ఇందు మూలంగా తెలియ జేయునది ఏమనగా...
*******
నేనూ విరాళాలు సేకరిస్తున్నా...!
నా ఖాతా నెంబరు రాసుకోండి.. !!
అన్ని పేదరిక నిర్మూలన కోసమే.. పైసా తిట్టే ఒట్టు.. !!
*********
ఈ దేశంలో పేదరికాన్ని దూరం చేసేందుకు, పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నేనూ విరాళాలు సేకరించాలని అనుకుంటున్నాను. ఈ దేశంలో పేదరికాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు నాకు టీవీ ఛానెల్ లేదు. నేను టీవీ ఛానెల్ యజమానిని అంతకన్నా కాదు. నా వద్ద రంగులు పూసుకుని పేదరికాన్ని అత్యద్భుతంగా వర్ణించే అందమైన యాంకర్లు అసలే లేరండీ.. కేవలం ఫేసుబుక్ మాధ్యమంగా విరాళాలు సేకరణ చేపట్టాలనుకుంటున్నా..
దయార్ద్ర హృదయులు, పెద్ద మనసు ఉన్న వారు ఆ పేదల కన్నీళ్లను దూరం చేసేందుకు నా ఖాతాలో డబ్బులు వేయండి...
***********
నేను సేకరించి ఇచ్చే విరాళాలతో దేశంలో పేదరికం పూర్తిగా పోతుందని నేను నమ్మినప్పుడు, ప్రభుత్వం నిజంగా పేదరికాన్ని తొలగించేందుకు చర్యలు చేపడుతుందని బలంగా విశ్వసించినప్పుడు ఈ సొమ్మును ప్రభుత్వ ఖాతాలోనో లేక పేదల ఖాతాలోనో వేస్తానని సత్య ప్రమాణకంగా చెబుతున్నాను.. వంద సంవత్సరాలు, వేయి సంవత్సరాలు అయినా సరే నా ఇనప పెట్టెలోనో లేక బ్యాంకు ఖాతాలోనో ఈ విరాళాల సొమ్మును భద్రపరుస్తాను... కావాలంటే మీరు ఎన్ని విచారణలైనా చేయించుకోవచ్చు.. !
*************
మీరంతా భారీగా విరాళాలు ఇస్తారని ఆశిస్తూ... మళ్లా ఆ సొమ్ము ఎక్కడకు పోయిందని భవిష్యత్తులో అడగరని నమ్ముతూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను.

- మీ ఆకాశ రామన్న అలియాస్ తెలంగాణ అసాంజే!!
No comments:
Post a Comment