1

1

Saturday, 19 December 2015

ప్రెస్ క్ల‌బ్ హైద‌రాబాద్ లో తాత్కాలిక‌ స‌భ్యుడిగా చేరాలంటే ఎంద‌రి కాళ్లు ప‌ట్టుకోవాలో?

ప్రెస్ క్ల‌బ్ హైద‌రాబాద్ లో తాత్కాలిక‌ స‌భ్యుడిగా చేరాలంటే ఎంద‌రి కాళ్లు ప‌ట్టుకోవాలో?
ఇవేం రూళ్లో పాడో...
తెలంగాణ వ‌చ్చినా ఆంధ్రా జ‌ర్న‌లిస్టుల చుట్టూ సంత‌కాల కోసం తిర‌గాల్సిన దుస్థితి..
హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ లో అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ స‌భ్య‌త్వం ఇవ్వాల్సిందే..
కాలం చెల్లిన పాత నిబంధ‌న‌లు మార్చండి.. 
***********
తెలంగాణ ప్ర‌భుత్వం అర్హులైన డెస్కు జ‌ర్న‌లిస్టుల‌కు, రిపోర్ట‌ర్ల‌కు అంద‌రికీ అక్రిడియేష‌న్ కార్డుల ఇవ్వాల‌ని జ‌ర్న‌లిస్టు సంఘాలు ఆందోళ‌న‌లు, ఉద్య‌మాలు చేశాయి. ప్ర‌భుత్వం కొంద‌రికి మాత్ర‌మే ఇస్తాన‌నంటే అగ్గి మీద గుగ్గిలం లాగా పైకి లేచి నానా యాగి చేశారు. మ‌రి అదేందో ప్ర‌భుత్వాలు నియ‌మ నిబంధ‌న‌లు రూపొందించి అమ‌లు చేస్తామంటే ఈ నిబంధ‌న‌లు మార్చాలి అంటూ జ‌ర్న‌లిస్టు నేత‌లు పోరాడారు. మ‌రి ఏళ్ల త‌ర‌బ‌డి హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ లో రూపొందించిన నిబంధ‌న‌లు అర్హులైన ఎంద‌రో జ‌ర్న‌లిస్టుల‌ను అందులో స‌భ్యులుగా కాకుండా చేస్తున్నాయి. ఒక జ‌ర్న‌లిస్టు స‌భ్యుడుగా చేరాలంటే ఆ సంఘంలో ఉన్న మ‌రో ముగ్గురు ఆయ‌న‌కు అనుకూలంగా సంత‌కాలు పెట్టాలంటా... ఇదేం ప‌ద్ధ‌తి. అంటే సంతకం కోసం ప్రెస్ క్ల‌బ్ లో స‌భ్యుల ఇంటి చుట్టూ కాళ్లు అరిగేలా తిర‌గాలా? వాళ్ల‌ను బ‌తిలాడు కోవాలా? ప్ర‌భుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు(అక్రిడియేష‌న్‌) ఉన్న వారికి కూడా ఇదే దుస్థితి. అంటే ప్ర‌భుత్వ అక్రిడియేష‌న్ కార్డులు కూడా అక్క‌డ చెల్ల‌వు అన్న‌ట్లు..
తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక తెలంగాణ‌కు సంబంధించిన అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ ప్రెస్ క్ల‌బ్ లో స‌భ్య‌త్వం ఇప్పిస్తే త‌ప్పేంటి?
వీలైతే మూడేళ్లు లేదా ఐదేళ్లు జ‌ర్న‌లిస్టుగా అనుభ‌వం ఉంటే స‌రిపోతుంద‌ని నిబంధ‌న పెడితే చాల‌దా? ఆ క్ల‌బ్ లో ఉన్న రెగ్యుల‌ర్ స‌భ్యుడి సంత‌కంతో ప‌నేంటి?
ఇలాంటి నిబంధ‌న‌ల‌నే అక్రిడియేష‌న్ కార్డుల జారీలో ప్ర‌భుత్వాలు పెడితే మీరు స‌హిస్తారా?
ప్ర‌భుత్వాలు ఉచితంగా వైద్య సేవ‌లు అందించాల‌ని, జ‌ర్న‌లిస్టులు మాత్రం పైసా పెట్టొద్దు అని గొడ‌వ‌లు చేస్తారు. మ‌రి ప్రెస్ క్ల‌బ్ అప్లికేష‌న్ ఫారానికి రూ.200 వ‌సూలు చేస్తున్నారు. ఇక స‌భ్య‌త్వ రుసుం వేల‌కు వేలు వ‌సూలు చేస్తున్నారు. ఓ వైపు జీతాలు రాక ఇబ్బందులు ప‌డుతున్న‌
జ‌ర్న‌లిస్టులు ఉన్న ఈ స‌మ‌యంలో ఈ వేల రుసుంలు అవ‌స‌ర‌మా?
ప్ర‌భుత్వం నుంచి అన్నీ ఉచితంగా అందుకోవాల‌ని కొట్లాడే జ‌ర్న‌లిస్టు సంఘం నేత‌లు మాత్రం.. జ‌ర్న‌లిస్టుల నుంచి ప్రెస్ క్ల‌బ్ వేల రూపాయల‌ను వ‌సూలు చేస్తే మాత్రం మౌనంగా ఉండ‌టం స‌బ‌బా?
ఇంత వ‌సూలు చేసిన సొమ్ముతో ఏం చేస్తున్నారో దేవుడికే ఎరుక‌?
*************
ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న నిబంధ‌న‌ల‌ను తొల‌గించి అర్హులంద‌రికీ ప్రెస్ క్ల‌బ్ లో స‌భ్య‌త్వం ల‌భించేలా నూత‌న కార్య‌వ‌ర్గం కృషి చేయాల‌ని, చేస్తుంద‌ని ఆకాంక్షిస్తున్నా.. లేనిప‌క్షంలో పాత వారికి కొత్త వారికి తేడా ఉండ‌దు..!!
మొత్తమ్మీద గెజిటెట్ సంత‌కాలకు విలువ‌ను తీసేసిన ఈ రోజుల్లో ప్రెస్ క్ల‌బ్ సంత‌కాల‌కు మ‌హా డిమాండ్ పెరిగింది...

No comments:

Post a Comment