1

1

Saturday, 19 December 2015

తెలంగాణ‌కు బీహార్ పాఠాలు..

తెలంగాణ‌కు బీహార్ పాఠాలు..
********
బీహార్‌, జార్ఖండ్ విడిపోయిన త‌ర్వాత బీహార్‌లో పుట్టిన పార్టీలు బీహార్ కే ప‌రిమితం అయ్యాయి. జార్ఖండ్ లో పోటీ చేస్తున్నా అక్క‌డ ఆద‌ర‌ణ శూన్య‌మే. అలాగే జార్ఖండ్ ఆవిర్భ‌వించిన త‌ర్వాత అక్క‌డ పుట్టిన పార్టీలు దాదాపు అర డ‌జ‌న్‌కు పైగానే ఉన్నాయి.
************
మ‌రి తెలంగాణ వ‌చ్చాక మ‌న వ‌ద్ద ప‌రిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇక్క‌డ ఒకే స్థానిక పార్టీ ఉంది. ఒక వేళ ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయాన్ని కోరుకోవాలంటే పొరుగు రాష్ట్రం పార్టీలు, లేక జాతీయ పార్టీలు ఉన్నాయి. వాటిని గెలిపించుకుంటే తెలంగాణ‌కు స‌మాధి క‌ట్టుకోవ‌డమే అవుతుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఇంటి పార్టీలు మ‌రిన్ని రావాలి. అలాగే తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు విఘాతం క‌లిగించేలా బ‌య‌ట పార్టీలు, బ‌య‌టి నేత‌లు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు ఏక‌మ‌య్యే విశాల దృక్ప‌థంతో ఈ పార్టీలు ప‌నిచేయాలి. బీహార్ పాఠాల‌ను మ‌నం నేర్చుకోవాలి. లేక‌పోతే భ‌విష్య‌త్ లో ఇబ్బందులు త‌ప్ప‌వు.
**************
ఒక‌వేళ భ‌విష్య‌త్‌లో తెలంగాణ లో స్థానిక‌ పార్టీలు పెరిగితే తెలంగాణ‌వాదుల ఓట్లు చీలి, సెటిల‌ర్ల‌ ఓట్ల‌తో తాము అంద‌లం ఎక్కొచ్చ‌ని కొన్ని శ‌క్తులు భావించొచ్చు. అలాంటి ప‌రిస్థితి వ‌చ్చే ప‌క్షం ఉంటే తెలంగాణ పార్టీలు ఏకం కావాలి. లేక బ‌ల‌హీన సెగ్మెంట్ల‌లో తెలంగాణ పార్టీల‌న్నీ ఉమ్మ‌డి అభ్య‌ర్థిని పెట్టాలి.
ఏది ఏమైనా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో టీఆర్ఎస్‌తోపాటు మ‌రొక బ‌ల‌మైన స్థానిక ప్ర‌త్యామ్నాయ పార్టీ అవ‌స‌రం ఉంది. వీలైన‌న్ని ఎక్కువ పార్టీలుంటేనే ప్ర‌జాస్వామ్యం వ‌ర్థిల్లుతుంది. ఆ పార్టీల‌న్నీ ఇంటి(తెలంగాణ‌) పార్టీలైతే ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ మ‌రింత ప‌రిపూర్ణం అవుతుంది.
జై తెలంగాణ‌... జై జై తెలంగాణ‌..!!

No comments:

Post a Comment