1

1

Tuesday, 28 April 2015

మ‌న కాంట్రాక్ట‌ర్ల‌నూ ప్రోత్స‌హించండి...! స‌బ్ కాంట్రాక్టర్లుగా మ‌న‌వాళ్ల‌ను మార్చొద్దు..!!

చిన్న విజ్ఞ‌ప్తి..
మ‌న కాంట్రాక్ట‌ర్ల‌నూ ప్రోత్స‌హించండి...!
స‌బ్ కాంట్రాక్టర్లుగా మ‌న‌వాళ్ల‌ను మార్చొద్దు..!!
***
తెలంగాణ‌లో ఎన్నో ప్రాజెక్టులు చేప‌డుతున్నారు.. కాంట్రాక్టుల‌న్నీ ఆంధ్రా కంపెనీల‌కు క‌ట్ట‌బెడుతున్నారు.. మ‌రి ఈ కంపెనీల‌న్నీ రాజ‌కీయప‌ర‌మైన విష‌యానికి వ‌స్తే అక్క‌డి ప్ర‌యోజ‌నాల కోస‌మే కొట్లాడేవి క‌దా.. తెలంగాణ ఉద్య‌మం 2009 డిసెంబ‌రు 9 త‌ర్వాత‌ దాదాపు నాలుగేళ్ల వ‌ర‌కూ విజ‌య‌తీరం చేయ‌కుండా అడ్డుకోవ‌డంలో వీరి పాత్ర ఉంది క‌దా... తెలంగాణ‌లో పెద్ద కాంట్రాక్ట‌ర్లు త‌క్కువ‌గా ఉన్నార‌న్న‌ది వాస్త‌వ‌మే.. మ‌రి కాంట్రాక్ట‌ర్ల‌ను త‌యారు చేయాలి క‌దా.. మ‌న వాళ్ల‌ను ఎప్ప‌టికీ స‌బ్ కాంట్రాక్ట‌ర్లుగానే ఉంచితే ఆంధ్రాపాల‌న‌కు మ‌న పాల‌న‌కు తేడా ఉండ‌దు క‌దా... ఎన్టీఆర్ అధికారం వ‌చ్చాకే ఆంధ్రా పారిశ్రామిక‌వేత్త‌ల‌కు మ‌రిన్ని ఎక్కువ అవ‌కాశాలు వ‌చ్చాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అలా వారి కులానికి, ప్రాంతానికి చెందిన వారికి అవ‌కాశాలు ఇవ్వ‌డం వ‌ల్లే ఆ పార్టీని ఇన్నేళ్లుగా వాళ్లు కాపాడుకోగ‌లిగారు.. మ‌రి రేపు టీఆర్ఎస్‌కు ఆర్థిక ప‌ర‌మైనా, ఇత‌ర‌త్రా ఇబ్బందులో వ‌స్తే ఇప్పుడు కాంట్రాక్టులు ద‌క్కించుకున్న వారు అండ‌గా ఉంటారంటారా?
ఏది ఏమైనా స‌రే తెలంగాణ‌లో ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను ప్రోత్స‌హించాలి.. ఇప్పుడు ఆ ప‌ని చేయ‌క‌పోతే దీర్ఘ‌కాలంలో మ‌న‌కు న‌ష్టాన్ని మిగుల్చుతుంది.. !!

2 comments:

  1. కాంట్రాక్టర్లలో మన,పర అని ఉండరండీ సారూ!
    యెవడెక్కువ మిగల్చగలిగితే వాడే మనవాడు?

    ReplyDelete
  2. మ‌న, ప‌ర ఎందుకుండ‌రు సార్‌.. మ‌న కులం, మ‌న మ‌తం, మ‌న ప్రాంతం ఇవి చాలా బాగా ప‌నిచేస్తాయి కాంట్రాక్ట‌ర్ల‌లో

    ReplyDelete