బోర్ల మీద ఆధారపడకుండా తెలంగాణ రైతులు వ్యవసాయం చేసే రోజులు రావాలి. ఆ రోజులు రావాలంటే ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా ప్రభుత్వం శర వేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి చేయాలి. విద్యుత్ సమస్యకు పరిష్కారం చూపినట్లే రైతు సమస్యలకు పరిష్కారం చూపాలి. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే తెలంగాణలో బీడుగా ఉన్న భూముల్లో పసిడి పంటలు పండుతాయి. రైతుకు బోర్లు వేసుకునే ఖర్చు తగ్గుతుంది. కరవు, కాటకాలతో నిమిత్తం లేకుండా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని సమర్థవంతంగా వాడుకొని పంటలు పండించుకోలుగుతాడు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాకుండా చూడటానికి ఆంధ్రా మీడియా, ఆంధ్రా మీడియాకు వత్తాసు పలికే తెలంగాణ నేతలు కొందరు ప్రయత్నిస్తారు. వాళ్ల పెడబొబ్బలను లెక్కచేయకుండా రానున్న మూడేళ్లలో సాగు నీటి ప్రాజెక్టులను పూర్తి చేయగలిగితే తెలంగాణకు దీర్ఘకాలంలో ఎంతో మేలు జరుగుతుంది..
No comments:
Post a Comment