1

1

Saturday, 17 October 2015

తెలంగాణ హృద‌య స్పంద‌న‌.. ఆల్ ద బెస్టు టు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

తెలంగాణ హృద‌య స్పంద‌న‌..
************* 
పేద‌లు కూడా పండుగొచ్చిందంటే అప్పోస‌ప్పో చేసి ఆనందంగా ఆ పండ‌గను ఘ‌నంగా జ‌రుపుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు. అలాంటిది ఆంధ్రా, రాయ‌ల‌సీమ వాసుల క‌ల‌ల న‌గ‌ర‌మైన అమ‌రావ‌తి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మం పండ‌గ క‌న్నా పెద్ద‌దే.. ఆ కార్య‌క్ర‌మాన్ని ఆర్భాటంగా జ‌రుపుకుంటే త‌ప్పులేద‌ని నా భావ‌న‌. ఇప్పుడు లోటు బ‌డ్జెట్‌లో ఉన్నాం అని సాదాసీదాగా జ‌రుపుకుంటే.. రేపు అభివృద్ధి ప‌థంలో ముందుకెళ్లిన స‌మ‌యంలో రాబోయే త‌రాల‌కు ఎంత వైభ‌వంగా మ‌న న‌గ‌ర శంకుస్థాప‌న జ‌రిగిందో తెలియ‌జెప్పాల్సిన అవ‌స‌రం ఉంటుంది. అప్పుడు డ‌బ్బున్నా రాజ‌ధాని శంకుస్థాప‌న‌ను ఘ‌నంగా చేసుకోలేరు క‌దా.. ఇది చ‌రిత్ర పుట‌ల్లోకి ఎక్కే స‌న్నివేశం. రాజ‌ధాని శంకుస్థాప‌న‌లు ప‌దేప‌దే జ‌ర‌గ‌వు క‌దా పుట్టిన రోజు పండ‌గ‌ల మాదిరిగా.. సో.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం వెచ్చించే డ‌బ్బు గురించి ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు. అదో మ‌హ‌త్త‌ర ఘ‌ట్ట‌మే.. అందులో అంద‌రూ సిద్ధాంత వైరుద్ధ్యాల‌ను ప‌క్క‌న పెట్టి పాలుపంచుకోవ‌డ‌మే ఉత్తమం..
ఆల్ ద బెస్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌... అమ‌రావ‌తి హైద‌రాబాద్ త‌ర‌హాలో వ‌ర్థిల్లాల‌ని ఆకాంక్షిస్తున్నా.. !!
జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌.!!
******
(భ‌ర‌త మాత చిన్న కుమార్తె అయిన తెలంగాణ రాష్ట్రం త్వ‌ర‌లోనే పురుడు బోసుకోబోతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తికి నిండు మ‌న‌సుతో స్వాగ‌తం ప‌లుకుతోంది.)

Friday, 16 October 2015

ఎవ‌రేమ‌న్నా చ‌రిత్ర పుటల నుంచి వాళ్ల పేరు చెరిపేయ‌డం క‌ష్ట‌మే..

లోక మాన్య తిల‌క్ కు ముందు దేశంలో వినాయ‌క చ‌వితి ఉత్స‌వాలు జ‌ర‌గ‌లేదా?
అంటే జ‌రిగాయి.. మ‌రి తిల‌క్ ఆ ఉత్స‌వాల ద్వారా జాతీయ భావాల‌ను, స్వాతంత్ర్య ఉద్య‌మ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేలా ప్ర‌జ‌ల‌ను ఐక్యం చేయ‌గ‌లిగారు. అందుకే వినాయ‌క చ‌వితి అంటే మొద‌ట గుర్తొచ్చేది ఆయ‌న పేరే...
***********************
కేసీఆర్‌కు ముందు తెలంగాణ ఉద్య‌మం లేదా? అంటే ఉంది. హేమాహేమి నేత‌లంతా ఆ ఉద్య‌మాన్ని ముందుకు న‌డిపారు.. విజ‌యాన్ని సాధించ‌లేద‌న్న‌ది వేరే విష‌యం.. కానీ కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ వ‌చ్చింది కాబ‌ట్టే తెలంగాణ‌కు ప‌ర్యాయ ప‌దంగా కేసీఆర్ మారారు...
**********************
ఇక ద‌స‌ర పండుగ త‌ర్వాత జ‌రుపుకున్న ఆల‌య్ బ‌ల‌య్ పేరు చెబితే ఠ‌క్కున గుర్తుకొచ్చే పేరు మ‌న ద‌త్త‌న్నే క‌దా... పార్టీల‌క‌తీతంగా నేత‌లంద‌రినీ ఆల‌య్ బ‌ల‌య్‌తో ఒక్క‌టి చేస్తున్న‌ది ఆయ‌నే క‌దా.. అందుకే ఆయ‌న పేరు ఆల‌య్ బ‌ల‌య్ ద‌త్త‌న్న‌గా మారిపోయింది..
***********************
క‌విత‌కు ముందు తెలంగాణ‌లో బ‌తుక‌మ్మే లేదా? అస‌లు ఆ పండుగ‌నే జ‌రుపుకునే వారు కాదా? అంటే ముమ్మాటికీ తెలంగాణ‌లో బ‌తుక‌మ్మ‌ను జ‌రుపుకునే వారు.. కానీ క‌విత వ‌చ్చాక గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా, జాతీయస్థాయి నుంచి అంత‌ర్జాతీయస్థాయి వ‌ర‌కు బ‌తుక‌మ్మ పండుగ విస్త‌రించింది. అయితే దాని ద్వారా కూడా ఉద్య‌మ భావజాల వ్యాప్తి జ‌రిగింది...
**********************
పైన ప్ర‌స్తావించిన పేర్ల‌లోని ఎవ‌రూ కూడా వీటి వ‌ల్ల త‌మ‌కు పేరు వ‌స్తుంద‌ని, త‌మ‌కు ప‌ద‌వులు ల‌భిస్తాయ‌ని ఆశించ‌లేదు... చేస్తున్న ప‌నిని కొన‌సాగించారు. రావాల్సిన పేరు, ప‌ద‌వులూ వ‌చ్చేశాయి.. పోయిన ఏడాది పాపం ద‌త్త‌న్న ఎంపీగా గెలిచాడు. తెలంగాణ నుంచి ఆయ‌న మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ అనుకున్నారు.. ఆయ‌న‌కు ప‌ద‌వి ద‌క్క‌లేదు.. మ‌రి ప‌ద‌వి ద‌క్క‌లేదు క‌దా అని ఆయ‌న ద‌స‌ర సంద‌ర్భంగా చేసే ఆల‌య్ బ‌ల‌య్‌ని ఆపాడా? ఆప‌లేదు క‌దా.. దీపావ‌ళి ముందు క్యాబినెట్ విస్త‌ర‌ణ‌లో మంత్రి అయ్యాడు..
******************
ఫ‌లితం ఆశించ‌కుండా చేస్తున్న ప‌నిని నిష్ట‌గా చేస్తే రావాల్సిన గుర్తింపు, ద‌క్కాల్సిన ప‌ద‌వులు అన్నీ ద‌క్కుతాయి.

ప్ర‌భుత్వ రాయితీలు వ‌దులుకునేందుకు జ‌ర్న‌లిస్టులు సిద్ధ‌మా?

ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను నిర‌సిస్తూ కేవ‌లం ర‌చ‌యిత‌లు మాత్ర‌మే అవార్డులను వెన‌క్కి ఇచ్చేస్తున్నారా? దీన్ని కొంద‌రు జ‌ర్న‌లిస్టులు అత్య‌ద్భుతం అని పొగుడుతున్నారు.. మంచిదే.. మ‌రి మీరు నిర‌స‌న తెల‌పొచ్చు క‌దా...!!
***********
ప్ర‌భుత్వ రైతు వ్య‌తిరేక విధానాలు, ఎన్‌కౌంట‌ర్ల‌ను ఖండించే జ‌ర్న‌లిస్టులు కూడా ప్ర‌భుత్వం ఇచ్చిన అక్రిడియేష‌న్ కార్డుల‌ను, ఆరోగ్య కార్డుల‌ను, ఇళ్ల స్థ‌లాల‌ను, ఇత‌ర‌త్రా స‌బ్సిడీల‌ను కూడా వెన‌క్కి ఇచ్చేసి నిఖార్స‌యిన జ‌ర్న‌లిస్టులం అని నిరూపించుకోవ‌చ్చు క‌దా..!!

శాఖాహారుల‌కు క‌(న‌)ష్టకాలం... మాంసం తిందామంటే ప్రాణాపాయం...!!

చికెన్ ధ‌ర‌ను మించిపోతున్న ప‌ప్పు ధాన్యాల ధ‌ర‌లు.. ఈ లెక్క‌న శాఖాహారులు కూడా మాంసాహారులుగా మారాలేమో.. చికెన్ ధ‌ర‌ల‌ను త‌గ్గించి ప‌ప్పు ధాన్యాల ధ‌ర‌ల‌ను పెంచిన ఘ‌నులు ఎవ‌రు? ఈ క్రెడిట్ ఎవ‌రి ఖాతాలోకి.. రేపు చికెన్ తింటే చంప‌ర‌ని గ్యారెంటీ ఇవ్వ‌గ‌లరా?

ఇది ఆంధ్ర‌జ్యోతిలో రాసిన వార్త‌లోని కొన్ని వ్యాఖ్య‌లు...

ఇది ఆంధ్ర‌జ్యోతిలో రాసిన వార్త‌లోని కొన్ని వ్యాఖ్య‌లు...
కేంద్రం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగితే నిధులు మంజూరు చేస్తార‌ట‌... ఈ మాట‌ల‌ను కేంద్ర మంత్రులే అంటున్నార‌ట‌... రాష్ట్రంలో పాల‌న‌ను గాలికి వ‌దిలేసి ఢిల్లీలో మ‌కాం పెడితే స‌రిపోతుంద‌న్న‌ట్లు.. !!
************
‘‘కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒక పని కావాలంటే ఒకటికి వంద సార్లు తిరగాలి. అప్పుడు కూడా పని జరుగుతుందన్న నమ్మకం లేదు. అయినా, పోయి రావలె హస్తినకు అన్నట్లు కాలికి బలపం కట్టుకొని తిరిగితే తప్ప పనులు కావడం కష్టం. అటువంటిది మొక్కుబడిగా ఓ విజ్ఞాపన పత్రం ఇచ్చి ఊరుకుంటే బుట్టదాఖలు కావడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదు’’ అని కేంద్ర మంత్రులు పలు వురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు, కేసీఆర్‌ ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చి ఎవరెవరిని ఎన్నిసార్లు కలిశారో లెక్కతీస్తే అసలు రంగు బయట పడుతుందంటున్నారు.

కేంద్రం నిధులు ఎందుకు రావ‌డం లేదు..

2014 జూన్ త‌ర్వాత కేంద్రం నుంచి తెలంగాణ‌కు వ‌చ్చింది 966 కోట్ల రూపాయ‌లు.. రావాల్సింది 11 వేల కోట్లు. ఇక ఉపాధి హామీకి నిధులే రాలేదు.. ఇదే టీం ఇండియా స్ఫూర్తి.. టీం ఇండియాలో తెలంగాణ భాగ‌మే క‌దా.. మ‌రి రావాల్సిన నిధులు రాక‌పోవ‌డానికి కార‌ణం ఏంటి?
ప‌క్ష‌పాత ర‌హితంగా నిధులు విడుద‌ల చేయాలి క‌దా.. అలా చేయ‌క‌పోవ‌డానికి కార‌ణాలు ఏంటో?

తెలంగాణ‌లో కాలువ నీళ్ల‌తో సాగు చేసే రోజులొస్తే రైతు క‌న్నీళ్లు దూరం...

బోర్ల మీద ఆధార‌ప‌డ‌కుండా తెలంగాణ రైతులు వ్య‌వ‌సాయం చేసే రోజులు రావాలి. ఆ రోజులు రావాలంటే ప్ర‌తిపక్షాల విమ‌ర్శ‌ల‌ను ప‌ట్టించుకోకుండా ప్ర‌భుత్వం శ‌ర వేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల‌ను పూర్తి చేయాలి. విద్యుత్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపిన‌ట్లే రైతు స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపాలి. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్త‌యితే తెలంగాణ‌లో బీడుగా ఉన్న భూముల్లో ప‌సిడి పంట‌లు పండుతాయి. రైతుకు బోర్లు వేసుకునే ఖ‌ర్చు త‌గ్గుతుంది. క‌ర‌వు, కాట‌కాల‌తో నిమిత్తం లేకుండా ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని స‌మ‌ర్థ‌వంతంగా వాడుకొని పంట‌లు పండించుకోలుగుతాడు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాకుండా చూడ‌టానికి ఆంధ్రా మీడియా, ఆంధ్రా మీడియాకు వ‌త్తాసు ప‌లికే తెలంగాణ నేత‌లు కొంద‌రు ప్ర‌య‌త్నిస్తారు. వాళ్ల పెడ‌బొబ్బ‌ల‌ను లెక్క‌చేయ‌కుండా రానున్న మూడేళ్ల‌లో సాగు నీటి ప్రాజెక్టుల‌ను పూర్తి చేయ‌గ‌లిగితే తెలంగాణ‌కు దీర్ఘ‌కాలంలో ఎంతో మేలు జ‌రుగుతుంది..

నిజాం సాగ‌ర్ గోదావ‌రిపై క‌ట్టార‌ట‌.. ఈనాడు రాత‌గాడి పైత్యం..

నిజాం సాగ‌ర్ ఏ న‌దిపై ఉంద‌ని ఎవ‌రైనా అడిగితే ప్ర‌తీ ఒక్క‌రూ ఠ‌క్కున మంజీరా అంటారు.. కానీ ఈనాడు ప‌త్రిక వాడికి మాత్రం నిజాం సాగ‌ర్ గోదావ‌రిపై క‌ట్టిన ప్రాజెక్టుగా క‌నిపించింది.. తెలంగాణ రాజ‌ముద్ర ను స‌రిగా గుర్తించి వేయ‌డం తెలియ‌దు, తెలంగాణ‌లో ఏ ప్రాజెక్టు ఏ న‌దిపై నిర్మించారో తెలియ‌కుండానే క‌థ‌నాలు రాసేస్తున్నారు.. చ‌దివేవాళ్లు ఉంటే రాసే వాళ్ల‌కు లోకువ అన్న భావ‌నో ఏమో తెలియ‌దు..

*************
ఇంత‌కీ ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌కు అనుకూల‌మా? వ్య‌తిరేక‌మా? అస‌లు తెలంగాణ‌లో ప్రాజెక్టులు క‌ట్టాలా వ‌ద్దా అన్న విష‌యాన్ని మాత్రం రాయ‌డానికి మ‌న‌సు రాలేదు.. బ‌హుషా వ‌స్తుంద‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుందేమో..!!

ఆంధ్రాలో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై వింత క‌థ‌నం..

క్ష‌ణికావేశాల‌తో విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. పూర్తిగా వారి వ్య‌క్తిగ‌త‌ప‌ర‌మైన అంశాల‌తో చ‌నిపోతున్నారు. ఇదీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై ఇంట‌ర్ విద్యా మండ‌లి నిపుణుల విశ్లేష‌ణ‌.. మ‌రి ప్ర‌భుత్వ‌ప‌ర‌మైన విద్యా మండ‌లి విశ్లేష‌ణ‌ను ప్రామాణికంగా తీసుకుని క‌థ‌నాలు రాసింది ఈనాడు. కార్పొరేట్ కాలేజీల‌కు ఆత్మ‌హ‌త్య‌ల‌తో సంబంధం లేద‌న్న‌ట్లుగా విశ్లేష‌ణ ఉంది. 
ఆంధ్రాలో రైతు ఆత్మ‌హ‌త్య‌లు జ‌రిగినా, విడ‌త‌ల వారీ రుణ మాఫీ చేస్తున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోరు.. అస‌లు ల‌క్ష కోట్ల రైతు, డ్వాక్రా రుణాల‌ను కుదించి 30 వేల కోట్ల‌కు చేసినా ఏ ఆంధ్రా ప‌త్రికా ప్ర‌శ్నించ‌దు.. వామ‌ప‌క్షాల‌ చ‌లో అసెంబ్లీలు ఉండ‌వు. బందులు ఉండ‌వు.. రైతు ఎక్క‌డైనా రైతే క‌దా.. అంద‌రి పక్షాన కొట్లాడితే బాగుంటుంది క‌దా.. !