1

1

Wednesday 16 September 2015

తెలంగాణ ఉద్యోగాల‌కు స‌న్న‌ద్ధం అవుతున్న సీమాంధ్ర అభ్య‌ర్థులు.. తెలంగాణ చ‌రిత్రను తెలుసుకుంటున్న వైనం..

తెలంగాణ ఉద్యోగాల‌కు స‌న్న‌ద్ధం అవుతున్న సీమాంధ్ర అభ్య‌ర్థులు..
తెలంగాణ చ‌రిత్రను తెలుసుకుంటున్న వైనం..
మెరిట్ పోస్టులు కొట్టుకుపోతామ‌ని ధీమా..!!
సింగ‌రేణిలో ఒక కొలువు కొట్టేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసి..
*******************
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ నోటిఫికేష‌న్లు వ‌స్తాయో రావో తెలియ‌క‌... తెలంగాణ‌లో రాబోయే నోటిఫికేష‌న్ల‌లో ఎలాగైన ఉద్యోగాలు పొందాల‌ని సీమాంధ్ర అభ్య‌ర్థులు గంపెడాశ‌ల‌తో ఉన్నారు... సీరియ‌స్‌గా స‌న్న‌ద్ధం అవుతున్నారు.. మా రాష్ట్రంలో మీరెలా ఉద్యోగాలు పొందుతార‌ని ఓ మిత్రుడిని ప్ర‌శ్నిస్తే.. సెల‌బ‌స్‌లో కొన్ని మార్పులు త‌ప్ప భాషాప‌ర‌మైన స‌మ‌స్య‌లు లేవు క‌దా.. ఎలాగూ మెరిట్ తెచ్చుకుంటే నాన్ లోక‌ల్ కోటా కింద 15-20 శాతం ఉద్యోగాల‌కు ఇత‌ర రాష్ట్రాల వారు పోటీ ప‌డొచ్చు అని స‌మాధానం ఇచ్చాడు.. అంటే 25 వేల పోస్టుల‌లో 20 శాతం అంటే దాదాపు 5 వేల పోస్టులు ఓపెన్‌లో ఉంటాయ‌న్న మాట‌.. ఇదే నిజ‌మైతే తెలంగాణ అభ్య‌ర్థులు మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డాలి.. ప్ర‌తీ పోస్టును మ‌న‌మే ద‌క్కించుకోవాలి..
***********************
ఓపెన్ కోటా పోస్టులు కూడా ఇత‌ర రాష్ట్రాల వారు త‌న్నుకుపోకుండా జాగ్ర‌త్త ప‌డాలి... స్థానిక‌త ధ్రువ‌ప్ర‌తాలు, ఇత‌ర‌త్రా అన్ని అంశాల్లోనూ టీపీఎస్సీ, తెలంగాణ స‌ర్కారు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఆంధ్రాలో డీఎస్సీలో తెలంగాణ వారికి క‌నీసం అవ‌కాశ‌మే ఇవ్వ‌లేదు.. మ‌రి మ‌న వ‌ద్ద అలాంటి నిబంధ‌న‌లు రూపొందిస్తే మేలేమో..!!
మొన్న సింగ‌రేణిలో 6 వేల ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం, ప‌రీక్ష‌లు అన్ని జ‌రిగిపోయాయి. కొన్ని పోస్టుల నియామ‌కాలు కొన‌సాగుతున్నాయి. అయితే 15 ఉద్యోగాలు ఉన్న పోస్టుకు జ‌రిగిన నియామ‌కాల్లో ఎంపికైన అభ్య‌ర్థుల్లో ఒక‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసి కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. మిగిలిన పోస్టుల్లో ఎంత మంది ఉన్నారో చూడ‌లేదు..
*************************
నోట్‌: విచిత్రం ఏంటో కానీ మ‌న అభ్య‌ర్థులు క‌నీసం ఎప్పుడు కూడా పొరుగు రాష్ట్రాల ప‌రీక్ష‌ల కోసం స‌న్న‌ద్ధం కూడా కారు.. తెలంగాణ త‌ప్ప దేశంలో ప‌డుతున్న ఇత‌ర నోటిఫికేష‌న్ల ధ్యాసే ఉండ‌దు.. ఈ ధోర‌ణి ఎప్పుడు మారుతుందో ఏమో.. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌, యూపీఎస్సీ నోటిఫికేష‌న్లు ప్ర‌తీ నెల‌లోనూ ఉంటాయి.. సీరియ‌స్‌గా ప్రిపేర్ అయితే కేంద్ర కొలువులో లేక కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో లేక రైల్వేలు, బ్యాంకుల్లో కొలువులు కొట్టేయవ‌చ్చు. ఆ దిశ‌గా తెలంగాణ యువ‌త ఆలోచించాలి. తెలంగాణ స‌ర్కారు ఉచితంగా కోచింగ్ కేంద్రాల‌ను న‌డ‌పాలి.

No comments:

Post a Comment