1

1

Wednesday 16 September 2015

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు...తెలంగాణ మ‌హ‌నీయుల చ‌రిత్ర‌ను మీ పుస్త‌కాల్లో నుంచి తొల‌గించినందుకు..




 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు...
మొన్న‌నే ప్ర‌భుత్వం ఆంధ్రా పాఠ్య పుస్త‌కాల్లో ఉన్న తెలంగాణ చ‌రిత్ర‌, మ‌హ‌నీయుల పాఠాల‌ను తొల‌గించిన‌ట్లు స‌ర్క్యుల‌ర్ ఇచ్చింది... ఇది ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం.
**********
హైద‌రాబాద్ విమోచ‌న ఉద్య‌మం, నిజాం వ్య‌తిరేక ఉద్య‌మం స్థానికేత‌ర అంశం కాబ‌ట్టి తొల‌గించండి...
స‌మ్మ‌క్క , సారక్క చ‌రిత్ర ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంస్కృతిని ప్ర‌తిబింబించ‌దు కాబ‌ట్టి బోధించొద్దు..
సింగ‌రేణి తో మ‌న‌కు సంబంధం లేదు కాబ‌ట్టి దాన్ని పాఠంగా బోధించొద్దు..
గుసౌడీ స్థానికేత‌ర అంశం కాబ‌ట్టి తొల‌గించాం..
మిద్దె రాములు, కాపు రాజ‌య్య‌లు మన ప్రాంతానికి చెందిన వారు కాబ‌ట్టి వారి పాఠాలు బోధించొద్దు..
విద్యార్థుల స్థాయి క‌న్నా త‌క్కువ స్థాయిలో ఉండే హైద‌రాబాద్ న‌గ‌ర వ‌ర్ణ‌న తొల‌గించండి..
హైద‌రాబాద్‌లో బ‌జార్ల పాఠాలు అవ‌స‌రం లేదు... అది తెలంగాణ సంస్కృతిని ప్ర‌తిబింబిస్తుంది కాబ‌ట్టి తొల‌గిస్తున్నాం...
************
ఏది ఏమైతేనేం... మొత్తానికి హైద‌రాబాద్ మీది కాద‌ని అంగీక‌రించారు.. స‌మ్మ‌క్క సార‌క్క‌ల‌తో మీకు సంబంధం లేద‌ని, కాపు రాజ‌య్య‌ల‌తో ప‌నిలేద‌ని వారి చ‌రిత్ర‌ను బోధించొద్ద‌న్న నిర్ణ‌యం మంచిదే...
******
ఇదే త‌ర‌హాలో హైద‌రాబాద్ న‌డిబొడ్డున తెలంగాణ‌కు సంబంధం లేని వ్య‌క్తుల విగ్ర‌హాలు ఎందుకు ఉంచాలి? తెలంగాణ‌కు సంబంధం లేని పేర్ల‌ను హైద‌రాబాద్‌లో ఎందుకు పెట్టాలి... వీలైనంత త్వ‌ర‌గా వాటిని మీ ప్రాంతానికి తీసుకెళ్తార‌ని ఆశిస్తున్నాం..
మా మ‌హ‌నీయుల కోసం మా హైద‌రాబాద్‌లో ఉన్న మీ విగ్ర‌హాల‌ను ఇలాగే వెన‌క్కి తీసుకెళ్తే ఎంతో అనందిస్తాం...వీలైతే దారి ఖ‌ర్చు ఇస్తాం.. త్వ‌ర‌గా తీసుకెళ్లండి బాబూ... మీ విగ్ర‌హాలు, మీ సంస్కృతి మాకు వ‌ద్దే వ‌ద్దే...!!
***
నోట్ : వారు స్పందించ‌ని ప‌క్షంలో తెలంగాణ స‌ర్కారే స్పందించాల‌ని విజ్ఞ‌ప్తి.. ఇక‌పై మీడియా కూడా మాకు సంబంధం లేని ఆంధ్రా మ‌హ‌నీయుల గురించి ఇక్క‌డ వార్త‌లుగా చూపితే స‌హించ‌కూడ‌దు...

No comments:

Post a Comment