1

1

Wednesday, 16 March 2016

భూ క‌బ్జాదారులైన కార్పోరేట‌ర్ల భ‌ర‌తం ప‌ట్టాలి...

కార్పోరేట‌ర్లు భూ దందాలు, అక్ర‌మాల‌ జోలికి వెళ్లొద్ద‌ని హిత‌వు చెబుతున్నారు డిప్యూటీ సీఎం గారు.. అస‌లు భూ దందాలే జీవితంగా బ‌తుకుతున్న కార్పోరేట‌ర్లు ఈ మాట‌ల‌ను ప‌ట్టించుకుంటారా? వారు నీతి వాక్యాల‌తో మారుతార‌నుకోవ‌డం అత్యాశే.. సీఎం గారు నీతి వాక్యాలు చెప్పినా ప‌ట్టించుకునే స్థితిలో వారు లేరు.. క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటే త‌ప్ప దారికొచ్చే ర‌కం కాదు.. కొంద‌రు కార్పోరేట‌ర్ల తీరును స్వ‌యంగా చూశాను కాబ‌ట్టే ఈ మాట‌లు చెబుతున్నాను.. అధికార పార్టీలో ఉన్న వాళ్లంతా కేసీఆర్ మాదిరిగా నిజాయ‌తీగా ఉండాల‌నే నిబంధ‌న లేదు..
ఇత‌ర పార్టీల నుంచి వ‌స్తున్న వారంద‌రినీ చేర్చుకున్నాం.. కానీ వారికి అల‌వాటైన అవ‌ల‌క్ష‌ణాలు అంత త్వ‌ర‌గా పోయే అవ‌కాశం లేదు క‌దా.. దానికి తోడు అధికార పార్టీ లో చేర‌డంతో క‌లిసొచ్చిన అధికార ద‌ర్పం.. వెర‌సి ఇక కొంద‌రు కార్పోరేట‌ర్ల‌కు అడ్డూ అదుపూ లేకుండా పోయింది... ఇలాంటి అవినీతి కార్పోరేట‌ర్ల తీరు మార‌కుంటే భ‌విష్య‌త్ లో పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రిగే అవ‌కాశం లేక‌పోలేదు.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. !!

ఈ ఆర్థిక ఉగ్ర‌వాదుల అప్ప‌గింత‌కు ఒప్పందాలు చేసుకోవాలి...!


ఈ ఆర్థిక ఉగ్ర‌వాదుల అప్ప‌గింత‌కు ఒప్పందాలు చేసుకోవాలి...!
*****
చోటా రాజ‌న్‌, చోటా ష‌కీల్ లాంటి నిందితుల‌ను మ‌న దేశానికి అప్ప‌గించేలా వివిధ దేశాల‌తో ఒప్పందాలు చేసుకున్నాం స‌రే..
మ‌రి ల‌లిత్ మోడీ, విజ‌య్ మాల్యా లాంటి నిందితుల‌ను కూడా అప్ప‌గించేలా ఒప్పందాలు చేసుకుంటారా?
లేక వీళ్లు కూడా దావూద్ ఇబ్ర‌హీం మాదిరిగానే ఇక ప‌త్తా లేకుండా పోతారా?
నోట్ : నా దృష్టిలో దావూద్ కు, విజ‌య్ మాల్యాకు పెద్ద తేడా లేద‌నిపిస్తుంది.. ఎందుకంటే ఇద్ద‌రూ ప‌రారీలో ఉన్న నిందితులే...!!

ఈ స్ఫూర్తి కొనసాగాలి..






రాజ‌కీయాల్లో వాళ్లు ప్ర‌త్య‌ర్థులు.. ఒక‌రి రాజ‌కీయ భ‌విష్య‌త్ ను మ‌రొక‌రు దెబ్బ తీశారు.. అయినా స‌రే రాజ‌కీయాలు రాజ‌కీయాలే.. స్వ‌రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో మేమంతా ఒక‌టే.. మ‌న తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం కావాల్సిందే అన్నదే వారి ఆకాంక్ష‌. రాజ‌కీయాల‌కు అతీతంగా, పార్టీల‌కు అతీతంగా తెలంగాణ ప్ర‌యోజ‌న‌మే ప‌ర‌మావ‌ధిగా ముంద‌డుగు వేశారు. మ‌హారాష్ట్ర‌ను ఒప్పించి జ‌ల వివాదాల‌ను ప‌రిష్క‌రించుకుంటూ చ‌రిత్రాత్మ‌క ముంద‌డుగు వేశారు. ఈ విష‌యంలో కేసీఆర్ ఎంత చొర‌వ తీసుకున్నారో.. అదే స్థాయిలో మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు గారు చొర‌వ తీసుకున్నారు. ఇద్ద‌రు క‌లిసి తెలంగాణ‌కు మేలు చేకూర్చారు. వారిద్ద‌రికీ హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు.
వీళ్లిద్ద‌రే కాకుండా హ‌రీశ్ రావు, ఢిల్లీలో ఉన్న తెలంగాణ బిడ్డ శ్రీ‌రాం వెదిరె, మ‌న జ‌ల వ‌న‌రుల నిపుణులు విద్యాసాగ‌ర్ రావు గారికి హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. ఇక మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ పేరును మ‌ర‌చిపోతే ఈ పోస్టుకు అర్థం ఉండ‌దు. ఈ ఒప్పందానికి సుముఖ‌త తెలియ‌జేసిన ఆయ‌న‌కు తెలంగాణ ప్ర‌జానీకం త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు..
****
మ‌నం ఏ పార్టీలో ఉన్నా స‌రే మ‌న తెలంగాణ ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఏకం కావాల్సిందే. ఈ స్ఫూర్తి నిరంత‌రం కొన‌సాగాలి. మిగిలిన పార్టీల నేత‌లు కూడా సంద‌ర్భం వ‌చ్చిన‌ప్పుడు సంఘ‌టితంగా ముందుకు సాగాలి. మ‌న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ‌గా మార్చాలి. జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌..!!
*****
నోట్ : మ‌హారాష్ట్ర‌లో కాంగ్రెస్‌, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు కూడా ఇలాంటి చ‌రిత్రాత్మ‌క ఒప్పందాలు జ‌ర‌గ‌లేదు.. కార‌ణం ఒక్క‌టే.. తెలంగాణ‌ను స‌స్య‌శ్యామ‌లం చేయాల‌న్న చిత్త‌శుద్ధి అప్ప‌టి పాల‌కుల‌కు లోపించ‌డ‌మే.. పాలించిన వాడు మ‌నోడు అయితే మ‌న గురించి ఆలోచిస్తాడు.. కాక‌పోవ‌డం వ‌ల్లే దాదాపు 60 ఏళ్లు తండ్లాట ప‌డ్డాం. అప్ప‌టికీ ఇప్ప‌టికీ పాల‌న‌లో తేడా సుస్ప‌ష్టంగా క‌నిపిస్తుంది.

రాజ‌గురువు ప‌త్రికే సెల‌వివ్వాలి...

రింగు రోడ్డు చుట్టూ అప్ప‌ట్లో కాంగ్రెస్ నేత‌లు భూములు కొనుగోలు చేస్తే పెద్ద‌లా గ‌ద్ద‌లా? అంటూ క‌థ‌నాలు వ‌చ్చాయి...
మ‌రి ఇప్పుడు అమ‌రావ‌తి చుట్టూ వాలిని వారిని ఏమ‌నాలో? రాజ‌గురువు ప‌త్రికే సెల‌వివ్వాలి...

వీణ‌వంక అత్యాచార ఘ‌ట‌న‌లో ముగ్గురు నిందితుల కు ఎలాంటి శిక్ష ప‌డుతుంది..?

వీణ‌వంక అత్యాచార ఘ‌ట‌న‌లో ముగ్గురు నిందితుల కు ఎలాంటి శిక్ష ప‌డుతుంది..?
నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రించిన పోలీసుల‌ పై ఎలాంటి చ‌ర్య‌లుంటాయి.. ?
షీ టీమ్స్ తో మ‌హిళ‌ల‌కు అండ‌గా నిలుస్తున్న రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణ‌కు వీణ‌వంక పోలీసులు క‌ళంకం తెచ్చారా?
నిందితుల‌ను జువైన‌ల్ హోమ్స్ కు త‌ర‌లించార‌ని వార్త‌లు వ‌చ్చాయి.. అది నిజ‌మేనా... జువైన‌ల్ చ‌ట్టంలో మార్పులు చేశారు క‌దా.. వారిని క‌ఠినంగా శిక్షించేందుకు ఇప్పుడు ఆస్కారం ఉంటుంది క‌దా.. మ‌రి పోలీసులు ద‌ర్యాప్తును నిజాయ‌తీగా చేస్తారా?

Friday, 19 February 2016

ఫొటో గ్రాఫ‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి..

ఫొటో గ్రాఫ‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి..
***
మేడారంలో మ‌హిళా భ‌క్తుల పుణ్య స్నానాల ఫొటోల‌కు బ‌దులుగా భ‌క్తులు స‌మ‌ర్పించే నిలువు బంగారం ఫొటోను తీసి ప్ర‌చురిస్తే బాగుంటుంది.. ఇది మ‌న‌వి మాత్ర‌మే..
ప‌త్రికా స్వేచ్ఛ‌ను హ‌రించ‌డం కాదు.. జ‌ర్న‌లిస్టుల హ‌క్కుల‌ను కాల‌రాయ‌డం అంత‌క‌న్నా కాదు.. అర్థం చేసుకుంటార‌న్న చిన్న ఆశ మాత్ర‌మే..
Note : ఒక‌వేళ పుణ్య స్నానాల ఫొటోలు వాడాల‌నుకుంటే లాంగ్ షాట్ ఫొటోలు వాడండి.. క్లోజ‌ప్ లో వాడొద్దు ప్లీజ్‌..

స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల‌కు మొక్కు చెల్లించుకున్న బాల‌కృష్ణ‌

మేడారం జాత‌ర‌లో స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల‌ను ద‌ర్శించుకొని నిలువెత్తు బంగారాన్ని స‌మ‌ర్పిస్తున్న హిందూపురం (ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, అనంత‌పురం జిల్లా) ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌.

హోట‌ల్ శంక‌ర‌మ్మ‌ను ఆదుకోండి ముఖ్య‌మంత్రి గారూ..

ముఖ్య‌మంత్రి గారికి విజ్ఞ‌ప్తి.
********
తోట శంక‌ర‌మ్మ అలియాస్ హోట‌ల్ శంక‌ర‌మ్మ‌. టీఆర్ఎస్ మ‌హిళా నేత‌గా ప‌నిచేశార‌ట‌.
ఈమెకు ప‌క్ష‌వాతం వ‌చ్చింద‌ట‌.
చ‌నిపోయేలోగా ఒక్క‌సారైనా కేసీఆర్ ను క‌ల‌వాల‌నుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ కోసం చాలా ఈమె క‌ష్ట‌ప‌డిన‌ట్లు వార్త‌లో రాశారు.
టీఆర్ఎస్ పార్టీ జిల్లాలో బ‌లంగా లేన‌ప్పుడు తొలి బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించిన వ్య‌క్తి హోట‌ల్ శంక‌ర‌మ్మ అని పేర్కొన్నారు.
ముఖ్య‌మంత్రి గారు ఈమెతో ఒక సారి మాట్లాడితే బాగుంటుంది..
ఈ మహిళా నేత‌ను ఆదుకునేలా జిల్లా నాయ‌కుల‌ కు ఆదేశాలు ఇస్తే బాగుంటుంది.
మొద‌టి నుంచి పార్టీకి సేవ‌లు అందిస్తున్న వారి కోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాలి.
వారిని పార్టీ త‌ర‌ఫున ఆదుకోవాలి. ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేసినా ప‌ట్టించుకోకుండా పార్టీ అధినేత‌కు, పార్టీకి క‌ష్ట‌కాలంలో అండ‌గా నిలిచిన వారంద‌రినీ స‌ముచితంగా గౌర‌వించుకోవాలి.

ఈ నెల‌లో రెండు వీడియోలు న‌న్ను అత్యంత క‌ల‌చివేశాయి..


ఈ నెల‌లో రెండు వీడియోలు న‌న్ను అత్యంత క‌ల‌చివేశాయి.. 
ఈ దేశ భ‌క్తుల‌ మ‌నో ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్‌..!!
*********
ఎండ‌లో గంట సేపు ఉండ‌లేం. చ‌లికాలం అస‌లు భ‌రించ‌లేం. అలాంటిది మంచు కింద ఆరు రోజులు కూరుకుపోయినా స‌రే ప్రాణాల‌తో క‌నిపించిన దివంగ‌త లాన్స్ నాయ‌క్ హ‌నుమంత‌ప్ప వీడియో క‌న్నీళ్లు తెప్పించింది. ఈ వీడియో ఎంద‌రిలోనో దేశ భ‌క్తిని ప్రేరేపించింది. కుల మ‌తాల‌క‌తీతంగా అంద‌రం ప్రార్థించినా, వైద్యులు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించినా స‌రే దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆయ‌నను మ‌నం బ‌తికించుకోలేక‌పోయాం.. కానీ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ మ‌నో ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాల‌న్న సందేశాన్ని ఇచ్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు వీర సైనికుడు లాన్స్ నాయ‌క్ హ‌నుమంత‌ప్ప‌.. ఆ వీరుడికి జోహారు..!!
****
చిన్న ముల్లు గుచ్చుకుంటే త‌ట్టుకోలేం. కాలికి దెబ్బ త‌గిలితేనే అల్లాడిపోతాం. కానీ శ‌రీరం ఛిద్ర‌మైనా, మృత్యువు క‌ళ్ల ముందు క‌నిపిస్తున్నా స‌రే.. మ‌నో నిబ్బ‌రం ప్ర‌ద‌ర్శించి ఛిద్ర‌మైన త‌న శ‌రీరంలో ప‌నికొచ్చే అవ‌య‌వాల‌ను దానం చేయాల‌నే సంక‌ల్ప‌న్ని చాటిన హ‌రీశ్ నంజ‌ప్ప వీడియో చూసి ఏడ‌వ‌కుండా ఉండ‌లేక‌పోయాను. ఆ యువ‌కుడిలోని సామాజిక స్పృహ‌, సామాజిక బాధ్య‌త చూస్తుంటే దేశం మ‌రో బాధ్య‌తాయుత‌మైన పౌరుడిని కోల్పోయింద‌న్న భావ‌న క‌లిగింది.
హ‌రీశ్‌ కుటుంబ ప‌రిస్థితి గురించి ఇంట‌ర్నెట్ లో చ‌దివితే.. ఎనిమిదో ఏట‌నే తండ్రిని కోల్పోయాడు హ‌రీశ్ నంజ‌ప్ప‌. చిన్న త‌నం నుంచి త‌మ కోసం త‌ల్లి క‌ష్ట‌ప‌డ‌టం చూడ‌లేక బెంగ‌ళూరులో లాజిస్టిక్ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. కుటుంబ బాధ్య‌త‌ను మోస్తున్నాడ‌ట‌. ఇక ఆయ‌న స్వ‌గ్రామానికి వెళ్లింది కూడా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఓటేయ‌డానికి. ఉన్న‌త కొలువులు చేస్తూ, సంప‌న్న కుటుంబాల్లో పుట్టిన కొంద‌రు ఓట్ల పండ‌గ రోజు సెల‌వు దొరికితే సినిమాల‌కు పోతున్న రోజులివి. కానీ వారంద‌రికీ భిన్నంగా హ‌రీశ్ నంజ‌ప్ప ఓటేసి వ‌స్తూ ప్ర‌మాదానికి గురి కావ‌డం, శ‌రీరం ఛిద్ర‌మైనా స‌రే నా వాళ్ల‌కు స‌మాచారం ఇవ్వ‌మ‌ని అడ‌గ‌కుండా, నా అవ‌య‌వాల‌ను దానం చేయ‌మ‌ని ప‌దేప‌దే కోర‌డం ఆయ‌న‌లోని సేవా గుణానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం. స‌మాజంలో బాధ్య‌తాయువ‌తంగా మెల‌గ‌డం ఎలాగో అత‌డిని చూసి నేర్చుకోవ‌చ్చు.
త‌న క‌ళ్ల‌తో ఓ అంధుడికి చూపు ప్ర‌సాదిస్తున్న హ‌రీశ్ నంజ‌ప్ప ఈ స‌మాజాన్ని నిరంత‌రం చూస్తూనే ఉంటాడు. మ‌న‌తో జీవిస్తూ ఉంటారు.
అవ‌య‌వ దానంతో అమ‌రుడైన హ‌రీశ్ నంజ‌ప్ప‌ హ్యాట్సాఫ్‌..
***********
నోట్ : విచిత్రం ఏంటో గాని ఈ ఇద్ద‌రు యువ‌కులూ క‌ర్ణాట‌కకు చెందిన వారు కావ‌డం విశేషం. ఇక వీరి పేర్లు హెచ్ తో మొద‌లు కావ‌డం గ‌మనార్హం.

52 ఏళ్లు ఆరెస్సెస్ ఆఫీసుపై జెండా ఎగ‌రేయ‌లేద‌ట‌...


http://timesofindia.indiatimes.com/city/pune/Tri-colour-hoisted-at-RSS-HQ-after-52-yrs/articleshow/1561733136.cms

దాదాపు 52 ఏళ్ల త‌ర్వాత తొలిసారిగా 2002 లో నాగ్ పూర్ లోని ఆరెస్సెస్ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌న‌వ‌రి 26 సంద‌ర్భంగా జాతీయ ప‌తాకాన్ని ఎగ‌ర‌వేశార‌ట‌.. తొలిసారి 1947 ఆగ‌స్టు 15 న‌, త‌ర్వాత 1950 జ‌న‌వ‌రి 26న ఎగ‌ర‌వేశార‌ట‌... 
***
ఇప్పుడే గూగుల్ లో త‌వ్వ‌కాలు జ‌రిపితే హిందూ ప‌త్రిక‌, టైమ్స్ ఆఫ్ ఇండియా ప‌త్రిక‌లో ఈ వార్త వ‌చ్చిన‌ట్లు ఉంది.. మ‌రి 52 ఏళ్లు వీళ్లు జాతీయ జెండా ఎగ‌ర‌వేయ‌కుండా దేశ భ‌క్తులుగా చెలామ‌ణీ అయ్యారా?

జెండా అంటే అది కాదు ఇది...

మిత్రులారా.. జెండా వంద‌నం అంటే త్రివ‌ర్ణ ప‌తాకానికి వంద‌నం చేయాలి.. కొంప‌దీసి ఆరెస్సెస్ వాళ్ల భ‌గ‌వ‌త్ ధ్వ‌జ్ అనుకోకండి...!!

జెండా ఊంఛా ర‌హే హ‌మారా..!!

జెండా ఊంఛా ర‌హే హ‌మారా..!!
********
ఈ దేశంలో జాతి జెండా కున్న ప్రాధాన్యం తెలియ‌ని వాళ్లు ఎంద‌రో ఉన్నారు.. ఇందులో విద్యార్థుల‌నే కాదు చాలా మంది ప్ర‌ముఖులు కూడా ఉన్నారు. ఈ కోవ లోకే ఈ దేశ ప్ర‌ధాన మంత్రి సైతం వ‌స్తారు.. పాపం ఆయ‌న విదేశీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కొన్ని సార్లు జాతీయ జెండాకు తెలిసో తెలియ‌కో అగౌర‌వం క‌లిగించారు. జెండా త‌ల కిందులుగా ఎగురుతున్నా ప‌ట్టించుకోలేదు.
ఇక ఉప రాష్ట్ర‌ప‌తి గారు జెండాకు వంద‌నం చేయలేద‌ని కొంద‌రు తెగ హ‌డావుడి చేశారు. తీరా ప్రోటోకాల్ ప్ర‌కార‌మే ఆయ‌న ప్ర‌వ‌ర్తించార‌ని తెలిసి ముక్కున వేలేసుకున్నారు. ఇలాంటి నియ‌మాలు తెలియ‌ని మూర్ఖులంతా తామే దేశ భ‌క్తులం.. మిగిలిన వారంతా దేశ ద్రోహుల‌నే దుస్థితి దాపురించింది.
************
ఈ దేశాన్ని పాలించే ప్ర‌ముఖుల‌కే లేని సామాజిక‌ స్పృహ సామాన్యుల‌కు ఎలా ఉంటుంది. ఏదో పంద్రాగ‌స్టు, జ‌న‌వ‌రి 26కు ముందు రెండు మూడు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి జాతీయ జెండాను గౌర‌వించాల‌ని అంటే స‌రిపోదు.
ఏది ఏమైతేనేం కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యాల్లో జాతీయ జెండాను ఎగ‌ర‌వేయాల‌న్న నిర్ణ‌యం చాలా మంచిది. ఎందుకంటే ఈ దేశానికి అత్య‌ధికంగా రాజ‌కీయ నేత‌ల‌ను పంపుతున్న సంస్థ‌ల్లో కేంద్రీయ‌ విశ్వ‌విద్యాల‌యాలు కూడా ఉన్నాయి. జేఎన్‌యూ నుంచి ఎంద‌రో నేత‌లు పుట్టుకొచ్చారు. జాతీయ జెండాను ఎలా గౌర‌వించాలో, దానికి ఉన్న ప్రాధాన్యం ఏంటో భావి రాజ‌కీయ నేత‌ల‌కు తెలియ‌జెప్ప‌డం మంచి విష‌య‌మే. అయితే జాతీయ జెండాను ఎలా గౌర‌వించాలి. దానికున్న నియ‌మ నిబంధ‌న‌లు ఏమిటో కూడా స్ప‌ష్టంగా తెలియ‌జేయాలి.
ఢిల్లీ లోని చ‌రిత్రాత్మ‌క‌ క‌నాట్ ప్లేస్ లోని సెంట్ర‌ల్ పార్కులో ఎగురుతున్న రీతిలో ప్ర‌తీ గ్రామంలో, మండ‌లంలో, ప‌ట్ట‌ణంలో, న‌గ‌రంలో చ‌రిత్రాత్మ‌క ప్రాంతంలో భారీ మువ్వ‌న్నెల జెండా రెప‌రెప‌లాడాలి. ఈ దిశ‌గా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చ‌ర్య‌లు తీసుకుంటే ఇంకా బాగుంటుంది.
*********
నోట్ : ప్ర‌భుత్వాలు ఆదేశాలు ఇవ్వ‌క‌ముందే, జేఎన్‌యూ వివాదాలు మొద‌లు కాక‌ముందే గ‌త నాలుగేళ్లుగా నా ఫేసుబుక్ వాల్‌పై మువ్వ‌న్నెల జెండా రెప‌రెప లాడుతూనే ఉంది... అయినా కూడా కొంద‌రు భ‌క్తులు న‌న్ను దేశ ద్రోహి అంటుంటే ఏమ‌నాలో అర్థం కావ‌డం లేదు. !!

కంచె మంచిదే...

ప్ర‌భుత్వ స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు వాటి చుట్టూ ప్ర‌హ‌రీలు క‌ట్ట‌డ‌మో , కంచెలు వేయ‌డమో చేయాల‌న్న నిర్ణ‌యం బాగుంది. దీన్ని తెలంగాణ వ్యాప్తంగా అమ‌లు చేయాలి. వేల ఎక‌రాల విలువైన ప్ర‌భుత్వ భూముల‌ను కాపాడుకోవాలి. ప్ర‌భుత్వ భూముల ప‌రిర‌క్ష‌ణ‌కు పాటు ప‌డిన అధికారుల‌కు ప్రోత్సాహ‌కాలు కూడా ఇచ్చినా త‌ప్పు లేదు..
అలాగే ప్ర‌భుత్వం వివిధ సంస్థ‌ల‌కు లీజుకు ఇచ్చిన స్థ‌లాల వ‌ద్ద కూడా లీజు ఒప్పందాన్ని తెలిపేలా బోర్డులు పెడితే బాగుంటుంది. ఎన్నేళ్ల‌కు లీజుకు ఇచ్చారు, ఎలాంటి ష‌ర‌తులు ఉన్నాయి త‌దిత‌ర విష‌యాలు అక్క‌డ స్థానికుల‌కు కూడా తెలిసేలా బోర్డులు ఉంచాలి. ఎందుకంటే ఓ వందేళ్ల త‌ర్వాత ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడ‌టంలో స్థానికులు తోడ్ప‌డుతారు.
***********
నోట్ : మిత్రులారా... మీకు సొంత ఊళ్ల‌లో స్థ‌లాలు, పొలాలు ఏమైనా ఉన్నాయా? అయితే వాటి చుట్టూ కూడా అర్జెంట్‌గా కంచెలు వేయించుకొని ప్ర‌హ‌రీలు క‌ట్టుకోండి. నిర్ల‌క్ష్యంగా మాత్రం ఉండొద్దు. భూములు క‌బ్జాల‌కు గురైతే తీర‌ని ఆర్థిక‌, మాన‌సిక ఇబ్బందులు మిగల‌డం త‌ప్ప చేసేది ఏమీ ఉండ‌దు..

ఐ ల‌వ్ మై ఇండియా..

ఐ ల‌వ్ మై ఇండియా..
*************
ఎల్టీటీఈ ప్ర‌భాక‌ర‌న్ కూడా త‌మిళుల‌కు న‌చ్చుతాడు.. వారి దృష్టిలో అత‌డు దేశ భ‌క్తుడు.. ఈ దేశంలో అఫ్జ‌ల్ గురు కొంద‌రికి న‌చ్చుతున్నాడు.. పంజాబ్ లోని ఖ‌లిస్థాన్ ఉగ్ర‌వాదులు మ‌రికొంద‌రికి న‌చ్చుతున్నారు.. జాతి పిత‌ను హ‌త‌మార్చిన గాడ్సే మ‌రికొంద‌రికి న‌చ్చుతున్నాడు.. ఇక ఈశాన్య రాష్ట్రాల ముక్క‌లు చేయాల‌నుకునే ఎన్ఎస్‌సీఎన్ ముయివా ఇంకొంద‌రికి ప్రీతిపాత్రుడు.. ఇక రాజీవ్ గాంధీని పాశ‌వికంగా చంపిన కిరాత‌కుల కోసం కొట్లాడే మ‌నుషులు ఉన్నారు.. ఎల్టీటీఈ ప్ర‌భాక‌ర‌న్ ను త‌మ‌కు ఆరాధ్యుడిగా చెప్పుకునే ప్ర‌జ‌లున్నారు.. మ‌న దేశంలో ఒక‌రి దృష్టిలో మ‌రొక‌రు దేశ ద్రోహులుగా క‌నిపిస్తున్నారు..!!
ఇదేందో గాని ఏ విష‌యంలోనైనా స‌రే భార‌త దేశం భిన్న‌త్వంలో ఏక‌త్వం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది... ఐ ల‌వ్ మై ఇండియా..!!
నోట్ : ఏక‌త్వం ఎక్క‌డ ఉంద‌ని కొంద‌రు అడ‌గొచ్చు.. కానీ ఇంతగా మాట‌ల యుద్ధం చేసుకునే నేతలు, నాయ‌కులు మ‌ళ్లా త్వ‌ర‌గానే క‌ల‌సి పోవ‌డం ఎన్నిసార్లు చూడ‌లేదు.. దేశంలో ఏదైనా ప్ర‌కృతి విప‌త్తో, యుద్ధ‌మో వ‌స్తే వీళ్లంతా క‌ల‌సి ప‌నిచేయ‌డం ఎన్నిసార్లు వీక్షించ‌లేదు... ఇది కాదా ఏక‌త్వం..!!
జై భార‌త్‌, జై తెలంగాణ‌.

ఆ రోజు వ‌చ్చిన ప్పుడు మ‌న వాళ్ల రియాక్ష‌న్ ఎలా ఉంటుంది?

భార‌త సంత‌తి వాళ్లు అమెరికాలో న్యాయ‌మూర్తి అయ్యారు.. గ‌వ‌ర్న‌ర్ అయ్యారు..క్రికెట‌ర్ అయ్యారు... ఇంకేదో అయ్యారు అని నిత్యం చ‌దువుతున్నాం.. అవ‌కాశం ఉంటే అమెరికా అధ్య‌క్షుడు కూడా కావొచ్చేమో... ఇవ‌న్నీ విని మ‌నం చాలా గ‌ర్విస్తున్నాం... ఇది మంచి విష‌య‌మే. మ‌రి అలాగే అమెరిక‌న్ సంత‌తి వాళ్లో లేక ఇత‌ర దేశాల్లో పుట్టి మ‌న దేశంలో స్థిర‌ప‌డిన వారు భార‌త్ లో న్యాయ‌మూర్తి అయ్యే రోజు, గ‌వ‌ర్న‌రో, ఎమ్మెల్యేనో లేక మంత్రి అయ్యే రోజును మ‌నం చూస్తామా? ఆ రోజు వ‌స్తుందా? ఆ రోజు వ‌చ్చిన ప్పుడు మ‌న వాళ్ల రియాక్ష‌న్ ఎలా ఉంటుంది?
*************
బ్రిట‌న్ కో లేదా ఇంకో దేశానికో మ‌న ప్ర‌ధాని గారు వెళితే భార‌తీయ ప‌ద్ధ‌తుల్లో స్వాగ‌త ఏర్పాట్లు చేసినట్లు మ‌నం చూస్తున్నాం.. గీతా శ్లోకాల ప‌ఠ‌నమో లేక ఇంకేదైనా వైదిక కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ జ‌రుగుతున్న‌ట్లు చూస్తున్నాం... మ‌రి అదే బ్రిట‌న్ ప్ర‌ధానో ఇంకెవ‌రో మ‌న దేశానికి వ‌స్తే వాళ్ల ప‌ద్ధ‌తుల్లో (బ్రిట‌న్ ప‌ద్ధతిలో) స్వాగ‌తం ఏర్పాటు చేస్తామా? బైబిల్ ప‌ఠ‌న‌మో లేక ఇంకేదైనా వారి ప‌ద్ధ‌తిలో స్వాగ‌త కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేస్తామా?

ఆర్థిక ఉగ్ర‌వాదుల‌ను వ‌దిలేస్తారా?

దేశ‌ద్రోహులుగా కొంద‌రిపై ముద్రలు వేసి దాడులు చేస్తూ శిక్ష‌లు విధిస్తున్న పెద్ద మ‌నుషులారా...!!
మీకో విజ్ఞ‌ప్తి... ఈ దేశానికి నిజ‌మైన దేశ ద్రోహులు ఎవ‌రైనా ఉన్నారా? అంటే అది కార్పోరేట్ ప‌న్ను ఎగ‌వేత‌దారులే..
బ్యాంకుల నుంచి అక్ష‌రాల రూ.3 ల‌క్ష‌ల కోట్లకు పైగా రుణాలు తీసుకొని క‌ట్ట‌కుండా ఎగ‌వేస్తున్న బ‌డా పారిశ్రామిక వేత్త‌లే సిస‌లైన దేశ‌ద్రోహులు..
ఇక విదేశాల్లో న‌ల్ల‌ధ‌నం దాచుకున్న కుబేరులే అస‌లైన క‌ర‌డు గ‌ట్టిన‌ ఉగ్ర‌వాదులు...
ముందు ఈ ఆర్థిక ఉగ్ర‌వాదుల ఇళ్ల‌పై దాడులు చేయండి... వారి ఆస్తుల‌ను లాగేసుకోండి...
వారిని క‌ఠినంగా శిక్షించండి.. మీలోని నిజ‌మైన దేశ భ‌క్తిని చాటుకోండి..
ఈ పోరాటంలో దేశం మొత్తం మీకు అండ‌గా నిలుస్తుంది.. !!

Tuesday, 16 February 2016

హ్యాపీ బ‌ర్త్ డే కేసీఆర్ గారు...

అస్థిత్వ పోరును విజ‌య తీరాల‌కు చేర్చిన సేనానీ..
ఆంక్ష‌ల తెలంగాణ‌ను అభివృద్ధి దిశ‌గా ప‌రుగులు పెట్టిస్తున్న శ్రామికుడా..
నిన్ను చూసి పొంగిపోతోంది త‌ల్లి భార‌తి..
నిన్ను చూసి మురిసిపోతోంది త‌ల్లి తెలంగాణ‌...
ప్ర‌తీ తెలంగాణ‌వాది హృద‌యంలో క‌నిపించేది నీ రూపే..
ప్ర‌తీ తెలంగాణ పిల్లాడి గొంతు నుంచి వినిపించేది నీ స్వ‌ర‌మే..
తెలంగాణ ఉచ్వాస‌, నిశ్వాస నీవే..
మీరు నిండు నూరేళ్లు వ‌ర్థిల్లాలి..
మాలో నిరంత‌ర స్ఫూర్తిని ర‌గిలించాలి..
హ్యాపీ బ‌ర్త్ డే కేసీఆర్ గారు... 

ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేస్తున్నార‌ని అనుమానించే వారికి ఓ విజ్ఞ‌ప్తి..

ఈవీఎంల‌ను ట్యాంప‌రింగ్ చేస్తున్నార‌ని అనుమానించే వారికి ఓ విజ్ఞ‌ప్తి..
*******
నిజంగానే ఈవీఎంల‌ ట్యాంప‌రింగ్ జ‌రుగుతుందా? లేదా అన్న‌ది మీరే స్వ‌యంగా నిర్ధ‌రించుకోవ‌చ్చు..
ఇక‌పై తెలంగాణ‌లో జ‌రిగే ఏ ఎన్నిక‌లోనైనా స‌రే కొన్నిస్థానాల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున‌, టీడీపీ త‌ర‌ఫున ఓ 65 మంది చొప్పున అభ్య‌ర్థులను బ‌రిలో నిల‌పండి..
అప్పుడు బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో ఆ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయి..
కొన్ని చోట్ల ఈవీఎంల ద్వారా ఎన్నిక‌లు జ‌రుగుతాయి...
బ్యాలెట్ ప‌ద్ధ‌తిలో మీరు బ‌రిలో నిలిపిన అభ్య‌ర్థులంద‌రికీ క‌లిపి డిపాజిట్ ద‌క్కితే ఈవీఎంలు క‌రెక్టు అని నిర్ధ‌రించుకోవ‌చ్చు..
**
నోట్ : బ్యాలెట్ లో చెల్ల‌ని ఓట్లు ఎక్కువైతే కొన్ని సార్లు డిపాజిట్ స్థాయి ఓట్లు కూడా ద‌క్క‌క‌పోవ‌చ్చు.. అప్పుడు ఈవీఎంల‌ను అనొద్దు ప్లీజ్‌..

బిగ్‌ బ్రేకింగ్ న్యూస్‌...

బిగ్‌ బ్రేకింగ్ న్యూస్‌...
****
నారాయ‌ణ్ ఖేడ్ ఉప ఎన్నిక‌లో డిపాజిట్ ద‌క్కించుకున్న కాంగ్రెస్‌... !

ముస్తాక్ అహ్మ‌ద్ కు జోహార్లు..


సియాచిన్ లో దేశం కోసం అమ‌రుడైన తెలుగు తేజం ముస్తాక్ అహ్మ‌ద్ కు జోహార్లు..