1

1

Wednesday, 16 September 2015

శెభాష్ తెలంగాణ‌.. పుష్క‌రాల ఘ‌న నిర్వ‌హ‌ణ‌ స‌మ‌ష్టి విజ‌యం..

శెభాష్ తెలంగాణ‌..
పుష్క‌రాల ఘ‌న నిర్వ‌హ‌ణ‌ స‌మ‌ష్టి విజ‌యం..
ఇదే స్ఫూర్తిని భ‌విష్య‌త్‌లోనూ కొన‌సాగించాల‌ని ఆకాంక్ష‌..
***
పుష్క‌రాల సంద‌ర్భంగా తెలంగాణ స‌మాజం తీరు అద్భుతంగా ఉంది.. ఒక్క ముఖ్య‌మంత్రిని పొగ‌డ‌టం క‌న్నా మొత్తం తెలంగాణ స‌మాజాన్ని కూడా అభినందించాల్సిందే.. ప్ర‌తీ ఒక్క‌రూ ఎంతో విజ్ఞ‌త‌తో, స‌హ‌నంతో ఇది మ‌న తెలంగాణ‌, ఇవి మ‌న పుష్క‌రాలు, వీటిని ఎలాగైన విజ‌య‌వంతంగా నిర్వ‌హించుకోవాల‌న్న ఆరాటంతో త‌మ‌వంతు పాత్ర పోషించారు., పోలీసులు, పంచాయ‌తీ రాజ్ సిబ్బంది, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది, నీటిపారుద‌ల శాఖ అధికారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, గ్రామీణ యువ‌కులు, పాఠ‌శాల విద్యార్థులు, మంత్రులు, ప్ర‌జ‌లంద‌రూ స‌మ‌ష్ఠిగా పుష్క‌రాల‌ను విజ‌య‌వంతం చేశారు.. వీళ్లంద‌రికీ శ‌త‌కోటి వంద‌నాలు.. ఇలాంటి ఐక్య‌త‌ను, అంకిత‌భావాన్ని మున్ముందు మ‌రింత‌గా ప్ర‌ద‌ర్శించాలి.. అన్ని సంద‌ర్భాల్లోనూ తెలంగాణ స‌మాజం ఏక‌తాటిపై నిల‌వాలి.. ఈ ప‌న్నెండు రోజుల పుష్క‌రాల‌ను విజ‌య‌వంతం చేయడానికి, ఏర్ప‌ట్ల కోసం శ్ర‌మించిన ప్ర‌తీ ఒక్క‌రికీ పేరు పేరునా కృతజ్ఞ‌తాభినంద‌న‌లు... తెలంగాణ జ‌నాభా 4 కోట్లే. కానీ పుష్క‌రాల‌కు దాదాపు 6 కోట్ల మంది(రేప‌టితో క‌లిపితే) రావ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే.. వాళ్ల‌కు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన మాట వాస్త‌వ‌మే కానీ.. త‌క్కువ స‌మ‌యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌నిచేసిన ప్ర‌తీ ఒక్క‌రినీ ప్ర‌భుత్వం గుర్తించాలి..
************
పుష్క‌రాల్లో సేవ‌లు అందించిన వారికి ముఖ్య‌మంత్రి త‌ర‌ఫున ప్ర‌శంసా ప‌త్రాల‌ను అందిస్తే బాగుంటుంది..
ఇది వేల మంది వ‌లంటీర్ల‌కు, ఇత‌ర స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు, ఊరిలోని సంఘాల‌కు పంపించాలి... ఇది ఒక జ్ఞాపిక‌గా మిగులుతుంది.. ప్ర‌జ‌లు డ‌బ్బు క‌న్నా ప్ర‌శంసా ప‌త్రాల‌కు ఎక్కువ విలువ ఇస్తారు.. తెలంగాణ ప్ర‌భుత్వం జిల్లా స్థాయిలో క‌లెక్ట‌ర్ పేరు మీదైనా లేక దేవాదాయ శాఖ త‌ర‌ఫునో లేక సీఎం కార్యాల‌యం నుంచైనా స‌రే ఈ ప్ర‌శంసా ప‌త్రాల‌ను అందించాల‌ని విజ్ఞ‌ప్తి...!
పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవ‌ల‌ను మ‌రువ‌లేం.. వారికి పాదాభివంద‌నం చేసినా త‌క్కువే.. !!
పుష్క‌రాల సంద‌ర్భంగా తెలంగాణ‌కు వ‌చ్చి అసౌక‌ర్యానికి ఎవ‌రైనా గురై ఉంటే వారు పెద్ద మ‌న‌సుతో మ‌మ్మ‌ల్ని క్ష‌మించాలి..
భ‌విష్య‌త్‌లో మ‌రింత ఘ‌న‌మైన ఆతిథ్యాన్ని ఇస్తామ‌న్న భ‌రోసాను ఇస్తున్నాం..
జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌..

No comments:

Post a Comment