సుల్తాన్ బజార్ మీదుగా వెళ్తున్న మెట్రో రైలు మార్గం మార్చమని గతంలో వ్యాపారులు అన్ని పార్టీలను కోరారు. సుల్తాన్ బజార్ బంద్‌ను వారం రోజుల పాటు విజయవంతంగా చేశారు.. అన్ని పార్టీల నేతలు(బాబు, కిషన్‌రెడ్డి, కేసీఆర్) వ్యాపారులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు..తీరా అలైన్‌మెంట్ మార్చడానికి సర్కారు దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకున్నప్పుడు మెట్రోపై కేసీఆర్ నాటకాలు ఆడుతున్నాడంటూ పచ్చ పత్రికల్లో వార్తలు రావడం, దానికి తగినట్లు పార్టీలు విమర్శలు చేయడం.. ఇవన్నీ మళ్లా పత్రికల్లో పతాక శీర్షికల్లో రావడం జరిగింది.. మరి సుల్తాన్ బజార్‌ను నమ్ముకున్న వేల మంది వ్యాపారుల ప్రయోజనాలను, అంతకన్న విలువైన చరిత్రక సంపదను కాపాడుతూ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ కు వ్యాపారులు అభినందలు తెలుపుతూ ఈ రోజు భారీ ర్యాలీ తీశారు.. మరి జిల్లా పేజీల్లో వేస్తాయేమో పచ్చ పత్రికలు.. వీళ్లంతా టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మాత్రం కాదు.. ఓటు బ్యాంక్ కోసమే అన్నీ చేయరు.. తెలంగాణలో చరిత్రాత్మక కట్టడాల పరిరక్షణ అనేది అత్యంత కీలకం.. ఇదే ప్రతి పార్టీ లక్ష్యం కావాలి.. చరిత్రను నాశనం చేసి భవిష్యత్తు తరాలకు అప్పగిస్తే వాళ్లు మనల్ని క్షమించబోరు....ఎవరైనా సరే(కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు) చరిత్రకు సంపదకు వీలైనంత వరకు నష్టం కలగకుండా అభివృద్ధి పనులు చేపట్టాలని విజ్ఞప్తి.. !!!
No comments:
Post a Comment