1

1

Wednesday 16 September 2015

తెలంగాణ‌లో త‌యార‌య్యే వ‌స్తువుల‌పై ఏపీ పేరు...

మొన్న క‌రాచీ బేక‌రీ బిస్కెట్ డ‌బ్బా కొన్నాను.. అయితే అందులో అవి త‌యారైన ప్రాంతం పేరు డ‌బ్బా మీద రాశారు.. చ‌దివితే ఏదో రంగారెడ్డి(ఏపీ) అని ఉంది.. ఇంకా ఏపీ ఎందిరా? టీఎస్ అని పెట్టాలి క‌దా..! మ‌రి అంత‌ర్జాతీయంగా గుర్తింపు ఉన్న క‌రాచీ బేక‌రీ డ‌బ్బా మీద ఇంకా ఏపీ పేరే ఎందుకు ఉంటోంది...? ఇలా ఇంకెన్ని వ‌స్తువుల‌పై ఇలా ఉంటుందో అర్థం కావ‌డం లేదు..
*********
ఇక నిన్న కింగ్ ఫిష‌ర్ నీళ్ల బాటిల్ కొనుగోలు చేశాను.. అందులో ప‌టాను చెరు మండ‌లం రామ‌చంద్రాపురం(ఏపీ) అని ఉంది...
ఇదెక్క‌డి క‌థ‌... రాష్ట్రం విడిపోయినా ఈ ఏపీ పేరు మ‌న ప్రాంతంలో ఉత్ప‌త్తి అవుతున్న తిను ప‌దార్థాల డ‌బ్బాల నుంచి ఎందుకు పోవ‌డం లేదు..
దీనిపై స‌ర్కారు కొంచెం దృష్టి పెట్టాలి...!!
మేడిన్ తెలంగాణ వ‌స్తువులు అయిన‌ప్ప‌టికీ ఏపీ అన్న‌ది ఎందుకు ఉంటుందో కొంచెం న‌జ‌ర్ పెడితే బాగుంటుంది..

No comments:

Post a Comment