1

1

Monday, 27 April 2015

రాత్రికి రాత్రి క్రీడాకారుల అవ‌తారం ఎత్తారు..

వంద‌లాది చెరువులు క‌బ్జాకు గుర‌వుతున్న‌ప్పుడు ఒక్క‌రు కూడా ఆ క‌బ్జాకు గురైన చెరువుల్లో జెండాలు పాత‌లేదు.. కనీసం వాటిని కాపాడే ప్ర‌య‌త్నం చేయ‌లేదు.. ఇప్పుడు స‌ర్కారు ఏ నిర్ణ‌యం తీసుకున్నా అదెలా కుదురుతుంద‌ని వంక‌లు పెట్ట‌డం మాత్రం చేస్తున్నారు.. అస‌లు వీళ్లు ఎప్పుడైనా ఎన్టీఆర్ స్టేడియంలో ఆట‌లు ఆడారా? ఆడ‌లేదు.. ఇప్పుడేమో రాత్రికి రాత్రి క్రీడాకారుల అవ‌తారం ఎత్తి బ్యాట్ ప‌ట్టి ఆట‌లు ఆడుతున్నారు.. మ‌రి అదే ఎన్టీఆర్ స్టేడియాన్ని సంవ‌త్స‌రంలో 250 రోజుల పాటు హోమాల‌కు, పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు, రాజ‌కీయ స‌భ‌ల‌కు, బ‌హిరంగ స‌భ‌ల‌కు, ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాల‌కు ఇచ్చిన‌ప్పుడు ఈ ఆట‌లు గుర్తుకు రాలేదా?
అప్పుడు వీళ్లంతా ఎక్క‌డ‌ నిద్ర‌పోయారు... క్రీడా మైదానాన్ని ఇలా ఆధ్వాత్మిక హోమాలు, ధ‌ర్మ ప్ర‌చార కార్య‌క్ర‌మాల పేరిట నాశ‌నం చేయొద్దు అని ప్ర‌శ్నించారా? ప్ర‌శ్నించ‌లేదు.. ప్ర‌శ్నించ‌రు కూడా... తెలంగాణ స‌ర్కారు నిర్ణ‌యం తీసుకుంది కాబ‌ట్టి వ్య‌తిరేకించాలి అంతే.. ఇదే వీరి వైఖ‌రి...!!


వాళ్ల బాధంతా క్రికెట్ స్టేడియం గురించి కాదు... ఎన్టీఆర్ పేరును లేకుండా చేస్తున్నార‌నే.. ఒక‌వేళ క‌ళాభార‌తికి ఎన్టీఆర్ పేరు పెడ‌తామ‌ని అని ఉంటే ఈ పాటికి అహో.. ఒహో అంటూ కీర్తించేవారు...!!

1 comment:

  1. ఎన్టీఆర్ పేరు లేనందుకు బాధ ఒకవైపు, తెలంగాణా పదం తగిలిస్తున్నందుకు ఉక్రోషం మరో వైపు. జోక్సత్తా పార్టీ తమ ప్రకటనలో కేవలం "కళామండలి" అనడం విడ్డూరం!

    ReplyDelete