1

1

Saturday, 19 December 2015

మెద‌క్ ఉప ఎన్నిక‌, వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ఓ ప‌రిశీల‌న‌...

మెద‌క్ ఉప ఎన్నిక‌, వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ఓ ప‌రిశీల‌న‌...
***********
కేసీఆర్ రాజీనామా తో తెలంగాణ ఏర్ప‌డిన మూడు నాలుగు నెల‌ల‌కే మెద‌క్ ఉప ఎన్నిక జ‌రిగింది. టీఆర్ఎస్ పార్టీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. అప్ప‌టికి ప్ర‌భుత్వ పాల‌న పూర్తిగా మొద‌లు కాలేదు. ఇక మెద‌క్ అంటే ఉద్య‌మ జిల్లా. ఆ స‌మ‌యంలో జ‌రిగిన ఎన్నిక‌లో కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డికి 3.6 ల‌క్ష‌ల మెజారిటీ వ‌చ్చింది. కేసీఆర్ సాధించిన 3.9 ల‌క్ష‌ల మెజారిటీని ఆయ‌న అధిగ‌మించ‌లేదు. అయితే అప్పుడు పోలింగ్ శాతం త‌గ్గ‌డం వ‌ల్ల మెజారిటీ కొంత త‌గ్గింద‌ని అంద‌రూ అన్నారు.
************
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక తెలంగాణ ఆవిర్భావించిన‌ ఏడాదిన్న‌ర త‌ర్వాత‌ జ‌రిగింది. ఇది కూడా కేవ‌లం కేసీఆర్ తీరు వ‌ల్ల వ‌చ్చిన ఉప ఎన్నిక అన్న విమ‌ర్శ ఉంది. మ‌రోవైపు ప్ర‌భుత్వంలోకి విప‌క్ష పార్టీల నేత‌ల‌ను తీసుకోవ‌డం, రైతు ఆత్మ‌హ‌త్య‌లులాంటి అంశాలు ప్ర‌తిప‌క్షాల వ‌ద్ద అస్త్రాలుగా ఉన్నాయి. అయినా స‌రే ప్ర‌జ‌లు టీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్ సొంత జిల్లాలో, సొంత‌ స్థానంలో టీఆర్ఎస్ కు ఇవ్వ‌నంత మెజారిటీని వ‌రంగ‌ల్ లో ఇచ్చారు.
టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆర్థికంగా బ‌ల‌మైన వ్య‌క్తి కాక‌పోయినా స‌రే నిఖార్సైయిన తెలంగాణ వాది కావ‌డం, మొద‌టి నుంచి ఉద్య‌మంలో ఉన్న వ్య‌క్తి కావ‌డ‌మూ ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది.
తెలంగాణ ఉద్య‌మంలో మొద‌టి నుంచి కేసీఆర్ వెంట నిలిచిన వారికి ఆర్థిక బ‌లం లేక‌పోయినా, ఎలాంటి ఛ‌రిష్మా లేక‌పోయినా స‌రే ఎన్నిక‌ల్లో ప్ర‌జామోదం ఎక్కువ‌గానే ఉంటుంద‌ని ఈ ఎన్నిక నిరూపిస్తోంది.

No comments:

Post a Comment