1

1

Saturday, 29 November 2014

ఓట‌ర్లుగా న‌మోదు చేయించుకోండి..


ప‌ట్ట భ‌ద్రుల నియోజ‌క‌వ‌ర్గ ఎన్నిక‌ల కోసం ఓట‌ర్లుగా న‌మోదు చేయించుకోండి.. అస‌లే ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌, న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గాల స్థానానికి ఎన్నిక‌ల జ‌ర‌గ‌నుంది.. గ‌తంలో టీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీ చేసిన దిలీప్ కుమార్ స్థానం ఇదే.  ఈ ఎమ్మెల్సీ ఎన్నిక‌లు తెలంగాణ ప్ర‌భుత్వ ఫ‌లితీరుకు ద‌ర్ప‌ణంగా నిల‌వ‌డం ఖాయం. విద్యావంతులు మాత్ర‌మే త‌మ ఓటు హ‌క్కును ఉప‌యోగించుకుంటారు. సో ప్ర‌భుత్వం ప‌నితీరుపై విద్యావంతుల మ‌నోభావాల‌కు ఈ ఎన్నిక‌లు నిద‌ర్శ‌నంగా ఉంటాయి.. 

మ‌న కేబుల్ ఆప‌రేట‌ర్లు దీనిపైన కూడా కొంచెం దృష్టిపెట్టాలి.. !!!

మొన్న మ‌న పొరుగున ఉన్న ఆంద్రా రాష్ట్రంలో ఓ 10 రోజులు ప‌ర్య‌టించాను. అక్క‌డ హోట‌ల్‌లో బ‌స చేశాను.. తెలంగాణ‌ల ఏం జ‌రుగుతుందో తెలుసుకుందామ‌ని టీవీ రిమోట్ ప‌ట్టుకు చూస్తే అన్నీ ఆంధ్రా ఛానెల్స్ మాత్ర‌మే వ‌స్తున్నాయి..  మ‌న వ‌ద్ద ఈటీవీ తెలంగాణ‌, ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండూ వ‌స్తాయి... కానీ ఆంధ్రాలో ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాత్ర‌మే వ‌స్తుంది.. ఇక టీ న్యూస్‌, వీ6 అన్న‌వి క‌నిపించ‌లేదు.. పోనీలే టీవీ9, ఎన్టీవీలు చూద్దామ‌ని పెడితే తూళ్లూరులో కోట్ల రూపాయాలు ప‌లుకుతున్న భూమి అంటూ వార్త‌లు క‌నిపించాయి.. మ‌రి ఆంధ్రాలో కేబుల్ ఆప‌రేట‌ర్లు ఏమైనా తెలంగాణ ఛానెళ్ల‌పై బ్యాన్ విధించారా?    మ‌రి తెలంగాణ‌లో ఈటీవీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎందుకు వ‌స్తుంది?   ఆంధ్రాలో ఈటీవీ తెలంగాణ ఎందుకు రావ‌డం లేదు?   మ‌రి మ‌న కేబుల్ ఆప‌రేట‌ర్లు దీనిపైన కూడా కొంచెం దృష్టిపెట్టాలి.. !!!

ఈ వేల కోట్ల ప‌రిహారాల‌తో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు, చెట్ల పెంప‌కానికి కృషి చేస్తారో? వేచిచూడాల్సిందే..!!!

ఇటీవ‌ల‌ నేను ఉత్త‌రాంధ్ర‌లో ప‌ర్య‌టించాను. దాదాపు ఓ 15 రోజులు..
తుపాన్ తాకిడికి దెబ్బ‌తిన్న విశాఖ చెట్ల‌ను చూశాను..తుపాన్ బాధితుల కోసం అంటూ విరాళాలు సేక‌రిస్తున్నారు. అయితే తుపాన్ వ‌ల్ల  తీవ్రంగా న‌ష్ట‌పోయింది ప‌ర్యావ‌ర‌ణం, చెట్లు.. నోరున్న ప్ర‌జ‌ల‌కే న‌ష్టం వాటిల్లితే ప‌రిహారాల‌ను మెక్కేసిన పుణ్యాత్ములు వీళ్లు.. ఇక నోరు లేని చెట్లు, చేమ‌ల‌కు వ‌చ్చే  ఆ ప‌రిహారాన్ని ఎవ‌రి ఖాతాలో వేసుకుంటారో ? అన్న సందేహం క‌లిగింది.. ప్ర‌కృతి అందాల విశాఖ తుపాన్ తాకిడికి కొంత క‌ళావిహీనంగా మారింది.. ఈ వేల కోట్ల ప‌రిహారాల‌తో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు, చెట్ల పెంప‌కానికి కృషి చేస్తారో?  వేచిచూడాల్సిందే..!!!

చ‌రిత్ర‌లో మంచీ చెడూ రెండూ ఉంటాయి..

కాక‌తీయులు గొప్ప‌వాళ్లు.. కాక‌తీయులు చెరువులు త‌వ్వించారు అని చెబుతారు..
మ‌రి కాక‌తీయ పాల‌కుడు ప్ర‌తాప‌రుద్రుడు స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, జంప‌న్న‌ల‌ను చంపేసింది వాస్త‌వం కాదా?
క‌ర‌వు కోర‌ల్లో ఉన్నాం.. ఈసారికి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌మ‌న్నా అంగీక‌రించ‌నిది వాస్త‌వం కాదా?
గిరిజ‌నుల‌పైకి సైన్యాన్ని పంపి వారిని హ‌త‌మార్చింది చ‌రిత్ర కాదా?
మ‌ళ్లా అదే ప్ర‌తాప‌రుద్రుడు ఢిల్లీ సుల్తాన్‌ల‌తో వీరోచితంగా పోరాడిన గాథ‌ల‌ను మ‌నం చెప్పుకుంట‌లేమా?
చ‌రిత్ర‌లో మంచీ చెడు రెండూ ఉంటాయి.. ఒక త‌ప్పు జ‌రిగింద‌ని చ‌రిత్ర‌లో అత‌డికి స్థాన‌మే ఉండ‌వ‌ద్దంటే ఈ భార‌త దేశ చ‌రిత్ర‌లో అన్నీ ఖాళీ పేజీలే క‌నిపిస్తాయి...!!!

తెలంగాణ‌లో ఆంధ్రా నేత‌ల విగ్ర‌హాలు, పేర్లు అన‌వ‌స‌రం.

తెలంగాణ‌లో ఆంధ్రా నేత‌ల విగ్ర‌హాలు, పేర్లు అన‌వ‌స‌రం.. ఈ విష‌యంలో ఎన్టీఆర్‌, వైఎస్ ప్ర‌తిమ‌లు రోడ్ల‌పై కుప్ప‌లు తెప్ప‌లుగా ఉన్నాయి.. వీటిని కూడా వెన‌క్కి పంపించాలి.. అయితే టీడీపీకి చెందిన ఎన్టీఆర్ స్థానంలో తెలంగాణ టీటీపీకి చెందిన దివంగ‌త నాయ‌కులైన మాధ‌వ రెడ్డిలాంటి వారి విగ్ర‌హాలు పెట్టాలి.. అలాగే వైఎస్ విగ్ర‌హాలు ఉన్న చోట తెలంగాణ కాంగ్రెస్‌కు చెందిన దివంగ‌త నేత‌ల విగ్ర‌హాలు పెట్టాలి.. ఈ ప్ర‌తిపాద‌న ఆ రెండు పార్టీల‌ను సంతృప్తిప‌రుస్తుంది... మ‌న చెన్నారెడ్డి, మ‌న అంజ‌య్య‌, మ‌న పీవీ న‌ర‌సింహారావుల విగ్ర‌హాలు ఆంద్రా గ‌ల్లీల్లో క‌నిపిస్తాయా?   లేదు క‌దా..  మ‌రి మ‌న గ‌ల్లీల్లో మ‌న తెలంగాణ నేత‌ల విగ్ర‌హాలు లేదా జాతీయ‌, సామాజిక ఉద్య‌మ‌కారుల విగ్ర‌హాలే ఉండాల‌న్న‌ది నా డిమాండ్‌...

అమెరికా అధ్య‌క్షుడికి కూడా మ‌నం వీసా నిరాక‌రించాలేమో..!

మైనారిటీల‌పై అకృత్యాల‌ను అరిక‌ట్ట‌లేక‌పోయారంటూ అప్ప‌ట్లో మోడీ గారికి అమెరికా వీసా నిరాక‌రించింది క‌దా..
ఇప్పుడు అమెరికా అధ్య‌క్షుడికి కూడా మ‌నం వీసా నిరాక‌రించాలేమో..!  ఆ దేశంలో న‌ల్ల‌జాతీయుల‌పై అకృత్యాలు కొన‌సాగుతున్నాయి క‌దా..!!

అది... ప్రెస్ కౌన్సిల్ ఆఫ్‌ ఆంధ్ర‌

దేశ స్థాయిలో ఉండే ప్ర‌భుత్వాలు, సంస్థ‌ల‌కు అన్ని రాష్ట్రాలూ స‌మాన‌మే. కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు మాత్రం ఆంధ్ర‌కు ముల్లు గుచ్చుకున్నా అది ప్ర‌పంచ బాధ‌గా మారింది. అదే తెలంగాణ‌కు భారీ గాయ‌మైనా ఏమాత్రం ప‌ట్టింపు లేకుండా ఉంది. మ‌రి ఆ కుర్చీలో కూర్చున్న వారు గ‌తంలో పెద్ద పెద్ద స్టేట్‌మెంట్ల‌తో మాన‌వ‌తావాదులుగా, మేధావులుగా కీర్తించ‌బ‌డ్డారు. కానీ మిత్రులారా... ఈ ఒక్క ఉదాహ‌ర‌ణ చూడండి. ఆత‌ర్వాత వారినేమంటో మీరే నిర్ణ‌యించండి. అంతేకాదు.... అస‌లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానా అది ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర‌నా నిర్ణ‌యించండి.
రాష్ట్ర విభ‌జ‌న‌తో తెలంగాణ‌, సీమాంధ్ర మీడియా ఏదో పానీకా పానీ... దూద్‌కా దూద్ అన్న‌ట్లు తేలిపోయింది. ఈ నేప‌థ్యంలో రెండు రాష్ట్రాల్లో కొన్ని మీడియా సంస్థ‌లు బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌య్యాయి. ఆయా రాష్ట్రాల ప్ర‌జ‌లు ఒక్కొక్క‌రి తమ కోణంలో ఒక‌టి మంచిది అనిపించ‌వ‌చ్చు. కానీ దేశ‌స్థాయిలో వెల‌గ‌బెడుతున్న ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు రెండు రాష్ట్రాలు, అన్ని మీడియా సంస్థ‌లు స‌మాన‌మే. అయినా పీసీఐ దానిని ఆచ‌ర‌ణ‌లో చూప‌కుండా ఫ‌క్తు ఆంధ్ర కౌన్సిల్‌గా వ్య‌వ‌హ‌రించింది. వాస్త‌వంగా తెలంగాణ‌లో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి, టీవీ9 నిషేధంపై పీసీఐ సెప్టెంబ‌రు 12న త్రిస‌భ్య క‌మిటీని వేసింది. అదేవిధంగా ఏపీ సీఎం చంద్ర‌బాబు అధికారిక స‌మావేశాల‌కు న‌మ‌స్తే తెలంగాణ‌ను బ‌హిష్క‌రిస్తున్నార‌నే ఫిర్యాదుపై సెపె్టంబ‌రు 26న త్రిస‌భ్య క‌మిటీ వేశారు. మొద‌టి క‌మిటీలో తెలంగాణ వారెవ‌రూ లేరు. కానీ రెండో క‌మిటీలో ఆంధ్రకు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు స‌భ్యుడు. స‌రే... అది ప‌క్క‌న‌పెడితే మొద‌టి క‌మిటీ రోజుల వ్య‌వ‌ధిలోనే విచార‌ణ ముగించి... కేంద్ర స‌మాచార‌, బ్రాడ్‌కాస్టింగ్‌కు నివేదిక ఇచ్చింది. అందులో తెలంగాణ రాష్ట్రంలో మీడియాకు పెద్ద ఎత్తున ముప్పు ఉందంటూ వాపోయింది. కానీ రెండో క‌మిటీ విచార‌ణ ముగించి దాదాపు రెండు నెల‌లు కావ‌స్తుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు నివేదిక ఇవ్వ‌లేదు. తెలంగాణ‌కు చెందిన ఒక యువ ఐఐటీ ప్రొఫెస‌ర్ ఈ గుట్టును స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ర‌ట్టు చేశారు. రెండు ఫిర్యాదుల‌పై వేసిన క‌మిటీల నివేదిక‌లేంటో చెప్పాలంటూ కేంద్ర ప్ర‌భుత్వానికి ఆన్‌లైన్‌లో స‌హ చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆంధ్ర మీడియా ఆవేద‌న‌పై నివేదిక వ‌చ్చిందంటూ కేంద్ర స‌మాచార‌, బ్రాడ్‌కాస్టింగ్ ఆదేశంతో స‌మాధాన‌మిచ్చిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న‌మ‌స్తే తెలంగాణ అంటే ఆంధ్ర స‌ర్కారు వైఖ‌రిపై మాత్రం ఇంకా విచార‌ణ నివేదిక అంద‌లేద‌ని స‌మాధాన‌మిచ్చింది. మ‌రి ఆంధ్రకైతే 20 రోజుల్లోపు వ‌చ్చిన నివేదిక‌... తెలంగాణ విష‌యంలో ఎందుకు రాలేదో కుర్చీల్లో హోదాలు వెల‌గ‌బెడుతున్న వారు విచారించాలి క‌దా... అంటే ఆంధ్ర బాధ లోకం బాధ‌... తెలంగాణ గోడు ఎవ‌రికీ ప‌ట్ట‌దా? ఇది తెలంగాణ ప్ర‌జ‌ల‌కే కాదు... వేడుక‌లు, కార్య‌క్ర‌మాల్లో బ్యాన‌ర్ల‌పై తెలంగాణ జ‌ర్న‌లిస్టు సంఘాల నేత‌ల‌మ‌ని చెప్పుకుంటున్న ప్ర‌తి ఒక్క‌రికీ అవ‌మానం. మ‌రి వారు ఒక్క‌సారి త‌మ‌ను తాము ఆత్మ ప‌రిశీల‌న చేసుకుంటే బాగుంటుందేమో?!