వారంలో ఒక రోజు మన కార్లను వినియోగించడం మానేస్తే ఎంత బాగుంటుంది. రహదారులపై రద్దీ తగ్గుతుంది. కాలుష్యం తగ్గుతుంది. కొంత కష్టమైనా ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఈ ఆలోచనతో ఐటీ కారిడార్‌లో చేపడుతున్న కార్ ఫ్రీ థర్స్ డే కార్యక్రమానికి నా సంపూర్ణ మద్దతు. ఐటీ ఉద్యోగులు దాదాపు 50000 కార్లను వినియోగిస్తున్నట్లు అంచనా వేశారు. ఈ లెక్కన ఒక్క రోజు వీళ్లంతా కార్లను వినియోగించకుంటే ఎంత బాగుంటుంది. అయితే ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ మొత్తం వర్తింపజేయాలి. ప్రజలంతా ప్రతీ వారం స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాన్ని కొనసాగించాలి... జై తెలంగాణ, జై జై తెలంగాణ...
No comments:
Post a Comment