1

1

Wednesday 16 September 2015

నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి పార్టీ పెడితే మేలు..

నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి పార్టీ పెడితే మేలు.. 
బీజేపీలో ఉంటూ.. వేరు ఉద్య‌మ సంస్థ‌లు న‌డిపితే ఫ‌లితం శూన్య‌మే..
********
బీజేపీలో గుర్తింపు ద‌క్క‌క‌.. త‌న అస్తిత్వాన్ని కోల్పోయే స్థితితో బ‌చావో తెలంగాణ పేరిట ఉద్య‌మిస్తామ‌ని ప్ర‌క‌టించిన నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి ప్ర‌త్యేక పార్టీ పెడితే మంచిది.. టీడీపీలోని త‌న స‌న్నిహితుల‌ను, బీజేపీలోని క‌ర‌డుగ‌ట్టిన తెలంగాణ వాదుల‌ను, అలాగే టీఆర్ఎస్‌లోని అసంతృప్తి నేత‌ల‌ను క‌లుపుకుని ముందుకు వెళ్ల‌గ‌లగాలి. అలా కాకుండా యెన్నం లాంటి ఒక‌రిద్ద‌రు త‌న‌ జిల్లా నేత‌ల‌తో క‌లిసి ఎంత పోరాడినా చివ‌రికి మిగిలేది శూన్య‌మే..
మ‌రోవైపు తెలంగాణ‌ బ‌చావో నినాదం ఇప్పుడు కావాల్సింది కాదు.. 60 ఏళ్ల స‌మైక్య పాల‌న నుంచి తెలంగాణ ర‌క్షించ‌బ‌డింది.. ఇప్పుడు ఆ తెలంగాణ‌ను ముందుకు తీసుకెళ్లాలి.. అందుకే నాగం ఉద్య‌మ సంస్థ పేరు బ‌డావో తెలంగాణ అని ఉంటే బాగుండేది.. ఇందులోనూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపుతూ,, స‌ర్కారుకు నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు ఇస్తూ ముందుకు వెళ్తే అది ఆయ‌న విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచుతుంది.. కేవ‌లం విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అయితే మిగ‌త ఉద్య‌మ సంస్థ‌ల మాదిరిగా క‌నుమ‌రుగు కావాల్సిన ప‌రిస్థితి ఉంటుంది..
****
నోట్‌: ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఒక్కో పార్టీకి ఒక్కో సామాజిక వ‌ర్గానికి చెందిన‌ది అన్న రీతిలో ముద్ర ప‌డిన స‌మ‌యంలో నాగం ఉద్య‌మ సంస్థ కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఒక్క వ‌ర్గం వారితో దాన్ని న‌డిపించ‌కుండా అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని వెళ్లేలా ప్ర‌ణాళిక‌లు వేసుకోవాలి.

No comments:

Post a Comment