1

1

Thursday, 27 November 2014

ఇదే స‌రైన స‌మ‌యం...

ఎలాగూ విమానాశ్ర‌యం ట‌ర్మిన‌ల్ పేరును మార్చారు.. బీజేపీ వాళ్లూ మ‌ద్ద‌తు ఇచ్చారు.. ఇది కేంద్రం చేతిలో ప‌ని కాబ‌ట్టి మ‌న వేద‌న అర‌ణ్య రోద‌న‌గానే మారుతోంది... అందుకే ఇక ట్యాంక్ బండ్ విగ్ర‌హాల‌ను న‌వ‌తా ట్రాన్స్‌పోర్టులో త‌ర‌లిస్తే బాగుంటుంది.. ఇప్పుడు అక్క‌డ మ‌న మ‌హ‌నీయుల విగ్ర‌హాలు పెట్టుకుంటే స‌రిపోతుంది.. ఏ ఒక్క నేత ప్ర‌శ్నించ‌లేడు.. !!

రిటైర్‌మెంట్ వ‌య‌సు పెంచొద్దు...

ఉద్యోగుల రిటైర్‌మెంట్ వ‌య‌సును పెంచ‌బోమ‌న్న స‌ర్కారు నిర్ణ‌యం బాగుంది..
తెలంగాణ‌లోనూ రిటైర్‌మెంట్ వ‌య‌సును 60 ఏళ్ల‌కు పెంచితే ఇక్క‌డ నుంచి ఏ ఒక్క ఉద్యోగి కూడా ఆంధ్రా ప్రాంతానికి వెళ్ల‌డానికి మొగ్గుచూప‌డు..
మ‌న నిరుద్యోగుల‌కూ న‌ష్టం వాటిల్లుతుంది.. క‌నీసం ఆంధ్రాలో రిటైర్‌మెంట్ వ‌య‌సు ఎక్కువ‌గా ఉంద‌న్న చిరు ఆశ‌తోనైనా కొంద‌రు అక్క‌డికి వెళ్ల‌డానికి ఆప్ష‌న్లు ఇస్తారేమో..!!

ఎందుకిలా ఆలోచిస్తున్నారు...?

స‌మైక్య రాష్ట్రంలో మ‌న ఉద్యోగాలను నిబంధ‌న‌లు ఉల్లంఘించి ఆంధ్రా ప్రాంతీయుల‌కు క‌ట్ట‌బెడితే వీళ్లు నోరు తెర‌వలేదు..
స‌మైక్య రాష్ట్రంలో మ‌న నీళ్లు, మ‌న నిధుల‌ను ఇత‌ర ప్రాంతాల‌కు త‌ర‌లించినా ప‌ట్టించుకోలేదు...
కానీ నేడు తెలంగాణలోని కాంట్రాక్టు ఉద్యోగాల‌ను ప‌ర్మినెంట్ చేస్తామంటే కొంద‌రు స‌హించ‌డం లేదు..
పాల‌మూరు మీదుగా కాలువ‌లు త‌వ్వి పాల‌మూరు, న‌ల్గ‌గొండ‌, రంగారెడ్డికి నీళ్లు ఇద్దామ‌ని ప్ర‌తిపాదిస్తే దానికీ అంగీక‌రించ‌డం లేదు..
మ‌న ఉద్యోగాలు, నీళ్ల‌తో ఇత‌రులు బాగుప‌డినా ఓకే కానీ.. తెలంగాణ ప్ర‌జ‌లు బాగుప‌డొద్ద‌నా వీరి ఆలోచ‌న‌...!!
ఎందుకిలా ఆలోచిస్తున్నారు...?

రేప‌టి దృశ్యం...!!

డ‌బ్బింగ్ సినిమాలు, డ‌బ్బింగ్ సీరియ‌ళ్ల‌ మూలంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని చిత్ర సీమ‌లోని కొంద‌రు పెద్ద‌లు అప్ప‌ట్లో పెద్ద ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.. ఆ సినిమాల విడుద‌ల‌పై ఆంక్ష‌లు విధించ‌డం చేశారు.. వాటిపై ప‌న్నులు పెంచారు.. ఇంకొంద‌రైతే డ‌బ్బింగ్ సీరియ‌ళ్ల‌ను ఆపేయాల‌ని పెద్ద ఉద్య‌మ‌మే చేశారు... అప్పుడు దీన్ని చాలా ఛానెళ్లు త‌ప్పుప‌ట్ట‌లేదు.. సినిమాకు జాతి, మ‌త‌, కుల‌, భాష, ప్రాంతీయ భేదాలు ఉండ‌వ‌నే పెద్ద‌ల‌కు పైన చేసిన చ‌ర్య త‌ప్పుగా అనిపించ‌లేదు ఎందుకో?
రేపు తెలంగాణ‌లోనూ ప‌క్క రాష్ట్రం సినిమాల విడుద‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తే వీళ్లు నోరు మూసుకు కూర్చుంటారా?
ప‌క్క రాష్ట్రం సినిమాల వ‌ల్ల తెలంగాణ సినీ ప‌రిశ్ర‌మ‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని అంటే ఒప్పుకుంటారా?
నోట్‌: ప‌క్క రాష్ట్రాల సినిమాలు, సీరియ‌ళ్లు వ‌ద్ద‌ని వీళ్లు అనుకుంటే త‌ప్పు కాదు కానీ.. ప‌క్క రాష్ట్రం ఛానెళ్లు, వార్త‌లు వ‌ద్ద‌ని మ‌నం అనుకుంటే త‌ప్పు అవుతుందట‌.. ఇదెక్క‌డి చోద్య‌మో...!!

ఇది తెలంగాణ ప‌బ్లిక్ డిమాండ్‌!!

--------
స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ ఎయిర్‌పోర్టు.. గుజ‌రాత్‌
ఛ‌త్ర‌ప‌తి శివాజీ విమానాశ్ర‌యం.. మ‌హారాష్ట్ర‌
డాక్ట‌ర్ బాబాసాహెబ్ అంబేద్క‌ర్ విమానాశ్ర‌యం.. మ‌హారాష్ట్ర‌
నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ విమానాశ్ర‌యం.. బెంగాల్‌
లోక్‌నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ ఎయిర్‌పోర్టు.. బీహార్‌
---------
వీళ్లంతా మ‌హ‌నీయులే... దేశానికి ఎంతో సేవ చేసిన వారే... మ‌రి స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ పేరును మ‌హారాష్ట్ర విమానాశ్ర‌యానికి పెట్ట‌లేదు ఎందుకు?
ఛ‌త్ర‌ప‌తి శివాజీ పేరును గుజ‌రాత్ లోని విమానాశ్ర‌యానికి పెట్ట‌లేదు ఎందుకు?
బాబాసాహెబ్ అంబేద్క‌ర్ పేరును బీహార్‌లోని విమానాశ్ర‌యానికి పెట్ట‌లేదు ఎందుకు?
జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ పేరును బెంగాల్ విమానాశ్ర‌యానికి పెట్టలేదు ఎందుకు?
---
వీళ్లు ఎంత మ‌హ‌నీయులు అయినా స‌రే.. వాళ్ల రాష్ట్రాల్లోని విమానాశ్ర‌యాల‌కు మాత్ర‌మే వీరి పేర్లు పెట్టి గౌర‌వించారు.. అంతేకానీ పొరుగు రాష్ట్రాల్లోని విమానాశ్ర‌యాల‌కు వీరి పేర్ల‌ను పెట్ట‌లేదు.. అలాగే మ‌న తెలంగాణ‌తో సంబంధం ఉన్న‌.. ఇక్క‌డి గ‌డ్డ‌పై పుట్టిన వారి పేరునే ఇక్క‌డి విమానాశ్రయానికి, ట‌ర్మిన‌ల్‌కు పెట్టాలి... ఇది తెలంగాణ ప‌బ్లిక్ డిమాండ్‌!!

ఈ దేశంలో మాన‌వ హ‌క్కుల సంఘం ఇంకా ఉందండోయ్‌..!


ఈ దేశంలో మాన‌వ హ‌క్కుల సంఘం ఇంకా ఉందండోయ్‌..!
తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై స్పందించింది... 69 మంది రైతులు చ‌నిపోయారా? అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది..
మ‌రి తెలంగాణ కోసం వంద‌ల మంది యువ‌త చ‌నిపోయిన‌ప్పుడు ఈ సంఘం ఎలా స్పందించింది?
కేంద్రానికి, రాష్ట్రానికి నోటీసులు ఇచ్చిందా?
ఏది ఏమైనా మానవ హ‌క్కుల సంఘం దేశంలోని రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పైనా స్పందించి ఉంటే ఇంకా బాగుంటుంది..
రైతుల కోసం జాతీయ విధానాన్ని తీసుకొచ్చేలా అన్ని ప్ర‌భుత్వాల‌ను సూచ‌న‌లు చేస్తే ఎంతో సంతోషిస్తాను..
గిట్టుబాటు ధ‌ర‌ను రైతులే నిర్ణ‌యించుకునేలా ప్ర‌భుత్వాల‌కు సూచ‌న‌లు ఇవ్వాలి...
ఇవ‌న్నింటినీ మానవ హ‌క్కుల సంఘం చేస్తుందా?
నోట్‌:: మ‌హారాష్ట్ర‌లో 200 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ట‌... ఈ విష‌యాన్ని కేంద్ర‌మే ప్ర‌క‌టించింది.. మ‌రి ఆ రాష్ట్రానికి కూడా నోటీసులు జారీ చేయాలి.. దేశంలో ఏ ఒక్క రైతు ఆత్మ‌హ‌త్య జ‌ర‌గ‌కుండా అంద‌రు రైతుల హ‌క్కుల‌ను కాపాడేలా హ‌క్కుల సంఘం కృషి చేయాలి..!!

Wednesday, 26 November 2014

అంజ‌య్య పేరును ఆంధ్రాలో విమానాశ్ర‌యానికి పెట్టించేంత పెద్ద మ‌న‌సు చంద్ర‌బాబునాయుడుకు ఉందా?



జానారెడ్డి, కేసీఆర్ లాంటి వారికి ఎన్టీఆర్ రాజ‌కీయ జీవితం ఇచ్చిన మ‌హనీయుడు ఎన్టీఆర్ కాబ‌ట్టి ఆయ‌న పేరును డొమిస్టిక్ ట‌ర్మిన‌ల్‌కు పెట్ట‌డంపై అభ్యంత‌రాలు చెప్పొద్ద‌ని ప‌చ్చ పార్టీ నేత‌లు అంటున్నారు.. మ‌రి చంద్ర‌బాబుకు రాజ‌కీయ జీవితం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే క‌దా.. మ‌రి మంత్రిగా అవ‌కాశం ఇచ్చిన అంజ‌య్య పేరును ఆంధ్రాలో విమానాశ్ర‌యానికి పెట్టించేంత పెద్ద మ‌న‌సు చంద్ర‌బాబునాయుడుకు ఉందా?