1

1

Saturday 19 December 2015

జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీకి పోటీ ప‌డుతున్న 20 మందికి పైగా ఆశావ‌హులు

హైద‌రాబాద్ లో మ‌రో ర‌స‌వ‌త్త‌ర ఎన్నిక‌...
జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీకి పోటీ ప‌డుతున్న 20 మందికి పైగా ఆశావ‌హులు
జ‌ర్న‌లిస్టుల‌కు స్థ‌లాలు ఇప్పిస్తామంటూ హామీలు
బూట‌క‌పు హామీలు ప‌క్క‌న పెట్టి డ‌బుల్ బెడ్రూం ఇళ్లుల్లో జ‌ర్న‌లిస్టుల‌కు చోటు క‌ల్పిస్తే చాలంటున్న మెజారిటీ జ‌ర్న‌లిస్టులు
నోటాకు చోటుంటే బాగుంటుందేమో..!!
******
మొన్న వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌కు ముందు అక్క‌డ ప్రెస్ క్ల‌బ్ కు సంబంధించి ర‌స‌వ‌త్త‌ర సంగ్రామం సాగింది. హేమాహేమిలైన జ‌ర్న‌లిస్టుల‌ను తీసుకొచ్చి ప్ర‌చారాలు చేశారు. ఇప్పుడు హైద‌రాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ముందే మ‌ళ్లా జ‌ర్న‌లిస్టులకు సంబంధించి మ‌రో ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది. జ‌ర్న‌లిస్టు కో ఆప‌రేటివ్ హౌసింగ్ సోసైటీ ఎన్నిక ఈ నెల 14న జ‌ర‌గ‌నుంది. సీనియ‌ర్లు అయిన జ‌ర్న‌లిస్టులు త‌మ‌కే ఎక్కువ భూమి కావాల‌ని జూనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డం, కొంద‌రికి ఉద్దేశ పూర్వ‌కంగా వాళ్ల సంఘంలో చోటు క‌ల్పించ‌క‌పోవ‌డంతో ఈ సంఘం ఏర్పాటైంది. ఇందులో దాదాపు 600-700 మంది జ‌ర్న‌లిస్టులు స‌భ్యులుగా ఉన్నారు. అస‌లు జ‌ర్న‌లిస్టుల‌కు స్థ‌లాలు ఇప్పిస్తామ‌ని కొంద‌రు నేత‌లు హామీల మీద హామీలు ఇస్తున్నారు. అస‌లు జ‌ర్న‌లిస్టుల‌కు స్థ‌లాలు ఇవ్వ‌డం అవ‌స‌ర‌మా? ప్ర‌భుత్వం ఎలాగైతే నిరుపేద‌ల‌కు డ‌బుల్ బెడ్రూం ఇళ్లులు క‌ట్టిస్తుందో అలాగే జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్లులు క‌ట్టించాల‌ని న్యాయ‌మైన డిమాండ్‌ను వీళ్లు లేవ‌నెత్తితే హైద‌రాబాద్ స‌హా జిల్లాల్లో ఉన్న అంద‌రు జ‌ర్న‌లిస్టుల‌కు ఎప్పుడో గూడు దొరికేది. కానీ రియ‌ల్ ఎస్టేట్ దందా చేయాల‌నో లేక ఇంకేం కార‌ణం వ‌ల్ల‌నో స్థ‌లాల కోస‌మే సీనియ‌ర్లు ప‌ట్టుప‌ట్ట‌డంతో జూనియ‌ర్ల‌కు అన్యాయం జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి ప్ర‌స్తుతం జ‌ర్న‌లిస్టు సంఘాల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకొని అదే స్థ‌లంలో అర్హులైన అంద‌రు జ‌ర్న‌లిస్టుల‌కు డ‌బుల్ బెడ్రూం ఇళ్లులు క‌ట్టిస్తే బాగుంటుంది. ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు ప్రాధానం ఇవ్వాలి.
**********
నోట్ : వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో జ‌ర్న‌లిస్టులంద‌రికీ డ‌బుల్ బెడ్రూం ఇళ్లులు క‌ట్టిస్తామంటే కొంద‌రు సీనియ‌ర్లు త‌మ రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తింటాయ‌న్న బాధ‌తో ఆ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించారు. అనంత‌రం కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ త‌మ ఆధీనంలోకి వ‌చ్చినట్టే వ‌చ్చిన 80 ఎక‌రాల‌ను ఎలాగైన పూర్తిగా సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

No comments:

Post a Comment