1

1

Thursday 4 December 2014

మ‌న తెలంగాణ యువ కెర‌టాల‌ను స‌న్మానించుకోవాలి..


తెలంగాణ ప్ర‌భుత్వానికి, సీఎం కేసీఆర్‌కు విజ్ఞ‌ప్తి..
------------------------------------
మ‌న తెలంగాణ యువ కెర‌టాల‌ను స‌న్మానించుకోవాలి..
ఏటా వివేకుడి జ‌యంతి రోజునో.. లేదా జ‌య‌శంక‌ర్ జయంతి రోజునో ఈ కార్య‌క్ర‌మం జ‌రుపుకోవాలి..
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వారి నుంచి సూచ‌న‌లు, స‌ల‌హాలు స్వీక‌రించేందుకు ప్ర‌త్యేక ఇంట‌రాక్టివ్ వెబ్‌సైట్ ఉండాలి..
----------------------------------
ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కావాలంటే ఇంగ్లిష్ రావాలి.. తెలంగాణ వారికి ఇంగ్లిషే స‌రిగా రాదు.. కాంపిటీష‌న్ ప్ర‌పంచంలో మాతో నెట్టుకురాలేకే తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను పైకి తెచ్చారంటూ చాలా మాట‌లు అన్నారు.. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కు క్రీడ‌లు, చ‌దువులు, ఆద‌ర్శ గ్రామాలు, మామ్ ప్ర‌యోగం విజ‌య‌వంతం త‌దిత‌ర అంశాలపై వార్త‌లు విన్న‌ప్పుడు ఆయా రంగల్లో తెలంగాణ తేజాల ప్ర‌తిభ‌ను మ‌నం చూస్తున్నాం.. క్రీడ‌ల్లో సైనా, సానియా, శ్రీ‌కాంత్‌, సింధు, ఇంకా క‌రాటేలో ఫ‌ల‌క్‌(పేరు స‌రిగా గుర్తులేదు), ఇక గూగుల్‌లో, సిస్కోలో ఉద్యోగాల‌ను తెలంగాణ యువ‌త కైవ‌సం చేసుకోవ‌డం, ఇక మామ్ ప్ర‌యోగంలో పాలుపంచుకున్న శాస్త్ర‌వేత్త‌ల్లో సిద్దిపేటకు చెందిన వ్య‌క్తి ఉన్న‌ట్లు వార్త‌ల్లో రావ‌డం.. మోడీ సంస‌ద్ ఆద‌ర్శ గ్రామ యోజ‌న‌ను ప్రారంభించే స‌మ‌యంలో వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన గంగ‌దేవ‌ప‌ల్లిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచించ‌డం జ‌రిగింది.. ఇంకా అనేక విష‌యాలు తెలంగాణ ప్ర‌తిష్ఠ‌ను పెంచాయి.. ఇవ‌న్నీ గ‌త ఆరు నెల‌ల్లో మ‌నం చూస్తునే ఉన్నాం.. ఇవి చూసిన‌ప్పుడ‌ల్లా.. కాంపిటేష‌న్ ప్ర‌పంచంలో తెలంగాణ ప‌ల్లెలు, యువ‌త రాణిస్తున్నార‌న్న ధీమా క‌లుగుతోంది.. గ‌తంలో మ‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన వాళ్లు ఈ తెలంగాణ తేజాల ప్ర‌తిభ‌ను చూసైనా ఇప్పుడు ప‌శ్చాత్తాపం చెందుతార‌ని ఆశిస్తున్నాను..
--------------------------------------
అయితే తెలంగాణ స‌ర్కారుకు విజ్ఞ‌ప్తి.. తెలంగాణ కీర్తి ప‌తాక‌న అంత‌ర్జాతీయ స్థాయిలో రెప‌రెప‌లాడించి క్రీడాకారుల‌ను ఆదుకుంటున్నారు.. ఇది మంచిదే.. అయితే శాస్త్ర‌, సాంకేతిక‌, ఇత‌ర రంగాల్లోనూ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న తెలంగాణ యువ కెర‌టాల‌నూ స‌న్మానించాలి..ఏదో పేప‌ర్లో వార్త‌లు రావ‌డం.. అది చూసి మురిసిపోవ‌డంతో స‌రిపుచ్చొద్దు..
పౌర స‌న్మానాలు రాజకీయాల్లో ఉన్న‌త స్థాయిలోకి చేరిన వారికి చేస్తున్నారు. అయితే ఈ తెలంగాణ యువ‌ కెర‌టాల‌కు ప్ర‌తిభా పుర‌స్కారాలు ఇచ్చి స‌న్మానించాలి.. వాళ్ల త‌ల్లిదండ్రుల‌నూ స‌న్మానించాలి.. వీలైతే వీళ్లంద‌రి జాబితా రూపొందించి వివేక‌నంద జ‌యంతి రోజున భారీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి తెలంగాణ యువ తేజాల‌ను ఏటా స‌న్మానించ‌డం చేయాలి.. ఇది ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌, తెలంగాణ స‌మాజం త‌ర‌ఫున జ‌రిగే స‌న్మానంగా ఉండాలి.. ఇది తెలంగాణ యువ‌త‌లో స్ఫూర్తిని, ఐక్య‌తా భావ‌న‌ను నింపుతుంది..
ఇప్పుడు ప్ర‌పంచంలో పేరున్న సంస్థ‌ల్లో కొలువు తీరిన ఈ యువ తెలంగాణ కెర‌టాలే రేప‌టి బంగారు తెలంగాణ‌లో ఓ ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తో, ఇంకొక‌రి మాదిరిగానో త‌యారు కావొచ్చు... ఇక్క‌డే ప‌రిశ్ర‌మ పెట్టి యువ‌త‌కు ఉపాధి చూపవ‌చ్చు..
------------------------
ఇలాంటి అత్యుత్త‌మ మాన‌వ వ‌న‌రులైన‌ యువ‌త స‌ల‌హాలు ప్ర‌భుత్వం స్వీక‌రించాలి.. ఇక ప్ర‌పంచంలో అనేక దేశాలు, మ‌న దేశంలోని అనేక‌
రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ప్ర‌జ‌లు వారు నివ‌సిస్తున్న ప్రాంతాల్లో ఉన్న మంచిని.. తెలంగాణ‌లోనూ ఆ ప‌ద్ధ‌తులు కొన‌సాగితే బాగుంటుంద‌ని
భావిస్తే వెంట‌నే ప్ర‌భుత్వానికి చెప్పుకునేందుకు వీలుగా ఇంట‌రాక్టివ్ వెబ్‌సైట్ ఉండాలి.. ఈ సూచ‌న‌ల్లో ఆచ‌ర‌ణ సాధ్య‌మైన‌వాటిని తెలంగాణ‌లో
అమ‌లు చేయాలి.. బంగారు తెలంగాణ సాధ‌న‌లో పాలుపంచుకునే అవ‌కాశాన్ని ఖండాంత‌రాల్లో ఉన్న తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ ఇవ్వాలి..
ఇదే నా విజ్ఞ‌ప్తి.. జై తెలంగాణ‌..

No comments:

Post a Comment