1

1

Tuesday 22 September 2015

ఓరుగ‌ల్లులో బై ఎల‌క్ష‌న్ ను త‌ల‌పిస్తున్న ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌లు

ఓరుగ‌ల్లులో బై ఎల‌క్ష‌న్ ను త‌ల‌పిస్తున్న ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌లు
స్విమ్మింగ్ ఫూల్ క‌ట్టిస్తార‌ట‌... జిమ్ పెట్టిస్తార‌ట‌... ఇంకేదో చేస్తార‌ట‌...
***********
ఓరుగ‌ల్లు లో పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతోందా? అన్న రీతిలో ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.. గ‌త నెల రోజుల‌ ప్ర‌చార ప‌ర్వం ముగిసి నేడు అక్క‌డ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.. ప‌ట్టు నిలుపుకోవ‌డం కోసం ఓ వ‌ర్గం... పూర్వ వైభ‌వం కోసం మ‌రో వ‌ర్గం హోరా హోరీ ప్ర‌చారాన్ని చేశాయి. విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు, విందు రాజ‌కీయాలు, వ‌ల‌స‌లు, ఆప‌రేష‌న్ ఆక‌ర్ష‌లు, స్టార్ క్యాంపెన‌ర్లను ర‌ప్పించి(ఇత‌ర జిల్లాల‌కు చెందిన సంఘం నేత‌లు) ప్ర‌చారానికి పూనుకున్నాయి. నిన్న ఒక కూట‌మిలో ఉన్న జ‌ర్న‌లిస్టు నేడు మ‌రో కూట‌మిలో చేర‌డంలాంటి ఎన్నో వింత‌లు విశేషాల‌కు వ‌రంగ‌ల్ వేదికైంది.
***************
ఒక‌డు స్విమ్మింగ్ ఫూల్ క‌ట్టిస్తానంటే.. ఇంకొక‌డు జిమ్ పెట్టిస్తానంటూ హామీలు... ఇంకా న‌యం తెలంగాణ స‌ర్కారుతో మాట్లాడి ప్రెస్ క్ల‌బ్‌లో వైన్ షాప్ లైసెన్సును తెప్పిస్తాన‌ని ఎవ‌డూ బ‌హిరంగ హామీ ఇవ్వ‌లేదు.(లోలోపల ఇచ్చినా ఆశ్చ‌ర్యం లేదు). అస‌లు ప్రెస్ క్ల‌బ్‌లో ఈ లైబ్ర‌రీ పెడ‌తాం (అంత‌ర్జాతీయంగా పాత్రికేయ రంగానికి పేరు తెచ్చిన ప్ర‌ముఖులు జీవిత చ‌రిత్ర‌లు, ఇత‌ర పుస్త‌కాల‌ను అందుబాటులో ఉంచొచ్చు క‌దా..).. ప్రెస్ క్ల‌బ్‌లో స‌భ్యుడైన వారికి కంప్యూట‌ర్ శిక్ష‌ణ ఇచ్చేలా కంప్యూట‌ర్ ల్యాబ‌రేట‌రీని ఏర్పాటు చేస్తామ‌నో హామీలు ఇవ్వొచ్చు క‌దా..
****************
మ‌రి ప్ర‌జ‌ల కోసం వార్త‌లు రాసే పాత్రికేయుల ఎన్నిక‌ల‌కు ఇంత ఆర్భాటం అవ‌స‌ర‌మా? అంటే.. మేమేం త‌క్కువ తిన్నాం రాజ‌కీయ నాయ‌కుల‌కు అంటున్నారు కొంద‌రు జ‌ర్న‌లిస్టులు . రాజ‌కీయ నాయ‌కులు ఇసుక దందాలు చేస్తున్నారు.. మేమూ చేస్తున్నాం.. రాజ‌కీయ నాయ‌కులు పైర‌వీలు చేస్తున్నారు.. వారికి ధీటుగా మేమూ పైర‌వీలు చేస్తున్నాం.. వారి క‌న్నా మా పైర‌వీల‌కే విలువెక్కువ అంటూ గ‌ర్వంగా చెబుతున్నారు.. ఎస్సైల బ‌దిలీల్లోనూ మా మాట‌ల‌కు విలువ‌లు ఉంటున్నాయి.. రియ‌ల్ దందాల్లోనూ మా సెటిల్ మెంట్లే ఫైన‌ల్‌...మా పేర్లు లేని మ‌ద్యం సిండికేటును చూశారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు..
క‌నీసం రాజ‌కీయ నాయ‌కుల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు బంద్ చేసిన ఉదంతాలు లేవు కానీ.. మాకు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు బంద్‌లు చేసే ప‌రిస్థితి వ‌చ్చిందంటే అదంతా మా ప‌లుకుబ‌డే విర్ర‌వీగుతున్నారు..
ఇంత చేసి ఎవ‌రైనా గెలిస్తే వాళ్లు నిజంగా జ‌ర్న‌లిస్టుల సంక్షేమానికి కృషి చేస్తారా? అని ప్ర‌శ్నించుకుంటే అది స‌మాధానం లేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోతుంది.
***********
నోట్ : మొన్న ఎన్ కౌంట‌ర్ వ‌రంగ‌ల్ లో జ‌రిగితే.. పెద్ద త‌ల‌కాయ‌లు(పెద్ద రిపోర్ట‌ర్లు) ప్రెస్ క్ల‌బ్ ప్ర‌చార హోరులో మునిగిపోయి చిన్న త‌ల‌కాయ‌ల‌ను (చిన్న రిపోర్ట‌ర్ల‌ను) పంపించడం మ‌రో విశేషం.. మాములుగా తెలంగాణ లో జ‌రిగిన తొలి ఎన్ కౌంట‌ర్ అంటే అది సంచ‌ల‌నం.
దానిపై క‌న్నా ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌ల‌పైనే ఎక్కువ దృష్టి సారించిన ఈ పెద్ద మ‌నుషులంతా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తేవ‌డం మాట‌
అటు ఉంచితే ఎన్నుకున్న జ‌ర్న‌లిస్టుల‌కైనా న్యాయం చేస్తార‌న్న న‌మ్మ‌క‌మైతే నాకు లేదు..
***********
నోట్ : నిజాయ‌తీగా ప‌నిచేసే ఆ కొంద‌రు జ‌ర్న‌లిస్టులంద‌రికీ నేను సెల్యూట్ చేస్తా.. మిగ‌తా వారికి మాత్ర‌మే ఈ వ్యాసం అంకితం..
****
పొట్ట కూటి కోసం పెన్ను ప‌ట్టుకోవ‌డం గ‌తంలో ముచ్చ‌ట‌.. పైర‌వీ కోసం పెన్నులు ప‌ట్టుకుని పాత్రికేయులు కావ‌డం నేటి ముచ్చ‌ట‌..

No comments:

Post a Comment