1

1

Tuesday, 23 December 2014

ఆంధ్రాలో వ‌ర్గీక‌*ర‌ణ‌మే*..

పెద్ద మాదిగ‌న‌ని ప్ర‌క‌టించుకున్న చంద్ర‌బాబు పార్టీ ఆఫీసుపై ఎమ్మార్పీఎస్ దాడి చేసింది ఎందుకు?
ఇంత‌కీ బాబు వ‌ర్గీక‌ర‌ణ‌పై మాట మార్చాడా?
ఈ వార్త ఇంత చిన్న‌గా వేశారేంటి...

మ‌రోమారు విజ్ఞ‌ప్తి...

గాంధీ జ‌యంతి-స్వ‌చ్ఛ‌తా దినోత్స‌వం
నెహ్రూ జ‌యంతి- బాల స్వ‌చ్ఛ భార‌త్ దినోత్స‌వం
ప‌టేల్ జ‌యంతి-ఏక‌తా దినోత్స‌వం
వాజ్‌పేయి పుట్టిన రోజు- సుప‌రిపాల‌న దినోత్స‌వం
--------------------------------------
మ‌రి మా తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ జ‌యంతిని(జూన్ 28) జాతీయ సంస్క‌ర‌ణ‌ల దినోత్స‌వంగానో ఇంకో పేరుతోనే జ‌ర‌పొచ్చు క‌దా..
ఈ ఏడాది ఎలాగూ చేయ‌లేక‌పోయారు.. వ‌చ్చే ఏడాద‌న్న చేయాల‌ని విజ్ఞ‌ప్తి... కాంగ్రెస్ నేత‌లైన గాంధీ, నెహ్రూ, ప‌టేల్‌ల‌ను గౌర‌వించిన‌ట్లే పీవీని గౌర‌వించాల‌ని మ‌రోమారు మోడీ గారికి విజ్ఞ‌ప్తి చేస్తున్నా...

చావు వార్త‌ల్లోనూ వివ‌క్షే...


----------------------
ఆయ‌న మీ దృష్టిలో తెలంగాణ నాయ‌కుడిగానే క‌నిపిస్తున్నాడు..
కానీ, ఆయ‌న మొత్తం ద‌ళిత‌, బ‌హుజ‌న‌, బ‌డుగుల పాలిట పెన్నిధి..
ఏడుసార్లు పార్ల‌మెంట్ స‌భ్యుడు, మ‌రెన్నో సార్లు ఎమ్మెల్యేగా ప‌నిచేశారు..
కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిగా ఎన్నో బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు..
మ‌రి అంత‌టి రాజ‌కీయ కురువృద్ధుడు, కాంగ్రెస్‌లో అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడు అస్త‌మిస్తే ఇంత చిన్న‌గా క‌వ‌రేజీ ఇస్తారా?
ఇదే నీతిని ఆంధ్రా నేత‌లు, మ‌హ‌నీయుల‌ మ‌ర‌ణాల స‌మ‌యంలోనూ వ‌ర్తింప‌జేస్తారా?
నోట్‌: లాల్ జాన్ బాషా, ఎర్ర‌న్నాయుడు, అక్కినేని లాంటి మ‌హ‌నీయులో లేక ఆంధ్రా షుగ‌ర్స్ అధినేత ముళ్ల‌పూడి హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్ లాంటి వాళ్లో మ‌ర‌ణిస్తే మాత్రం తెలంగాణ ఎడిష‌న్ల‌లో పేజీల‌కు పేజీలు వార్త‌లు రాసిందీ ప‌త్రిక‌... రేపు ఆంధ్రాలో ఇంకెవ‌రైనా చిన్న నేత చ‌నిపోయినా మ‌న‌కు ప‌తాక‌శీర్షిక‌ల్లో వేస్తుంది... కానీ ఓ ద‌ళిత శిఖ‌రం నేల‌రాలితే ప‌ట్టించుకోదు.. ఇక్క‌డ కులం, ప్రాంతం రెండూ అడ్డ‌య్యాయేమో బ్యాన‌ర్ వార్త కావ‌డానికి...!!

Monday, 22 December 2014

కొత్త కంపెనీలూ గూగుల్ బాట‌లో న‌డుస్తాయేమో..

రేపో మాపో దుకాణం ఖాళీ చేయాల‌నుకునే వాడు అద్దె ఇంట్లో ఉంటాడు..
లేదు లేదు ఈ ప్రాంతంలో భ‌విష్య‌త్తు ఉంది.. ఈ ప్రాంతంలో సుదీర్ఘ కాలం ఉండాల‌నుకునే వాడు సొంత ఇళ్లు కొనుక్కుంటాడు..
ఇప్పుడు గూగుల్ కంపెనీ కూడా హైద‌రాబాద్‌లోనే ఉండాల‌ని డిసైడ్ అయింది.. ఇక్క‌డ సొంత క్యాంప‌స్‌ను ఏర్పాటు చేసుకుంటోంది..
ఇది చాలు హైద‌రాబాద్ నుంచి కంపెనీలు త‌మ దుకాణాల‌ను ఎత్తేస్తున్నాయో.. లేక ఇక్క‌డ స్థిరంగా ఉండిపోవాల‌నుకుంటున్నాయో తెలవ‌డానికి..
ఎన్ని పిచ్చి రాత‌లు రాసినా హైద‌రాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌కు డ్యామేజీ కాద‌న్న‌ది సుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది..
విశేషం ఏంటంటే గూగుల్‌కు సొంత క్యాంప‌స్‌లు చాలా త‌క్కువ దేశాల్లోనే ఉన్న‌ట్లు స‌మాచారం... మ‌రి హైద‌రాబాద్‌లో సొంత క్యాంప‌స్ వ‌స్తే మ‌రిన్ని కొత్త కంపెనీలూ గూగుల్ బాట‌లో న‌డుస్తాయేమో.. ఎల్లో మీడియా త‌ట్టుకోగ‌ల‌దా?!!

జ‌బ‌ర్ద‌స్తు ప్రోగ్రామ్ డైరెక్ట‌ర్ కేసీఆర్ అయి ఉంటే..?

జ‌బ‌ర్ద‌స్తు ప్రోగ్రామ్ డైరెక్ట‌ర్ కేసీఆర్ అయి ఉంటేనా... ఈ పాటికి అంద‌రూ కృష్ణ‌న్న‌లు ఒంటికాలిపై లేచెటోళ్లు... మావోళ్ల‌ను దొర కించ‌ప‌రుస్తాడా? అంటూ తెగ హ‌డావుడి చేసే వారు... క‌నీసం ప్రోగ్రామ్ ప్ర‌సారం అవుతున్న‌ది టీ న్యూస్‌లో కూడా కాక‌పాయే... అది ఆంధ్రా యాజ‌మాన్యం దాయే.. ఇక వీళ్లంతా ఏం మాట్లాడుతారు.. మాట్లాడితే సీటు ఇచ్చిన బాబు గారు ఊరుకుంటారా? ఆయ‌న‌కు కోపం వ‌చ్చే ప‌నిని వీళ్లు చేస్తారా? అందుకే ప‌త్తా లేకుండా పోయారు...!!

జాగ్ర‌త్త సుమీ...!!!!

అమ్మో భార‌త సైన్యం క‌న్నా బ‌ల‌మైన సైన్య‌మే ఉంది టీడీపీకి... 
ఎవ‌రి మీద దండ‌యాత్ర‌కు వెళ‌తారో ఈ సైన్యంతో..
మ‌ళ్లా తెలంగాణ‌ను ఆక్ర‌మించుకోడానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారేమో..
ఏది ఏమైనా ఈ సైన్యాల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే..
పొరుగున 43 ల‌క్ష‌ల మంది సైన్యం.. వారికి స‌హ‌క‌రించేందుకు మ‌న సామ్రాజ్యంలో 7 ల‌క్ష‌ల మంది వారి అనుచ‌ర గ‌ణం..
ఇంకా కోవ‌ర్టులు ఎంద‌రు ఉన్నారే లెక్క తెల‌వ‌దు...
వామ్మో.. అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే అంతే సంగ‌తులు..!!
మ‌రీ అంత మంద‌బ‌లం మ‌న‌కు అక్క‌ర‌కు లేదు.. కానీ..
అంకిత భావం క‌లిగిన, మేధా సంప‌త్తి క‌లిగిన వారిని మ‌నం త‌యారు చేసుకోవాలి..!!!

ఏపీలో రుణ మాఫీయాన‌ట‌..

ఏపీలో రుణ మాఫీయాన‌ట‌..
మ‌రి తెలంగాణ‌లో ఇలాంటి దందా లేదా?
ఉన్నా రాస్తారా?
రాసినా రుణ మాఫీయాకు మ‌ద్ద‌తుగానే రాస్తారేమో...?

ప‌ర భాషా సీరియ‌ల్స్‌, ప్రొగ్రామ్ ల‌ను కాపీ చేసుకోండి...

మంచి సీరియ‌ల్స్ తీయ‌డం చేత‌కాక‌పోయినా... మంచి ప్రొగ్రామ్స్ చేయ‌డం రాక‌పోతే... ప‌ర భాషా సీరియ‌ల్స్‌, ప్రొగ్రామ్ ల‌ను కాపీ చేసుకోండి...
మీలో ఉన్న సృజ‌నాత్మ‌క‌త ఇంతే అయితే దానికో దండం...!!

మ‌న వేలుతో మ‌న క‌న్నునే పొడుచుకునేలా చేస్తారు.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌

మ‌న వాళ్ల‌తోనే మ‌న‌పై ఎట‌కార‌పు బూతు కామెడీ పండించి విక‌టాట్ట‌హాసాలు చేస్తారు..
మ‌నం మ‌నం కొట్టుకుంటుంటే మళ్లా ఆనందిస్తారు...
మ‌న వేలుతో మ‌న క‌న్నునే పొడుచుకునేలా చేస్తారు..
మ‌న కులాల మ‌ధ్య చిచ్చు రేపుతారు..
ఇప్పుడు వేణుపై ఓ కులం దాడి చేసింది..
రేపు వేణు వాళ్ల కుల‌పోళ్లు వారిపై క‌క్ష పెంచుకుంటారు..
మ‌నం ఐక్యంగా ఉండాల్సిన త‌రుణమిది..
అస‌లు శ‌త్రువును గుర్తించాలి...
కులాల కుమ్ములాట‌లు, మ‌తాల మార‌ణ‌హోమాలు మ‌న‌కొద్దు..
----------------
నోట్‌: రేపు హైద‌రాబాద్‌లో శాంతిభ‌ద్ర‌త‌లు క‌ర‌వ‌య్యాయా? అంటూ క‌థ‌నాలు రాసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదేమో... ఇదే డ్రామాలో వేణు కాకుండా ఇంకా ఇత‌ర ప్రాంత క‌ళాకారుడు చేసి ఉంటే.. ఆయ‌న‌పై దాడి జ‌రిగి ఉంటే అమ్మో ఏమైనా ఉందా? ఈపాటికి సినిమాలోక‌మే స్పందించేది.. తాలిబ‌న్ తెలంగాణ అనేది... !!
-----------------
వేణు ఆంధ్రా క‌ళాకారుడు కాదు.. ఆయ‌న‌కు అభిమాన సంఘాలు లేవు...
రేపు ఎవ‌రూ గ‌గ్గోలు పెట్ట‌రు... కానీ ఒక్క‌టే విజ్ఞ‌ప్తి.. అస‌లు శ‌త్రువును ప‌సిగ‌ట్టాలి..
వీలైతే ఆ ప్రొగ్రామ్ ప్ర‌సారం చేస్తున్న ఛానెల్ ముందు ధ‌ర్నాలు చేయాలి.. నిర‌స‌న‌లు తెల‌పాలి... ద‌ర్శ‌కుడి ఇంటి ముందు నిర‌స‌న ఉండాలి..
ఇవ‌న్నీ చేయ‌కుండా మ‌న ప్రాంత క‌ళాకారుడిని మ‌న‌మే కొట్టుకుంటే మ‌న‌కే న‌ష్ట‌ము..
-----------------------
నోట్‌: తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఆంధ్రా మీడియాలో వార్త‌లు వ‌స్తే.. అవి రాసిన తెలంగాణ విలేక‌రుల‌ను కొడ‌తారా? లేక ఆ వార్త‌లు రాయించిన‌
మీడియా యాజ‌మాన్యాల‌పై నిర‌స‌న తెలుపుతున్నామా ఆలోచించుకోవాలి...

స‌గ‌టు వీక్ష‌కుడిగా నా మ‌న‌సులో మాట‌...

----------------------------------
మొన్న తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో ఆంధ్రా సినీ న‌టుల చిత్రాల‌ను అడ్డుకుంటే..
సినిమాకు ప్రాంతాల‌తో సంబంధం లేద‌న్నారు..
ఈరోజు ఓ బూతు కార్య‌క్ర‌మంలో న‌టించినందుకు పాపం ఓ తెలంగాణ న‌టుడిపై దాడి చేసిన‌ప్పుడు...
క‌ళ‌కు కులాల‌తో సంబంధం లేదంటారేమో..
ఇక సినిమాల్లో మ‌తాల‌కు సంబంధించి అభ్యంత‌ర‌క‌రంగా తీస్తే నిర‌స‌న వ‌స్తే..
మాకు మ‌తాల‌తో సంబంధం లేదంటారు..
---------------------------------
నాకు తెలిసి వీరికి ఒక్క‌దానితోనే సంబంధం ఉంటుంది... అది డ‌బ్బు.. రేటింగ్‌లు పెంచుకోవ‌డం, పైస‌లు వ‌సూలు కోసం ఇలాంటి త‌ప్పుడు పంథాలో వెళ్తున్నారు.. సినిమా ఎప్పుడో దారి త‌ప్పింది.. ఇప్పుడు బుల్లి తెర అదే దారిలో ప‌య‌నిస్తోంది... ఈ ధోర‌ణి మారాలి.. మంచి చిత్రాలు రావాలి.. మంచి సీరియ‌ల్స్‌, ప్రోగ్రామ్స్ రావాలి...!!
నాది ఒక‌టే ప్ర‌శ్న‌...మీరు మ‌తాలు, కులాలు, ప్రాంతాల‌కు అతీత‌మైన వారే అయితే అన్ని మతాలు, అన్ని కులాల‌, ప్రాంతాల‌ను స‌మానంగా ఎందుకు గౌర‌వించ‌లేక‌పోతున్నారు... ఎందుకు ఇలా కించ‌ప‌ర‌చ‌డం... అంద‌రినీ గౌర‌విస్తూ అద్భుత క‌ళాఖండాలు తీయ‌లేరా? ప్ర‌జాభిమానాన్ని చూర‌గొన‌లేరా?
ద‌ర్శ‌కుల్లారా.. మీరు మారండి... మీ పంథా మార్చుకోండి...సందేశాత్మ‌క చిత్రాలు, ప్రొగ్రామ్‌లు తీయ‌క‌పోయినా ప‌ర్లేదు కానీ బూతు ప్రొగ్రామ్‌లు , యువ‌త‌ను చెడుదారిలో ప‌య‌నించే కార్య‌క్ర‌మాల‌ను రూపొందించొద్దు ప్లీజ్‌...!!

టీవీ ఛానెళ్ల ప్రొగ్రామ్‌ల‌పైనా సెన్సార్ బోర్డు ఉండాలి..

సినిమాల్లో బూతు డైలాగ్‌లు క‌ట్ చేస్తారు.. ఏ స‌ర్టిఫికేట్ ఇస్తారు.. పెద్ద‌ల‌కు మాత్ర‌మే అంటారు.. మ‌రి టీవీల్లో బూతు ప్రొగ్రామ్స్‌ తీస్తే ఎలా అనుమ‌తి ఇస్తున్నారు.. సినిమాల‌కు సెన్సార్ బోర్డు ఉన్న‌ట్లు టీవీ ఛానెళ్ల ప్రొగ్రామ్‌ల‌పైనా సెన్సార్ బోర్డు ఉండాల‌న్న‌ది నా డిమాండ్‌... అప్పుడు గానీ ఈ ''జ‌బ‌ర్ద‌స్తు'' బూతు ప్రొగ్రామ్‌లు ఆగ‌వు...!!!

మ‌తం మారిన వారికి ఇంకా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌డం స‌బ‌బు కాదు...

ద‌ళిత క్రైస్త‌వుల‌కు ఎస్సీ హోదా ద‌క్కేలా ఆర్డినెన్సు తెస్తామ‌ని ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌ల్లో చంద్ర‌బాబునాయుడు హామీ ఇచ్చారు...
మొన్న కేసీఆర్ కూడా ఇదే హామీ ఇచ్చాడు...
మ‌రి ఇవ‌న్నీ మ‌త‌మార్పిడిల‌ను ప్రోత్సాహించేవే అన్న‌ది నా నిశ్చితాభిప్రాయం...
నిజ‌మైన ద‌ళితులకు అన్యాయం జ‌రుగుతుంది... మ‌తం మారిన వారికి ఇంకా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌డం స‌బ‌బు కాదు...
ఈ విష‌యంలో చంద్ర‌బాబు, కేసీఆర్ ఇద్ద‌రు ఇచ్చిన హామీల‌ను వెన‌క్కి తీసుకోవాలి...
చాలా రాష్ట్రాలు గ‌త ప‌దేళ్లుగా ఈ డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.. అయితే కేంద్రం ఎప్పుడూ ప‌ట్టించుకోలేదు.. ఇప్పుడు ప‌ట్టించుకోవ‌ద్దు...
ఒక్క బీజేపీ మిన‌హా దాదాపు అన్ని పార్టీలు ఈ విష‌యంలో ఏకాభిప్రాయంతో ఉన్నాయి..
ద‌ళితుల‌ను ఉన్న‌త‌స్థాయికి తీసుకురావ‌డానికి చ‌ర్య‌లు తీసుకోవాలి గానీ మ‌తం మారేలా ప్రోత్స‌హించే నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్ద‌ని అన్ని పార్టీల‌కు విజ్ఞ‌ప్తి...
ఈ రోజు మ‌తం మారిన ద‌ళితుల‌కు రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తిస్తాయంటారు.. రేపు మ‌తం మారిన గిరిజ‌నుల‌కు రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తింప‌జేయాల‌ని కోరుతారు.. ఎల్లుండి మ‌తం మారిన బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తింప‌జేయాలంటారు.. ఇది ఆగ‌ని ప్ర‌హ‌స‌నం... ఇలాంటి వాటికి అవ‌కాశం ఇవ్వొద్దు...!!!

http://www.newindianexpress.com/…/…/04/06/article2152499.ece

క్రైస్త‌వ భ‌వ‌న్ కోసం రూ.10 కోట్లు ఇస్తే ఎందుకు ఈ స‌న్నాయినొక్కులు...!!!

యాద‌గిరి గుట్ట‌కు రూ.2 వేల కోట్లు ఇస్తాన‌న్న‌ప్పుడు ముస్లింలు, క్రైస్త‌వులు, సిక్కుల‌కు అభ్యంత‌రం చెప్ప‌లేదు..
ద‌క్షిణ భార‌తంలో ఎక్క‌డా లేని విధంగా సిక్కుల‌కు గురుద్వారా క‌ట్టుకునేందుకు స్థ‌లం ఇస్తాను, సాయం చేస్తాన‌న్న‌ప్పుడు ముస్లింలు, క్రైస్త‌వులు, హిందువులు అడ్డుచెప్ప‌లేదు..
బంజారాలు, ఆదివాసీలు, కురుమ భ‌వ‌న్ ల కోసం నిధులు ఇచ్చినా ఎవ‌రూ అడ్డుచెప్ప‌లేదు..
మ‌రి క్రైస్త‌వ భ‌వ‌న్ కోసం రూ.10 కోట్లు ఇస్తే ఎందుకు ఈ స‌న్నాయినొక్కులు...!!!

ప్రొఫెస‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి గారికి శుభాకాంక్ష‌లు..

బంగారు తెలంగాణ‌లో మీ పాత్ర అతికీల‌కం..
నిరుద్యోగుల‌కు మీపై కోటి ఆశ‌లున్నాయి.. విజ‌య‌వంతంగా నెర‌వేరుస్తార‌ని న‌మ్ముతున్నాం...
ఆల్ ద బెస్టు సార్‌...
తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఛైర్మ‌న్‌గా నియ‌మితులైన మీకు తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ స‌మాజం త‌ర‌ఫున హృద‌య పూర్వ‌క శుభాకాంక్ష‌లు.. బంగారు తెలంగాణ కావ‌డంలో, నిరుద్యోగుల ఆకాంక్ష‌లు తీరాల‌న్నా మీలాంటి వారు ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా చేయాల్సింది ఎంతో ఉంది... ముఖ్యంగా నిరుద్యోగ యువ‌త ఆకాంక్ష‌లు తీరేలా ఏటా ఉద్యోగాల భ‌ర్తీని చేప‌ట్టాలి... పార‌ద‌ర్శ‌కంగా ఈ భ‌ర్తీ ప్ర‌క్రియ ఉండాలి... గ‌తంలో వెంక‌ట‌రామిరెడ్డి చేసిన తీరుగా మాత్రం జ‌ర‌గ‌కూడ‌దు... ముమ్మాటికీ ఆశ్రిత ప‌క్ష‌పాతం, డ‌బ్బు, పైర‌వీలు, లాబీయింగ్‌లు లేని విధంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌నిచేయాలి... ప్రజాగొంతుక‌గా ఉన్న మీరు విద్యార్థుల‌కు కూడా న్యాయం చేయాల‌ని.. చేస్తార‌ని హృద‌య‌పూర్వ‌కంగా న‌మ్ముతున్నా... మీ నేతృత్వంలో ఏర్ప‌డ‌బోయే ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ యూపీఎస్సీ, స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌, ఇత‌ర అన్ని నియామ‌క సంస్థ‌ల క‌న్నా ఉత్త‌మంగా ప‌నిచేయాల‌ని మ‌రో మారు విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. కొత్త బాధ్య‌త‌ల్లో మీరు విజ‌య‌వంతం కావాల‌ని మ‌నస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.. అలాగే మీలాంటి అర్హులైన‌ విద్యావంతుల‌ను ఈ పోస్టుకు ఎంపిక చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు.. ప‌బ్లిక్ స‌ర్వీస్‌
క‌మిష‌న్ లో రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న వారిని స‌భ్యులుగా నియ‌మించొద్ద‌ని సీఎంకు విజ్ఞ‌ప్తి...

వాళ్లు స‌మ‌ర్థులు కారు...

ఏదో ప‌రిపాల‌న అనుభ‌వం ఉంది కాబ‌ట్టి, వారి స‌మ‌ర్థ‌త‌ను బ‌ట్టి ప‌ద‌వులు వ‌రించాయి.. కొత్త‌ రాష్ట్రం కాబ‌ట్టి గ‌తంలో ప‌రిపాల‌న అనుభ‌వం ఉన్న‌వారికి అవ‌కాశాలు ఇచ్చార‌న్న కోణంలో ఎవ‌రైనా విశ్లేషిస్తే అది ముమ్మాటికీ త‌ప్పే.. ఎందుకంటే కేటీఆర్‌, ఈటెల త‌దిత‌రులకు అస‌లు పాల‌నా అనుభ‌వం లేదు.. అయినా బాగానే ప‌నిచేస్తున్నారు క‌దా... ఏదో స‌మ‌ర్థించుకోవాల‌న్న ఉద్దేశంతో మొద‌టి నుంచి పార్టీలో ఉన్న వారిని అస‌మ‌ర్థులుగా చిత్రీక‌రించొద్ద‌ని టీఆర్ఎస్ అభిమానుల‌కు విజ్ఞ‌ప్తి...

ఆ విరాళాన్ని వెన‌క్కి తీసుకుంటారా?

ఆంధ్రా రాజ‌ధాని కోసం గ‌త మే 24వ తేదీన అనుకుంటా త‌లసాని శ్రీ‌నివాస యాద‌వ్ 20 ల‌క్ష‌లు, ఎమ్మెల్సీ స‌లీం 50 ల‌క్ష‌లు విరాళం ఇచ్చారు..
ఇంకా చాలా మంది టీడీపీ తెలంగాణ నేత‌లు విరాళాలు ఇచ్చారు.. వీరంతా ఇప్పుడు టీఆర్ఎస్ లో చేరారు.. మ‌రి ఆ విరాళాల‌ను వెన‌క్కి ఇవ్వాల‌ని చంద్ర‌బాబును ఏమైనా డిమాండ్ చేస్తారా?
తెలంగాణ అమ‌రుల‌కు ఎన్ని రూపాయ‌లు ఇచ్చార‌ని మాత్రం అడ‌గొద్దు... నా విజ్ఞ‌ప్తి ఒక‌టే ఇప్పుడైనా ఈ గ‌డ్డ కోసం ప‌నిచేయండి... ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోండి... తెలంగాణ స‌ర్వ‌తోముఖ అభివృద్ధిలో మీ వంతు పాత్ర పోషించండి.. లేక‌పోతే చ‌రిత్ర క్ష‌మించ‌దు..

నా మ‌న‌సు మాత్రం అంగీక‌రించ‌దు...!!

ఐమ్యాక్స్ థియేట‌ర్‌, ప‌ద్మాల‌యా స్టూడియో, అన్న‌పూర్ణ స్టూడియో, ఎన్ క‌న్విన్ష‌న్ సెంట‌ర్లు కూడా తెలంగాణ‌కు త‌ల‌మానికం అని అంటే కూడా స‌మ‌ర్థిస్తారా?
ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకునే భూత‌ల స్వ‌ర్ణాలని కీర్తిస్తే మ‌నం అంగీక‌రిద్దామా? ఆక్ర‌మిత భూముల్లో, అసైన్డు భూముల్లో క‌ట్టిన అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను మ‌నం వ‌దిలేద్దాం... ల్యాంకో హిల్స్ జోలికి కూడా వెళ్లొద్దు... !!
రేపు ఆంధ్రా ప‌త్రిక‌ల‌ను, మీడియాను తిట్టొద్దు.. వీట‌న్నింటికీ మీరు ఒప్పుకుంటారేమో గానీ.. నా మ‌న‌సు మాత్రం అంగీక‌రించ‌దు...!!

ఇంత‌కంటే సిగ్గుచేటు మ‌రొక‌టి ఉంటుందా?.

ఈనాడులో ఈరోజు బ్యాన‌ర్ క‌థ‌నం ఇది. ఇదేదో కొత్త‌గా చేసిన ట్రాఫిక్ అధ్య‌య‌నం లెక్క క‌థ‌నం వండి వార్చారు. కానీ ఇదే పేప‌ర్‌లో ఇది బ‌హుశా ఏడెనిమిది సార్లు రావ‌చ్చు. వాస్త‌వంగా నాలుగేండ్ల కింద‌ట మొద‌లైన స‌ర్వే 2012 చివ‌ర్లోనే పూర్త‌యింది. దానిని గ‌త ఏడాది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ముసాయిదా ప్ర‌ణాళిక‌కు ఆమోదం కూడా తెలిపింది. కానీ ఇదేదో ఇప్ప‌డు పుట్టుకొచ్చిన స‌ర్వే అని లీ అసోసియేష‌న్‌ను ప్ర‌మోట్ చేయ‌డానికి రాసిన క‌థ‌నంలా ఉంది.

*రాజ‌* పుండుకు ఏరియ‌ల్ స‌ర్వేతో మందా?



తెలంగాణ‌వాదులు ఏ చిత్రాన్ని చూడొద్ద‌నుకున్నారో్.... ఎవ‌రి నోటి నుంచి ఏ మాట వినొద్ద‌నుకున్నారో.... అదే జ‌రిగింది. తెలంగాణ ద్రోహి, రాష్ట్ర ఏర్పాటుకు అడుగ‌డుగునా మోకాల‌డ్డ‌టంతో పాటు శాయ‌శ‌క్తులా త‌న అర్ధ‌, అంగ‌, మీడియా బ‌లాన్ని ఉప‌యోగించి ఉద్య‌మాన్ని అవ‌హేళ‌న చేసి... ఇప్ప‌టికీ త‌ప్పుడు రాత‌ల‌తో తెలంగాణ మ‌నోభావాల్ని దెబ్బ‌తీస్తున్న రాజ‌గురువు డ్రామోజీ ప‌క్క‌న తెలంగాణ సీఎం కేసీఆర్ చేతులు క‌ట్టుకొని నిల‌బ‌డిన ఫొటో, ఆపై ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తాన‌న్న భూమిపై నిల‌బ‌డి ఇది భూతల స్వ‌ర్గం అని స్తుతించ‌డం!.
ఇది ఎవ‌రి విజ‌యం! ఎవ‌రికి అప‌జ‌యం!! మ‌రెవ‌రికి అవ‌మానం!!!
- ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తా... ఆంధ్ర మీడియాను పాత‌రేస్తా... అన్న వ్య‌క్తితో, అదే నోటితో త‌న ముందు ఇది భూత‌ల‌స్వ‌ర్గం, రామోజీ తెలంగాణ గ‌డ్డ మీద దీన్ని ఏర్పాటు చేయ‌డం మాకే గ‌ర్వ‌కార‌ణం అని కేసీఆర్‌తో అనిపించిన డ్రామోజీకి ఇంత‌కంటే విజ‌యం ఏం కావాలి?. నాలుగు కోట్ల మంది ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా సీఎం కుర్చీలో కూర్చున్న వ్య‌క్తిని త‌న ద‌గ్గ‌ర‌కు ఆహ్వానించి... త‌న మ‌నుషులు, త‌న మీడియా... త‌న కెమెరాల మ‌ధ్య ఏకంగా నాలుగు గంట‌లు తిప్పుకొని... త‌న ప‌త్రిక‌లో తాను న‌చ్చిన అక్ష‌రాల‌తో తెలంగాణ‌, ఏపీల్లో బ్యాన‌ర్ వార్త‌లు రాసుకున్న రాజ‌గురువు ఆరోజు విక‌టాట్ట‌హాసం చేశాడు కాబోలు. క‌నీసం ఆ వార్త‌లో రామోజీ ఆహ్వానం మేర‌కు సీఎం వ‌చ్చాడ‌నే అక్ష‌రాలు ఎక్క‌డ లేకుండా, ఎందుకు వెళ్లాడు... అని యావ‌త్తు తెలంగాణ స‌మాజం మీమాంస‌లో ఉండేలా వార్త‌ను రాయ‌డం బహుశా రామోజీ వ్యూహంలో కేసీఆర్ బురిడీలు కొట్టార‌నేందుకు నిద‌ర్శ‌నం. నాలుగు గంట‌ల స‌మ‌యంలో కేసీఆర్ ఫిలిం సిటీని పొగ‌డ‌టం త‌ప్ప డ్రామోజీ కేసీఆర్‌ను కొంచెం కూడా మెచ్చుకోలేదా?. మ‌రి ఆ వ్యాక్య‌లు ఎందుకు రాయ‌లేదు?.. రాసే వారెవ‌రు?. సీఎం కార్యాల‌య పీఆర్వోలు అక్క‌డ ఉన్నారా?. ఉంటే ప్ర‌క‌ట‌న ఎందుకు విడుద‌ల చేయ‌లేదు?.. లేక‌పోతే సీఎం పీఆర్వోలు లేకుండా కేవ‌లం ఈనాడు, ఈటీవీ మీడియా ఒక్క‌టే అక్క‌డ ఎందుకు ఉండాలి?.. కేసీఆర్‌, ఆయ‌న వ‌ర్గం ఆ మాత్రం జాగ్ర‌త్త‌లు ఎందుకు తీసుకోలేదు?. అందుకే అప్ప‌నంగా డ్రామోజీ చేతిలో విజ‌యాన్ని పెట్టి వ‌చ్చారు.
- రామోజీ ఫిలిం సిటీని ల‌క్ష నాగ‌ళ్ల‌తో దున్నిస్తా... ఏనాడో కేసీఆర్ అన్న మాట‌లివి. నిజంగా దున్నిస్తాడ‌ని న‌మ్మిన వాళ్లు ఒక‌రిద్ద‌రు... ఇదంతా ఒట్టి బూట‌కం అన్న‌వాళ్లు పిడికెడు మంది. కానీ దున్నించ‌డ‌ని తెలిసినా... తెలంగాణ శ‌త్రువు గుండెల్లో ఇలాంటి అక్ష‌ర గున‌పాలు దింపాల్సిందే అని న‌మ్మిన వాళ్లు కోట్ల‌ల్లో ఉన్నారు. అందుకే కేసీఆర్ మాట‌లు నిజం కావ‌ని తెలిసినా, ఇలాంటి మాట‌లు, ఇలాంటి నేత మాకు కావాల‌నుకున్నారు. ముఖ్య‌మంత్రిగా చూసుకుంటున్నారు. మ‌రి ఆ నాయ‌కుడే డ్రామోజీ ప‌క్క‌న నిల‌బ‌డి... ఏక‌ప‌క్షంగా రామోజీ అండ్ కో ఉన్న ప్ర‌దేశంలో ఆ గ‌డ్డ‌పై నిల‌బ‌డి తెలంగాణ వ్య‌తిరేకిని స్తుతిస్తుంటే, కీర్తిస్తుంటే... స‌గ‌టు తెలంగాణ‌వాది గుండె ప‌గిలింది. నిరాశా, నిర్వేదంతో నిండిపోయింది. క‌నీసం ఇత‌ర మీడియాకు అవ‌కాశం లేకుండా, ఈనాడు బ‌య‌టి ప్ర‌పంచానికి నెట్‌లో ఏ అక్ష‌రాలు పెడితే వాటిని మాత్ర‌మే క్యారీ చేసే నిస్స‌హాయ‌స్థితిలో ఉండ‌టం తెలంగాణ ప్ర‌జ‌ల‌ను క‌ల‌చివేసింది. అక్ష‌ర గున‌పాల‌ను దింపే నేత‌ను ఎన్నుకొని ఆంధ్ర మీడియా చెంప మీద పెల్లున కొట్టిన తెలంగాణ‌వాడు అప‌జ‌య భారంలో మునిగిపోయాడు.
- ఉద్య‌మంలో ప్ర‌తి అడుగునూ వ్య‌తిరేకించారు. క‌థ‌నాల‌తో అవ‌మానించారు. చంద్ర‌బాబుతో పోల్చి... అస‌లు ఒక నాయ‌కుడి ల‌క్ష‌ణాలు కేసీఆర్‌లో లేవ‌నే రీతిలో క‌థ‌నాలు వండి వార్చారు. తెలంగాణ వ‌స్తున్న స‌మ‌యంలో త‌ప్పుడు క‌థ‌నాల‌తో వంద‌లాది మంది యువ‌కుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యారు. వ‌చ్చిన త‌ర్వాత కూడా మెట్రో, ఇత‌ర‌త్రా అభివృద్ధిని అడ్డుకునేందుకు విషం చిమ్మారు. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వ‌ర‌కు కేసీఆర్ మొద‌లు టీఆరెస్ కిందిస్థాయి కార్య‌క‌ర్త వ‌ర‌కు ఆంధ్ర మీడియా అంటూ హూంక‌రిస్తారు. మ‌రి ఆ ఆంధ్ర మీడియా గురువు ద‌గ్గ‌ర‌కు పోయి... నీవు ఈ గ‌డ్డ మీద కాలు పెట్ట‌డ‌మే మాకు మ‌హా ప్ర‌సాదం అన్న‌ట్లుగా మాట్లాడితే ఎవ‌రికి అనుమానం?. రాచ‌కొండ గుట్ట‌ల్లో పెట్ట‌బోయే ఫిలిం సిటీకి మోడ‌ల్‌గా దీన్ని ముందుగా కేసీఆర్ చూశారు... అని కొంద‌రు స‌ర్దుబాటు చేసుకోవ‌చ్చు. కానీ అందుకు అనేక ఇత‌ర మార్గాలున్నాయి. రామోజీ ఫిలిం సిటీని త‌ల‌ద‌న్నే రీతిలో దేశంలో, ప్ర‌పంచంలో అనేక ఫిలిం సిటీలు ఉన్నాయి. అక్క‌డికి కేసీఆర్ వెళ్లి ఉంటే స‌గ‌టు తెలంగాణ‌వాది గ‌ల్ల ఎగ‌రేసుకొని, నిల‌బ‌డేవాడు. కానీ ఓ తెలంగాణ వ్య‌తిరేకి గూటికి వెళ్లి దాన్ని కాపీ కొట్టాల‌నుకోవ‌డం వ్యూహం కాదు క‌దా క‌నీసం ఆలోచ‌న కూడా త‌ప్పు. మ‌రి ఇంత చిన్న లాజిక్‌ను కేసీఆర్ మిస్ కావ‌డమే మ‌న దౌర్బాగ్యం.
!!! తెలంగాణ ప్ర‌జ‌లు చాలా తెలివైన‌వారు. కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీకి వెళ్లిన ప‌రిణామాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేదు. క‌ల‌త చెందారు. కానీ బ‌య‌టికొచ్చి ఆందోళ‌న చేయ‌లేదు, నిర‌స‌నలు వ్య‌క్తం చేయ‌లేదు. కేవ‌లం మౌనంగా త‌మ వ్య‌తిరేక‌త‌ను ఒక‌రి నుంచి మ‌రొక‌రి ద్వారా వ్య‌క్తీక‌రించారు. బ‌హుశా ఆ నాడిని గుర్తించి కేసీఆర్ ఫిలిం సిటీ ఏరియ‌ల్ స‌ర్వే కార్య‌క్ర‌మాన్ని పెట్టుకొని ఉండ‌వ‌చ్చు. కానీ ఇది మొన్న ఏర్ప‌డిన *రాజ‌*పుండుకు ఏమాత్రం మందు కాబోదు. దీనిపై కేసీఆర్ క‌చ్చితంగా బ‌హిరంగంగా... ఫిలిం సిటీకి ఎందుకు వెళ్లారు, ఏం జ‌రిగింది అనే దానిపై తెలంగాణ స‌మాజానికి బ‌దులివ్వాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది.
-------- నోట్‌: ఇక్క‌డ ఒక విచిత్రం ఉంది. తెలంగాణ వ్య‌తిరేకిని క‌లిసి, పొగిడినందుకు వాస్త‌వంగా టీడీపీ, బీజేపీ వాళ్లు కేసీఆర్‌పై ఒంటికాలు మీద లేవాలి. కానీ ఈళ్లంతా ఆ రాజ‌గురువు క‌నుస‌న్న‌ల్లోనే న‌డిచేవారు. అందుకే ఏ ఒక్క‌రూ కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీ ప‌ర్య‌ట‌న మీద ప‌ల్లెత్తు మాట మాట్లాడ‌టం లేదు. ఈ విష‌యానొకిస్తే అంద‌రూ ఒక్క‌రే.


ఆంధ్రాలో స‌మైక్యాంధ్ర ఉద్య‌మం చేసిన‌ విద్యార్థి హీరోలు ఏమ‌య్యారు..

క‌నీసం ఒక్క‌రికైనా టికెట్ ఇచ్చారా?
చ‌ట్ట‌స‌భ‌ల సంగ‌తి దేవుడెరుగు నామినేటెడ్ ప‌ద‌వులైనా ద‌క్కాయా?
క‌నీసం తెలంగాణ‌లోనైనా యువ‌త‌రం కొంద‌రికి అవ‌కాశాలు ద‌క్కాయి...
ఓ బాల్క సుమ‌న్‌, ఓ కిశోర్‌ల‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో అవ‌కాశం ద‌క్కింది..
పిడ‌మ‌ర్తి ర‌వికి నామినేటెడ్ పోస్టు ద‌క్కింది..
కాంగ్రెస్ పార్టీలో ఒక‌రిద్ద‌రు నేత‌లకు పార్టీ ప‌ద‌వులైనా ద‌క్కాయి..
క‌నీసం తెలంగాణ‌లో విద్యార్థి నేత‌ల‌కు కొంత గుర్తింపైనా ఉంది..
మ‌రి స‌మైక్యాంధ్ర కోసం జైళ్ల‌కు వెళ్లిన యువ‌త ప‌రిస్థితి ఆంధ్రాలో ఎలాఉంది..?
దీనిపై మీడియా ఫోక‌సు పెడుతుందా?
అమ్మో... బాబు గారు క‌న్నెర్ర చేస్తార‌ని చేతులు ముడుచుకు కూర్చుంటారా?

Wednesday, 10 December 2014

టీవీ ఛానెళ్ల‌లోనూ మ‌న వీరులు, వీర వ‌నిత‌లపై సీరియ‌ల్స్ రావాల్సిన అవ‌స‌రం ఉంది..


తెలంగాణ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి...

తెలంగాణ చ‌రిత్ర‌లో మ‌రుగున ప‌డిన‌, త‌గిన గుర్తింపు రాని మ‌హ‌నీయులు ఎంద‌రో.. చ‌రిత్ర పుట‌ల్లో సువ‌ర్ణాక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గిన తెలంగాణ మ‌హ‌నీయుల పేర్ల‌లో రాణి రుద్ర‌మ దేవిది మొద‌టి వ‌రుస‌లో ఉంటుంది... అలాంటి వీర‌నారి చ‌రిత్ర‌పై ఇప్ప‌టికీ ఒక్క తెలుగు సినిమా రాలేదు(నేనైతే చూడ‌లేదు.).. అయితే త్వ‌ర‌లో రాణి రుద్ర‌మ దేవిపై ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ రూపొందించే సినిమా విడుద‌ల అవుతుంది.. ఈ సినిమా తెలంగాణ చ‌రిత్ర‌కు ప్ర‌తిబింబంగా ఉంటే దీనికి వినోద‌పు ప‌న్ను మిన‌హాయింపు లాంటివి ఇవ్వొచ్చు... అలాగే తెలంగాణ చ‌రిత్ర‌పై సినిమాలు తీసే వారంద‌రికీ ప్రోత్సాహం ఇవ్వ‌డం చేయాలి.. మ‌న అస్తిత్వాన్ని వెండితెర‌పైన ఆవిష్క‌రించ‌డానికి ఇది మంచి అవ‌కాశంగా ఉంటుంది..
అలాగే ఖైరున్నిసాపై తెలంగాణ ద‌ర్శ‌కుడు ర‌ఫీ ప్రారంభించిన చిత్రానికి కూడా ప్ర‌భుత్వం నుంచి ప్రోత్సాహ‌కం అందాలి.. తెలంగాణ‌లో సినిమా ప‌రిశ్ర‌మ వ‌ర్థిల్లాల‌న్నా.. తెలంగాణ చ‌రిత్ర‌, తెలంగాణ మ‌హ‌నీయులు, తెలంగాణ ప్రాంత‌మే నేప‌థ్యంగా  సినిమాలు రావాల‌న్నా ఇలాంటి ప్రోత్సాహ‌కాలు దోహ‌ద‌ప‌డ‌ట‌మే కాకుండా మ‌న ప్రాంతంలోని యువ‌త‌కు అవ‌కాశాల‌ను క‌ల్పిస్తాయ‌న్న న‌మ్మ‌కం ఉంది..
టీవీ ఛానెళ్ల‌లోనూ మ‌న వీరులు, వీర వ‌నిత‌లపై సీరియ‌ల్స్ రావాల్సిన అవ‌స‌రం ఉంది..  టిప్పు సుల్తాన్‌, అక్బ‌ర్‌, జోధా, మ‌హారాణా ప్ర‌తాప్‌,  మ‌హారాణి ఝాన్సీ ల‌క్ష్మీభాయ్ లాంటి హిందీ సీరియ‌ల్స్‌రూపొందించిన‌ట్లే... మ‌న వ‌ద్ద కాక‌తీయులు, స‌మ్మ‌క్క సార‌క్క‌, శాత‌వాహ‌నులు, కొమ‌రం భీం, తుర్రేబాజ్‌ఖాన్‌, తెలంగాణ‌ సాయుధ‌పోరాటం,  మ‌లి ద‌శ ఉద్య‌మం, ఇంకా అనేక అంశాల‌పై సీరియ‌ల్స్ రావాల్సిన అవ‌స‌రం ఉంది... చ‌రిత్ర‌పై అవ‌గాహ‌న ఉన్న ద‌ర్శ‌కులు,  నిర్మాత‌లు ఈ మ‌హ‌త్కార్యానికి పూనుకుంటే  రామానంద సాగ‌ర్  తీసిన రామాయం లాగా సూప‌ర్ హిట్ కావ‌డ‌మే కాకుండా మ‌న ప్ర‌జ‌ల‌కు చ‌రిత్రను చెప్పిన వాళ్లం  అవుతాం... తెలంగాణ ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు ప్ర‌భుత్వ ప‌రంగా ప్రోత్సాహ‌కం ఇవ్వ‌డం అత్య‌వ‌స‌రం...   వ‌చ్చే నెల‌లో కాక‌తీయ ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి... ఆ స‌మ‌యంలో రుద్ర‌మ‌దేవి సినిమా విడుద‌ల అయితే ఇంకా బాగుంటుందేమో.. సినిమా మాధ్య‌మం ద్వారా కాక‌తీయ చ‌రిత్ర ప్ర‌పంచానికి మ‌రింత ఎక్కువ‌గా తెలుస్తుంది... మ‌న ప‌ర్యాట‌కానికి ఇది దోహ‌ద‌ప‌డుతుంది...!!!

Friday, 5 December 2014

తెలంగాణ‌లో మొద‌ల‌వుతున్న అభివృద్ధి వార్త‌లు ఆంధ్రా ఎడిష‌న్ల‌కు వేయాలి క‌దా?


ఈనాడు ప‌త్రిక మొద‌టి పేజీలో ఈ రోజు వ‌చ్చిన ఆంధ్రాకు సాగ‌ర‌మాల‌? వార్త‌ను చూసి తొలుత ఆశ్చ‌ర్యం వేసింది..
త‌ర్వాత న‌వ్వొచ్చింది... ఎందుకంటే నిన్న కేసీఆర్ రాచ‌కొండ గుట్ట‌ల్లో విహంగ వీక్ష‌ణం చేసి ఔష‌ధ న‌గ‌రికి, చిత్ర న‌గ‌రి కోసం ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశాడు..
దీని వ‌ల్ల దాదాపు 30 వేల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తాయి.. 70 వేల మందికి ఉపాధి వ‌స్తుంద‌ని చెప్పారు..
ఆ వార్త తెలంగాణ‌లో ప్ర‌ధానాంశ‌మైంది.. అంద‌రూ దానిపై చ‌ర్చిస్తున్నారు..
ఈ నేప‌థ్యంలోనే ఆంధ్రాలో ఏదో జ‌రుగుతుంద‌న్న‌ట్లు ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చే ఉద్దేశంలో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ సాగ‌ర‌మాల‌?
లేక‌పోతే కేంద్రం ఓ ప్రాజెక్టు చేప‌ట్టాల‌ని భావిస్తుంద‌ట‌.... ఇంకా నిర్ణ‌యం తీసుకుందో లేదో తెలియ‌దు..
ఆ ప్రాజెక్టును ద‌క్కించుకోవాల‌ని ఆంధ్రా ప్ర‌భుత్వం కేంద్రానికి వారం త‌ర్వాత నివేదిక ఇవ్వాల‌ని చూస్తోంద‌ట‌..
డిసెంబ‌రు 17న కేంద్ర మంత్రివ‌ర్గంలో ప్రాజెక్టుపై చ‌ర్చించే అవ‌కాశం ఉండొచ్చ‌ట‌... ఇది కూడా ఖ‌రారు కాలేదు..
కానీ 5 వేల కోట్లు పెట్టుబ‌డులు, వేల మంది ఉపాధి అంటూ ఈనాడులో క‌థ‌నం వ‌చ్చేసింది...
రేపు మ‌ళ్లా కేసీఆర్ ఇంకా ఏదైనా ప‌ర్య‌ట‌న చేసి... ఫ‌లానా స్థాపించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన వెంట‌నే మ‌రో క‌థ‌నం ఇలాంటిదే వ‌స్తుంది..
------------------
ఇలాంటి క‌థ‌నాలు ఎన్నైనా ఈనాడు ప‌త్రిక రాసుకోవ‌డానికి స్వేచ్ఛ ఉంది... కానీ వాటిని ఆంధ్రా ఎడిషన్‌కు వేసుకుంటే బాగుంటుంది.. ఎందుకంటే రాచ‌కొండ లో ఔష‌ధ ప‌రిశ్ర‌మ‌, సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన నిన్న‌టి వార్త ఆంధ్రా ఎడిష‌న్ల‌కు ఎందుకు మొద‌టి పేజీలో వేసుకోలేదు... అది కూడా 70 వేల మందికి ఉపాధి క‌ల్పించే వార్త క‌దా... 30 వేల కోట్ల పెట్టుబ‌డుల వార్త క‌దా... మ‌రి ఆంధ్రాలో ప్రాజెక్టు రాక‌ముందే ఆ వార్త‌లు తెలంగాణ‌కు వేస్తున్న‌ప్పుడు తెలంగాణ‌లో మొద‌ల‌వుతున్న అభివృద్ధి వార్త‌లు ఆంధ్రా ఎడిష‌న్ల‌కు వేయాలి క‌దా?

స్థానిక వార్త‌ల‌కు పెద్ద‌పీట వేయ‌డం గ‌తం... ఆంధ్రా వార్త‌ల‌కు పెద్ద‌పీట వేయ‌డం వ‌ర్త‌మానం.. ఇదీ ఈనాడు జ‌ర్న‌లిజం నీతి...

స్థానిక వార్త‌ల‌కు పెద్ద‌పీట వేయ‌డం గ‌తం...
ఆంధ్రా వార్త‌ల‌కు పెద్ద‌పీట వేయ‌డం వ‌ర్త‌మానం..
ఇదీ ఈనాడు జ‌ర్న‌లిజం నీతి...
------------------
హైద‌రాబాద్‌లో బంజారా భ‌వ‌న్‌, కొమ‌రం భీం భ‌వ‌న్ నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.. మ‌రి హైద‌రాబాద్ ఎడిష‌న్లో ప్ర‌ముఖంగా ఉండాలి క‌దా.. కానీ మొదటి పేజీలో ఆంధ్రాకు సాగ‌ర‌మాల‌, రైతుల‌కు రుణ విముక్తి అంటూ 50 శాతం స్పేస్ కేటాయించి తెలంగాణ‌కు సంబంధించి ముఖ్యంగా బంజారాలు, ఆదివాసీల‌కు సంబంధంచిన వార్త‌ను ఇలా అప్రాధాన్యంగా వేస్తారా?
స్థానిక వార్త‌ల‌కు పెద్ద పీట వేయ‌డ‌మే ఈనాడు ప్ర‌త్యేకత అన్నారు.. మ‌రి తెలంగాణ‌లో స్థానిక వార్త‌ల‌ను తొక్కేయ‌డ‌మే నేటి ప్ర‌త్యేక‌త‌నా...
ఆంధ్రా వార్త‌కు పెద్ద పీట వేయ‌డ‌మే మీ ప్ర‌త్యేక‌త‌గా మార్చుకున్నారా?
మీ పేప‌ర్ పెట్టిన‌ప్పుడు అమెరికా సంక్షోభం వార్త‌, దాని ప‌క్క‌నే అన‌కాప‌ల్లి చెక్క‌ర రైతుల ఆందోళ‌న వార్త‌ను వేశాం.. ఇదే మా ప్ర‌త్యేక‌త‌..
వార్త అంటే ఢిల్లీలో జ‌రిగింది కాద‌ని... గ‌ల్లీలో స్థానికంగా జ‌రిగేవే అని చెప్పుకునే మీరు.. ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు...?

కృష్ణ ప‌ట్నంలో తెలంగాణ‌కు వాటా లేదని భావించి వేయ‌లేదా?

ఇది ఈ రోజు ఈనాడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎడిష‌న్లో వ‌చ్చింది...
మ‌రి తెలంగాణ ఎడిష‌న్‌కు, ప్ర‌జ‌ల‌కు అవ‌స‌రం లేదా?
కృష్ణ ప‌ట్నంలో తెలంగాణ‌కు వాటా లేదని భావించి వేయ‌లేదా?
ఈ విద్యుత్‌లో తెలంగాణ‌కు ఎంత వాటా వ‌స్తుందో రాయ‌లేదు ఎందుకు?

రాజ్‌నాథ్‌ గారూ.. మ‌రో డైలాగ్ కొట్టండి..

ఈ ఉగ్ర‌వాదుల‌కు భ‌యం, భ‌క్తి ఏమీ లేవా?
కేంద్రంలో మోడీ ఉన్నాడ‌ని వారికి ఇంకా తెలియ‌దా?
లేక‌పోతే స‌రిహ‌ద్దుల్లో ఈ కాల్పులేంది...
కాశ్మీర్‌లో ఈ జ‌వాన్ల‌ను హ‌త‌మార్చ‌డ‌మేంటి...?
రాజ్‌నాథ్‌ గారూ.. మ‌రో డైలాగ్ కొట్టండి..
ఢిల్లీలో ఉన్న‌ది మోడీ ప్ర‌భుత్వ‌మ‌ని...

అక్క‌డ ఏమీ జ‌ర‌గ‌కున్నా సైలెంట్‌గా ఉన్నారే...

ఆంధ్రప్ర‌దేశ్‌లో ఈ ఆరు నెల‌ల కాలంలో రుణ మాఫీ జ‌ర‌గలేదా... నిన్న‌నే 5 వేల కోట్లు విడుద‌ల‌య్యాయా?
అరే అక్క‌డ ఎర్ర‌బెల్లి, రేవంత్‌రెడ్డి లాంటి వాళ్లు లేరా?
లేక ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలాంటి పేప‌ర్లు లేవా?
ఇక్క‌డ 5 వేల కోట్లు విడుద‌ల చేసినా ర‌చ్చ చేశారు..
అక్క‌డ ఏమీ జ‌ర‌గ‌కున్నా సైలెంట్‌గా ఉన్నారే...
మ‌త‌ల‌బేంటి?

మ‌నం ఇలాంటి నిబంధ‌న‌లు రూపొందించాలి..

చాలా మంచి ప‌రిణామం..
ఈ విష‌యంపై విప‌క్షాలు రాద్ధాంతం చేయ‌వు..
మ‌నం ఇలాంటి నిబంధ‌న‌లు రూపొందించాలి..
తెలంగాణ ఉద్యోగాల్లో ఆంధ్రా వారు ఒక్క‌రికి కూడా అవ‌కాశం ద‌క్క‌నివ్వొద్దు..
పెళ్లి చేసుకుని వ‌చ్చినా స‌రే మ‌నం క‌నిక‌రం చూపొద్దు....
శాశ్వ‌త విభ‌జ‌న‌కు నాంది వేసింది ఆంధ్రా ప్ర‌భుత్వ‌మే...
సో మ‌నం కొన‌సాగిద్దాం....
-----------------
మొత్తానికి భ‌విష్య‌త్తులో తెలంగాణ‌, ఆంధ్రా మ‌ధ్య వివాహ సంబంధాలు ఆగిపోయే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది..
తెలంగాణ ఆడ‌పిల్ల‌లు ఆంధ్రా వారిని పెళ్లి చేసుకుని అక్క‌డ ఉన్నా.. అక్క‌డ ఉద్యోగాలు చేయ‌డానికి అన‌ర్హులట‌... జీవో విడుద‌లైంది.. ఆంధ్రాలో జ‌రుగుతున్న డీఎస్సీలోనూ అవ‌కాశం ఇవ్వ‌డం లేదు..
మ‌న ఆడ‌ప‌డుచులు అక్క‌డ ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో స్థానికేతర కోటాలోనూ చేర‌లేరు... మ‌న వాళ్లు ఎప్ప‌టికీ అక్క‌డ స్థానికులు కారు, స్థానికేత‌రులు కాదు...
మ‌న ప్ర‌భుత్వం కూడా 1956 నిబంధ‌న‌న‌ను క‌ఠినంగా అమ‌లు చేయాలి... ఉద్యోగాల్లోనూ ఆంధ్రాలో పుట్టిన‌ట్లు ధ్రువ ప‌త్రం ఉన్న యువ‌కుల‌కు ఇక్క‌డ ఉద్యోగాల్లో అవ‌కాశం ఇవ్వొద్దు... ఎందుకంటే అక్క‌డా ఇక్క‌డా రెండు చోట్లా వారికి అవ‌కాశాలు ల‌భించిన‌ట్లు అవుతుంది...
ఈ విష‌యంలో ప్ర‌భుత్వం దృఢ సంక‌ల్పంతో ఉండాలి... బీజేపీ, టీడీపీ, ఇంకా ఎవ‌రు ఎన్ని మాట‌లు అన్నా వెన‌క్కి త‌గ్గొద్దు..
ఆంధ్రాలో జ‌రుగుతున్న ప‌రిణామాలు చూసిన త‌ర్వాత కూడా మ‌నం మౌనంగా ఉండ‌కూడ‌దు...!!!
ఆంధ్ర ప్ర‌భుత్వం తెచ్చిన జీవో వ‌ల్ల కేవ‌లం వంద‌ల మంది తెలంగాణ బిడ్డ‌ల‌కు న‌ష్టం జ‌రుగుతుంది..
కానీ మ‌న వ‌ద్ద ఉన్న వేల మంది ఆంధ్రా ప్రాంతంలో పుట్టిన వారు ఉన్నారు.. అలాంటి వారంతా ఇక వెన‌క్కి వెళ్ల‌డానికి ఇదే దోహ‌ద‌ప‌డుతుంది..
రెండు చోట్ల పోటీ ప‌రీక్ష‌ల్లో పాల్గొనే అవ‌కాశం ఉండ‌దు...!!
నోట్‌: ఈనాడు ప‌త్రిక‌లో ఈ వార్త రాసింది తెలంగాణ ఆడ‌ప‌డుచులపై అభిమానంతో కాదు.. ఇదే నిర్ణ‌యాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తే తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రావారికి తీర‌ని అన్యాయం జ‌రుగుతుంద‌న్న ఆందోళ‌న‌తోనే.. ఆ విష‌యాన్ని కింద‌న స్ప‌ష్టంగా పేర్కొంది...
అక్క‌డి వారు అని హెడ్డింగ్‌లో పెట్టారు.. తెలంగాణ వారు అని హెడ్డింగ్‌లో పెట్ట‌డానికి చేతులు రాలేదా? లేదా వార్త ప్రాధాన్య‌త‌ను త‌గ్గించే ప్ర‌య‌త్న‌మో రామోజీగారే చెప్పాలి...

పెట్రోల్ ధ‌ర‌లు పెరిగితే మా క్రెడిటే అని చెప్పుకుంటారా?

వాళ్ల చేతుల్లో ఉన్న రైల్వే ఛార్జిల ధ‌ర‌ల‌ను పెంచి.. ఈ పాపం యూపీఏదే అని చేతులు దులుపుకున్నారు..
అంత‌ర్జాతీయ చ‌మురు ధ‌ర‌ల‌కు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై నిర్ణ‌యాలు తీసుకునే స్వేచ్ఛ‌ను కంపెనీల‌కు వ‌దిలేసింది యూపీఏ ప్ర‌భుత్వ‌మే.. 
అంత‌ర్జాతీయంగా చ‌మురు ధ‌ర త‌గ్గ‌డం వ‌ల్ల మ‌న వ‌ద్ద ధ‌ర‌లు త‌గ్గాయి.. వీళ్లేదో సౌదీ దేశాల‌తో ఒప్పందాలు కుదుర్చుకుని త‌గ్గించిన‌ట్లుగా బిల్డ‌ప్‌లు ఇవ్వ‌డం చూస్తుంటే న‌వ్వొస్తుంది...
నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తే స‌రిపోతుంది...
కోడి గుడ్డు ధ‌ర 4.25 పైస‌లుంది... వీళ్లు అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు 3.50 పైస‌లుండే...
మ‌రి కూర‌గాయ‌ల ధ‌ర‌లేమైనా త‌గ్గాయా?
ఇవ‌న్నీ ప‌క్క‌కు పెట్టి అంత‌ర్జాతీయ మార్కెట్‌తో సంబంధం ఉన్న వాటి గురించి చెప్పుకోవ‌డం బాగా లేదు...
రేపు ఇజ్రాయెల్‌, పాల‌స్తీన‌లో గొడ‌వ‌లు జ‌ర‌గ‌డ‌మో.. అర‌బ్ దేశాల్లో అశాంతి రాజుకుంటే పెట్రోల్ ధ‌ర‌లు లీట‌ర్‌కు 90 రూపాయ‌లు అయితే.. మా వ‌ల్లే పెరిగాయ‌ని ఇంతే బాహాటంగా చెప్పుకుంటారా? లేక అంత‌ర్జాతీయ ప‌రిణామాల వ‌ల్లే పెరిగాయంటారా?

Thursday, 4 December 2014

ఆర్ట్స్ కాలేజీకి 75 వ‌సంతాలు పూర్తి

ఆర్ట్స్ కాలేజీకి 75 వ‌సంతాలు పూర్తి.. ఇంకా నిత్య య‌వ్వ‌నంగానే ఉంటుంది..
ప్ర‌గ‌తి శీల భావాల‌కు కేంద్ర బిందువిది...
ఘ‌న‌మైన కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తే బాగుండేది..
ఎన్నో ఉద్య‌మాల‌కు సజీవ సాక్ష్యం..
ఎంద‌రో మేధావుల‌ను రూపొందించిన కేంద్రం..
తెలంగాణ విద్యారంగానికి త‌ల‌మానికం ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం..
అందులో క‌లికితురాయి మ‌న ఆర్ట్స్ కాలేజీ...

పెట్రోల్ ధ‌ర‌లు పెరిగినా మా క్రెడిటే అని చెప్పుకుంటారా?

వాళ్ల చేతుల్లో ఉన్న రైల్వే ఛార్జిల ధ‌ర‌ల‌ను పెంచి.. ఈ పాపం యూపీఏదే అని చేతులు దులుపుకున్నారు..
అంత‌ర్జాతీయ చ‌మురు ధ‌ర‌ల‌కు అనుగుణంగా పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై నిర్ణ‌యాలు తీసుకునే స్వేచ్ఛ‌ను కంపెనీల‌కు వ‌దిలేసింది యూపీఏ ప్ర‌భుత్వ‌మే.. 
అంత‌ర్జాతీయంగా చ‌మురు ధ‌ర త‌గ్గ‌డం వ‌ల్ల మ‌న వ‌ద్ద ధ‌ర‌లు త‌గ్గాయి.. వీళ్లేదో సౌదీ దేశాల‌తో ఒప్పందాలు కుదుర్చుకుని త‌గ్గించిన‌ట్లుగా బిల్డ‌ప్‌లు ఇవ్వ‌డం చూస్తుంటే న‌వ్వొస్తుంది...
నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తే స‌రిపోతుంది...
కోడి గుడ్డు ధ‌ర 4.25 పైస‌లుంది... వీళ్లు అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు 3.50 పైస‌లుండే...
మ‌రి కూర‌గాయ‌ల ధ‌ర‌లేమైనా త‌గ్గాయా?
ఇవ‌న్నీ ప‌క్క‌కు పెట్టి అంత‌ర్జాతీయ మార్కెట్‌తో సంబంధం ఉన్న వాటి గురించి చెప్పుకోవ‌డం బాగా లేదు...
రేపు ఇజ్రాయెల్‌, పాల‌స్తీన‌లో గొడ‌వ‌లు జ‌ర‌గ‌డ‌మో.. అర‌బ్ దేశాల్లో అశాంతి రాజుకుంటే పెట్రోల్ ధ‌ర‌లు లీట‌ర్‌కు 90 రూపాయ‌లు అయితే.. మా వ‌ల్లే పెరిగాయ‌ని ఇంతే బాహాటంగా చెప్పుకుంటారా? లేక అంత‌ర్జాతీయ ప‌రిణామాల వ‌ల్లే పెరిగాయంటారా?

అమ‌రులు క‌ల‌లు క‌న్న తెలంగాణ‌కు పున‌రంకితం అవుదాం..

స‌ర్దార్ పటేల్‌ను బీజేపీ వాళ్లు..
గాంధీ కుటుంబాన్ని కాంగ్రెస్ వాళ్లు.. సొంతం చేసుకుని ఘ‌నంగా వ‌ర్థంతులు, జ‌యంతులు జ‌రుపుతున్న రోజులివి..
ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ పార్టీల‌కు, స‌మాజానికి విజ్ఞ‌ప్తి..
తెలంగాణ అమ‌రుల‌ను కూడా పంచుకోవ‌ద్దు..
శ్రీ‌కాంతాచారి అయినా... యాద‌న్న అయినా.. యాదిరెడ్డి అయినా.. అంద‌రూ మ‌న వారే.. మ‌న తెలంగాణ కోసం అమ‌రులైన వారే..
తెలంగాణ‌లోని అన్ని పార్టీల నేత‌లూ ఈ అమ‌రుల త్యాగాల‌ను స్మ‌రించుకోవాలి.. వాళ్ల పార్టీ కార్యాల‌యాల్లో వీరి జ‌యంతి, వ‌ర్థంతుల‌ను జ‌ర‌పాలి.. ఇదే తెలంగాణ స‌మాజం త‌ర‌ఫున నా విజ్ఞ‌ప్తి...
ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీ‌రాములు ఒక్క‌డే అమ‌రుడ‌య్యారు.. తెలంగాణ కోసం అమ‌రులైన పొట్టి శ్రీ‌రాములు లాంటి వాళ్లు వంద‌ల మంది.. వారిని మ‌నం అంద‌రం పార్టీల‌క‌తీతంగా స్మ‌రించుకుందాం.. అమ‌రులు క‌ల‌లు క‌న్న తెలంగాణ‌కు పున‌రంకితం అవుదాం.. జై తెలంగాణ‌..

మ‌న తెలంగాణ యువ కెర‌టాల‌ను స‌న్మానించుకోవాలి..


తెలంగాణ ప్ర‌భుత్వానికి, సీఎం కేసీఆర్‌కు విజ్ఞ‌ప్తి..
------------------------------------
మ‌న తెలంగాణ యువ కెర‌టాల‌ను స‌న్మానించుకోవాలి..
ఏటా వివేకుడి జ‌యంతి రోజునో.. లేదా జ‌య‌శంక‌ర్ జయంతి రోజునో ఈ కార్య‌క్ర‌మం జ‌రుపుకోవాలి..
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలంగాణ వారి నుంచి సూచ‌న‌లు, స‌ల‌హాలు స్వీక‌రించేందుకు ప్ర‌త్యేక ఇంట‌రాక్టివ్ వెబ్‌సైట్ ఉండాలి..
----------------------------------
ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కావాలంటే ఇంగ్లిష్ రావాలి.. తెలంగాణ వారికి ఇంగ్లిషే స‌రిగా రాదు.. కాంపిటీష‌న్ ప్ర‌పంచంలో మాతో నెట్టుకురాలేకే తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను పైకి తెచ్చారంటూ చాలా మాట‌లు అన్నారు.. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన‌ప్ప‌టి నుంచీ ఇప్ప‌టి వ‌ర‌కు క్రీడ‌లు, చ‌దువులు, ఆద‌ర్శ గ్రామాలు, మామ్ ప్ర‌యోగం విజ‌య‌వంతం త‌దిత‌ర అంశాలపై వార్త‌లు విన్న‌ప్పుడు ఆయా రంగల్లో తెలంగాణ తేజాల ప్ర‌తిభ‌ను మ‌నం చూస్తున్నాం.. క్రీడ‌ల్లో సైనా, సానియా, శ్రీ‌కాంత్‌, సింధు, ఇంకా క‌రాటేలో ఫ‌ల‌క్‌(పేరు స‌రిగా గుర్తులేదు), ఇక గూగుల్‌లో, సిస్కోలో ఉద్యోగాల‌ను తెలంగాణ యువ‌త కైవ‌సం చేసుకోవ‌డం, ఇక మామ్ ప్ర‌యోగంలో పాలుపంచుకున్న శాస్త్ర‌వేత్త‌ల్లో సిద్దిపేటకు చెందిన వ్య‌క్తి ఉన్న‌ట్లు వార్త‌ల్లో రావ‌డం.. మోడీ సంస‌ద్ ఆద‌ర్శ గ్రామ యోజ‌న‌ను ప్రారంభించే స‌మ‌యంలో వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన గంగ‌దేవ‌ప‌ల్లిని ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచించ‌డం జ‌రిగింది.. ఇంకా అనేక విష‌యాలు తెలంగాణ ప్ర‌తిష్ఠ‌ను పెంచాయి.. ఇవ‌న్నీ గ‌త ఆరు నెల‌ల్లో మ‌నం చూస్తునే ఉన్నాం.. ఇవి చూసిన‌ప్పుడ‌ల్లా.. కాంపిటేష‌న్ ప్ర‌పంచంలో తెలంగాణ ప‌ల్లెలు, యువ‌త రాణిస్తున్నార‌న్న ధీమా క‌లుగుతోంది.. గ‌తంలో మ‌న‌పై ఆరోప‌ణ‌లు చేసిన వాళ్లు ఈ తెలంగాణ తేజాల ప్ర‌తిభ‌ను చూసైనా ఇప్పుడు ప‌శ్చాత్తాపం చెందుతార‌ని ఆశిస్తున్నాను..
--------------------------------------
అయితే తెలంగాణ స‌ర్కారుకు విజ్ఞ‌ప్తి.. తెలంగాణ కీర్తి ప‌తాక‌న అంత‌ర్జాతీయ స్థాయిలో రెప‌రెప‌లాడించి క్రీడాకారుల‌ను ఆదుకుంటున్నారు.. ఇది మంచిదే.. అయితే శాస్త్ర‌, సాంకేతిక‌, ఇత‌ర రంగాల్లోనూ ప్ర‌తిభ క‌న‌బ‌రుస్తున్న తెలంగాణ యువ కెర‌టాల‌నూ స‌న్మానించాలి..ఏదో పేప‌ర్లో వార్త‌లు రావ‌డం.. అది చూసి మురిసిపోవ‌డంతో స‌రిపుచ్చొద్దు..
పౌర స‌న్మానాలు రాజకీయాల్లో ఉన్న‌త స్థాయిలోకి చేరిన వారికి చేస్తున్నారు. అయితే ఈ తెలంగాణ యువ‌ కెర‌టాల‌కు ప్ర‌తిభా పుర‌స్కారాలు ఇచ్చి స‌న్మానించాలి.. వాళ్ల త‌ల్లిదండ్రుల‌నూ స‌న్మానించాలి.. వీలైతే వీళ్లంద‌రి జాబితా రూపొందించి వివేక‌నంద జ‌యంతి రోజున భారీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి తెలంగాణ యువ తేజాల‌ను ఏటా స‌న్మానించ‌డం చేయాలి.. ఇది ప్ర‌భుత్వం త‌ర‌ఫున‌, తెలంగాణ స‌మాజం త‌ర‌ఫున జ‌రిగే స‌న్మానంగా ఉండాలి.. ఇది తెలంగాణ యువ‌త‌లో స్ఫూర్తిని, ఐక్య‌తా భావ‌న‌ను నింపుతుంది..
ఇప్పుడు ప్ర‌పంచంలో పేరున్న సంస్థ‌ల్లో కొలువు తీరిన ఈ యువ తెలంగాణ కెర‌టాలే రేప‌టి బంగారు తెలంగాణ‌లో ఓ ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తో, ఇంకొక‌రి మాదిరిగానో త‌యారు కావొచ్చు... ఇక్క‌డే ప‌రిశ్ర‌మ పెట్టి యువ‌త‌కు ఉపాధి చూపవ‌చ్చు..
------------------------
ఇలాంటి అత్యుత్త‌మ మాన‌వ వ‌న‌రులైన‌ యువ‌త స‌ల‌హాలు ప్ర‌భుత్వం స్వీక‌రించాలి.. ఇక ప్ర‌పంచంలో అనేక దేశాలు, మ‌న దేశంలోని అనేక‌
రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ప్ర‌జ‌లు వారు నివ‌సిస్తున్న ప్రాంతాల్లో ఉన్న మంచిని.. తెలంగాణ‌లోనూ ఆ ప‌ద్ధ‌తులు కొన‌సాగితే బాగుంటుంద‌ని
భావిస్తే వెంట‌నే ప్ర‌భుత్వానికి చెప్పుకునేందుకు వీలుగా ఇంట‌రాక్టివ్ వెబ్‌సైట్ ఉండాలి.. ఈ సూచ‌న‌ల్లో ఆచ‌ర‌ణ సాధ్య‌మైన‌వాటిని తెలంగాణ‌లో
అమ‌లు చేయాలి.. బంగారు తెలంగాణ సాధ‌న‌లో పాలుపంచుకునే అవ‌కాశాన్ని ఖండాంత‌రాల్లో ఉన్న తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికీ ఇవ్వాలి..
ఇదే నా విజ్ఞ‌ప్తి.. జై తెలంగాణ‌..

చ‌రిత్రాత్మ‌క సంప‌ద‌ను కాపాడుకోవాలి..

సుల్తాన్ బ‌జార్ మీదుగా వెళ్తున్న‌ మెట్రో రైలు మార్గం మార్చ‌మ‌ని గ‌తంలో వ్యాపారులు అన్ని పార్టీల‌ను కోరారు. సుల్తాన్ బ‌జార్ బంద్‌ను వారం రోజుల పాటు విజ‌య‌వంతంగా చేశారు.. అన్ని పార్టీల నేతలు(బాబు, కిష‌న్‌రెడ్డి, కేసీఆర్‌) వ్యాపారుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌తామ‌ని హామీ ఇచ్చారు..తీరా అలైన్‌మెంట్ మార్చ‌డానికి స‌ర్కారు దృఢ సంక‌ల్పంతో నిర్ణ‌యం తీసుకున్న‌ప్పుడు మెట్రోపై కేసీఆర్ నాట‌కాలు ఆడుతున్నాడంటూ ప‌చ్చ ప‌త్రిక‌ల్లో వార్తలు రావ‌డం, దానికి త‌గిన‌ట్లు పార్టీలు విమ‌ర్శ‌లు చేయ‌డం.. ఇవ‌న్నీ మ‌ళ్లా ప‌త్రిక‌ల్లో ప‌తాక శీర్షిక‌ల్లో రావ‌డం జ‌రిగింది.. మ‌రి సుల్తాన్ బ‌జార్‌ను న‌మ్ముకున్న‌ వేల మంది వ్యాపారుల ప్ర‌యోజ‌నాల‌ను, అంత‌క‌న్న విలువైన చ‌రిత్ర‌క సంప‌ద‌ను కాపాడుతూ నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్ కు వ్యాపారులు అభినంద‌లు తెలుపుతూ ఈ రోజు భారీ ర్యాలీ తీశారు.. మ‌రి జిల్లా పేజీల్లో వేస్తాయేమో ప‌చ్చ ప‌త్రిక‌లు.. వీళ్లంతా టీఆర్ఎస్ ఓటు బ్యాంక్ మాత్రం కాదు.. ఓటు బ్యాంక్ కోస‌మే అన్నీ చేయ‌రు.. తెలంగాణ‌లో చ‌రిత్రాత్మ‌క క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ అనేది అత్యంత కీల‌కం.. ఇదే ప్ర‌తి పార్టీ ల‌క్ష్యం కావాలి.. చ‌రిత్ర‌ను నాశ‌నం చేసి భ‌విష్య‌త్తు త‌రాల‌కు అప్ప‌గిస్తే వాళ్లు మ‌న‌ల్ని క్ష‌మించ‌బోరు....ఎవ‌రైనా స‌రే(కేంద్రం, రాష్ట్ర ప్ర‌భుత్వాలు) చ‌రిత్ర‌కు సంప‌ద‌కు వీలైనంత వ‌ర‌కు న‌ష్టం క‌ల‌గ‌కుండా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల‌ని విజ్ఞ‌ప్తి.. !!!

విద‌ర్భ‌, తెలంగాణ రైతుల కోసం కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వాలి..

విద‌ర్భ‌లో ఒక్క రోజు 10 మంది రైతులు చ‌నిపోయార‌ట‌..
చితి పేర్చుకుని రైతు చ‌నిపోయాడ‌ట‌..
స్వ‌యంగా బీజేపీ ఎంపీనే చెప్పాడు..
బీజేపీ ప్ర‌భుత్వం కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నా విద‌ర్భ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు జ‌రుగుతున్నాయి..
ఇది పార్టీల అంశం కాదు.. జాతీయ అంశ‌మ‌ని అంద‌రూ గుర్తించాలి..
రైతు ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌కు జాతీయ విధానాన్ని రూపొందించాలి..
ముఖ్యంగా విద‌ర్భ‌, తెలంగాణ రైతుల కోసం కేంద్రం ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వాలి..
ఇది పార్టీల‌క‌తీతంగా చేయాల్సిన డిమాండ్‌..

Tuesday, 2 December 2014

మ‌న వ్య‌వ‌స్థ‌లో మినిమ‌మ్ గ‌వ‌ర్న‌మెంట్‌.. మాగ్జిమ‌మ్ గ‌వ‌ర్నెన్స్‌లు అన్న‌వి సూట్ కావు..

లెస్ గ‌వ‌ర్న‌మెంట్‌.. మోర్ గ‌వ‌ర్నెన్స్‌..
మినిమ‌మ్ గ‌వ‌ర్న‌మెంట్‌.. మాగ్జిమ‌మ్ గ‌వ‌ర్నెన్స్‌..
స్మాల్‌ గ‌వ‌ర్న‌మెంట్‌.. స్మార్ట్ గ‌వ‌ర్నెన్స్‌...

--------------------
చిన్న కేబినెట్‌తో అద్భుతాలు చేస్తాడ‌ని మోడీ గారు కొలువు తీరిన స‌మ‌యంలో ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన హెడ్డింగ్‌లు..
మొన్న క్యాబినెట్‌ను విస్త‌రించారు.. మ‌ళ్లా దాదాపుగా సాధార‌ణ క్యాబినెట్ మాదిరిగానే త‌యారైంది..
------------------
చిన్న క్యాబినెట్‌తో పూర్తిగా నెట్టుకురావ‌డం క‌ష్ట‌మైన ప‌ని అని మోడీ గారు గుర్తించ‌డానికి ఆరు నెల‌లు ప‌ట్టింది..
మ‌రి మ‌న తెలంగాణ‌, ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులకు ఎంత కాలం ప‌డుతుందో?
ఇంకా చిన్న క్యాబినెట్‌తోనే నెట్టుకొస్తున్నారు..
మ‌న వ్య‌వ‌స్థ‌లో మినిమ‌మ్ గ‌వ‌ర్న‌మెంట్‌.. మాగ్జిమ‌మ్ గ‌వ‌ర్నెన్స్‌లు అన్న‌వి సూట్ కావు..
అందుకే మోడీని ఆద‌ర్శంగా తీసుకొని వీలైనంత త్వ‌ర‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను చేస్తే ప‌నైపోతుంది క‌దా..!!!

నా అంచ‌నా త‌ప్పింది..

జ‌గ్గారెడ్డి క‌మ్యూనిస్టు పార్టీలో చేరుతాడ‌నుకున్నా.. నా అంచ‌నా త‌ప్పింది..
చూస్తుంటే మ‌ళ్లా ఏదో ఒక రోజు టీఆర్ఎస్‌లో చేరినా ఆశ్చ‌ర్యం లేదు..(బీజేపీ- టీఆర్ఎస్‌-కాంగ్రెస్‌-బీజేపీ- మ‌ళ్లా కాంగ్రెస్‌?... ఈ లెక్క‌న నెక్ట్స్ టీఆర్ఎస్‌యేమోన‌ని అంచ‌నా. రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మేనండోయ్‌)

రేవంత్‌రెడ్డి ఆంధ్రా స‌ర్కారు తీరుకు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తాడా?

కృష్ణా, గోదావ‌రి న‌దుల మీద తెలంగాణోళ్లు ప్రాజెక్టులు క‌ట్టుకోవ‌ద్దు... ఆ రెండు న‌దుల నీళ్లు తెలంగాణోళ్లు వాడుకోవ‌ద్దు.. ముఖ్యంగా కృష్ణా న‌ది నీటిని మేం దోపిడీ చేసినా అడ‌గొద్దు...
మేం మాత్రం తెలంగాణ మండ‌లాల‌ను క‌లిపేసుకుని పోల‌వ‌రం క‌ట్టుకుంటాం.. ఇంకా అనేక అక్ర‌మ ప్రాజెక్టుల నిర్మించుకుంటాం..
---------------------------------------------
ఇది కేంద్రానికి ఆంధ్రా స‌ర్కారు చేస్తున్న విజ్ఞ‌ప్తులు..
మ‌రి ఇప్పుడు తెలంగాణ టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తెలంగాణ‌లో ప్రాజెక్టుల నిర్మాణం ఆప‌మ‌ని పాద‌యాత్ర చేస్తాడా?   రిలే నిరాహార దీక్ష చేస్తాడా?
లేక ఆంధ్రా స‌ర్కారు తీరుకు వ్య‌తిరేకంగా గ‌ళం వినిపిస్తాడా?

న‌వ చ‌రిత్ర‌కు నాంది ప‌లికిన తెలంగాణ జ‌న నేత‌...

ఆయ‌న‌ది గాంధీ కుటుంబం కాదు..
ఆయ‌న వెన‌క 80 ఏళ్ల చ‌రిత్ర ఉన్న‌ సంఘ్ ప‌రివార్ లేదు..
మామ‌కు వెన్నుపోటు పొడిచిన చ‌రిత్రా కాదు..
న‌వ చ‌రిత్ర‌కు నాంది ప‌లికిన తెలంగాణ జ‌న నేత‌...

బంగారు తెలంగాణ స్వ‌ప్నం సాకారం అవుతుందా? మీరే నిర్ణ‌యించుకోండి..

తెలంగాణ స్వ‌ప్నాన్ని చూపాడు.. 13 ఏళ్ల‌లో సాకారం చేశాడు..
బంగారు తెలంగాణ స్వ‌ప్నాన్ని చూపుతున్నాడు.. సాకారం చేయ‌డ‌ని ప్ర‌తిప‌క్షాలు అంటున్నాయి..
ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారో?

ఈ పిట్ట‌ల దొర నాకు ఇష్టం..

తెలంగాణ తెస్తాన‌న్న‌ప్పుడూ పిట్ట‌ల దొర మాట‌లే..
బంగారు తెలంగాణ చేస్తాన‌న్న‌ప్పుడూ పిట్ట‌ల దొర మాట‌లే..

కేసీఆర్ మాట్లాడితే పిట్ట‌ల దొర మాట‌లు అవుతాయి.. మాట‌ల గార‌డీ అవుతుంది..
మోడీ మాట్లాడితే చేత‌ల మ‌నిషి మాట‌లంటారు...
-----------------------
అసాధ్య‌మ‌నుకున్న తెలంగాణను సాకారం చేస్తాన‌న్న‌ప్పుడూ ఇదే మాట అన్నారు.. సుసాధ్య‌మైన తెలంగాణ‌ను బంగారు తెలంగాణ‌గా మార్చుతాన‌న్న‌ప్పుడూ ఇవే మాట‌లు అంటున్నారు...
------------------------
మీరు అన్న పిట్ట‌ల దొర‌నే తెలంగాణ కార్య‌సాధ‌కుడ‌య్యాడ‌న్న‌ది మీరు జీర్ణించుకోని వాస్త‌వం...
మోడీ గుజ‌రాత్‌ను అభివృద్ధిలో మొద‌టి స్థానంలో నిల‌ప‌డంతో పోల్చితే తెలంగాణ సాధ‌నే నా దృష్టిలో అతి క‌ష్ట‌మైన‌, క్లిష్ట‌మైన ప‌ని..
అంత క‌ష్టాన్ని ఇష్టంగా పూర్తి చేసిన వ్య‌క్తి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చ‌డానికి ఇంకా ఎక్కువ‌గా శ్ర‌మ ప‌డ‌తాడ‌న్న‌ది నా న‌మ్మ‌కం..
త‌ప్పు జ‌రిగినా, త‌ప్పు చేసినా నిర్మాణాత్మ‌క విమ‌ర్శ‌లు చేయాలి.. అదే ప‌నిగా విమ‌ర్శ‌లు చేస్తే 2001 నుంచి 2014 వ‌ర‌కు కేసీఆర్‌ను విమ‌ర్శించి ప‌త్రిక‌ల్లో ప‌తాక స్థాయిలో ఉన్న వారు నేడు అనామ‌కులుగా మిగిలిపోయారు..!!!

ఈ విష స‌ర్పం ఎప్పుడో మ‌ళ్లా బుస కొడుతుంది... త‌స్మాత్ జాగ్ర‌త్త‌...!!


తెలంగాణ ఏర్ప‌డి ఆరు నెల‌లు అయింది..
కేంద్రం తెలంగాణ‌కు ఏం హామీలు ఇచ్చింది.. ఎన్ని నెర‌వేర‌లేదు..?
పోల‌వ‌రం ముంపు గ్రామాల‌ను ఆఘ‌మేఘాల మీద  ఆంధ్రాలో క‌లిపిన తీరు..
ఇంకా కేంద్ర ప్ర‌భుత్వ అధికారుల కేటాయింపులో జాప్యం.
ఇంకా అనేక వివ‌క్ష‌లు కొన‌సాగుతున్నాయి.. వీట‌న్నింటి గురించి రాయ‌కుండా
మ‌రి ఈనాడు ప‌త్రిక తెలంగాణ ఎడిష‌న్లో ఆంధ్రా గురించి రాయ‌డం ఏంటి?
తెలంగాణ వెత‌ల‌ను రాయ‌డానికి చేతులు రావ‌డం లేదా?
ఆరు నెల‌ల్లో తెలంగాణ‌కు రావాల్సిన‌వి రాలేద‌ని..
ఆంధ్రాకు రావాల్సినవి రాలేద‌ని రాయాలి కానీ.. కేవ‌లం ఆంధ్రాకే అన్యాయం జరిగిన‌ట్లు తెలంగాణ‌కు న్యాయం జ‌రిగిన‌ట్లు ఇలాంటి క‌థ‌నాలు రాయ‌డం వెన‌క ముఖ్యోద్దేశం ఏంటి?
ఇలాంటి ప‌త్రిక‌ల‌ను ఆద‌రించ‌డం అంటే తెలంగాణ‌కు ద్రోహం చేయ‌డ‌మే..
తెలంగాణ ప్ర‌జ‌ల‌ను, టీఆర్ఎస్ పాల‌కుల‌ను మ‌భ్య‌పెట్ట‌డానికి అప్పుడ‌ప్పుడు మొద‌టి పేజీలో కేసీఆర్ బొమ్మ పెట్ట‌డం.. మిగ‌తావ‌న్నీ మ‌న‌కు అన‌వ‌స‌ర వార్త‌లు వేయ‌డం ప‌రిపాటిగా మారింది.. ఈ విష‌యంలో ప్ర‌జ‌లతోపాటు, పాల‌కులూ ఏమ‌రుపాటుగా ఉండ‌క‌పోతే ఈ విష స‌ర్పం ఎప్పుడో మ‌ళ్లా బుస కొడుతుంది... త‌స్మాత్ జాగ్ర‌త్త‌...!!