తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి...
తెలంగాణ చరిత్రలో మరుగున పడిన, తగిన గుర్తింపు రాని మహనీయులు ఎందరో.. చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన తెలంగాణ మహనీయుల పేర్లలో రాణి రుద్రమ దేవిది మొదటి వరుసలో ఉంటుంది... అలాంటి వీరనారి చరిత్రపై ఇప్పటికీ ఒక్క తెలుగు సినిమా రాలేదు(నేనైతే చూడలేదు.).. అయితే త్వరలో రాణి రుద్రమ దేవిపై దర్శకుడు గుణశేఖర్ రూపొందించే సినిమా విడుదల అవుతుంది.. ఈ సినిమా తెలంగాణ చరిత్రకు ప్రతిబింబంగా ఉంటే దీనికి వినోదపు పన్ను మినహాయింపు లాంటివి ఇవ్వొచ్చు... అలాగే తెలంగాణ చరిత్రపై సినిమాలు తీసే వారందరికీ ప్రోత్సాహం ఇవ్వడం చేయాలి.. మన అస్తిత్వాన్ని వెండితెరపైన ఆవిష్కరించడానికి ఇది మంచి అవకాశంగా ఉంటుంది..
అలాగే ఖైరున్నిసాపై తెలంగాణ దర్శకుడు రఫీ ప్రారంభించిన చిత్రానికి కూడా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందాలి.. తెలంగాణలో సినిమా పరిశ్రమ వర్థిల్లాలన్నా.. తెలంగాణ చరిత్ర, తెలంగాణ మహనీయులు, తెలంగాణ ప్రాంతమే నేపథ్యంగా సినిమాలు రావాలన్నా ఇలాంటి ప్రోత్సాహకాలు దోహదపడటమే కాకుండా మన ప్రాంతంలోని యువతకు అవకాశాలను కల్పిస్తాయన్న నమ్మకం ఉంది..
టీవీ ఛానెళ్లలోనూ మన వీరులు, వీర వనితలపై సీరియల్స్ రావాల్సిన అవసరం ఉంది.. టిప్పు సుల్తాన్, అక్బర్, జోధా, మహారాణా ప్రతాప్, మహారాణి ఝాన్సీ లక్ష్మీభాయ్ లాంటి హిందీ సీరియల్స్‌రూపొందించినట్లే... మన వద్ద కాకతీయులు, సమ్మక్క సారక్క, శాతవాహనులు, కొమరం భీం, తుర్రేబాజ్‌ఖాన్, తెలంగాణ సాయుధపోరాటం, మలి దశ ఉద్యమం, ఇంకా అనేక అంశాలపై సీరియల్స్ రావాల్సిన అవసరం ఉంది... చరిత్రపై అవగాహన ఉన్న దర్శకులు, నిర్మాతలు ఈ మహత్కార్యానికి పూనుకుంటే రామానంద సాగర్ తీసిన రామాయం లాగా సూపర్ హిట్ కావడమే కాకుండా మన ప్రజలకు చరిత్రను చెప్పిన వాళ్లం అవుతాం... తెలంగాణ దర్శక, నిర్మాతలకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకం ఇవ్వడం అత్యవసరం... వచ్చే నెలలో కాకతీయ ఉత్సవాలు జరగనున్నాయి... ఆ సమయంలో రుద్రమదేవి సినిమా విడుదల అయితే ఇంకా బాగుంటుందేమో.. సినిమా మాధ్యమం ద్వారా కాకతీయ చరిత్ర ప్రపంచానికి మరింత ఎక్కువగా తెలుస్తుంది... మన పర్యాటకానికి ఇది దోహదపడుతుంది...!!!
No comments:
Post a Comment