1

1

Friday 16 October 2015

ఎవ‌రేమ‌న్నా చ‌రిత్ర పుటల నుంచి వాళ్ల పేరు చెరిపేయ‌డం క‌ష్ట‌మే..

లోక మాన్య తిల‌క్ కు ముందు దేశంలో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు జ‌ర‌గ‌లేదా?
అంటే జ‌రిగాయి.. మ‌రి తిల‌క్ ఆ ఉత్స‌వాల ద్వారా జాతీయ భావాల‌ను, స్వాతంత్ర్య ఉద్య‌మ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేలా ప్ర‌జ‌ల‌ను ఐక్యం చేయ‌గ‌లిగారు. అందుకే వినాయ‌క చ‌వితి అంటే మొద‌ట గుర్తొచ్చేది ఆయ‌న పేరే...
***********************
కేసీఆర్‌కు ముందు తెలంగాణ ఉద్య‌మం లేదా? అంటే ఉంది. హేమాహేమి నేత‌లంతా ఆ ఉద్య‌మాన్ని ముందుకు న‌డిపారు.. విజ‌యాన్ని సాధించ‌లేద‌న్న‌ది వేరే విష‌యం.. కానీ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ వ‌చ్చింది కాబ‌ట్టే తెలంగాణ‌కు ప‌ర్యాయ ప‌దంగా కేసీఆర్ మారారు...
**********************
ఇక ద‌స‌ర పండుగ త‌ర్వాత జ‌రుపుకున్న ఆల‌య్ బ‌ల‌య్ పేరు చెబితే ఠ‌క్కున గుర్తుకొచ్చే పేరు మ‌న ద‌త్త‌న్నే క‌దా... పార్టీల‌క‌తీతంగా నేత‌లంద‌రినీ ఆల‌య్ బ‌ల‌య్‌తో ఒక్క‌టి చేస్తున్న‌ది ఆయ‌నే క‌దా.. అందుకే ఆయ‌న పేరు ఆల‌య్ బ‌ల‌య్ ద‌త్త‌న్న‌గా మారిపోయింది..
***********************
క‌విత‌కు ముందు తెలంగాణ‌లో బ‌తుక‌మ్మే లేదా? అస‌లు ఆ పండుగ‌నే జ‌రుపుకునే వారు కాదా? అంటే ముమ్మాటికీ తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ‌ను జ‌రుపుకునే వారు.. కానీ క‌విత వ‌చ్చాక గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా, జాతీయస్థాయి నుంచి అంత‌ర్జాతీయస్థాయి వ‌ర‌కు బ‌తుక‌మ్మ పండుగ విస్త‌రించింది. అయితే దాని ద్వారా కూడా ఉద్య‌మ భావజాల వ్యాప్తి జ‌రిగింది...
**********************
పైన ప్ర‌స్తావించిన పేర్ల‌లోని ఎవ‌రూ కూడా వీటి వ‌ల్ల త‌మ‌కు పేరు వ‌స్తుంద‌ని, త‌మ‌కు ప‌ద‌వులు ల‌భిస్తాయ‌ని ఆశించ‌లేదు... చేస్తున్న ప‌నిని కొన‌సాగించారు. రావాల్సిన పేరు, ప‌ద‌వులూ వ‌చ్చేశాయి.. పోయిన ఏడాది పాపం ద‌త్త‌న్న ఎంపీగా గెలిచాడు. తెలంగాణ నుంచి ఆయ‌న మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు.. ఆయ‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌లేదు.. మ‌రి ప‌ద‌వి ద‌క్క‌లేదు క‌దా అని ఆయ‌న ద‌స‌ర సంద‌ర్భంగా చేసే ఆల‌య్ బ‌ల‌య్‌ని ఆపాడా? ఆప‌లేదు క‌దా.. దీపావ‌ళి ముందు క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో మంత్రి అయ్యాడు..
******************
ఫ‌లితం ఆశించ‌కుండా చేస్తున్న ప‌నిని నిష్ట‌గా చేస్తే రావాల్సిన గుర్తింపు, ద‌క్కాల్సిన ప‌ద‌వులు అన్నీ ద‌క్కుతాయి.

No comments:

Post a Comment