----------------------
ఆయన మీ దృష్టిలో తెలంగాణ నాయకుడిగానే కనిపిస్తున్నాడు..
కానీ, ఆయన మొత్తం దళిత, బహుజన, బడుగుల పాలిట పెన్నిధి..
ఏడుసార్లు పార్లమెంట్ సభ్యుడు, మరెన్నో సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు..
కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు..
మరి అంతటి రాజకీయ కురువృద్ధుడు, కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడు అస్తమిస్తే ఇంత చిన్నగా కవరేజీ ఇస్తారా?
ఇదే నీతిని ఆంధ్రా నేతలు, మహనీయుల మరణాల సమయంలోనూ వర్తింపజేస్తారా?
నోట్: లాల్ జాన్ బాషా, ఎర్రన్నాయుడు, అక్కినేని లాంటి మహనీయులో లేక ఆంధ్రా షుగర్స్ అధినేత ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ లాంటి వాళ్లో మరణిస్తే మాత్రం తెలంగాణ ఎడిషన్లలో పేజీలకు పేజీలు వార్తలు రాసిందీ పత్రిక... రేపు ఆంధ్రాలో ఇంకెవరైనా చిన్న నేత చనిపోయినా మనకు పతాకశీర్షికల్లో వేస్తుంది... కానీ ఓ దళిత శిఖరం నేలరాలితే పట్టించుకోదు.. ఇక్కడ కులం, ప్రాంతం రెండూ అడ్డయ్యాయేమో బ్యానర్ వార్త కావడానికి...!!
No comments:
Post a Comment