచారం. మొద‌టి నుంచి తెలంగాణ ఉద్య‌మంలో ప‌నిచేసే వారికి ప‌ట్టం క‌డ‌తామ‌ని ఓట‌ర్లు తీర్పునిచ్చారు.. గ్రేట‌ర్ లో టీఆర్ఎస్‌కు బ‌ల‌మే లేద‌న్న బీజేపీ, టీడీపీల‌కు ఈ ఎన్నిక‌లు గ‌ట్టి గుణ‌పాఠాన్ని చెప్పాయి. ఒంట‌రిగా పోటీ చేసినా మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌న‌డానికి ఇది మంచి ఉదాహ‌రణ‌. చేస్తున్న ప‌నుల‌పై దృష్టి పెట్టాలి. ప్ర‌జ‌లు కంటోన్మెంట్‌లోనూ గెలిపించి మ‌రింత బాధ్య‌త పెంచారు. బాధ్య‌త‌ల‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించాల‌ని కోరుకుంటున్నా. తెలంగాణ వాదమే టీఆర్ఎస్‌కు శ్రీ‌రామ‌ర‌క్ష‌. తెలంగాణ ఆత్మ‌గౌర‌వంతో ముందుకు వెళ్లాలితే ప్ర‌జా ఆద‌ర‌ణ ఎప్ప‌టికీ ఉంటుంది..!!

మ‌రి చైనా ఆక్ర‌మ‌ణ‌ల స‌మ‌యంలో నోరు మెద‌ప‌రు...!!

మొన్నా మ‌ధ్య చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ భార‌త్‌కు వ‌స్తే మ‌న క‌మ్యూనిస్టులు గ‌ప్‌చుప్‌గా ఉన్నారు..
మ‌రీ రేపు ఒబామా వ‌స్తే ఆయ‌న రాక‌ను అడ్డుకోవాలి... నిర‌స‌న‌లు తెల‌పాల‌ని అంటున్నారు...
చైనాతో వ్యాపారం మంచిదే... అమెరికాతో చేస్తేనే త‌ప్పంటా...!!
భార‌త్‌-చైనా భాయ్ భాయ్ అంటారు.. మ‌రి చైనా ఆక్ర‌మ‌ణ‌ల స‌మ‌యంలో నోరు మెద‌ప‌రు...!!

రాధాకృష్ణ గొప్ప‌వాడు అన్న స్వాగ‌తించాలి..

రేప‌టి నుంచి ఎవ‌రూ ఆంధ్రా ప‌త్రిక‌లు అని ప‌ల్లెత్తు మాట కూడా అనొద్దు... ఆంధ్రా మీడియా అని ప‌దేప‌దే బెదిరిస్తే మ‌న పెట్టుబ‌డులు దూరం అవుతాయి.... రేపు రాధాకృష్ణ గొప్ప‌వాడు... సైకిల్ చెయిన్ వేసుకొనే స్థాయి నుంచి ఓ ప‌త్రికాధినేత అయ్యే స్థాయికి ఎదిగాడు.. తెలంగాణ రిపోర్ట‌ర్ల‌కు ఉపాధి చూపుతున్నాడు... ప్ర‌భుత్వం నుంచి న‌యాపైసా ఆశించ‌ని పెద్ద‌మ‌నిషి ఆయ‌న‌. ఈయ‌నలాంటి వారు తెలంగాణ‌కు గర్వ‌కార‌ణం... తెలంగాణ మ‌ట్టిలో పుట్టిన మాణిక్యం ఆయ‌న అంటే మ‌నం స్వాగ‌తించాలి.... !!!

ఏ ఆంధ్రా పారిశ్రామిక‌వేత్త కూడా భూములను ఆక్ర‌మించుకోలేదు...

తెలంగాణ‌లో ఏ ఆంధ్రా పారిశ్రామిక‌వేత్త కూడా భూములను ఆక్ర‌మించుకోలేదు... అంద‌రూ కొనుక్కున్నారు.. ఆ కొనుగోలు చేసిన భూమి అసైన్డు భూమా? నిజాం ఇనామ్ ఇచ్చిన భూమా? కాందిశీకుల భూమా? వ‌క్ఫ్ భూమా అన్న‌దే స‌మ‌స్య‌... !!

మోడీని కూడా పొగిడితేనే పైస‌లు వ‌స్తాయి... ఇదేం ప‌ద్ధ‌తో ఏంటో?

పొన్నాల ల‌క్ష్మ‌య్య భూముల జోలికి కూడా పోవ‌ద్దు... పోతే మ‌ళ్లా రాజ‌కీయప‌ర‌మైన‌ చ‌ర్య‌లు తెలంగాణ‌లో ఇలా ఉంటాయా? అని పారిశ్రామిక‌వేత్త‌లు జ‌డుసుకొని పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ముందుకు రారు... అస‌లే వ‌రంగ‌ల్ జిల్లా మ‌రో హైద‌రాబాద్ కాబోతుంది కదా.... పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణం ఉండాలంటే పారిశ్రామిక‌వేత్త‌ల‌ను పొగ‌డాలి... తెలంగాణ‌లోని 3.5 కోట్ల మంది ప్ర‌జ‌లు కూడా పొగ‌డాలి.... మోడీని కూడా పొగిడితేనే పైస‌లు వ‌స్తాయి... ఇదేం ప‌ద్ధ‌తో ఏంటో?

అప్పుడు ఎమ్మార్వో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చేసింది

నిజంగా చిత్ర‌న‌గ‌రిలో ఆక్ర‌మ‌ణ‌లు జ‌ర‌గ‌క‌పోతే అప్పుడు  ఎమ్మార్వో అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను కూల్చేసింది ఎందుకు?  నిజ నిర్ధ‌ర‌ణ‌లు జ‌రిగింది ఎందుకు?  మావోయిస్టులు త‌మ డిమాండ్ల‌లో రాజ‌గురువు ఆస్తుల ప్ర‌స్తావ‌న ఎందుకు తెచ్చారు? నిజంగా ప్ర‌భుత్వం త‌న నిర్మాణాల‌ను అక్ర‌మంగా కూల్చి త‌ప్పు చేసి ఉంటే ప‌రిహారం కోరుతూ రాజ‌గురువు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లే వాడు కాదా?   విశాఖ‌లో అద్దెకిచ్చిన కొంప‌నే అక్ర‌మించుకోవాల‌నుకున్న పెద్ద మ‌నిషి స‌క్ర‌మంగా ఉండి ప్ర‌భుత్వంతో న‌ష్ట‌పోయి ఉంటే ఎందుకు నోరుమూసుకు ఉంటాడు...?   చిత్ర‌న‌గ‌రి ప‌క్క‌నే ఉండే ప్ర‌జ‌లు పిచ్చోళ్లా ఆందోళ‌న చేయ‌డానికి... ?
--------------------
చిత్ర న‌గ‌రి తెలంగాణ‌కే త‌ల‌మానికం అన్న‌ప్పుడు ఎంద‌రు తెలంగాణోళ్ల‌కు ఉపాధిని చూపిందో క‌నీసం తెలుసుకోవాల‌న్న ఆలోచ‌న లేదా?
అక్క‌డ నియామ‌కాల కోసం ఆంధ్రా ప్రాంతంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంప‌స్ సెల‌క్ష‌న్లు చేసి ఇక్క‌డికి తెచ్చుకోవ‌డం వాస్త‌వం కాదా?
క‌నీసం ఆయ‌న కంపెనీల్లో తెలంగాణ‌ వాళ్లు 10 శాతం(అది కూడా గ్రేడ్ 3, 4లోనే) కూడా లేర‌ని తెలియ‌దా?   తెలంగాణ యువ‌త చ‌నిపోతే ఒక్క రూపాయి సేక‌రించి ఇవ్వ‌ని ప‌త్రిక అది.. అదంతా ఎందుకు?   మొన్న‌టికి మొన్న తెలంగాణ‌లో తీవ్ర విద్యుత్ కోత‌ల‌తో పొలాల‌కు నీళ్లు అంద‌క రైతులు చ‌నిపోతుంటే.. శ్రీ‌శైలం నీటిని ఉప‌యోగించుకొని విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తే ఆక్షేపించిన ప‌త్రిక అది... శ్రీ‌శైలం అడుగంటుతోంద‌ని  క‌థ‌నాలు రాసి ఆంధ్రా స‌ర్కారుకు వంత‌పాడిన తీరును ఎలా మ‌ర‌చిపోతారు...?
త‌న ప‌త్రిక‌లోని తెలంగాణ ఉద్యోగుల‌ను అక్ర‌మంగా తొల‌గించిన తీరును ఎలా మ‌ర‌చిపోతారు..?   కార్మిక చ‌ట్టాల ఉల్లంఘ‌న‌ను ఎలా విస్మ‌రిస్తారు..?
తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కాంగ్రెస్‌ను బ‌లోపేతం చేస్తాం... అని కేసీఆర్ అన్న‌ట్లుగా త‌ప్పుడు వార్త‌ను రాసిన ప‌త్రిక అది...  ఆనాడు నిజామాబాద్‌లో నెహ్రూ ఏమ‌న్నాడు?  అంటూ తెలంగాణ‌, ఆంధ్రాది వివాహ బంధం అన్న మాట‌ను నెహ్రూ అన‌లేదు అని చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించింది ఈ ప‌త్రిక క‌దా?  అంతెందుకు ఈ ఏడు నెల‌ల కాలంలో వ‌చ్చిన కుట్ర క‌థ‌నాలు ఎన్నెన్నో... అన్నీ మీరు మ‌ర‌చిపోవ‌చ్చు గాక‌... ప్ర‌జ‌లు  మ‌ర‌వ‌లేరు...
------------
రాజ‌గురువు మిమ్మ‌ల్ని ఎంట‌ర్‌టెయిన్ చేయ‌డం శాశ్వ‌తం కాదు.. ఎందుకంటే వారి శాశ్వ‌త మిత్రులు వేరే ఉన్నారు... ఆట‌లో అర‌టిపండులా... కూర‌లో క‌రివేపాకులా వాడుకొని వ‌దిలేయ‌డంలో వాళ్లు ఉద్ధండ పిండాలు... వాళ్ల అవ‌స‌రం మేర‌కు  ఎన్టీఆర్‌, గోశ‌య్య‌తో దోస్తీ చేశారు...
ఛీప్ విప్పు త‌ప్పు త‌ప్పు అంటూ క‌థ‌నాలు రాసిన చేతుల‌తోనే న‌ల్లికుట్లోడికి జేజేలు ప‌లికారు.. అవ‌స‌రం తీరాక గోదారిలో క‌లిపారు..
అవ‌స‌రం దొరికితే ప్ర‌భుత్వాల‌ను అస్థిర ప‌చ‌డం వారి నైజం... అలాంటి వారికి క్లీన్ చిట్ ఇస్తే భ‌విష్య‌త్తులో మ‌న గోతి మ‌న‌మే తీసుకున్న‌ట్లు అవ‌డం ముమ్మాటికీ ఖాయం...
----------------

ఈ  రోజు ఏ తెలంగాణ ప్ర‌జ‌లైతే ఓట్లేశారో వారి నోటిని మించిన ప్ర‌చార సాధ‌నం ఇంకోటి ఉండ‌దు... ఎంత పెద్ద మీడియా సంస్థ‌యినా, ఇంకోటైనా ఇచ్చే ప్ర‌చారం క‌న్నా నిజాయ‌తీ ప‌రుడైన తెలంగాణ వ్య‌క్తి మ‌న‌సులో నుంచి వ‌చ్చే నోటి మాట‌ను మించిన మీడియా ఇంకోటి వ‌ద్దు..  ఎన్నిక‌ల ముందు ఒక‌లా.. ఎన్నిక‌లు అయ్యాక ఒక‌లా.. ఎన్నిక‌లు రెండేళ్ల‌లో ఉన్నాయ‌న‌ప్పుడు ఒక‌లా వ్య‌వ‌హ‌రించే మీడియా సంస్థ‌ల‌తో సోప‌తి మీ అస్థిత్వానికి, మీ వ్య‌క్తిత్వానికి  న‌ష్టాన్ని చేకూర్చుతాయి...!
ఇవ‌న్నీ వ‌ద్దు ఐదేళ్ల అధికార‌మే ముద్దు అనుకుంటే ఎవ‌రూ ఏమీ చేయ‌లేరు.. మేం దీర్ఘ‌కాలం తెలంగాణ‌కు ర‌క్ష‌ణ‌గా నిలిచే వారిని కోరుకుంటున్నాం.. తెలంగాణ‌ను భ‌క్షించే వారి ప‌క్షాన నిలిచేవారిని మాత్రం కాదు..!!

--------------------
నోట్‌:  మీరు మాట్లాడే మాట‌లు తెలంగాణ ప్ర‌జ‌లే కాదు ఆంధ్రా ప్ర‌జ‌ల‌కూ, రాజ‌గురువు ఉద్యోగుల‌కే రుచించ‌డం లేదు... !!

చెరువులు, కుంట‌లు, శిఖం భూములు ఆక్ర‌మించుకున్న వారిని ప‌క్క‌కు పెట్టాలి...!!

చెరువులు, కుంట‌లు, శిఖం భూముల్లో గుడిసెలు, ఇళ్లులు క‌ట్టుకుంటే వాటిని క్ర‌మ‌బద్ధీక‌రించి ప‌ట్టాలు ఇస్తే.. మిష‌న్ కాక‌తీయ ల‌క్ష్యం ఎలా నెర‌వేరుతుంది.... క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌లో చెరువులు, కుంట‌లు, శిఖం భూములు ఆక్ర‌మించుకున్న వారిని ప‌క్క‌కు పెట్టాలి...!!

లేదు వీటికీ ఆధారాలు కావాల్సిందేనా...?

భూ క‌బ్జాదారుడు అక్కినేని నాగార్జున‌...
ల్యాంకో హిల్స్‌ను ఆక్ర‌మించుకున్న‌ది ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌...
----------------------
ఈ మాట‌లు అన్న‌ట్లు గుర్తుందా?
లేదు వీటికీ ఆధారాలు కావాల్సిందేనా...?

చిత్ర‌న‌గ‌రికి ఈయ‌న‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పెట్టుకున్న‌ట్లు ఉన్నాడు..

స్వ‌చ్ఛ భార‌త్‌కు రాజ‌గురువును మోడీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పెట్టుకున్నాడు...
ఇక రాజ‌గురువు త‌న చిత్ర‌న‌గ‌రికి ఈయ‌న‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పెట్టుకున్న‌ట్లు ఉన్నాడు..
మోడీ అప్ప‌గించిన ప‌నిని రాజ‌గురువు చక్క‌గా నెర‌వేరుస్తున్నాడో లేదో కానీ రాజ‌గురువు అప్ప‌గించిన బాధ్య‌త‌ను ఈయ‌న మాత్రం బాగానే నిర్వ‌ర్తిస్తున్నాడు...

Friday, 9 January 2015

ఆ బీజేపీ ఎంపీ ఎవ‌రో వీళ్ల‌కు హిత‌బోధ చేసి ఉంటే బాగుండేదేమో...!!

న‌రేంద్ర మోడీ...
రాహుల్‌గాంధీ
జ‌య‌ల‌లిత 
మాయావ‌తి
ఉమా భార‌తి...
మ‌మ‌తా బెన‌ర్జీ...
రాందేవ్ బాబా...
ఇంకా ఎంద‌రున్నారో నాకు తెలియ‌దు..
--------------
ఆ బీజేపీ ఎంపీ ఎవ‌రో వీళ్ల‌కు హిత‌బోధ చేసి ఉంటే బాగుండేదేమో...!!

చ‌రిత్ర‌కు డిమాండ్ పెరిగింది...

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తెలంగాణ చ‌రిత్ర తెలుసుకునేందుకు 18-19,20 శ‌తాబ్ధాల చ‌రిత్ర‌ను చ‌దివారు..
ఇప్పుడు ఈ ఘ‌ర్ వాప‌సీలు, మొద‌ట పుట్టింది మా మ‌త‌మే అన్న వ్యాఖ్య‌ల ఫ‌లితంగా మ‌ళ్లా క్రీస్తు పూర్వం చ‌రిత్ర తిర‌గేస్తున్నారు.. ఏం చేసినా చ‌రిత్ర‌కు మంచి రోజులొచ్చాయి.. 
----------------
ఈ ప్ర‌పంచంలో మొద‌ట పుట్టిన మ‌తం ఏంటి?
మ‌త మార్పిడిలు ఎప్పుడు మొద‌ల‌య్యాయి...
అశోకుడు బౌద్ధ‌మ‌తం ఎందుకు స్వీక‌రించాడు..?
ఘ‌ర్ వాపసీ కార్య‌క్ర‌మాలు ఎప్ప‌టి నుంచి జ‌రుగుతున్నాయి..?
ఈ ప్ర‌శ్న‌లన్నింటికీ రామచంద్ర గుహ, రొమిలా థాప‌ర్‌, బిపిన్ చంద్ర‌ పుస్తకాలు, ఇంకా ఫేమ‌స్ చ‌రిత్ర కారులంద‌రి పుస్త‌కాలు తిర‌గేయాలి... పై విష‌యాలు కాక‌పోయినా కొత్త విష‌యాలు మాత్రం తెలుస్తాయి...

ఎవ‌రి ప‌రీక్ష‌లు వారే నిర్వ‌హించుకుంటే ఈ ఉమ్మ‌డి తిప్ప‌లు త‌ప్పుతాయి..

ఎవ‌రి ప‌రీక్ష‌లు వారే నిర్వ‌హించుకుంటే ఈ ఉమ్మ‌డి తిప్ప‌లు త‌ప్పుతాయి..
--------------
తెలంగాణలో ఇంజినీరింగ్ చేయాల‌నుకునే వాళ్లు ఇక్క‌డ ఎంసెట్ రాస్తారు... లేదు ఆంధ్రాలోనే చేస్తాం అనుకునే వారు అక్క‌డ ఎంసెట్ రాస్తారు... లేక‌పోతే త‌మిళ‌నాడు, కర్ణాట‌క కాలేజీలే బెట‌ర్ అనుకుంటే అక్క‌డి సెట్‌లు రాయ‌డ‌మో... లేక యాజ‌మాన్య కోటాలో చేర‌డ‌మో చేస్తారు.. 
--------------------
ఒక‌వేళ‌ ఇప్పుడు ఉమ్మ‌డి ఎంసెట్ ప‌రీక్ష జ‌రిగితే... మ‌ళ్లా కౌన్సిలింగ్‌లో ఏదో ఒక ప్రాంతానికి అన్యాయం జ‌రిగింద‌ని లొల్లి వ‌స్తుంది... ఆంధ్రా అబ్బాయిల‌కు తెలంగాణ‌లో బోధ‌న రుసుంలు చెల్లించ‌రు.. తెలంగాణ విద్యార్థుల‌కు ఆంధ్రాలో బోధ‌న ఫీజులు క‌ట్ట‌రు.. దీనిపై రోజుకో ధ‌ర్నా, ఆందోళ‌న‌.. ప్ర‌ధానికి ఫిర్యాదులు... హైకోర్టులో కేసులు... ఇవ‌న్నీ అవ‌స‌ర‌మా? ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం బోర్డులే ఎంసెట్ నిర్వ‌హిస్తేనే మేలు... ఈ ర్యాంకుల గోల కూడా కొంత త‌గ్గుతుంది.. !!
----------------
ఎటొచ్చి కొంచెం నారాయ‌ణ‌, చైత‌న్య కాలేజీల‌కు ఇబ్బంది ఉండొచ్చు కానీ రెండు ప్రాంతాల విద్యార్థుల‌కు మంచే జ‌రుగుతుంది...!

డ‌బ్బులు తీసుకొని స్థానికేత‌రుల‌కు స్థానిక‌త స‌ర్టిఫికేట్ల‌ను మాత్రం ఇవ్వొద్దు...!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్‌క‌మిష‌న్ ప‌రీక్ష‌ల్లో మొత్తం స్థానికుల‌కే అవ‌కాశం ఇవ్వొచ్చు!! అంటూ నిన్న టైమ్స్ ఆఫ్ ఇడియాలో క‌థ‌నం వ‌చ్చింది... ఇది జ‌రిగితేనే మంచిది... ఈ లెక్క‌న 100 శాతం ఉద్యోగాలు స్థానికుల‌కే ద‌క్కుతాయి... ఇప్ప‌టికే ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన డీఎస్సీలో తెలంగాణ‌లో పుట్టి ఆంధ్రాకు కోడ‌లుగా వెళ్లిన ఆడ‌ప‌డుచుల‌కు అనుమ‌తిని నిరాక‌రించిన విష‌యం తెలిసిందే... ఇక‌పై ఏ రాష్ట్రం నియామ‌కాలు ఆ రాష్ట్రం చేప‌ట్టుకుంటే ఎక్క‌డి వారు అక్క‌డ ఉద్యోగాలు పొంది హాయిగా ఉండొచ్చు... అధికారులు మాత్రం డ‌బ్బులు తీసుకొని స్థానికేత‌రుల‌కు స్థానిక‌త స‌ర్టిఫికేట్ల‌ను మాత్రం ఇవ్వొద్దు...!!