1

1

Monday, 22 December 2014

*రాజ‌* పుండుకు ఏరియ‌ల్ స‌ర్వేతో మందా?



తెలంగాణ‌వాదులు ఏ చిత్రాన్ని చూడొద్ద‌నుకున్నారో్.... ఎవ‌రి నోటి నుంచి ఏ మాట వినొద్ద‌నుకున్నారో.... అదే జ‌రిగింది. తెలంగాణ ద్రోహి, రాష్ట్ర ఏర్పాటుకు అడుగ‌డుగునా మోకాల‌డ్డ‌టంతో పాటు శాయ‌శ‌క్తులా త‌న అర్ధ‌, అంగ‌, మీడియా బ‌లాన్ని ఉప‌యోగించి ఉద్య‌మాన్ని అవ‌హేళ‌న చేసి... ఇప్ప‌టికీ త‌ప్పుడు రాత‌ల‌తో తెలంగాణ మ‌నోభావాల్ని దెబ్బ‌తీస్తున్న రాజ‌గురువు డ్రామోజీ ప‌క్క‌న తెలంగాణ సీఎం కేసీఆర్ చేతులు క‌ట్టుకొని నిల‌బ‌డిన ఫొటో, ఆపై ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తాన‌న్న భూమిపై నిల‌బ‌డి ఇది భూతల స్వ‌ర్గం అని స్తుతించ‌డం!.
ఇది ఎవ‌రి విజ‌యం! ఎవ‌రికి అప‌జ‌యం!! మ‌రెవ‌రికి అవ‌మానం!!!
- ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తా... ఆంధ్ర మీడియాను పాత‌రేస్తా... అన్న వ్య‌క్తితో, అదే నోటితో త‌న ముందు ఇది భూత‌ల‌స్వ‌ర్గం, రామోజీ తెలంగాణ గ‌డ్డ మీద దీన్ని ఏర్పాటు చేయ‌డం మాకే గ‌ర్వ‌కార‌ణం అని కేసీఆర్‌తో అనిపించిన డ్రామోజీకి ఇంత‌కంటే విజ‌యం ఏం కావాలి?. నాలుగు కోట్ల మంది ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా సీఎం కుర్చీలో కూర్చున్న వ్య‌క్తిని త‌న ద‌గ్గ‌ర‌కు ఆహ్వానించి... త‌న మ‌నుషులు, త‌న మీడియా... త‌న కెమెరాల మ‌ధ్య ఏకంగా నాలుగు గంట‌లు తిప్పుకొని... త‌న ప‌త్రిక‌లో తాను న‌చ్చిన అక్ష‌రాల‌తో తెలంగాణ‌, ఏపీల్లో బ్యాన‌ర్ వార్త‌లు రాసుకున్న రాజ‌గురువు ఆరోజు విక‌టాట్ట‌హాసం చేశాడు కాబోలు. క‌నీసం ఆ వార్త‌లో రామోజీ ఆహ్వానం మేర‌కు సీఎం వ‌చ్చాడ‌నే అక్ష‌రాలు ఎక్క‌డ లేకుండా, ఎందుకు వెళ్లాడు... అని యావ‌త్తు తెలంగాణ స‌మాజం మీమాంస‌లో ఉండేలా వార్త‌ను రాయ‌డం బహుశా రామోజీ వ్యూహంలో కేసీఆర్ బురిడీలు కొట్టార‌నేందుకు నిద‌ర్శ‌నం. నాలుగు గంట‌ల స‌మ‌యంలో కేసీఆర్ ఫిలిం సిటీని పొగ‌డ‌టం త‌ప్ప డ్రామోజీ కేసీఆర్‌ను కొంచెం కూడా మెచ్చుకోలేదా?. మ‌రి ఆ వ్యాక్య‌లు ఎందుకు రాయ‌లేదు?.. రాసే వారెవ‌రు?. సీఎం కార్యాల‌య పీఆర్వోలు అక్క‌డ ఉన్నారా?. ఉంటే ప్ర‌క‌ట‌న ఎందుకు విడుద‌ల చేయ‌లేదు?.. లేక‌పోతే సీఎం పీఆర్వోలు లేకుండా కేవ‌లం ఈనాడు, ఈటీవీ మీడియా ఒక్క‌టే అక్క‌డ ఎందుకు ఉండాలి?.. కేసీఆర్‌, ఆయ‌న వ‌ర్గం ఆ మాత్రం జాగ్ర‌త్త‌లు ఎందుకు తీసుకోలేదు?. అందుకే అప్ప‌నంగా డ్రామోజీ చేతిలో విజ‌యాన్ని పెట్టి వ‌చ్చారు.
- రామోజీ ఫిలిం సిటీని ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తా... ఏనాడో కేసీఆర్ అన్న మాట‌లివి. నిజంగా దున్నిస్తాడ‌ని న‌మ్మిన వాళ్లు ఒక‌రిద్ద‌రు... ఇదంతా ఒట్టి బూట‌కం అన్న‌వాళ్లు పిడికెడు మంది. కానీ దున్నించ‌డ‌ని తెలిసినా... తెలంగాణ శ‌త్రువు గుండెల్లో ఇలాంటి అక్ష‌ర గున‌పాలు దింపాల్సిందే అని న‌మ్మిన వాళ్లు కోట్ల‌ల్లో ఉన్నారు. అందుకే కేసీఆర్ మాట‌లు నిజం కావ‌ని తెలిసినా, ఇలాంటి మాట‌లు, ఇలాంటి నేత మాకు కావాల‌నుకున్నారు. ముఖ్య‌మంత్రిగా చూసుకుంటున్నారు. మ‌రి ఆ నాయ‌కుడే డ్రామోజీ ప‌క్క‌న నిల‌బ‌డి... ఏక‌ప‌క్షంగా రామోజీ అండ్ కో ఉన్న ప్ర‌దేశంలో ఆ గ‌డ్డ‌పై నిల‌బ‌డి తెలంగాణ వ్య‌తిరేకిని స్తుతిస్తుంటే, కీర్తిస్తుంటే... స‌గ‌టు తెలంగాణ‌వాది గుండె ప‌గిలింది. నిరాశా, నిర్వేదంతో నిండిపోయింది. క‌నీసం ఇత‌ర మీడియాకు అవ‌కాశం లేకుండా, ఈనాడు బ‌య‌టి ప్ర‌పంచానికి నెట్‌లో ఏ అక్ష‌రాలు పెడితే వాటిని మాత్ర‌మే క్యారీ చేసే నిస్స‌హాయ‌స్థితిలో ఉండ‌టం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను క‌ల‌చివేసింది. అక్ష‌ర గున‌పాల‌ను దింపే నేత‌ను ఎన్నుకొని ఆంధ్ర మీడియా చెంప మీద పెల్లున కొట్టిన తెలంగాణ‌వాడు అప‌జ‌య భారంలో మునిగిపోయాడు.
- ఉద్య‌మంలో ప్ర‌తి అడుగునూ వ్య‌తిరేకించారు. క‌థ‌నాల‌తో అవ‌మానించారు. చంద్ర‌బాబుతో పోల్చి... అస‌లు ఒక నాయ‌కుడి ల‌క్ష‌ణాలు కేసీఆర్‌లో లేవ‌నే రీతిలో క‌థ‌నాలు వండి వార్చారు. తెలంగాణ వ‌స్తున్న స‌మ‌యంలో త‌ప్పుడు క‌థ‌నాల‌తో వంద‌లాది మంది యువ‌కుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యారు. వ‌చ్చిన త‌ర్వాత కూడా మెట్రో, ఇత‌ర‌త్రా అభివృద్ధిని అడ్డుకునేందుకు విషం చిమ్మారు. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వ‌ర‌కు కేసీఆర్ మొద‌లు టీఆరెస్ కిందిస్థాయి కార్య‌క‌ర్త వ‌ర‌కు ఆంధ్ర మీడియా అంటూ హూంక‌రిస్తారు. మ‌రి ఆ ఆంధ్ర మీడియా గురువు ద‌గ్గ‌ర‌కు పోయి... నీవు ఈ గ‌డ్డ మీద కాలు పెట్ట‌డ‌మే మాకు మ‌హా ప్ర‌సాదం అన్న‌ట్లుగా మాట్లాడితే ఎవ‌రికి అనుమానం?. రాచ‌కొండ గుట్ట‌ల్లో పెట్ట‌బోయే ఫిలిం సిటీకి మోడ‌ల్‌గా దీన్ని ముందుగా కేసీఆర్ చూశారు... అని కొంద‌రు స‌ర్దుబాటు చేసుకోవ‌చ్చు. కానీ అందుకు అనేక ఇత‌ర మార్గాలున్నాయి. రామోజీ ఫిలిం సిటీని త‌ల‌ద‌న్నే రీతిలో దేశంలో, ప్ర‌పంచంలో అనేక ఫిలిం సిటీలు ఉన్నాయి. అక్క‌డికి కేసీఆర్ వెళ్లి ఉంటే స‌గ‌టు తెలంగాణ‌వాది గ‌ల్ల ఎగ‌రేసుకొని, నిల‌బ‌డేవాడు. కానీ ఓ తెలంగాణ వ్య‌తిరేకి గూటికి వెళ్లి దాన్ని కాపీ కొట్టాల‌నుకోవ‌డం వ్యూహం కాదు క‌దా క‌నీసం ఆలోచ‌న కూడా త‌ప్పు. మ‌రి ఇంత చిన్న లాజిక్‌ను కేసీఆర్ మిస్ కావ‌డమే మ‌న దౌర్బాగ్యం.
!!! తెలంగాణ ప్ర‌జ‌లు చాలా తెలివైన‌వారు. కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన ప‌రిణామాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేదు. క‌ల‌త చెందారు. కానీ బ‌య‌టికొచ్చి ఆందోళ‌న చేయ‌లేదు, నిర‌స‌నలు వ్య‌క్తం చేయ‌లేదు. కేవ‌లం మౌనంగా త‌మ వ్య‌తిరేక‌త‌ను ఒక‌రి నుంచి మ‌రొక‌రి ద్వారా వ్య‌క్తీక‌రించారు. బ‌హుశా ఆ నాడిని గుర్తించి కేసీఆర్ ఫిలిం సిటీ ఏరియ‌ల్ స‌ర్వే కార్య‌క్ర‌మాన్ని పెట్టుకొని ఉండ‌వ‌చ్చు. కానీ ఇది మొన్న ఏర్ప‌డిన *రాజ‌*పుండుకు ఏమాత్రం మందు కాబోదు. దీనిపై కేసీఆర్ క‌చ్చితంగా బ‌హిరంగంగా... ఫిలిం సిటీకి ఎందుకు వెళ్లారు, ఏం జ‌రిగింది అనే దానిపై తెలంగాణ స‌మాజానికి బ‌దులివ్వాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది.
-------- నోట్‌: ఇక్క‌డ ఒక విచిత్రం ఉంది. తెలంగాణ వ్య‌తిరేకిని క‌లిసి, పొగిడినందుకు వాస్త‌వంగా టీడీపీ, బీజేపీ వాళ్లు కేసీఆర్‌పై ఒంటికాలు మీద లేవాలి. కానీ ఈళ్లంతా ఆ రాజ‌గురువు క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచేవారు. అందుకే ఏ ఒక్క‌రూ కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీ ప‌ర్య‌ట‌న మీద ప‌ల్లెత్తు మాట మాట్లాడ‌టం లేదు. ఈ విష‌యానొకిస్తే అంద‌రూ ఒక్క‌రే.


No comments:

Post a Comment