1

1

Tuesday, 3 February 2015

వ్యాస రూప ప్ర‌శ్నాప‌త్రాలంటే క‌ష్టం..

ఈ వార్త నిజ‌మైతే...!!

వ్యాస రూప స‌మాధానాలు రాస్తే దిద్దేవాళ్లు వేసే మార్కులు భిన్నంగా ఉండొచ్చు..
ఒక పేప‌ర్‌ను ముగ్గురు నిపుణులు చూస్తే మూడు ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్తం కావొచ్చు..
ఒక‌రు గ‌రిష్ఠ మార్కులు వేస్తే మ‌రొక‌రు క‌నిష్ఠ మార్కులు వేయొచ్చు..
క్ల‌రిక‌ల్ నుంచి అధికారి పోస్టు వ‌ర‌కు ఈ విధానం ముమ్మాటికీ స‌రికాదు..
గ్రూప్‌-1, గ్రూప్‌-2 ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో వ్యాస‌రూప ప్ర‌శ్న‌ల కోసం ఓ పేప‌ర్ పెట్ట‌డ‌మో చేయాలి..
లేదా విష‌య విశ్లేష‌ణ సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించేందుకు కొన్ని ప్ర‌శ్న‌ల‌ను ఇవ్వ‌డ‌మో చేయాలి..
వీలైనంత పార‌ద‌ర్శ‌క‌త‌కు ఆస్కారం ఉండే విధానాన్ని రూపొందించాల‌ని విజ్ఞ‌ప్తి...



నోట్‌:   అంతో ఇంతో విష‌య నైపుణ్యం ఉన్న‌ప్ప‌టికీ అంద‌రూ గంటా చ‌క్ర‌పాణి సార్ లాగా రాయ‌లేరు క‌దా..  అందుకే మెజారిటీ నిరుద్యోగుల నైపుణ్యాల‌ను అర్థం చేసుకుని  ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో మార్పులు చేర్పులు చేయాలి.. ఒకేసారి సివిల్స్ మాదిరిగా మార్చితే ఎవ‌రూ త‌ట్టుకోలేరని నా భావ‌న‌..

No comments:

Post a Comment