మొన్న ఆంధ్రాలో డీఎస్సీ పరీక్ష జరిగింది..
అందుతో తెలంగాణ నుంచి ఆంధ్రాకు కోడలుగా వెళ్లిన వారిని అనర్హులను చేశారు..
టెట్‌లో మొదటి స్థానంలో నిలిచిన ఖమ్మం వనిత నెల్లూరు వాసిని పెళ్లాడింది.. ఆమె డీఎస్సీ రాయలేకపోయింది..
దీనిపై ఏ ఒక్కడూ నోరు తెరవలేదు..
చివరకు హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రా యువతీ, యువకులను కూడా పరీక్షలో అనర్హులను చేశారు..
పాపం పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలుకు చెందిన ఒకాయన కుమార్తె హైదరాబాద్‌లో 6 నుంచి 10వ తరగతి చదివింది..
ఆమె డీఎస్సీకి అప్లయి చేస్తే దరఖాస్తును తోసి పుచ్చారు.. చివరకు హైకోర్టు ద్వారా పరీక్షకు అనుమతి ఇప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిండి..
ఆయన మొన్న ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నాడు... ప్రత్యేక హోదాతోనైనా ఉద్యోగాలు వస్తాయనుకున్నాను.. అదీ రాలేదు.. దానికి తోడు తన కుమార్తె వ్యవహారంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు...
ఆంధ్రాకు కోడలుగా వెళ్లిన తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇవ్వకపోయారు.. మేం అడగం కూడా.. కానీ మీ ప్రాంతానికి చెందిన వారికి మాత్రం అన్యాయం చేయొద్దు బాబు గారూ...!!
No comments:
Post a Comment