కార్పోరేటర్లు భూ దందాలు, అక్రమాల జోలికి వెళ్లొద్దని హితవు చెబుతున్నారు డిప్యూటీ సీఎం గారు.. అసలు భూ దందాలే జీవితంగా బతుకుతున్న కార్పోరేటర్లు ఈ మాటలను పట్టించుకుంటారా? వారు నీతి వాక్యాలతో మారుతారనుకోవడం అత్యాశే.. సీఎం గారు నీతి వాక్యాలు చెప్పినా పట్టించుకునే స్థితిలో వారు లేరు.. కఠిన చర్యలు తీసుకుంటే తప్ప దారికొచ్చే రకం కాదు.. కొందరు కార్పోరేటర్ల తీరును స్వయంగా చూశాను కాబట్టే ఈ మాటలు చెబుతున్నాను.. అధికార పార్టీలో ఉన్న వాళ్లంతా కేసీఆర్ మాదిరిగా నిజాయతీగా ఉండాలనే నిబంధన లేదు..
ఇతర పార్టీల నుంచి వస్తున్న వారందరినీ చేర్చుకున్నాం.. కానీ వారికి అలవాటైన అవలక్షణాలు అంత త్వరగా పోయే అవకాశం లేదు కదా.. దానికి తోడు అధికార పార్టీ లో చేరడంతో కలిసొచ్చిన అధికార దర్పం.. వెరసి ఇక కొందరు కార్పోరేటర్లకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది... ఇలాంటి అవినీతి కార్పోరేటర్ల తీరు మారకుంటే భవిష్యత్ లో పార్టీకి తీరని నష్టం జరిగే అవకాశం లేకపోలేదు.. తస్మాత్ జాగ్రత్త.. !!