1

1

Thursday, 31 December 2015

ఈటీవీ జ‌బ‌ర్ద‌స్తుపై ఎన్నేళ్ల నిషేధం ఉండాలి?

అస‌లు రోజా మాట‌ల‌ను ఒక్క రోజు అసెంబ్లీలో విన‌లేక ఏడాది పాటు బ‌హిష్క‌రించిన పెద్ద మ‌నుషులారా... రామోజీరావుకు చెందిన ఈటీవీలో వ‌చ్చే జ‌బ‌ర్థ‌స్తు (బూతులు), ఎక్స్ ట్రా జ‌బ‌ర్థ‌స్తు (ఎక్స్ ట్రా బూతులు ) కార్య‌క్ర‌మంలో ఇంత క‌న్నా అత్యంత అస‌హ్య‌క‌ర రీతిలో వ‌చ్చే ప్ర‌సారంపైనా ఎన్నేళ్లు నిషేధం విధించాలి... ?
*********
ఈ ఛానెల్ ప్ర‌సారాల‌ను ఆపేస్తే మ‌ళ్లా భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌పై క‌ళ్లెం, మీడియా స్వేచ్ఛ‌కు అడ్డుక‌ట్ట‌, ప్ర‌జాస్వామ్యానికి చీక‌టి రోజు అంటూ రాయ‌కుండా ఉంటారా?

కేంద్రంలో అలా.... రాష్ట్రంలో ఇలా...

కేంద్రంలో అలా....
వ‌చ్చీ రావ‌డంతోనే రైలు టికెట్ ధ‌ర‌లు పెంచిన వారు.. త‌త్కాల్ ఛార్జీల భారం మోపిన వారు.. టికెట్ ర‌ద్దు చేసుకుంటే అధిక రుసుం విధించే వారు.. గ్యాస్ సిలిండ‌ర్ల పై రాయితీ ఎత్తివేసే వాళ్లు... స్వ‌చ్ఛ భార‌త్ పేరిట ప‌న్నులు వ‌సూలు చేసే వాళ్లు వారు... 
*******
రాష్ట్రంలో ఇలా...
జీహెచ్ ఎంసీలో ఆస్తి ప‌న్ను వ‌సూలు చేయొద్దు..
విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు...
ఆర్టీసీ ఛార్జీలు పెంచొద్దు..
అస‌లు ఒక్క ప‌న్ను కూడా వ‌సూలు చేయొద్దు అన్న చందం...

అప్పుడు టీ అంటే అదేన‌ట‌..

" మేం చ‌దువుకునేట‌ప్పుడు ఇక్క‌డ టీ-హ‌బ్ లాంటివి లేవు.. అప్ప‌ట్లో టీ అంటే ట్యాంకు బండ్ మాత్ర‌మే.. " అని స‌త్యా నాదెళ్ల సెల‌విచ్చారు..
*********************
*********************
మ‌రి బాబు గారి వ‌ల్ల‌నే స‌త్యా నాదెళ్ల ఎదిగార‌ని ప్ర‌చారం చేసుకున్న వాళ్లు ఏం సమాధానం ఇస్తారో....

క్రిమిలేయ‌ర్ పై అపోహ‌లు...

బీసీల‌కు క్రిమీలేయ‌ర్ ను ఒక్క త‌మిళ‌నాడు మిన‌హా దేశంలోని అన్నిరాష్ట్రాలు అమ‌లు చేస్తున్నాయి..
ఈ విష‌యాన్ని జాతీయ బీసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య గారు ఇటీవ‌ల చెప్పారు...
తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోతో అటెండ‌ర్ల పిల్ల‌లు కూడా క్రిమీలేయ‌ర్ ప‌రిధిలోకి వ‌స్తార‌ని కొంద‌రు గ‌గ్గోలు పెడుతున్నారు..
వాస్త‌వానికి ఎవ‌రైనా బీసీ వ్య‌క్తి కేంద్ర ప్ర‌భుత్వ గ్రూప్ - ఏ ఉద్యోగాల‌కు(సివిల్స్‌) లేదా రాష్ట్ర ప్ర‌భుత్వంలో గ్రూప్ - 1 ఉద్యోగాల‌కు నేరుగా ఎంపికైనా లేదా ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినా రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వులు చేప‌ట్టితే మాత్రం వారి పిల్ల‌లు క్రిమీలేయ‌ర్ ప‌రిధిలోకి వ‌స్తారు...
40 ఏళ్ల లోపు ప్ర‌మోష‌న్ మీద గ్రూప్ - ఏ కు వెళితే మాత్ర‌మే వారికి క్రిమీలేయ‌ర్ వ‌ర్తిస్తుంది...
ఒక‌వేళ భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ కేంద్ర ప్ర‌భుత్వంలో గ్రూప్ - బీ ఉద్యోగులైతే వారి పిల్ల‌ల‌కు క్రిమీలేయ‌ర్ వ‌ర్తిస్తుంది...
ఇలా అనేకం ఉన్నాయి.. వాస్త‌వానికి క్రిమీలేయ‌ర్ అంశంపై త‌హ‌సీల్దార్ల‌కు కూడా స‌రైన అవ‌గాహ‌న లేదు..
ఇటీవ‌ల కొంద‌రు మేధావులు కూడా అటెండ‌ర్ల పిల్ల‌లు కూడా క్రిమీలేయ‌ర్ ప‌రిధి లోకి వ‌స్తారంటూ మాట్లాడుతుండ‌టం ఇంకా ఆశ్య‌ర్యాన్ని క‌లిగిస్తోంది..
నోట్ - ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లైన ఎన్టీపీసీ, సింగ‌రేణిలో ఉన్న‌త స్థానంలో ప‌నిచేస్తున్న బీసీల పిల్ల‌ల‌కు కూడా క్రిమీలేయ‌ర్ వ‌ర్తించ‌దు.. ఎందుకంటే వారి జీతం ఎక్కువ‌గా ఉన్నా కూడా వారిని గ్రూప్ - ఏ కింద ప‌రిగ‌ణించ‌రు..

బ‌హుజ‌న ఆయుత చండీ యాగాన్ని మ‌నం చూడొచ్చా?

చిన్న సందేహం...
*****
బంగారు బ‌తుక‌మ్మ‌
బ‌హుజ‌న బ‌తుక‌మ్మ‌ల‌ను చూసిన‌ట్లే
బ‌హుజ‌న ఆయుత చండీ యాగాన్ని మ‌నం చూడొచ్చా?

అఖండ భార‌త్ కు ప్ర‌ధాని ఎవ‌రో..?

త్వ‌ర‌లో భార‌త్‌, పాక్‌, బంగ్లాదేశ్ లు క‌లిసి పోతాయ‌ని.. అఖండ భార‌తావ‌ని ఏర్ప‌డుతుంద‌ని ఒక‌ప్పుడు ఆర్ ఎస్ ఎస్ లో ప‌నిచేసి గ‌తేడాది బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాం మాధ‌వ్ గారి ఉవాచ‌...
--------------
--------------
--------------
ఇంత‌కీ అఖండ భార‌త్‌కు ప్ర‌ధాన మంత్రి న‌వాజ్ ష‌రీఫ్ అవుతారా? షేక్ హ‌సీనా అవుతారా? లేక న‌రేంద్ర మోదీ ఉంటారా? లేక ముగ్గురూ ఏడాదిన్న‌ర చొప్పున పంచుకుంటారా? అది కూడా సెల‌విస్తే బాగుండేదేమో...!!

ఈ ఘోరీల‌ను న‌మ్మితే ఘోరీ క‌డ‌తారు జాగ్ర‌త్త..

చ‌రిత్ర‌లో పృథ్వీరాజ్ చ‌వాన్ మొద‌ట ఘోరీనీ ఓడించి వ‌దిలేశాడు... రెండో సారి ఘోరీ మ‌ళ్లా దండ‌యాత్ర చేసి పృథ్వీరాజ్ ను ఓడించి ప్రాణాల‌తో వ‌దిలేయ‌లేదు.. చంపేశాడు.. ఇప్పుడు అధికారం ద‌క్కింద‌ని, సీఎం పీఠంపై ఉన్నాడ‌న్న ఒకే ఒక కార‌ణంతో కేసీఆర్ ప‌ట్ల వీర విధేయ‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నట్లు న‌టిస్తున్న‌ రాజ‌గురువు ఘోరీ త‌ర‌హా వ్య‌క్తే... వాళ్ల‌ను క్ష‌మించి ద‌గ్గ‌ర‌కు తీస్తే మ‌న‌కే ఘోరీలు క‌ట్టే ఘ‌నాపాటిలు.. వాళ్ల‌కు అవ‌కాశం ఇస్తే మ‌న అస్తిత్వాన్ని లేకుండా చేయ‌గ‌ల కాలాంత‌కులు... ఈ విష‌యాన్ని తెలంగాణ‌లో చిన్న పిల్ల‌గాడిని అడిగినా చెబుతాడు... ఏమ‌ర‌పాటుతో ఉంటే ఎప్ప‌టికైనా ప్ర‌మాద‌మే.... త‌స్మాత్ జాగ్ర‌త్త‌..!!

గోదావ‌రి పుష్కరాల‌కు , ఆయుత చండీ యాగానికి ప్ర‌ధాన మంత్రిని కేసీఆర్ ఆహ్వానించింది వాస్త‌వం కాదా?

గోదావ‌రి పుష్కరాల‌కు , ఆయుత చండీ యాగానికి ప్ర‌ధాన మంత్రిని కేసీఆర్ ఆహ్వానించింది వాస్త‌వం కాదా?
ఇక వాట‌ర్ గ్రిడ్ పైలాన్ ఆవిష్క‌ర‌ణ‌కు కూడా ఆహ్వానించిన‌ట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.. మ‌రి భార‌త మాత చిన్న కుమార్తె అయిన తెలంగాన‌ను పుట్టిన త‌ర్వాత ఒక్క‌సారైనా చూడాల‌ని ప్ర‌ధాన మంత్రి గారికి అనిపించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏంటో? చిన్న కుమార్తె ఎలా ఉందో చూడాల‌న్న ఆత్రుత లేదేమో.. అందుకేనేమో మొన్న అమ‌రావ‌తి సాక్షిగా ప్ర‌ధాని గారు చేసిన ప్ర‌సంగంలోనూ తెలంగాణ ఏర్పాటు హ‌డావుడి నిర్ణ‌యం అంటూ మాట్లాడారు... ఆయ‌న ప్ర‌సంగాల సీడీల‌ను జీహెచ్ ఎంసీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీవీల్లో ప్ర‌సారం చేస్తే తెలిసి పోతుంది మోడీ గారికి తెలంగాణ‌పై ఉన్న ప్రేమ‌..
నోట్ - ప్ర‌పంచ దేశాల‌న్నీ తిరుగుతున్న పెద్ద మ‌నిషి సొంత దేశంలో కొత్త‌గా ఆవిర్భ‌వించిన రాష్ట్రాన్ని ఇంత వ‌ర‌కు చూడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.. ఇక ముఖ్య‌మంత్రి పిలిచినా ఆయ‌న వ‌స్త‌లేడు.. నాకు తెలిసి బీజేపీ వాళ్లు పిలిచినా వ‌స్తాడ‌న్న న‌మ్మ‌క‌మే లేదు..

ఎన్టీఆర్ స్టేడియాన్ని కాళోజీ క‌ళా భ‌వ‌న్ గా మార్చాల్సిందే..

ఎన్టీఆర్ స్టేడియాన్ని కాళోజీ క‌ళా భ‌వ‌న్ గా మార్చాల్సిందే..
*****
అస‌లు ఎన్టీఆర్ మైదానం స్థానంలో కాళోజీ క‌ళా భ‌వ‌న్ గా మార్చాల‌ని ప్ర‌భుత్వం భావిస్తే త‌ప్పు ప‌డ‌తారు.. మ‌ళ్లా అదే మైదానంలో పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌.. క్రాఫ్ట్ మేళాలు జ‌రిపినా... ఎన్టీవీ కోటి దీపోత్స‌వం జ‌రిగినా ఈ ప్ర‌జాస్వామ్య వాదులు, క్రీడా మైదానాల ప‌రిర‌క్ష‌ణ పేరుతో బోగ‌స్ ఉద్య‌మాలు చేసే మేధావులు, రాజ‌కీయ నేత‌లు ప‌త్తా లేకుండా పోతారు... మైదానంలో క్రీడ‌లు ఆడుకోవ‌డం త‌ప్ప ఇత‌ర‌త్రా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం ఏంట‌ని క‌నీసం నిల‌దీయ‌రు... ఇలా ఎన్టీఆర్ స్టేడియాన్ని అద్దెకు ఇవ్వ‌డం క‌న్నా కాళోజీ క‌ళా భ‌వ‌న్ గా మార్చ‌డం అత్యుత్త‌మం..

Saturday, 19 December 2015

వీరిని స‌స్పెండ్ చేసిన రోజు ఏ హెడ్డింగ్ లు పెడ‌తారో వేచిచూడాలి...

అక్క‌డ బూతులు మాట్లాడితే రోజాను ఏడాది స‌స్పెండ్ చేశార‌ట‌.. మ‌రి ఇక్క‌డ రేవంతుడిని, ఎర్ర‌బెల్లిని ఎన్నేళ్లు స‌స్పెండ్ చేస్తారో? 
అక్క‌డ స‌స్పెండ్ చేస్తే ఏ ప‌త్రిక‌లోనూ ప్ర‌జాస్వామ్యం అప‌హాస్యం అయింద‌నో ఇంకేదో అయింద‌నో హెడ్డింగ్ లు రాలేదు.. మ‌రి ఇక్క‌డ వీరిని స‌స్పెండ్ చేసిన రోజు ఏ హెడ్డింగ్ లు పెడ‌తారో వేచిచూడాలి...

మా క‌రీంన‌గ‌ర్ కు బ‌దులు ఇంకో సిటీని స్మార్ట్ సిటీ చేయండి ప్లీజ్‌...

ఇది నా భావ‌న‌...
*************
కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల స్మార్ట్ న‌గ‌రాల జాబితాలోకి వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్ ను ఎంపిక చేసింది. అయితే హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రం కాబ‌ట్టి దానికి బ‌దులు క‌రీంన‌గ‌ర్ ను స్మార్ట్ సిటీగా ప్ర‌క‌టించ‌మ‌ని మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. నేను క‌రీంన‌గ‌ర్ వాసిని అయిన‌ప్ప‌టికీ మా జిల్లాకు బ‌దులుగా ఏ న‌ల్ల‌గొండ‌నో లేదా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నో లేదా నిజామాబాద్ నో స్మార్ట్ సిటీగా ప్ర‌క‌టించ‌మ‌ని విజ్ఞ‌ప్తి చేస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్ప‌టికే కొంద‌రు టీటీడీపీ నేత‌లు ఉత్త‌ర తెలంగాణ , ద‌క్షిణ తెలంగాణ అంటూ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను చీల్చాల‌ని చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ రెండింటినీ స్మార్ట్ సిటీలుగా ప్ర‌క‌టించుకుంటే దాన్చి భూత‌ద్దంలో చూసే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే వెన‌క‌బ‌డిన న‌ల్ల‌గొండ‌, పాల‌మూరుల‌ను స్మార్ట్ సిటీలుగా మ‌ల‌చ‌డ‌మో చేయాలి. ఒక‌వేళ అవి న‌గ‌ర పాల‌క సంస్థ‌లు కాక‌పోతే జోన్ 6 లో నిజామాబాద్ ను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చ‌డ‌మో చేస్తే బాగుంటుంది... స్మార్ట్ సిటీ తో నా జిల్లా అభివృద్ధి చెంద‌డం క‌న్నా తెలంగాణ ప్ర‌జ‌లంతా ఎప్ప‌టికీ ఐక్యంగా ఉండట‌మే అతి ప్ర‌ధానం. తెలంగాణ యావ‌త్తు అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగాలి. జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌..

ఇది ఆ ఒక్క నేత మాట కాదు.. విప‌క్షాల‌న్నింటివీ ఇదే మాట‌...

ద‌స‌రా పండుగ స‌మ‌యంలో జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు పెట్టినా స‌హిస్తాం, దీపావ‌ళి స‌మ‌యంలో ఎన్నిక‌లు పెట్టినా స‌హిస్తాం, రంజాన్ స‌మ‌యంలో పెట్టినా ఓకే.. క్రిస్మ‌స్ స‌మ‌యంలో నిర్వ‌హించినా ప‌ర్వాలేదు.. కానీ సంక్రాంతి పండుగ స‌మ‌యంలో పెడితే మాత్రం చూస్తూ ఊరుకోం... 
--- ఇది ఆ ఒక్క నేత మాట కాదు.. విప‌క్షాల‌న్నింటివీ ఇదే మాట‌...

మాటి మాటికి అంబానీపై ఆరోప‌ణ‌లు చేస్తే సీబీఐ ఊరుకుంటుందా?

మాటి మాటికి అంబానీపై ఆరోప‌ణ‌లు చేస్తే సీబీఐ ఊరుకుంటుందా? 
ఇలాగే దాడులు చేస్తుంది... దాడులు అంబానీల‌పై కాదు.. ఆరోప‌ణ‌లు చేసే ముఖ్య‌మంత్రుల కార్యాల‌యాల‌పైన‌...!!

శైలేష్ రెడ్డి ప్యానెల్‌కు జై కొట్టిన జ‌ర్న‌లిస్టులు..

జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అధికారిక ప్యానెల్ మ‌రోమారు జ‌య‌భేరి మోగించింది.. ఈ ప్యానెల్‌కు చెందిన ఏడుగురు విజ‌యం సాధించ‌గా... రెహానా బేగ‌మ్ గారు, మంజ‌రి గారు కూడా జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేశారు.. గ‌త ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌లేదు.. కానీ ఈ సారి జ‌ర్న‌లిస్టులు మ‌హిళ‌ల‌కు 33 శాతం పోస్టులు క‌ట్ట‌బెట్టారు.. గెలిచిన 9 మందిలో ముగ్గురు మ‌హిళా జ‌ర్న‌లిస్టులు కూడా ఉండ‌టం విశేషం. 2010-14 మ‌ధ్య స‌మ‌యంలో తెలంగాణ ఉద్య‌మం, ఇత‌ర అంశాల మూలంగా పూర్తిస్థాయిలో ప‌నిచేసేందుకు ఆస్కారం ఈ ప్యానెల్‌కు ద‌క్క‌లేద‌ని స‌భ్యులు భావించారు. ఇప్పుడు సంక్షోభాలు లేక‌పోవ‌డంతో వీళ్లంతా జ‌ర్న‌లిస్టుల కోసం ఏదైనా చేస్తార‌న్న భావ‌న అంద‌రిలో ఉంది.. వీరిపై ఆశ‌లు పెట్టుకున్న జ‌ర్న‌లిస్టులంద‌రి క‌ల‌ల‌ను నెర‌వేర్చాల‌ని ఆశిస్తున్నా..
************
గెలిచిన వారు వీరే..
*****
డి.వెంకటాచారి ( ప్రస్తుత అధ్యక్షుడు),
ఆర్. శైలెష్ రెడ్డి (ప్రస్తుత కార్యదర్శి),
కొండవీటి జయప్రసాద్ (ప్రస్తుత సంయుక్త కార్యదర్శి అండ్ చీఫ్ ఎడిటర్ మెట్రో టీవీ ),
ఎం.ఎస్.హాష్మి.( ప్రస్తుత మేనేజింగ్ కమిటీ సభ్యులు, సియాసత్),
జి.సుబ్బారావు ( ఈనాడు),
కే.అరుణ జ్యోతి ( ఎన్ టీవీ),
కే.హరిందర్,( ఫ్రీలాన్సర్)
రెహానా బేగ‌మ్‌(మీడియా 24)
మంజ‌రి (సాక్షి)

బ్యాంకులు బాగుంటే ఈ కాల్ మ‌నీ దందాలు న‌డిచేవా?

ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్‌, ఇంకా అనేక ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు బ‌కాయి ప‌డ్డ (లోన్లు క‌ట్ట‌కుండా ఎగ్గొట్టిన‌) బ‌డా పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌పైకి ఆయా బ్యాంక్ యాజ‌మాన్యాలు విజ‌య‌వాడ‌ కాల్ మ‌నీ ముఠానో లేదా క‌రీంన‌గ‌ర్‌ ఏఎస్సై మోహ‌న్ రెడ్డి లాంటి వారినో ప్ర‌యోగిస్తే బాగుండేదేమో... ఈ పాటికి రూ.2 ల‌క్ష‌ల కోట్లు వ‌సూల‌య్యేవి.. !
*********
సంప‌న్నుల‌కు కోట్ల రూపాయ‌లు అప్పులు ఇచ్చి సామాన్యులు మాత్రం వేల రూపాయ‌ల అప్పులు అడిగితే ష్యూరిటీల పేరిట బ్యాంకులు స‌వాల‌క్ష అడ్డంకులు సృష్టించ‌డం వ‌ల్లే సామాన్యులంతా కాల్ మ‌నీ ముఠాల‌కు లేదా ఏ ఎస్సై మోహ‌న్ రెడ్డి లాంటి క్రూరుల‌కు చిక్కి బ‌ల‌వుతున్నారు...!!!

ఇళ్లు వ‌స్తుందో రాదో..

మొత్తానికి జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నిక‌ల్లో ఓటేసినం.. ఓటేయించుకునేందుకు రోజుకు ప‌దుల సంఖ్య‌లో మెసేజులు, ఫోన్ల మీద ఫోన్లు చేశారు ఎంద‌రో? మ‌రి గెలిచిన త‌ర్వాత ఇలాగే ట‌చ్ లో ఉంటారా? అన్న‌ది స‌మాధానం లేని ప్ర‌శ్నే..
హైద‌రాబాద్ లో స్థ‌లం ఇప్పించ‌క‌పోయినా ప‌ర్వాలేదు కానీ ప్ర‌భుత్వం పేద‌ల‌కు ఇస్తున్న‌ డ‌బుల్ బెడ్రూం ఇళ్లులు ఇప్పించినా చాలు వారి పేరును క‌ల‌కాలం యాదికి ఉంచుకుంటారు జ‌ర్న‌లిస్టులు.. మ‌రి గెలిచే వాళ్లు ఏం చేస్తారో వేచిచూడాలి..!!

జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీకి పోటీ ప‌డుతున్న 20 మందికి పైగా ఆశావ‌హులు

హైద‌రాబాద్ లో మ‌రో ర‌స‌వ‌త్త‌ర ఎన్నిక‌...
జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీకి పోటీ ప‌డుతున్న 20 మందికి పైగా ఆశావ‌హులు
జ‌ర్న‌లిస్టుల‌కు స్థ‌లాలు ఇప్పిస్తామంటూ హామీలు
బూట‌క‌పు హామీలు ప‌క్క‌న పెట్టి డ‌బుల్ బెడ్రూం ఇళ్లుల్లో జ‌ర్న‌లిస్టుల‌కు చోటు క‌ల్పిస్తే చాలంటున్న మెజారిటీ జ‌ర్న‌లిస్టులు
నోటాకు చోటుంటే బాగుంటుందేమో..!!
******
మొన్న వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక‌కు ముందు అక్క‌డ ప్రెస్ క్ల‌బ్ కు సంబంధించి ర‌స‌వ‌త్త‌ర సంగ్రామం సాగింది. హేమాహేమిలైన జ‌ర్న‌లిస్టుల‌ను తీసుకొచ్చి ప్ర‌చారాలు చేశారు. ఇప్పుడు హైద‌రాబాద్ లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ముందే మ‌ళ్లా జ‌ర్న‌లిస్టులకు సంబంధించి మ‌రో ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది. జ‌ర్న‌లిస్టు కో ఆప‌రేటివ్ హౌసింగ్ సోసైటీ ఎన్నిక ఈ నెల 14న జ‌ర‌గ‌నుంది. సీనియ‌ర్లు అయిన జ‌ర్న‌లిస్టులు త‌మ‌కే ఎక్కువ భూమి కావాల‌ని జూనియ‌ర్ల‌ను ప‌క్క‌న పెట్ట‌డం, కొంద‌రికి ఉద్దేశ పూర్వ‌కంగా వాళ్ల సంఘంలో చోటు క‌ల్పించ‌క‌పోవ‌డంతో ఈ సంఘం ఏర్పాటైంది. ఇందులో దాదాపు 600-700 మంది జ‌ర్న‌లిస్టులు స‌భ్యులుగా ఉన్నారు. అస‌లు జ‌ర్న‌లిస్టుల‌కు స్థ‌లాలు ఇప్పిస్తామ‌ని కొంద‌రు నేత‌లు హామీల మీద హామీలు ఇస్తున్నారు. అస‌లు జ‌ర్న‌లిస్టుల‌కు స్థ‌లాలు ఇవ్వ‌డం అవ‌స‌ర‌మా? ప్ర‌భుత్వం ఎలాగైతే నిరుపేద‌ల‌కు డ‌బుల్ బెడ్రూం ఇళ్లులు క‌ట్టిస్తుందో అలాగే జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్లులు క‌ట్టించాల‌ని న్యాయ‌మైన డిమాండ్‌ను వీళ్లు లేవ‌నెత్తితే హైద‌రాబాద్ స‌హా జిల్లాల్లో ఉన్న అంద‌రు జ‌ర్న‌లిస్టుల‌కు ఎప్పుడో గూడు దొరికేది. కానీ రియ‌ల్ ఎస్టేట్ దందా చేయాల‌నో లేక ఇంకేం కార‌ణం వ‌ల్ల‌నో స్థ‌లాల కోస‌మే సీనియ‌ర్లు ప‌ట్టుప‌ట్ట‌డంతో జూనియ‌ర్ల‌కు అన్యాయం జ‌రుగుతోంది. ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి ప్ర‌స్తుతం జ‌ర్న‌లిస్టు సంఘాల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకొని అదే స్థ‌లంలో అర్హులైన అంద‌రు జ‌ర్న‌లిస్టుల‌కు డ‌బుల్ బెడ్రూం ఇళ్లులు క‌ట్టిస్తే బాగుంటుంది. ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు ప్రాధానం ఇవ్వాలి.
**********
నోట్ : వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో జ‌ర్న‌లిస్టులంద‌రికీ డ‌బుల్ బెడ్రూం ఇళ్లులు క‌ట్టిస్తామంటే కొంద‌రు సీనియ‌ర్లు త‌మ రియ‌ల్ ఎస్టేట్ ప్ర‌యోజ‌నాలు దెబ్బ‌తింటాయ‌న్న బాధ‌తో ఆ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించారు. అనంత‌రం కోర్టు కేసుల చుట్టూ తిరుగుతూ త‌మ ఆధీనంలోకి వ‌చ్చినట్టే వ‌చ్చిన 80 ఎక‌రాల‌ను ఎలాగైన పూర్తిగా సొంతం చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

ర‌ఘు సేవ‌ల‌ను ప్ర‌భుత్వం ఉప‌యోగించుకోవాలి...



తెలంగాణ ఉద్య‌మంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేత ర‌ఘు పాత్ర అద్వితీయం. ఒక‌వేళ ఆయ‌న పై తెలంగాణ స‌ర్కారు బ‌దిలీ వేటు వేస్తే అది నిజం గా త‌ప్పిద‌మే అవుతుంది. విద్యుత్ రంగంపై మంచి అవ‌గాహ‌న ఉన్న తెలంగాణ ఉద్య‌మ‌కారుడు ఆయ‌న‌. ఆయ‌న సేవ‌ల‌ను ప్ర‌భుత్వం ఉప‌యోగించుకోవాలి. భేదాభిప్రాయాలుంటే ప‌రిష్క‌రించుకోవాలి..

మెద‌క్ ఉప ఎన్నిక‌, వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ఓ ప‌రిశీల‌న‌...

మెద‌క్ ఉప ఎన్నిక‌, వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక ఓ ప‌రిశీల‌న‌...
***********
కేసీఆర్ రాజీనామా తో తెలంగాణ ఏర్ప‌డిన మూడు నాలుగు నెల‌ల‌కే మెద‌క్ ఉప ఎన్నిక జ‌రిగింది. టీఆర్ఎస్ పార్టీ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. అప్ప‌టికి ప్ర‌భుత్వ పాల‌న పూర్తిగా మొద‌లు కాలేదు. ఇక మెద‌క్ అంటే ఉద్య‌మ జిల్లా. ఆ స‌మ‌యంలో జ‌రిగిన ఎన్నిక‌లో కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డికి 3.6 ల‌క్ష‌ల మెజారిటీ వ‌చ్చింది. కేసీఆర్ సాధించిన 3.9 ల‌క్ష‌ల మెజారిటీని ఆయ‌న అధిగ‌మించ‌లేదు. అయితే అప్పుడు పోలింగ్ శాతం త‌గ్గ‌డం వ‌ల్ల మెజారిటీ కొంత త‌గ్గింద‌ని అంద‌రూ అన్నారు.
************
వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక తెలంగాణ ఆవిర్భావించిన‌ ఏడాదిన్న‌ర త‌ర్వాత‌ జ‌రిగింది. ఇది కూడా కేవ‌లం కేసీఆర్ తీరు వ‌ల్ల వ‌చ్చిన ఉప ఎన్నిక అన్న విమ‌ర్శ ఉంది. మ‌రోవైపు ప్ర‌భుత్వంలోకి విప‌క్ష పార్టీల నేత‌ల‌ను తీసుకోవ‌డం, రైతు ఆత్మ‌హ‌త్య‌లులాంటి అంశాలు ప్ర‌తిప‌క్షాల వ‌ద్ద అస్త్రాలుగా ఉన్నాయి. అయినా స‌రే ప్ర‌జ‌లు టీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించారు. కేసీఆర్ సొంత జిల్లాలో, సొంత‌ స్థానంలో టీఆర్ఎస్ కు ఇవ్వ‌నంత మెజారిటీని వ‌రంగ‌ల్ లో ఇచ్చారు.
టీఆర్ఎస్ అభ్య‌ర్థి ఆర్థికంగా బ‌ల‌మైన వ్య‌క్తి కాక‌పోయినా స‌రే నిఖార్సైయిన తెలంగాణ వాది కావ‌డం, మొద‌టి నుంచి ఉద్య‌మంలో ఉన్న వ్య‌క్తి కావ‌డ‌మూ ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంది.
తెలంగాణ ఉద్య‌మంలో మొద‌టి నుంచి కేసీఆర్ వెంట నిలిచిన వారికి ఆర్థిక బ‌లం లేక‌పోయినా, ఎలాంటి ఛ‌రిష్మా లేక‌పోయినా స‌రే ఎన్నిక‌ల్లో ప్ర‌జామోదం ఎక్కువ‌గానే ఉంటుంద‌ని ఈ ఎన్నిక నిరూపిస్తోంది.

మ‌రి ఓరుగ‌ల్లు ఓట‌ర్లు ఏంది మ‌రోలా స్పందించారు..

రైతు ఆత్మ‌హ‌త్య‌లు..
శృతి ఎన్ కౌంట‌ర్‌..
ప‌త్తి రైతుల స‌మ‌స్య‌లు..
నిరుద్యోగులు ఆగ్ర‌హం..
ఆశా వ‌ర్క‌ర్ల ధ‌ర్నా..
మున్సిప‌ల్ ఉద్యోగుల స‌మ్మె...
వాట‌ర్ గ్రిడ్ లో అక్ర‌మాలు..
ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో అవినీతి..
ఇంకా ఎన్నో ఎన్నెన్నో అన్నారు...
************
మ‌రి ఓరుగ‌ల్లు ఓట‌ర్లు ఏంది మ‌రోలా స్పందించారు..

తెలంగాణ ప్ర‌జా బ‌ల‌మే మీకు శ్రీ‌రామ ర‌క్ష‌..!

ఈ ఎన్నిక‌ల ఫ‌లితంతో ఆంధ్ర‌జ్యోతి రాత‌ల తీరు మారుతుంద‌ని, రాధాకృష్ణ‌కు జ్ఞానోద‌యం అవుతుంద‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది. అలాగే ప్ర‌తిప‌క్షాలు కూడా తెలంగాణ అభివృద్ధిలో నిర్మాణాత్మ‌క సూచ‌న‌ల‌తో ఇక‌పై ముందుకు వ‌స్తార‌ని కూడా నేను భావించ‌ను. కానీ ఉప ఎన్నిక ఫ‌లితాలు మాత్రం టీఆర్ఎస్‌పై మ‌రింత ఎక్కువ బాధ్య‌త‌ను పెట్టాయి.
*****
తెలంగాణ ప్ర‌జ‌లు టీఆర్ఎస్‌పై విశ్వాసాన్ని మ‌రింత బ‌లంగా ప్ర‌స్పుటం చేశారు. విజ‌య గ‌ర్వాన్ని ద‌రి చేర‌నీయ‌కుండా, ప్ర‌జా విశ్వాసాన్ని వ‌మ్ము చేయ‌కుండా మిగిలిన మూడున్న‌రేళ్ల‌ పాల‌న‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా సాగించాలి. ముఖ్యంగా రైతు ఆత్మ‌హ‌త్య‌లు లేని తెలంగాణ కోసం చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగ‌వంతం చేయాలి. యుద్ధ ప్రాతిప‌దిక‌న వీటిని పూర్తి చేసి రైతుల‌కు నీళ్లు ఇవ్వ‌గ‌లిగితేనే వారి రైతు క‌న్నీళ్ల‌ను కొంత మేర‌కు తుడ‌వగ‌లం.
ఇక ప్ర‌భుత్వం ప్రారంభించిన వాట‌ర్ గ్రిడ్‌ను స‌కాలంలో పూర్తి చేయాలి. అన్నింటి క‌న్నా ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టు అయిన ఇళ్ల నిర్మాణం, కేజీ టూ పీజీ విద్య ను కూడా ఎలాంటి లోపాలు లేకుండా అమలు చేయ‌గ‌లిగితే మ‌రో ప‌దేళ్లు ప్ర‌జా ఆశీర్వాదం ఉంటుంది. ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లో చిర‌కాలం నిలిచిపోతారు. ఇక జిల్లాల విభ‌జ‌న‌ను కూడా వివాదాలు లేకుండా పూర్తి చేస్తే ఇచ్చిన హామీల‌ను సంపూర్ణంగా అమ‌లు చేసిన వాళ్లుగా నిలిచిపోతారు.
***************
కేంద్రం అండ లేక‌పోయినా, పొరుగు రాష్ట్రాలు క‌య్యానికి మీద‌కు వ‌చ్చినా స‌రే
తెలంగాణ ప్ర‌జా బ‌ల‌మే మీకు శ్రీ‌రామ ర‌క్ష‌..!
జై తెలంగాణ‌... జై జై తెలంగాణ‌..!!

కెప్టెన్ కూల్.. కేసీఆర్‌..!

కెప్టెన్ కూల్.. కేసీఆర్‌..!
టెండూల్క‌ర్ మీద కూడా లేనంత ఒత్తిడి..!!
************
నిజంగా స‌చిన్ టెండూల్క‌ర్ మీద కూడా ఇంత ఒత్తిడి(ప్రెజ‌ర్) ఉండేది కాదేమో... ఇండియా మ్యాచ్ గెలిచి స‌చిన్ సెంచ‌రీ చేయ‌క‌పోయినా జ‌నం ఆమోదించే వాళ్లు.. లేక స‌చిన్ సెంచ‌రీ చేసి ఇండియా మ్యాచ్ ఓడిపోయినా పోనీలే స‌చిన్ ఆడాడు క‌దా అని సంతోషించే వాళ్లు.. 
************
కానీ తెలంగాణ‌లో టీఆర్ఎస్ విష‌యంలోకి వ‌స్తే భిన్నంగా ఉంటోంది ప‌రిస్థితి. ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ గెల‌వాలి.. మెజారిటీ ల‌క్ష‌ల్లో ఉండాలి అన్న‌ ప‌రిస్థితులు ఉంటున్నాయి.
ఒక‌వేళ టీఆర్ఎస్ గెలిచి మెజారిటీ త‌గ్గితే ప్ర‌తిప‌క్షాలు, మీడియా విమ‌ర్శ‌నాస్త్రాలు. ఒక‌వేళ కొత్త నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి పోటీ చేసి గ‌ణ‌నీయంగా ఓట్లు సాధించినా స‌రే గెల‌వ లేదు క‌దా అని నిట్టూర్పు విడుస్తారు.. ఇదేం ధోర‌ణో...!!
ఇన్ని ఒత్తిళ్ల మ‌ధ్య విజ‌య‌వంతంగా 15 ఏళ్లుగా పార్టీని న‌డ‌ప‌డం, తెలంగాణ‌ను విజేత‌గా నిల‌ప‌డం మాట‌లు కాదు..
భార‌త క్రికెట్ జ‌ట్టుకు కెప్టెన్ కూల్ ధోని కావొచ్చేమో గాని... తెలంగాణకు ల‌భించిన సిసలైన‌ కెప్టెన్ కూల్.. కేసీఆర్ అన‌డంలో ఎలాంటి సందేహ‌మూ లేదు.. !!

వాళ్లు ఆ ప‌త్రిక‌లో, ఛానెల్ లో మాత్రం గెలిచారు..

వాళ్లు ఆ ప‌త్రిక‌లో, ఛానెల్ లో మాత్రం గెలిచారు.. ప్ర‌జ‌ల్లో ఓడిపోయారు.. పాపం.. ప‌త్రిక రాత‌లే ప్ర‌జా నాడి అనుకొని బోల్తా ప‌డ్డారు.. !!

బెట్టింగ్ అంతా దీనిపైనే

రెండో స్థానం ఎవ‌రికి? టీఆర్ ఎస్ మెజారిటీ ఎంత‌? ఇదే ఇప్పుడు జ‌రుగుతున్న బెట్టింగ్

ప్రెస్ క్ల‌బ్ హైద‌రాబాద్ లో తాత్కాలిక‌ స‌భ్యుడిగా చేరాలంటే ఎంద‌రి కాళ్లు ప‌ట్టుకోవాలో?

ప్రెస్ క్ల‌బ్ హైద‌రాబాద్ లో తాత్కాలిక‌ స‌భ్యుడిగా చేరాలంటే ఎంద‌రి కాళ్లు ప‌ట్టుకోవాలో?
ఇవేం రూళ్లో పాడో...
తెలంగాణ వ‌చ్చినా ఆంధ్రా జ‌ర్న‌లిస్టుల చుట్టూ సంత‌కాల కోసం తిర‌గాల్సిన దుస్థితి..
హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ లో అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ స‌భ్య‌త్వం ఇవ్వాల్సిందే..
కాలం చెల్లిన పాత నిబంధ‌న‌లు మార్చండి.. 
***********
తెలంగాణ ప్ర‌భుత్వం అర్హులైన డెస్కు జ‌ర్న‌లిస్టుల‌కు, రిపోర్ట‌ర్ల‌కు అంద‌రికీ అక్రిడియేష‌న్ కార్డుల ఇవ్వాల‌ని జ‌ర్న‌లిస్టు సంఘాలు ఆందోళ‌న‌లు, ఉద్య‌మాలు చేశాయి. ప్ర‌భుత్వం కొంద‌రికి మాత్ర‌మే ఇస్తాన‌నంటే అగ్గి మీద గుగ్గిలం లాగా పైకి లేచి నానా యాగి చేశారు. మ‌రి అదేందో ప్ర‌భుత్వాలు నియ‌మ నిబంధ‌న‌లు రూపొందించి అమ‌లు చేస్తామంటే ఈ నిబంధ‌న‌లు మార్చాలి అంటూ జ‌ర్న‌లిస్టు నేత‌లు పోరాడారు. మ‌రి ఏళ్ల త‌ర‌బ‌డి హైద‌రాబాద్ ప్రెస్ క్ల‌బ్ లో రూపొందించిన నిబంధ‌న‌లు అర్హులైన ఎంద‌రో జ‌ర్న‌లిస్టుల‌ను అందులో స‌భ్యులుగా కాకుండా చేస్తున్నాయి. ఒక జ‌ర్న‌లిస్టు స‌భ్యుడుగా చేరాలంటే ఆ సంఘంలో ఉన్న మ‌రో ముగ్గురు ఆయ‌న‌కు అనుకూలంగా సంత‌కాలు పెట్టాలంటా... ఇదేం ప‌ద్ధ‌తి. అంటే సంతకం కోసం ప్రెస్ క్ల‌బ్ లో స‌భ్యుల ఇంటి చుట్టూ కాళ్లు అరిగేలా తిర‌గాలా? వాళ్ల‌ను బ‌తిలాడు కోవాలా? ప్ర‌భుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు(అక్రిడియేష‌న్‌) ఉన్న వారికి కూడా ఇదే దుస్థితి. అంటే ప్ర‌భుత్వ అక్రిడియేష‌న్ కార్డులు కూడా అక్క‌డ చెల్ల‌వు అన్న‌ట్లు..
తెలంగాణ రాష్ట్రం వ‌చ్చాక తెలంగాణ‌కు సంబంధించిన అర్హులైన జ‌ర్న‌లిస్టులంద‌రికీ ప్రెస్ క్ల‌బ్ లో స‌భ్య‌త్వం ఇప్పిస్తే త‌ప్పేంటి?
వీలైతే మూడేళ్లు లేదా ఐదేళ్లు జ‌ర్న‌లిస్టుగా అనుభ‌వం ఉంటే స‌రిపోతుంద‌ని నిబంధ‌న పెడితే చాల‌దా? ఆ క్ల‌బ్ లో ఉన్న రెగ్యుల‌ర్ స‌భ్యుడి సంత‌కంతో ప‌నేంటి?
ఇలాంటి నిబంధ‌న‌ల‌నే అక్రిడియేష‌న్ కార్డుల జారీలో ప్ర‌భుత్వాలు పెడితే మీరు స‌హిస్తారా?
ప్ర‌భుత్వాలు ఉచితంగా వైద్య సేవ‌లు అందించాల‌ని, జ‌ర్న‌లిస్టులు మాత్రం పైసా పెట్టొద్దు అని గొడ‌వ‌లు చేస్తారు. మ‌రి ప్రెస్ క్ల‌బ్ అప్లికేష‌న్ ఫారానికి రూ.200 వ‌సూలు చేస్తున్నారు. ఇక స‌భ్య‌త్వ రుసుం వేల‌కు వేలు వ‌సూలు చేస్తున్నారు. ఓ వైపు జీతాలు రాక ఇబ్బందులు ప‌డుతున్న‌
జ‌ర్న‌లిస్టులు ఉన్న ఈ స‌మ‌యంలో ఈ వేల రుసుంలు అవ‌స‌ర‌మా?
ప్ర‌భుత్వం నుంచి అన్నీ ఉచితంగా అందుకోవాల‌ని కొట్లాడే జ‌ర్న‌లిస్టు సంఘం నేత‌లు మాత్రం.. జ‌ర్న‌లిస్టుల నుంచి ప్రెస్ క్ల‌బ్ వేల రూపాయల‌ను వ‌సూలు చేస్తే మాత్రం మౌనంగా ఉండ‌టం స‌బ‌బా?
ఇంత వ‌సూలు చేసిన సొమ్ముతో ఏం చేస్తున్నారో దేవుడికే ఎరుక‌?
*************
ఉమ్మ‌డి రాష్ట్రంలో ఉన్న నిబంధ‌న‌ల‌ను తొల‌గించి అర్హులంద‌రికీ ప్రెస్ క్ల‌బ్ లో స‌భ్య‌త్వం ల‌భించేలా నూత‌న కార్య‌వ‌ర్గం కృషి చేయాల‌ని, చేస్తుంద‌ని ఆకాంక్షిస్తున్నా.. లేనిప‌క్షంలో పాత వారికి కొత్త వారికి తేడా ఉండ‌దు..!!
మొత్తమ్మీద గెజిటెట్ సంత‌కాలకు విలువ‌ను తీసేసిన ఈ రోజుల్లో ప్రెస్ క్ల‌బ్ సంత‌కాల‌కు మ‌హా డిమాండ్ పెరిగింది...

మోడీ గారికి ఉద్యోగుల నుంచి వ్య‌తిరేక‌త త‌ప్ప‌దేమో..

రెండో వేత‌న స‌వ‌ర‌ణ సంఘం త‌ర్వాత అతి త‌క్కువ‌గా వేత‌న పెంపును ప్ర‌తిపాదించింది ఈ క‌మిష‌నే అని కేంద్ర ఉద్యోగులు గ‌గ్గోలు పెడుతున్నారు. 
క‌మిష‌న్ ఎంత ప్ర‌తిపాదించినా చివ‌ర‌కు కేసీఆర్ మాదిరిగా మోడీ కూడా అధికంగా ఫిట్‌మెంట్ ఇస్తాడేమో అని కేంద్ర ఉద్యోగులు అనుకుంటున్నారు.
అలా జ‌రుగుతుందా? లేదా అన్న‌ది వేచిచూడాలి... పత్రిక‌లేమో బోనాంజా అంటుంటే ఉద్యోగ సంఘాలేమో ఆందోళ‌న బాట ప‌డుతుండ‌టం గ‌మ‌నార్హం. ఇదే నివేదిక‌ను మోడీ గారు య‌థాత‌థంగా అమ‌లు చేస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉద్యోగుల నుంచి ఎదురుగాలి త‌ప్ప‌దేమో..

వేత‌న స‌వ‌ర‌ణ‌ను పార్ల‌మెంట్ స‌భ్యుల‌కు అమ‌లు చేస్తే బాగుంటుంది క‌దా..

25 రూపాయ‌ల‌కు కిలో బియ్యం
97 రూపాయ‌ల‌కు కిలో ప‌ప్పు
58 రూపాయ‌ల‌కు కిలో ప‌చ్చి కూర‌గాయ‌లు
38 రూపాయ‌ల‌కు కిలో కూర‌గాయ‌లు
*********
ఈ రేట్ల ఆధారంగా 18 వేల రూపాయ‌ల‌తో చిరుద్యోగి గౌర‌వ ప్రదంగా జీవించొచ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌న స‌వ‌ర‌ణ సంఘం పేర్కొంది.. అందుకే 18 వేల క‌నీస వేత‌నాన్ని ప్ర‌తిపాదించామ‌న్నారు.
ఇంత‌కీ కిలో 25 రూపాయ‌ల‌కు ఎక్క‌డ బియ్యం ల‌భిస్తాయో? 97 రూపాల‌య‌కు కిలో కంది పప్పు ఎక్క‌డ ల‌భిస్తుందో కూడా వారు సెల‌వు ఇచ్చి ఉంటే బాగుండేదేమో..
కూరగాయ‌లు కూడా 38 రూపాయ‌ల‌కు కిలో, 58 రూపాయ‌ల‌కు కిలో ఎక్క‌డ ల‌భిస్తున్నాయో కూడా చెబితే బాగుండేది..
*************
పార్ల‌మెంట్ స‌భ్యుల‌కు, రాష్ట్రాల ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు వేత‌నాల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు పెంచుకుంటారు.. మ‌రి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు అమ‌లు చేసే వేత‌న స‌వ‌ర‌ణ‌ను పార్ల‌మెంట్ స‌భ్యుల‌కు అమ‌లు చేస్తే బాగుంటుంది క‌దా... వాళ్లు కూడా 18 వేల‌తో గౌర‌వ ప్ర‌దంగా బ‌తుకుతారేమో..!!
దీనిపై చ‌ర్చ జ‌రిగితే బాగుంటుంది...

కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల క‌న్నా తెలంగాణ ఉద్యోగుల‌కే అధిక వేత‌నాలు..

తెలంగాణ ఉద్యోగుల‌కు కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు స‌మానంగా జీతాలు ఇస్తామ‌ని కేసీఆర్ అన్నాడు.. ఇప్పుడేమో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల క‌న్నా ఎక్కువ‌గా తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ల‌భిస్తున్న‌ట్లు జాతీయ స్థాయిలో చ‌ర్చ మొద‌ల‌వుతోంది. మ‌రి తెలంగాణ ఉద్యోగుల జీతాలు త‌గ్గించి కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో స‌మానం చేస్తారా?
లేక కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు తెలంగాణ ఉద్యోగుల‌కు స‌మానంగా జీతాలు ఇవ్వాల‌ని ఆందోళ‌న బాట ప‌డ‌తారా? వేచిచూడాలి.

కావూరే మీ క‌న్నా తెలంగాణ‌కు ఎక్కువ చేశాడేమో అనిపిస్తుంది అప్పుడొప్పుడు...

జైపాల్ రెడ్డి మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసి ఉంటే తెలంగాణ వ‌చ్చేదో కాదో తెలియ‌దు కానీ కావూరికి మంత్రి ప‌ద‌వి ఇచ్చిన‌ప్పుడే తెలంగాణ ఖాయ‌మైపోయింది... ఈ విష‌యంలో మంత్రి ప‌ద‌వి స్వీక‌రించి తెలంగాణ విష‌యంలో మౌనంగా ఉన్న కావూరే మీ క‌న్నా తెలంగాణ‌కు ఎక్కువ చేశాడేమో అనిపిస్తుంది అప్పుడొప్పుడు...

ఏ దీక్ష అయితే ఏంటి తెలంగాణ కల‌ను సాకారం చేశాడు క‌దా...

కేసీఆర్ చేసింది దొంగ దీక్షో దొర దీక్షో... ఏ దీక్ష అయితే ఏంటి తెలంగాణ కల‌ను సాకారం చేశాడు క‌దా...
రామాయ‌నంలో వాలిని దొంగ దొబ్బ కొట్టిన(విశ్వ‌మాన‌వ ఆలి కోసం) రాముడు గొప్పోడు అయితే.. మీరు అనుకుంటున్నట్లు దొంగ దీక్ష‌తో తెలంగాణ క‌ల సాకారం చేసిన కేసీఆర్ కూడా గొప్పోడే అవుతాడు మ‌రి..
అస‌లు హైద‌రాబాద్ ఫ్రీ జోన్ అన్న‌ప్పుడు మీరు దీక్ష‌లు చేసి ఉండొచ్చు క‌దా...
తెలంగాణ కోసం మీరంతా ఉద్య‌మించి ఉండొచ్చు క‌దా..
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 16 మందిని కాంగ్రెస్ వైపు లాక్కున్న‌ప్పుడు అడ్డుచెప్పి ఉంటే బాగుండేది క‌దా..
తెలంగాణ కోసం 40 పార్టీల‌తో సంత‌కాలు పెట్టి ఒప్పించొచ్చు క‌దా..
తెలంగాణ‌కు అడ్డం కాదు నిలువు కాద‌ని అంటూ.. తెలంగాణ వ‌స్తే వీసా తీసుకోవాల్సి వ‌స్తుంద‌ని మీ నేత అన్న‌ప్పుడే ప‌ద‌వులు వ‌దులుకొని నిఖార్స‌యిన తెలంగాణ వాదులం అని నిరూపించుకుంటే బాగుండేది క‌దా...
*************
ఇప్పుడు ఎన్ని మొత్తుకుంటే ఏం లాభం.. అప్పుడు లేవ‌ని నోర్లు ఇప్పుడు లేసి గ‌తం త‌వ్వితే పోయేది మీ ప‌రువే.. ఎందుకంటే గ‌తాన్ని గుర్తుతెచ్చుకుంటే జ‌నాలు మిమ్మ‌ల్ని మ‌రింత‌గా మిమ్మ‌ల్ని చీద‌రించుకుంటారు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. !!

తెలంగాణ‌పై కేంద్రానికి ఎంత ఘాటు ప్రేమ‌నో...

కేంద్రానికి తెలంగాణ‌పై ఉన్న ప్రేమ‌కు మంచి నిద‌ర్శ‌నం...
తెలంగాణ‌కు 10 వేల ఇళ్ల నిర్మాణం అట‌..
ఆంధ్రాకు 1.93 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణం అట‌...
కేంద్రం ప్రేమ తెలంగాణ‌పై ఎంత ఉందో సామాన్యుడికి కూడా అర్థం కాదా?

భిన్న ధ్రువాల‌ను క‌లిపేది ఒక్క భార‌త రాజ‌కీయాలేనేమో...

భిన్న ధ్రువాల‌ను క‌లిపేది ఒక్క భార‌త రాజ‌కీయాలేనేమో...
********************
నిన్న జ‌మ్మూ కాశ్మీర్‌లో బీజేపీ-పీడీపీని క‌లిపింది.
నేడు బీహార్‌లో లాలూ-నితీశ్‌-సోనియాను క‌లిపింది.
********
రేపు ఎక్క‌డ ఎలాంటి దృశ్యాన్ని చూస్తామో..

తెలంగాణ‌కు బీహార్ పాఠాలు..

తెలంగాణ‌కు బీహార్ పాఠాలు..
********
బీహార్‌, జార్ఖండ్ విడిపోయిన త‌ర్వాత బీహార్‌లో పుట్టిన పార్టీలు బీహార్ కే ప‌రిమితం అయ్యాయి. జార్ఖండ్ లో పోటీ చేస్తున్నా అక్క‌డ ఆద‌ర‌ణ శూన్య‌మే. అలాగే జార్ఖండ్ ఆవిర్భ‌వించిన త‌ర్వాత అక్క‌డ పుట్టిన పార్టీలు దాదాపు అర డ‌జ‌న్‌కు పైగానే ఉన్నాయి.
************
మ‌రి తెలంగాణ వ‌చ్చాక మ‌న వ‌ద్ద ప‌రిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఇక్క‌డ ఒకే స్థానిక పార్టీ ఉంది. ఒక వేళ ప్ర‌జ‌లు ప్ర‌త్యామ్నాయాన్ని కోరుకోవాలంటే పొరుగు రాష్ట్రం పార్టీలు, లేక జాతీయ పార్టీలు ఉన్నాయి. వాటిని గెలిపించుకుంటే తెలంగాణ‌కు స‌మాధి క‌ట్టుకోవ‌డమే అవుతుంది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఇంటి పార్టీలు మ‌రిన్ని రావాలి. అలాగే తెలంగాణ ప్ర‌యోజ‌నాల‌కు విఘాతం క‌లిగించేలా బ‌య‌ట పార్టీలు, బ‌య‌టి నేత‌లు ప్ర‌య‌త్నించిన‌ప్పుడు ఏక‌మ‌య్యే విశాల దృక్ప‌థంతో ఈ పార్టీలు ప‌నిచేయాలి. బీహార్ పాఠాల‌ను మ‌నం నేర్చుకోవాలి. లేక‌పోతే భ‌విష్య‌త్ లో ఇబ్బందులు త‌ప్ప‌వు.
**************
ఒక‌వేళ భ‌విష్య‌త్‌లో తెలంగాణ లో స్థానిక‌ పార్టీలు పెరిగితే తెలంగాణ‌వాదుల ఓట్లు చీలి, సెటిల‌ర్ల‌ ఓట్ల‌తో తాము అంద‌లం ఎక్కొచ్చ‌ని కొన్ని శ‌క్తులు భావించొచ్చు. అలాంటి ప‌రిస్థితి వ‌చ్చే ప‌క్షం ఉంటే తెలంగాణ పార్టీలు ఏకం కావాలి. లేక బ‌ల‌హీన సెగ్మెంట్ల‌లో తెలంగాణ పార్టీల‌న్నీ ఉమ్మ‌డి అభ్య‌ర్థిని పెట్టాలి.
ఏది ఏమైనా వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి తెలంగాణ‌లో టీఆర్ఎస్‌తోపాటు మ‌రొక బ‌ల‌మైన స్థానిక ప్ర‌త్యామ్నాయ పార్టీ అవ‌స‌రం ఉంది. వీలైన‌న్ని ఎక్కువ పార్టీలుంటేనే ప్ర‌జాస్వామ్యం వ‌ర్థిల్లుతుంది. ఆ పార్టీల‌న్నీ ఇంటి(తెలంగాణ‌) పార్టీలైతే ప్ర‌జాస్వామ్య ప్ర‌క్రియ మ‌రింత ప‌రిపూర్ణం అవుతుంది.
జై తెలంగాణ‌... జై జై తెలంగాణ‌..!!

న్యాయం చ‌చ్చిపోయింది...

న్యాయం చ‌చ్చిపోయింది...
**************
ఏబీఎన్ కేసులో 500 రోజుల్లోనే సుప్రీంకోర్టు స్థాయికి వెళ్లి న్యాయాన్ని గెలిపించుకున్నాం అని సంక‌లు గుద్దుకుంటున్నారు.. ఏడాదిన్న‌ర‌లోనే న్యాయాన్ని గెలిపించుకున్నాం అంటున్నారు.. మ‌రి దాదాపు రెండుమూడేళ్లుగా(ఇంంకా ఎక్కువ రోజులుగానే కావొచ్చు) న్యాయం కోసం కోర్టు మెట్లు, పోలీసు స్టేష‌న్ మెట్లు ఎక్కిన మాజీ ఎంపీ రాజ‌య్య‌ కోడ‌లు సారిక‌కు మాత్రం ఈ న్యాయ వ్య‌వ‌స్థ‌, ఈ పోలీసు వ్య‌వ‌స్థ‌, ఈ మీడియా వ్య‌వ‌స్థ‌లు న్యాయం చేయ‌లేక‌పోయాయి... పాపం ఆమె న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కితే రేటింగ్ ల కోసం ఫోన్ ఇన్‌లు తీసుకున్న ఛానెళ్లు ఉన్నాయి. లైవ్ షోలు చేసిన ఛానెళ్లు ఉన్నాయి.. అవ‌న్నీ వాటి రేటింగ్‌ల కోసం తాత్కాలికంగా ప‌డిన ఆరాటాలే.. ఆమె అభాగ్యురాలి ప‌క్షాన ఏ ఒక్క‌రూ నిల‌బ‌డ‌లేక‌పోయారు... చుట్టు ప‌క్క‌న ఉన్న జ‌నం కూడా అయ్యో పాపం అన్నారే కానీ ఏ ఒక్క‌రూ ఆమెకు అండ‌గా నిల‌వ‌లేదు.. న్యాయం కోసం సాగించిన ఒంట‌రి పోరులో పిల్ల‌ల‌తో స‌హా బ‌లైన సారిక కేసులో ఒక్క రాజ‌య్య కుటుంబ‌మే కాకుండా స‌మాజం, న్యాయ వ్య‌వ‌స్థ‌, పోలీసు వ్య‌వ‌స్థ మొత్త‌మూ దోషులేనేమో...!!
**********
ఏబీఎన్ కేసులో గెలిచింది నిజ‌మైన న్యాయ‌మో కాదో చెప్ప‌లేను కానీ సారిక విష‌యంలో మాత్రం నిజ‌మైన న్యాయం చ‌చ్చిపోయింది.. కాదు చంపేశారు.!!

దావుద్ ఛానెల్ పెట్టినా హ‌క్కులు క‌ల్పించాలంటారండోయ్‌..

ఈ దేశంలో దూర‌ద‌ర్శ‌న్ నేష‌న‌ల్ ఛానెల్‌, స్థానిక దూర ద‌ర్శ‌న్ ఛానెల్‌, లోక్ స‌భ‌, రాజ్య స‌భ‌, కిసాన్ టీవీల‌ను ఎంఎస్‌వోలు త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌సారం చేయాలి. అది కూడా ప్రైమ్‌బ్రాండ్‌లో కొన్ని దూర‌ద‌ర్శ‌న్ ఛానెళ్ల‌ను ప్ర‌సారం చేయాల‌ని పార్ల‌మెంట్‌లో చ‌ట్టం చేశారు.. మ‌రి అస‌లు ప్ర‌సారం అవుతున్నాయో లేదో కూడా ఎవ‌రూ ప‌ట్టించుకోరు.. దీనిపై ఎవ‌రూ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌రు.. ఏ సుప్రీంకోర్టూ వీటిని సుమోటోలుగా స్వీక‌రించ‌దు.. కానీ ప్రైవేటు ఛానెల్‌ను దావూద్ ఇబ్ర‌హీం పెట్టిన‌డిపినా వాడికి హ‌క్కులు క‌ల్పించాల‌ని కొట్లాడే జ‌ర్న‌లిస్టు సంఘాలున్నాయి.. వాటికి అనుకూలంగానే అంద‌రూ తీర్పులిచ్చే దుస్థితి ఉంది... ఇదే దేశ దౌర్భాగ్యం..!!

నిషేధాల‌ను కోరుకునే వారు భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌పై ఉప‌న్య‌సిస్తే...

పుస్త‌కాల‌ను నిషేధించే వాళ్లు, సినిమాల‌ను నిషేధించే వాళ్లు, సినిమాల‌ను అడ్డుకునే వారు, ఆహార అల‌వాట్ల‌పై ఆంక్ష‌లు విధించాల‌ని కోరుకునే వాళ్లంతా నేడు భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే న‌వ్వొస్తుంది... !!

మా నియామ‌కాల‌ల్లో ప‌క్క‌వాళ్ల‌ జోక్యం రాజ్యాంగ విరుద్ధం అనేటోళ్ల నుంచి అద్భుత తీర్పులు ఆశించ‌డం అత్యాశే అవుతుంది క‌దా...

మా న్యాయ‌మూర్తుల‌ను మేమే నియ‌మించుకుంటాం... మా నియామ‌కాల‌ల్లో ప‌క్క‌వాళ్ల‌ జోక్యం రాజ్యాంగ విరుద్ధం అనేటోళ్ల నుంచి అద్భుత తీర్పులు ఆశించ‌డం అత్యాశే అవుతుంది క‌దా... ఎవ‌రి రాజ్యం వారిదాయే.. !
*********
మ‌రి వాళ్ల నియామ‌కాలు వాళ్ల ప‌రిధిలో ఉంటే ప్ర‌జ‌లు ఏ ఛానెళ్లు చూడాలో ఏ ఛానెళ్లు చూడొద్దో నిర్ణ‌యించే అధికారం ప్ర‌జాకాంక్ష‌ను గౌర‌వించే ఎంఎస్‌వోల‌కూ ఉండాల్సిందే క‌దా... !!

ఇందు మూలంగా తెలియ జేయున‌ది ఏమ‌న‌గా...

ఇందు మూలంగా తెలియ జేయున‌ది ఏమ‌న‌గా...
*******
నేనూ విరాళాలు సేక‌రిస్తున్నా...!
నా ఖాతా నెంబ‌రు రాసుకోండి.. !!
అన్ని పేద‌రిక నిర్మూల‌న‌ కోస‌మే.. పైసా తిట్టే ఒట్టు.. !!
*********
ఈ దేశంలో పేద‌రికాన్ని దూరం చేసేందుకు, పేద‌ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు నేనూ విరాళాలు సేక‌రించాల‌ని అనుకుంటున్నాను. ఈ దేశంలో పేద‌రికాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించేందుకు నాకు టీవీ ఛానెల్‌ లేదు. నేను టీవీ ఛానెల్ య‌జ‌మానిని అంత‌క‌న్నా కాదు. నా వ‌ద్ద రంగులు పూసుకుని పేద‌రికాన్ని అత్య‌ద్భుతంగా వ‌ర్ణించే అంద‌మైన యాంక‌ర్లు అస‌లే లేరండీ.. కేవ‌లం ఫేసుబుక్ మాధ్య‌మంగా విరాళాలు సేక‌ర‌ణ చేప‌ట్టాల‌నుకుంటున్నా..
ద‌యార్ద్ర హృద‌యులు, పెద్ద మ‌న‌సు ఉన్న వారు ఆ పేద‌ల క‌న్నీళ్ల‌ను దూరం చేసేందుకు నా ఖాతాలో డ‌బ్బులు వేయండి...
***********
నేను సేక‌రించి ఇచ్చే విరాళాల‌తో దేశంలో పేద‌రికం పూర్తిగా పోతుంద‌ని నేను న‌మ్మిన‌ప్పుడు, ప్ర‌భుత్వం నిజంగా పేద‌రికాన్ని తొల‌గించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని బ‌లంగా విశ్వ‌సించిన‌ప్పుడు ఈ సొమ్మును ప్ర‌భుత్వ ఖాతాలోనో లేక పేద‌ల ఖాతాలోనో వేస్తాన‌ని స‌త్య ప్ర‌మాణ‌కంగా చెబుతున్నాను.. వంద సంవ‌త్స‌రాలు, వేయి సంవ‌త్స‌రాలు అయినా స‌రే నా ఇన‌ప పెట్టెలోనో లేక బ్యాంకు ఖాతాలోనో ఈ విరాళాల సొమ్మును భ‌ద్ర‌ప‌రుస్తాను... కావాలంటే మీరు ఎన్ని విచార‌ణ‌లైనా చేయించుకోవ‌చ్చు.. !
*************
మీరంతా భారీగా విరాళాలు ఇస్తార‌ని ఆశిస్తూ... మ‌ళ్లా ఆ సొమ్ము ఎక్క‌డ‌కు పోయింద‌ని భ‌విష్య‌త్తులో అడ‌గ‌ర‌ని న‌మ్ముతూ మీ వ‌ద్ద సెల‌వు తీసుకుంటున్నాను.
- మీ ఆకాశ రామ‌న్న అలియాస్ తెలంగాణ అసాంజే!!