తెలంగాణ జనాభా దాదాపు 4 కోట్లు. ఏడాదిలో నాలుగు కోట్ల మంది పుట్టిన రోజు ఏదో ఒక రోజున జరుగుతుంది కదా.. ప్రతీ ఒక్కరు తమ తమ పుట్టిన రోజుకు ఒక్కో మొక్కను నాటి.. దాన్ని సంరక్షిస్తే బాగుంటుంది... అలాగే తెలంగాణను సందర్శించే వీఐపీలతో ప్రభుత్వం మొక్కలు నాటించాలి. గాంధీ జయంతి, తెలంగాణ ఆవిర్భావం రోజున సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలి.. ఎవరు నాటిన మొక్కకు వారు బాధ్యతను తీసుకునేలా ప్రోత్సహిస్తే హరిత హారం విజయవంతం అవుతుంది... అలా కాకుండా ప్రభుత్వమే 3 లక్షల కోట్ల మొక్కలు నాటినా ప్రయోజనం ఉండదు.. ప్రజా భాగస్వామ్యాన్ని ఎంత పెంచితే అంతగా ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలవుతాయి..!!
యెవరి వోటును వారు తెలివిగా వెయ్యడమొకటి తెలిస్తే చాలు!
ReplyDeleteయెవరి మొక్కను వారు వటవృక్షం చేసినంతటి గొప్ప మేలు?
యెంత చెట్టు కంత గాలి కాదూ!
ఆయనే ఉంటే మంగలెందుకో?