1

1

Wednesday 16 September 2015

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో బ‌యోమెట్రిక్ హాజ‌రు ప‌ట్టిక‌ను పెట్టాలి..

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో బ‌యోమెట్రిక్ హాజ‌రు ప‌ట్టిక‌ను పెట్టాలి..
ఉద్యోగులు స‌మ‌య పాల‌న పాటించ‌కుంటే జీతాల్లో కోత‌లు పెట్టాలి..
********************
వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సుల ప్ర‌కారం జీతాలు పెంచాల‌ని డిమాండ్ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగులు మ‌రి.. నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌మ‌య‌పాల‌న పాటించాల‌ని తెలియ‌దా?
60 శాతం మంది ఆఫీసుల‌కు ఆల‌స్యంగా రావ‌డం, ముందుగా వెళ్తున్నారు.. ఇక వ‌చ్చిన వాళ్లు స‌రిగా ప‌నిచేయ‌డం లేదు...
ఇలాంటి వాటిని అరిక‌ట్టాలి... ఉద్యోగులు జీతాల పెంపు ఎలాగైతే త‌మ హ‌క్కు అని కొట్లాడారో.. అలాగే స‌రిగా ప‌నిచేయ‌డ‌మూ వారి బాధ్య‌త అన్న విష‌యాన్ని విస్మ‌రించ‌రాదు...
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తీ ప్ర‌భుత్వ కార్యాల‌యంలోనూ బ‌యో మెట్రిక్ హాజ‌రు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాలి.. ఆధార్‌తో అనుసంధానం చేయాలి... ఆల‌స్యంగా వ‌చ్చే ఉద్యోగుల వేత‌నాల్లో కోత విధించాలి... ఉద్యోగ సంఘాలు వ్య‌తిరేకించినా స‌రే ఈ మార్పు దిశ‌గా అడుగులు ప‌డాల్సిందే.. లేక‌పోతే తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో విఘాత‌కులుగానే మారుతారు... !

No comments:

Post a Comment